తెలుగు జవాన్‌ వీర మరణంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | Ys Jagan Shocked Over The Heroic Death Of Telugu Soldier In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ వీరమరణం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

May 9 2025 12:39 PM | Updated on May 9 2025 8:34 PM

Ys Jagan Shocked Over The Heroic Death Of Telugu Soldier In Jammu Kashmir

సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీర మరణంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్‌ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్‌ కుటుంబీకులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.

భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్‌ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement