breaking news
Operation Sindoor
-
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్‌తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్‌పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్‌కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్‌కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్‌లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ ‘నోబెల్’ ఆశలపై నీళ్లు చల్లిన భారత్!!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై భారత్ నీళ్లు చల్లిందా? ఆ కోపంతోనే భారత్‌పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవంటూ అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్‌ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కుసతో ఈ టారిఫ్‌లు విధించినట్లు జెఫరీస్ తన నివేదికలో హైలెట్ చేసింది.భారత్‌పై ట్రంప్‌కు వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టే ప్రపంచంలోనే భారత్‌పై అత్యధికంగా 50శాతం సుంకాలు విధించినట్లు జెఫరీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలంగా అమెరికా-భారత్‌ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయ వ్యక్తం చేసింది. భారత్-పాక్‌ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా.. అందుకు భారత్ ఒప్పు కోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తున్న విషయాన్ని వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు.తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్‌ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్‌లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
ఫోన్ చేసి బెదిరించా.. మోదీ యుద్ధం ఆపేశారు: ట్రంప్
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్‌లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇక..ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్‌కు మోదీ నో -
నేల విడిచిన సమరం
చిన్నపాటి ప్రాంతాన్ని ఏలిన రాజును సైతం భూమండలమేలినవాడిగా పేర్కొని ఆకాశానికెత్తడం మన ఇతిహాస, పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో దుష్యంతుని గురించి నన్నయ రాస్తూ, అతడు మహాబలవంతుడనీ, దిక్కుల చివర ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్య కిరణాలు, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతో ఏలాడనీ అంటాడు. అన్ని రకాల బలాలూ, బలగాలూ కలిసొస్తే భూమి మొత్తాన్ని శాసించాలనే పాలకుల ఆకాంక్ష అలాంటి అభివర్ణనలలో తొంగిచూస్తుంది. యుద్ధాలనేవి భూమినింకా దాటని దశ అది. నేటి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని యుద్ధాలు ఆకాశ మార్గం పట్టేశాయి. భూయుద్ధాలు గతస్మృతులై, యుద్ధం ఈ రోజున అక్షరాలా నేల విడిచిన సమరమైంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మనం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దానిని అత్యాశ్చర్య కరంగా కళ్ళకు కట్టింది. ‘అర్థశాస్త్రం’తో సహా ప్రాచీన గ్రంథాలు యుద్ధతంత్రంలో చెప్పిన అన్ని ఉపాయాలను, మాయోపాయాలను, పూర్తిగా సైనిక సాయంతో కాకుండా శాస్త్ర సాంకేతిక సాయంతో అందులో ప్రయోగించినట్టు చెబుతున్నారు. అంతర్జాల కేంద్రితంగా, కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో, ద్రోణులపైనా, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్స్(జీపీఎస్)పైనా, ఉపగ్రహాలపైనా ఆధారపడి చేసిన ఎలక్ట్రానిక్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. రష్యా సాయంతో మనం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను, రఫేల్ వంటి యుద్ధ విమానాలను బరిలోకి దింపి విజయవంతంగా వాడుకున్న తీరు, నేటి యుద్ధాలు భూమ్యాకాశాల మధ్య పోరుగా మారడాన్ని ప్రత్యక్షంగా చాటాయి. సాంప్రదాయిక యుద్ధాలతో పోల్చితే, ఈ గగనతల యుద్ధాలు దేశాలకూ, జనాలకూ తెచ్చిపెట్టే కష్టాలూ అనేక రెట్లు ఎక్కువనీ; ఏ దేశానికాదేశం ఎప్పటికప్పుడు సాంకేతికంగా పై చేయిని సాధించడమే దీనికి పరిష్కారమన్న హెచ్చరికా వినిపిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వెలుగు చూసిన వివరాలు ఇలాంటి యుద్ధాలతో ముడి పడిన ప్రమాదాలను భయభ్రాంతంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ జనానికి టెలివిజన్ సేవలందించే ఒక ఉపగ్రహాన్ని రష్యా నిపుణులు హ్యాక్ చేసి వాటిలో యుద్ధ శకటాల తోనూ, ఆయుధ సంపత్తితోనూ తమ సైనికులు జరిపే విన్యాసాల దృశ్యాలను ప్రసారం చేశారు. ఒక్క గుండు కూడా పేల్చకుండా, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం ద్వారా, సమాచార అంధకారాన్ని సృష్టించి ఒక దేశ భద్రతనూ, దాని ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసే ప్రమాదాన్ని రూపుగడుతున్నారు. సాంకేతికతను మెరుగుపరచుకుంటూ అన్ని విధాలా పోటీకి సన్నద్ధమైతే తప్ప ఈ సవాలును ఎదుర్కోవడం కష్టమనీ, సాంకేతిక సంపత్తి దేశాల మనుగడకు గీటురాయి అయిందనీ అంటున్నారు. అంతేకాదు, యుద్ధాలు గగన సీమను దాటి గ్రహాంతరాలకు చేరుకోవడమూ పొడగడుతోంది. చంద్ర మండలం మీది ఖనిజాలను, ముఖ్యంగా అణు విచ్ఛేదానికి తోడ్పడే హీలియం–3ను కొల్లగొట్టే పోటీకి అగ్రదేశాలు సిద్ధమవుతూ, అక్కడ అణు రియాక్టర్లను నెలకొల్పే యత్నంలో ఉన్నాయట! మబ్బు చాటు మాయా యుద్ధాలను మన పూర్వులు ఊహించకపోలేదు. రాక్షసులు వాటిలో ప్రవీణులని మన ఇతిహాస, పురాణాలంటాయి. రామాయణంలో మారీచ సుబా హులు అలాంటివారే. రావణుని కొడుకు ఇంద్రజిత్తయితే, నింగి నుంచే కానీ, నేల మీద యుద్ధం చేయడు. మాయసీతను చూపించి నిజసీతగా భ్రమింపజేసి హత మార్చడం లాంటి మాయావి చేష్టలలో రావణుడు కూడా అతనికి చాలడు. సూర్యాస్తమ యంలోగా సైంధవుని చంపుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డేసి సూర్యాస్తమయాన్ని సృష్టించడం నేటి కృత్రిమ సాంకేతిక విన్యాసాల్లాంటిదే. అప్పటివన్నీ ఊహలనుకుంటే, ఇప్పటి శాస్త్ర సాంకేతికత సృష్టించేవి నిండునిజాలు. యుద్ధాలు నేలనూ, నింగినీ దాటి గ్రహాంతరాలకు చేరుకునే పరిస్థితిలో శాంతి గతే మిటి; ఇది పురోగమనమా, తిరోగమనమా అన్న ప్రశ్నా వేసుకోక తప్పదు; యుద్ధమూ, శాంతి అనే జంటలో ఒకటి కాపురం కూల్చేసి గగనమార్గం పట్టిపోతే రెండవది నేల మీద కుమిలిపోతూ ఉండవలసిందేనా అన్న బాధకూ లోనవక తప్పదు. బాహ్యయుద్ధాల ఎండమావుల వేట నుంచి మనిషి వెనుదిరిగి అంతరంగ యుద్ధం వైపు ఎప్పుడు దృష్టి సారి స్తాడు?! లోకాలన్నీ జయించావు కానీ, అరిషడ్వర్గాలనే నీ లోపలి శత్రువులను ఎప్పుడు జయిస్తావని హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఎంత ప్రాసంగికం!! -
‘భారత్ ఫెరారీ కారు, పాక్ చెత్త ట్రక్కు’.. పాక్ ఆర్మీ చీఫ్‌కు రాజ్‌నాథ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్ మునీర్ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్ పోలిక పాకిస్తాన్ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్‌ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్ వెనుకబడి ఉందని, సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మునీర్‌పై విమర్శలు వచ్చాయి.ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్ మిలటరీ ఆఫీసర్స్ కోర్స్‌లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది. -
‘ఆపరేషన్ సిందూర్’కు తోక ముడిచిన పాక్.. శాటిలైట్ చిత్రాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్‌కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి. -
జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే..?
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, వీర జవాన్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కె.సురేశ్‌బాబు తెలిపారు.ఈ సినిమా ప్రకటన సందర్భంగా గౌతమ్ కృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య అధ్యాయమని అన్నారు. దేశ ప్రజల కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ కథను ఈ ప్రపంచానికి చెప్పాలని అందరూ తెలుసుకోవాలని ఈ చిత్రం తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమా నిర్మించేందుకు మురళీ నాయక్ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తూ మరణించారు. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఆపరేషన్ సింధూర్ అధికారులు.. ఎంత గెలిచారంటే..?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే, ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడులకు సంబంధించిన వివరాలను భారత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ వచ్చారు. అయితే, వారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్లో పాల్గొని మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.భారత భద్రతా బలగాలకు చెందిన సైన్యం నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నావికాదళం నుంచి కమాండర్ ప్రేరణ డియోస్థలీ కలిసి కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన ఈ అధికారులు, తమ ధైర్యం, దేశానికి చేసిన సేవ వంటి అంశాలను ఈ షోలో పంచుకున్నారు. అయితే, క్విజ్‌లో అద్భుతంగా ఆడి, రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లోని స్వాతంత్ర్య దినోత్సవ ఎపిసోడ్ చారిత్రాత్మకంగా మారింది.ఇంగ్లాండ్ లీసెస్టర్‌లోని విక్టోరియా పార్క్‌లో ఉన్న "ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్" స్మారక చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తే ఇండియాలో కూడా ఆయన రూపొందించిన స్మారక చిహ్నాం ఏంటి..?ఏ)విక్టోరియా మెమోరియల్, బి) గేట్‌వే ఆఫ్ ఇండియా, సి) ఫోర్ట్ సెయింట్ జార్జ్, డి) ఇండియా గేట్ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వారు మొదట్లో గందరగోళంగా ఉన్నప్పటికీ, ఆ ముగ్గురూ సరైన సమాధానాన్ని లాక్ చేయడానికి ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు. ఫైనల్‌గా ఇండియా గేట్ అని సరైన సమాధానం చెప్పారు. 'ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్' అనేది మొదటి ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం. దీనిని సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. అతనే ఇండియా గేట్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమాధానం చెప్పినందుకు వారు రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. గెలుచుకున్న ఆ డబ్బును వారి సంబంధిత సంస్థలతో అనుబంధించబడిన సంక్షేమ నిధులకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
సిందూర్‌లో స్వదేశీ సత్తా
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కరులకు, వారి పోషకులకు తగిన బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు 100 రోజులు పూర్తయ్యాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలతో మనం విజయం సాధించామని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ఆయుధాల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని అన్నారు. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌లో శత్రువుపై ఎక్కుపెట్టిన స్వదేశీ ఆయుధాలు ఏమిటో తెలుసుకుందాం.. డి–4 డ్రోన్ల విధ్వంసకారి డి–4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్‌లో తన వంతు సేవలు అందించింది. గగనతల నుంచి పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది. సాధారణ డ్రోన్లతోపాటు చిన్నపాటి మానవ రహిత యుద్ధ విమానాలను నేలకూల్చగలదు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలతోపాటు విదేశాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సైతం భారత సైన్యం ఉపయోగించింది. వాటిలో స్కై స్ట్రైకర్ కామికాజ్ డ్రోన్లు, బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు ఉన్నాయి. అంతేకాదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు కూడా ఈ ఆపరేషన్‌కు సహకరించాయి. సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్(సమర్) అనేది ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలో ఒక భాగం. పాక్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులకు మధ్యలోనే కూలి్చవేసింది. భారత వైమానిక దళం సహకారంతో భారత రక్షణ రంగ పరిశ్రమలు దీన్ని రూపొందించాయి. గగనతలంలో తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, మానవ రహిత విమానాలను ఇది పేల్చేయగలదు. భారత సైన్యంలో ఇది కీలక అస్త్రంగా మారింది. బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ శిబిరాలు, ఎయిర్‌బేస్‌లపై భారత సైన్యం మే 10వ తేదీన అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు ప్రారంభించింది. ఇందుకు బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు ఎంతగానో తోడ్పడ్డాయి. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్లో 20 శాతం వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ క్షిపణులను భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డీఆర్డీఓపాటు రష్యా రక్షణ పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి ఇవి ప్రపంచంలో అత్యంత అధునాతనమైన క్షిపణులుగా గుర్తింపు పొందాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లను సబ్మెరైన్లు, నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూభాగం నుంచి ప్రయోగించవచ్చు. ఇవి ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. ప్రయోగించామంటే లక్ష్యాన్ని తాకాల్సిందే. గురితప్పే ప్రసక్తే లేదు. బ్రహ్మోస్ అంటే కేవలం ఆయుధం కాదు, భారతీయ సైనిక శక్తికి ప్రతీక అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారతదేశ ఐరన్ డోమ్‌గా పేరుగాంచిన ఆకాశ్ క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ మిస్సైళ్లను బీడీఎల్ తయారు చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడులు ప్రారంభించిన తర్వాత పాక్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించింది. ఇవి చాలావరకు తుర్కియే, చైనా సరఫరా చేసినవే. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ వాటిని సమర్థంగా తుత్తునియలు చేసింది. భారత భూభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆకాశ్ అనేది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌తో దీన్ని పోల్చుతుంటారు. ఆకాశ్ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలోని నాలుగు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు. -
దేశానికి రక్షణగా.. శ్రీకృష్ణుడి స్పూర్తితో ‘మిషన్ సుదర్శన్ చక్ర’
న్యూఢిల్లీ, సాక్షి: మహాభారతంలో శ్రీకృష్ణుడి స్పూర్తితో ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను అనే ఆధునిక ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో .. రాబోయే పదేళ్లలో అంటే 2035 నాటికి, దేశ భద్రత కోసం రక్షణా కవచాన్ని అందుబాటులోకి తేనున్నాం. అందుకే శ్రీకృష్ణుడి స్పూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ 2035 నాటికి అభివృద్ధి అవుతుంది. మిషన్ సుదర్శన్ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ప్రార్ధనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సురక్షితంగా ఉంచేలా మిషన్ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో ఖచ్చితమైన లక్ష్య వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం వలె శక్తివంతమైన ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ .. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడులను నిలువరించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు. -
శ్వాన్‌సింగ్ కోసం దిగొచ్చిన భారత ఆర్మీ.. పాక్ యుద్ధంలో ఏం చేశాడంటే?
సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్ సింగ్. ఇంతకీ శ్వాస్ సింగ్ ఏం చేశాడంటే..ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్ సింగ్ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్‌లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్ సింగ్. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్‌సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.🇮🇳 The Indian Army will sponsor the education of 10-yr-old Shvan Singh from Ferozepur, Punjab — the youngest warrior of #OperationSindoor, who served soldiers with food day & night during the op.#IndianArmy #ShvanSingh #OperationSindoor #RealHero pic.twitter.com/Bqn1Vot8TD— Aman Dev Barman (@AmanDevBar67676) July 21, 2025ఇక, తాజాగా శ్వాన్సింగ్ను ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా పలకరించింది. సాక్షి అడిగిన పలు ప్రశ్నలకు శ్వాన్‌సింగ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అతడు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు.. అతడి పేరెంట్స్ ఏం చేస్తారు.. పది రోజుల పాటు తాను ఇండియన్ ఆర్మీతో గడిపిన క్షణాలను.. యుద్ధం నాటి పరిస్థితులను వివరించాడు.. ఈ వివరాల గురించి కింది వీడియోలో.. -
ఆపరేషన్ సిందూర్ యోధులకు వీర్‌చక్ర పురస్కారాలు
న్యూఢిల్లీ: ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలుచేసిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రకటించింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డ్‌లను ప్రకటించారు. యుద్ధకాలంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డ్ అయిన వీర్‌చక్రను వాయుసేనకు చెందిన తొమ్మిది మంది పైలెట్లకు ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు రంజిత్ సింగ్ సిధూ, మనీశ్ అరోరా, అనిమేశ్ పట్నీ, కునాల్ కల్రాలకు వీర్‌చక్ర ప్రకటించారు. వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, స్వాడ్రాన్ లీడర్లు సర్థాక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఏఎస్ ఠాకూర్‌లకూ వీర్‌చక్ర ప్రకటించారు. ఆర్మీ తరఫున కల్నల్ కోశాంగ్ లాంబా, లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిష్ట్, నాయిబ్ సుబేదార్ సతీశ్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్లకూ వీర్‌చక్ర దక్కింది. యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డుల్లో పరమ్ వీర్‌చక్ర, మహావీర్ చక్ర తర్వాత వీర్‌చక్రను మూడో అత్యున్నత అవార్డ్‌గా పరిగణిస్తారు. గ్యాలంట్రీ అవార్డ్‌ల జాబితాను గురువారం మోదీ ప్రభుత్వం విడుదలచేసింది. మేలో పాక్‌నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను ఎస్–400 గగనతల రక్షణవ్యవస్థ సాయంతో నేలకూల్చిన భారతవాయుసేన సిబ్బందికి సైతం గ్యాలంట్రీ అవార్డ్లు దక్కాయి. మరికొందరికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడళ్లను ప్రకటించారు. పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేసిన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్లకు సారథ్యం వహించిన ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్, ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాలకూ సర్వోత్తమ్ యుద్ధసేవా మెడల్‌ను ప్రకటించారు. కేవలం వింగ్ కమాండర్ అభిమన్యు సింగ్‌కు మాత్రమే శౌర్య చక్ర ఇచ్చారు. మొత్తంగా భారతవాయుసేన నుంచి నలుగురికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్, నలుగురికి ఉత్తమ్ యుద్ధసేవా మెడల్, తొమ్మిది మందికి వీర్ చక్ర, ఒకరికి శౌర్య చక్ర, 13 మందికి యుద్ద సేవా మెడళ్లు, 26 మందికి యువసేవా మెడళ్లు, 162 మందికి ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నందుకు ‘మెన్సన్–ఇన్–డెస్పాచెస్’ దక్కాయి. రాష్ట్రపతి ముర్ము మొత్తంగా 127 గ్యాలంట్రీ అవార్డ్లు ప్రకటించారు. -
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్ హీరోస్ పేరిట ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్ నటుడు తన లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్ ఓటీటీలో ఈ ఫుల్ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. -
చట్టసభలే సరైన వేదికలు
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్‌లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు. -
భారత్‌తో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్తాన్‌కు చావు దెబ్బ!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలు వల్ల ఆ దేశానికే ఊహించని షాక్ తగిలింది ఈ కారణంగా కేవలం రెండు నెలల కాలంలో పాక్‌కు ఏకంగా రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లినట్టు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో.. భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్‌పై కక్షగట్టిన పాక్.. తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు రూ.1240కోట్లు(భారత కరెన్సీ) నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతపై ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100-150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది.దీని కారణంగా విమానాల రాకపోకలు 20శాతం తగ్గిపోయాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు.. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.Pakistan's ministry of Defence informed National Assembly on Friday that Pakistan lost Rs 4.1 billion in 2 months due to closure of airspace for Indian aircraftIn 2019, a similar closure led to an estimated Rs7.6 billion ($54 million) revenue loss to Pakistan#OperationSindoor pic.twitter.com/BdLlZVmPB2— Anmol (@anmol_kaundilya) August 9, 2025పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులోభాగంగా సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు పాక్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచివెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. -
‘ఆపరేషన్ సిందూర్‌తో చెక్‌మేట్.. భారత్ సత్తా పాక్ ప్రజలకు తెలుసు’
మద్రాస్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చర్య పాత్రను ఆపరేషన్ సిందూర్ నొక్కిచెబుతుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో తాము చెస్‌లో పావుల మాదిరిగా శత్రువుల కదిలికలు తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.ఐఐటీ మద్రాస్‌లోని అగ్నిశోధ్-ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC)ను ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆపరేషన్ సిందూర్ అంశంపై జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు.‘ఆపరేషన్ సిందూర్‌లో మేం చెస్ గేమ్ ఆడాం. శత్రువు తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. మేం ఏం చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు. మనం చెస్ గేమ్‌లో పావుల్లా ముందుకు సాగాం. శత్రువు అంచనా వేయలేని విధంగా దాడులు చేశాం. పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి అని చెప్పుకొచ్చారు. 'If you ask a Pakistani, you lost or won...our chief has bcm field Marshal..we must have won, that is why he became the field Marshal', Army Chief General Upendra Dwivedi on Pakistan's narrative strategy for own domestic population after Indian strikes pic.twitter.com/VX5MD12p7u— Sidhant Sibal (@sidhant) August 9, 2025ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 23వ తేదీన మరుసటి రోజే మేమందరం సమావేశం అయ్యాం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలు చాలు అని చెప్పడం ఇదే మొదటిసారి. ముగ్గురు చీఫ్‌లు ఏదో ఒకటి చేయాలని చాలా స్పష్టంగా ఉన్నారు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అనే స్వేచ్ఛ ఇచ్చారు. అదే మా మనోధైర్యాన్ని పెంచింది అని చెప్పారు. 25వ తేదీన నార్తర్న్ కమాండ్‌ను సందర్శించాం. అక్కడ మేం తొమ్మిది లక్ష్యాలను నాశనం చేశాం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఏప్రిల్ 29న మేం మొదటిసారి ప్రధానమంత్రిని కలిశాము. ఆపరేషన్ సిందూర్ అనే చిన్న పేరు మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది’ అని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌పై భారత్ గెలిచిందా లేక ఓడిందా అనే విషయం పాకిస్తానీలను అడిగితే బాగా చెబుతారు అని చెప్పుకొచ్చారు. -
సిందూర్ సమయంలో పాక్ ఐదు యుద్ధ విమానాలు కూల్చేశాం: ఐఏఎఫ్ చీఫ్
-
ఐదు పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం
బెంగళూరు: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ వైమానిక దళాన్ని భారీగా దెబ్బకొట్టామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, మరో భారీ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. మన సైన్యం ఇప్పటిదాకా ఉపరితలం నుంచి ఉపరితలానికి చేసిన నమోదిత దాడుల్లో ఇది అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు. శనివారం బెంగళూరులో 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం.కాట్రే స్మారక ప్రసంగంలో అమర్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు పంచుకున్నారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌పై జరిగిన నష్టంపై భారత సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. తొమ్మిది పాక్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అమర్‌ప్రీత్ సింగ్ ప్రదర్శించారు. దాడికి ముందు, దాడి తర్వాత దృశ్యాలు ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్ చెబుతున్నట్లుగా సాధారణ జనావాసాలపై, పౌరులపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘‘పటిష్టమైన ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించాం. దాదాపు 90 గంటల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యం సాధించి, ప్రత్యర్థి దేశాన్ని భారీగా నష్టపరిచాం. పాకిస్తాన్‌కు చెందిన రెండు వైమానిక స్థావరాలు సైతం ధ్వంసం చేశాం. భారత ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయి. పాక్ సైన్యం ప్రయోగించిన మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), డ్రోన్లను కూల్చివేశాం. వాటిలో చాలావరకు మన భూభాగంలో పడి పోయాయి. కొన్ని క్షిపణులను సైతం తుత్తునియలు చేసి మన సత్తా చాటాం. కాళ్లబేరానికి వచ్చిన పాక్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ సైనిక స్థావరాలపై దృష్టి పెట్టి, క్షిపణులతో దాడికి దిగాం. జకోబాబాద్ ఎయిర్‌బేస్‌లో కనీసం ఒక ఏడబ్ల్యూసీ విమానంతోపాటు ఎఫ్–16 యుద్ధ విమానాలను పార్క్ చేసిన హ్యాంగర్ సగం వరకు నామరూపాల్లేకుండా పోయింది. అమెరికా ఇచ్చిన ఎఫ్–16లు చాలావరకు దెబ్బతిన్నాయి. రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి. సర్గోధా ఎయిర్‌బేస్‌ను సైతం నేలమట్టం చేశాం. పదవీ విరమణ కంటే ముందే ఈ ఎయిర్‌బేస్‌పై దాడి చేసే అవకాశం రావడం సంతోషకరం. సుకుర్ ఎయిర్‌బేస్‌లో యూఏబీ హ్యాంగర్తోపాటు రాడార్ సైట్‌పై దాడి చేశాం. మరింత నష్టం జరిగే ప్రమాదం కనిపించడంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. దాడులు ఆపాలంటూ ఫోన్‌చేసి అభ్యరి్థంచింది. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. మన దాడిలో దెబ్బతిన్న పాక్ ఎయిర్‌బేస్‌లు ఎప్పటికీ వినియోగంలోకి రావు. వాటికి మరమ్మతు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాలో తయారైన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఎంతగానో తోడ్పడింది. ఇదొక గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది పాక్ ముష్కరులపై ఆపరేషన్ విషయంలో సైన్యంపై రాజకీయపరమైన ఒత్తిళ్లేవీ రాలేదు. దాడులకు ప్రణాళిక రచించి, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆపరేషన్ సిందూర్ విజయానికి మన ప్రభుత్వ పట్టుదల కూడా కారణమే. మాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒత్తిళ్లు లేవు, ఆంక్షలు విధించలేదు. మేము ఏవైనా నియంత్రణలు పాటించి ఉంటే అవి సొంతంగా పాటించినవే. పాక్ ఉగ్రవాదులను భారీగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే పనిచేశాం. మన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాం. ‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ను త్వరగా ముగించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. వాస్తవం ఏమిటో చెప్పుకోవాలి. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉగ్రవాదులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలన్నదే మా లక్ష్యం. భారత్‌పై మళ్లీ దాడికి దిగితే ఏం జరుగుతుందో వారికి తెలిసిరావాలి. ఆపరేషన్ సిందూర్‌తో ఆ లక్ష్యం నెరవేరింది. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఎంత మూల్యం చెల్లించాలో ముష్కరులకు అర్థమైంది. లక్ష్యం నెరవేరింది కాబట్టి దాడులు ఆపేశాం. ఆపరేషన్ ముగించిన రోజు చాలామంది మాట్లాడారు. నాకు సన్నిహితులైనవారు మాట్లాడుతూ.. ‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు. అనుకున్నది సాధించిన తర్వాత కూడా దాడులు కొనసాగించడంలో అర్థం లేదు. ‘బాలాకోట్’పై ఒప్పించలేకపోయాం పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ధ్యేయంతో బాలాకోట్‌లో భీకర దాడులు చేశాం. వైమానిక దాడులతో పాక్ సైనిక శిబిరాలను నేలమట్టం చేశాం. బాలాకోట్ దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అందుబాటులో లేవు. అవి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు తావిచ్చింది. మేము ఏం సాధించామో ప్రజలకు చెప్పలేకపోవడం నిజంగా దురదృష్టకరం. బాలాకోట్ దాడులతో పాకిస్తాన్‌కు పెద్ద నష్టం జరిగినట్లు నిఘా సమాచారం ఉంది. ఈ దాడుల్లో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ, ఆ విషయంలో ప్రజలను నమ్మించలేకపోయాం. కానీ, ఆపరేషన్ సిందూర్ విషయంలో మేము అదృష్టవంతులమే. ఎందుకంటే వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ది అత్యంత కీలక పాత్ర. సైనిక దళాలను, ఇతర సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఏ యుద్ధంలోనైనా తొలుత గగనతల దాడులే ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ ద్వారా మరోసారి తేటతెల్లమైంది’’ అని అమర్‌ప్రీత్ సింగ్ వివరించారు. -
ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ విజయంపై మోదీకి సత్కారం
-
భారత్ హెచ్చరించినా పట్టించుకోని పాక్.. పీఓకేలో దాయాది దుశ్చర్య!
న్యూఢిల్లీ: ఓవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంతటా 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ప్యాడ్లు ఏర్పాటయ్యాయి.పాకిస్తాన్ ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా, ఇప్పుడు వారి నెట్‌వర్క్‌లను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి కీలక ప్రదేశాలలో శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు. అదనంగా, జమ్మూ ప్రాంతంలోని మస్రూర్, చాప్రార్ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు లాంచ్ప్యాడ్లు, షకర్‌గఢ్‌లోని డ్రోన్ సెంటర్ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చిన్న శిబిరాల ఏర్పాటు.. భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత్ ప్రకటిస్తుండటంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతున్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి, ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది.అధునాతన సాధనాలతో పునరుద్ధరణ.. ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని వర్గాలు చెబుతున్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందింది. ఈ శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్‌ను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఈ పునర్నిర్మాణానికి ఐఎస్ఐ 100 కోట్లకు పైగా పాకిస్తాన్ రూపాయలను కేటాయించింది. -
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ముంబై: మహారాష్ట్ర శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై ప్రియాంక విరుచుకుపడ్డారు. భారత సైనికుల ప్రాణాలు, ప్రజల రక్తం కంటే.. బీసీసీఐకి డబ్బే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ విషయమై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ‘బ్లాక్‌బస్టర్ ఫిక్సర్.. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. అలాగే, మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్‌లో కూడా దాయాదులు తలపడే అవకాశం ఉంది. ఇది న్యాయమేనా?. భారత సైనికుల రక్తం, త్యాగం.. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైనప్పుడు ఇలాంటివి ఉంటాయి. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దుతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.“Blockbuster Fixture: India vs Pakistan scheduled for 14 September, 2025 with potential rematches during Super Four and Final”When money is more important than the blood of our fellow Indians and our men in uniform. Shame on GoI for being a hypocrite on Operation Sindoor. And… pic.twitter.com/AJG4xruesB— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 3, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఎఫెక్ట్ ఇరుదేశాల క్రీడా సంబంధాలపైనా పడింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది. ఆసియాకప్‌లో కూడా భారత్-పాక్ మ్యాచ్‌లను నిర్వహించాలనుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆసియాకప్ షెడ్యూల్ విడుదల కావడంతో పలువరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్‌గా సోషల్ మీడియా ఖాతాలు, క్రికెటర్ల యూట్యూబ్ చానెల్స్ సైతం బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. -
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్‌ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్‌కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
సవరణపై సభా సమరం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను. హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్‌చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు. లోక్‌సభలోనూ అదే తీరు..లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్‌సభ ఉదయం మొదలుకాగానే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్‌సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు. -
కాంగ్రెస్ ధారాదత్తం చేసింది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో 16 గంటల చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాపం కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. ‘‘ దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ అజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టిపెట్టి జాతీయభద్రత వంటి మిగతా కీలకాంశాలను గాలికొదిలేసింది. దీంతో ఉగ్రవాదం విపరీతంగా విస్తరించింది. దీనికి ఏకైక కారణం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పేలవమైన రాజకీయ విధానాలు. కాంగ్రెస్ ఘోర తప్పిదాల కారణంగానే కశ్మీర్లో కొంతభాగం మన చేజారింది. అలా కాంగ్రెస్సే పాకిస్తాన్‌కు పీఓకేను అప్పగించింది. వాళ్లు ఇచి్చన పీఓకేను మేం తిరిగి తీసుకొస్తాం. ఘటన జరిగాక సమీక్ష జరపడం కాంగ్రెస్ విధానం. అసలు అలాంటివి సంభవించకుండా ముందే అప్రమత్తంగా ఉండటం మా నైజం’’ అని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గాం పాశవిక హత్యాకాండలో అమాయకులు చనిపోయారు. వాళ్ల తలకు గురిపెట్టి మరీ ఉగ్రవాదులు తూటాలు పేల్చారు. అదే తీరులో ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఉగ్రవాదుల తలల్లోకి మేం కూడా తూటాలు దించాం. పహల్గాం బాధిత కుటుంబాలు కోరుకున్నది మేం నెరవేర్చాం. ఆపరేషన్ మహదేవ్లో అంతమైన ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఆర్మీ దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు, చిన్నారుల ఎదుట నీ మతమేంటి? అని అడిగిమరీ అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గాం వంటి హేయమైన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా వచ్చి మాట్లాడాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. ఆయన బదులు నేను మాట్లాడుతున్నానని అమిత్ షా సర్దిచెప్పే ప్రయత్నంచేసినా విపక్షసభ్యులు వినిపించుకోకుండా నిరససగా వాకౌట్ చేశారు. తర్వాత అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది: జైశంకర్
-
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్‌తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
భారత్ గురించి మీకు చెబుతా.. మనీష్ తివారీ నర్మగర్భ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ సామాజిక మాధ్యమాల్లో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1970లనాటి సినిమా పాటను జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తివారీ.మంగళవారం తివారీ ఎక్స్‌లో.. ఆపరేషన్ సిందూర్ చర్చలో ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు కాంగ్రెస్ అవకాశమివ్వలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని జోడిస్తూ.. మనోజ్ కుమార్ నటించిన పూరబ్ ఔర్ పశ్చిమ సినిమాలోని ‘భారత్ కా రెహ్నా వాలా హూ, భారత్ కీ బాత్ సునాతా హూ’ అనే పాటను ఉటంకించారు. భారత వాసులారా.. భారత్ గురించి మీకు చెబుతా.. అని దీనర్థం. ఆపరేషన్ సిందూర్ అనంతరం విదేశాలకు పంపించిన దౌత్య బృందాల్లో భాగస్వాములుగా ఉన్న థరూర్, తివారీలకు పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడే అవకాశముందంటూ వార్తలు రావడం తెల్సిందే.అయితే, వీరిద్దరికీ కాంగ్రెస్ మాట్లాడే అవకాశమివ్వలేదు. దీనిపై ఎంపీ తివారీ త్రివర్ణ పతాకం కనిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. 1970లనాటి సినిమా పాటను జోడించారు. అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియా ఈ వ్యాఖ్యలపై అర్థమేంటని అడగ్గా.. ‘ఆంగ్లంలో ఓ సామెతుంది..‘నా మౌనాన్ని అర్థం చేసుకోలేకుంటే.. నా మాటలను సైతం ఎన్నటికీ అర్థం చేసుకోలేవు’ అంటూ స్పందించారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రశ్నించగా.. జర్నలిస్టులు కదా పరిశోధించండి’ అంటూ దాటవేశారు. తన వ్యాఖ్యలకు అర్థాన్ని మాత్రం వివరించలేదు.అయితే, తివారీ తనకు లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా, కాంగ్రెస్ వర్గాలు శశిథరూర్‌కు మాట్లాడే అవకాశమిచ్చానా ఆయన మాత్రం మరో అంశంపై మాట్లాడుతానని తెలిపినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, కేంద్రం చర్యలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రభుత్వాన్ని సమర్థించడంపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు వార్తలు రావడం తెల్సిందే. #WATCH | On his tweet, Congress MP Manish Tewari says, "There is a saying in English- 'If you don't understand my silences, you will never understand my words'. " pic.twitter.com/r1MsSt4wgZ— ANI (@ANI) July 29, 2025 -
పాకిస్తాన్ భార్యను తోడ్కొని రావాలి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్ బేణివాల్ సోమవారం రాత్రి సభలో వ్యాఖ్యలో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ భార్యగా మారిపోయిందని, ఆ భార్యను మన ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘భీకర దాడులతో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్‌కు సిందూర్ పేరుపెట్టారు. అంటే పాకిస్తాన్ నుదుటిపైనా సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్‌పై భారత్‌పై సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావడం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు(ప్రభుత్వం) వెళ్లి, పాకిస్తాన్‌ను ఇంటికి తీసుకురండి’’అని కోరారు. ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ సూచించగా, అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తన ప్రసంగం రేపు పత్రికలో ప్రచురితం కాదని, ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే అని హనుమాన్ బేణివాల్ చెప్పగా సభలో మరోసారి నవ్వుల విరిశాయి. -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చలో ఎవరేమన్నారంటే..
మోదీకి ఆ ధైర్యం ఉందా? ‘‘పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సైనిక దళాలను వాడుకుంటున్నారు. భారత్–పాక్‌ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరా గాందీకి ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50 శాతం ఉన్నా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్లో చెప్పాలి. చైనా, పాకిస్తాన్ల కుట్రల గురించి కొన్ని నెలల క్రితమే లోక్‌సభలో హెచ్చరించా. ప్రభుత్వం నా మాట విని ఉంటే ఐదు యుద్ధ విమానాలను కోల్పోయేవాళ్లం కాదు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించగానే కొన్ని సున్నితమైన విషయాలను మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు చేరవేసింది. సైనిక స్థావరాలపై దాడులు చేయడం లేదని, ఘర్షణ ఇష్టం లేదని చెప్పేసింది. అలా చేయడం లొంగిపోయినట్లు కాదా? కేవలం 30 నిమిషాల్లో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు లొంగిపోయింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేయకుండా భారత వైమానిక దళం చేతులు కట్టేసింది ఎవరు? మోదీ ప్రతిష్టను కాపాడే ప్రయత్నం జరిగింది. పహల్గాం బాధితుల రక్తంతో మోదీ చేతులు తడిశాయి. చైనా, పాకిస్తాన్ ఒక్కటి కాకుండా చూడాలని నాలుగు నెలల క్రితం నేను చెబితే చాలామంది ఎగతాళి చేశారు. మన విదేశాంగ విధాన వైఫల్యం వల్ల ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు చైనాతోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు చైనా అన్ని విధాలుగా సహకరించింది. యు ద్ధంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పులిని వదిలిపెట్టాలి అనుకుంటే దానికి బంధనాలు విధించడం తగదు. శత్రువును ఓడించాలనుకుంటే పూర్తిగా ఓడించాలి. భారత్–పాక్ యుద్ధం తానే ఆపేశానని ట్రంప్ 29 సార్లు చెప్పారు. ‘మమ్మల్ని మీరు ఆపలేరు, కచి్చతంగా యుద్ధం కొనసాగిస్తాం’ అని ట్రంప్‌తో మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పలేకపోయారు. మనం ఇప్పుడు ప్రమాదకరమైన దశలో ఉన్నాం. చైనా–పాకిస్తాన్ల కూటమిని ఎదుర్కొంటున్నాం. సైనిక శక్తిని సక్రమంగా వాడుకోలేని ప్రధానమంత్రిని మనం ఇక భరించలేం. డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు అని ధైర్యంగా చెప్పలేని ప్రధానిమంత్రిని భరించలేం. ఇందిరాగాంధీ చేసినట్లుగానే.. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ‘పని పూర్తి చేసుకొని రండి’ అని చెప్పే ప్రధానమంత్రి ప్రస్తుతం మనకు కావాలి. పహల్గాం దాడికి సృష్టికర్త అయిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు ఇస్తే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం’’ – లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా రాజీనామా చేస్తారా? ‘‘నాయకత్వం అంటే ఏదైనా మంచి జరిగితే పేరు ప్రఖ్యాతలు కొట్టేయడం కాదు, తప్పు జరిగితే అందుకు బాధ్యత వహించాలి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీలతోపాటు నా తల్లి సోనియా గాంధీ పెట్టుకున్న కన్నీళ్ల గురించి మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్‌పై యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపారో మాత్రం చెప్పడం లేదు. భద్రతాపరమైన లోపాలే పహల్గాంలో ఉగ్రవాద దాడికి కారణం. పాకిస్తాన్ దాడిలో మనం యుద్ధ విమానాలకు నష్టం జరగకపోతే ఆ విషయం పార్లమెంట్లో చెప్పడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? పహల్గాంలో నిఘా వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పాలి. అమిత్ షా రాజీనామా చేస్తారా? లేక బాధ్యత వహిస్తారా? గతంలో జరిగిపోయిన విషయాలు పక్కనపెట్టి, ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం స్పందించాలి’’. – కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు ‘‘ఆపరేషన్ సిందూర్ మోదీ ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఎవరి ఒత్తిడితో కాల్పుల విరమణ పాటించారో చెప్పాలి. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దేశం ఒంటరిగా మిగిలిపోయింది, ఎవరూ మనకు మద్దతుగా రాలేదు. భారతదేశ దౌత్య విధానంలో ఇదొక చీకటి దశ. పుల్వామా, పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలి’’. – సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ప్రజలను పరాజితులను చేశారు ‘‘విశ్వగురు(నరేంద్ర మోదీ) దేశ ప్రజలను పరాజితులను చేశారు. ఆపరేషన్ సిందూర్ ఘోరంగా విఫలమైంది. శత్రువులను పూర్తిగా ఒడించకుండానే యుద్ధం విరమించడం ఏమిటి? విశ్వగురు ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో ఉగ్రవాద దాడులు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల నుంచి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు’’. –డీఎంకే ఎంపీ కనిమొళి పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. సాయం చేస్తాం ‘‘పాకిస్తాన్ సహా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతం కావాలని భారత్ కోరుకుంటోంది. పాక్ ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలి. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. మీకు(పాక్) చేతకాకపోతే చెప్పండి మేము రంగంలోకి దిగుతాం. పాక్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే)ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్వా«దీనం చేసుకోలేదో చెప్పాలి. పీఓకే ప్రజలు భారత పరిపాలనా వ్యవస్థలో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు’’. – రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్సమగ్ర నివేదిక విడుదల చేయాలి ‘‘పహల్గాం ఉగ్రవాద దాడికి భద్రతాపరమైన లోపాలే కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యత వహించాలి, పదవికి రాజీనామా చేయాలి. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేశానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ నోరుమెదపడం లేదు. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం అంగీకరించిందా? హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కా>ర్యక్రమాలతో మనకు ఒరిగిందేమీ లేదు. వాటితో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు ఏమాత్రం లాభం లేదు. ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీకి గొప్ప స్నేహ సంబంధాలున్నప్పటికీ పాక్‌తో యుద్ధం సమయంలో ఇండియాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పాక్ దురాగతాలను కనీసం అమెరికా కూడా బహిరంగంగా ఖండించలేదు. పాక్ ఓడిపోయే దశలో ఉన్నప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు. అమెరికా జోక్యం నిజమేనా? దీనిపై ప్రభుత్వం కచి్చతంగా సమాధానం చెప్పాలి? కార్గిల్ యుద్ధంపై అప్పటి ప్రభుత్వం సమగ్ర నివేదిక విడుదల చేసింది. అదే తరహాలో పహల్గాం దాడిపై మోదీ సర్కార్ నివేదిక ఇవ్వాలి’’. – రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మోదీ నరాల్లో రాజకీయాల ప్రవాహం ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నరాల్లో సిందూరం ప్రవహించడం లేదు. కేవలం రాజకీయాలే ప్రవహిస్తున్నాయి. నిజంగా సిందూరమే ప్రవహిస్తే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగేదే కాదు. మన ప్రజలను బలి తీసుకుంటున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం ఏమిటి? ఇదేనా మన విదేశాంగ విధానం?’’ – రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
సిందూర్ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు
న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్ సిందూర్ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ దండయాత్ర చేయగలదని ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్ నుంచి సింధు దాకా భారత్ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్ చేయలేదు. పాకిస్థా న్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి ఫోన్ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదేపదే నాకు ఫోన్ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్ చేసి మాట్లాడా. పాక్ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్ దాడులుచేస్తే కాంగ్రెస్ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్ అభి నందన్ పాక్ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్ వైమానికస్థావరం నాశనమైందని పాక్ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్ విలువ ఇవ్వట్లేదు. పాక్ రిమోట్ కంట్రోల్‌తో కాంగ్రెస్ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్ యువనేత (రాహుల్)లు ఆపరేషన్ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. -
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి56 ఇంచ్‌ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్‌తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్‌తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్‌పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్‌ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్‌కు అప్పగించారు. -
మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది? -
ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?
పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా.. ఇటు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. #WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "... Yesterday, the Defence Minister spoke for an hour, during which he spoke about terrorism, protecting the country, and also gave a history lesson. But one thing was left out- How did this attack happen?..." pic.twitter.com/as9gAbNCjr— ANI (@ANI) July 29, 2025కశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా చేస్తారు?. పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరు?. .. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు. పాకిస్తాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్‌కు సపోర్ట్ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్‌కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. #WATCH | Discussion on Operation Sindoor | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...We attended the meeting (all-party), but you went to Bihar for election campaigning. Is that your patriotism?...He should have been in the House today and heard us. If you do not have the… pic.twitter.com/XrcPafJoNp— ANI (@ANI) July 29, 2025కాంగ్రెస్‌ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్ నుంచి ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు. -
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ..
-
చిదంబరం అడిగిన ప్రూఫ్ ఇదిగో: అమిత్‌షా
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ సాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాక్ రెచ్చిపోయి సరిహద్దులో హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్ చేసిందని.. ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు.పహల్గామ్లో కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. టెర్రరిస్టులు ఉగ్రదాడి తర్వాత పాక్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదు. నిన్న జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ మహాదేవ్ జరిగింది. ఆపరేషన్ మహాదేవ్లో సులేమాన్ మూసా హతమయ్యాడు. ముగ్గురిలో ఒకరు ఎల్ఈటీ ఉగ్రవాది సులేమాన్గా గుర్తించాం. ఈ సులేమాన్ పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.‘‘చిదంబరం ప్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన వారు. ఉగ్రవాదులు దగ్గర పాక్‌లో తయారైన చాకెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్‌కు క్లీన్చిట్ ఎందుకుఇచ్చారు?’’ అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.పహల్గామ్ టెర్రిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది. పాక్‌ను రక్షిస్తే చిదంబరానికి వస్తుంది? అంటూ అమిత్‌షా మండిపడ్డారు.కమ్యూనికేషన్ డివైజ్‌ను ట్రాక్ చేయడంద్వారా ఉగ్రగుట్టును పసిగట్టాయి. జమ్మూకశ్మీర్ ోలీసులు, సీఆర్పీఎఫ్, పారామిలటరీ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. యూపీఏ హయాంలో తప్పించుకున్న ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులు ప్రాణాలతో దేశం వెళ్లరని ఆ మరుసటి రోజే చెప్పాం’’ అని అమిత్‌షా గుర్తు చేశారు. -
‘భారత్ మాటే వినిపిస్తా..’ కాంగ్రెస్‌లో మరో ముసలం!
శశిథరూర్ ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం తెర మీదకు వచ్చింది. సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ ఓ క్రిప్టిక్ పోస్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ చర్చకు శశిథరూర్‌తో పాటు మనీశ్ తివారీని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందంటూ నిన్నంతా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. భారతీయుడిగా భారత్ మాటే చెబుతానని ఎక్స్‌లో పోస్టు చేశారాయన. మరోవైపు.. ప్రభుత్వానికి అనుకూలంగా థరూర్, తివారీ మాట్లాడతారనే ఆపరేషన్ సిందూర్ చర్చకు కాంగ్రెస్ దూరంగా ఉంచిందా? అనే కథనం తాలుకా కట్టింగ్‌ను షేర్ చేశారు. దానికి.. ప్రేమే జీవన మూర్తి అయిన దేశం.. ఈ దేశ గీతాలను నేను ఆలపిస్తాను.. నేను భారత్‌లో నివసించే ఒక భారతీయుడిని.. భారత్ మాటలు నేనే వినిపిస్తాను అంటూ అలనాటి బాలీవుడ్ చిత్రం ఉపకార్లోని దేశభక్తి పాట సాహిత్యాన్ని పోస్ట్ చేశారాయన.है प्रीत जहां की रीत सदा मैं गीत वहां के गाता हूं भारत का रहने वाला हूं भारत की बात सुनाता हूंHai preet jahaan ki reet sada Main geet wahaan ke gaata hoon Bharat ka rehne waala hoonBharat ki baat sunata hoon - Jai Hind pic.twitter.com/tP5VjiH2aD— Manish Tewari (@ManishTewari) July 29, 2025 కాంగ్రెస్‌లో మనీష్ తివారి ట్వీట్ కలకలం రేపుతోంది. శశిథరూర్‌తో పాటే గతంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారీయన. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వైఖరికి అనుగుణంగా లోక్ సభలో మాట్లాడేందుకు ఈ ఇద్దరూ నిరాకరించినట్లు సమాచారం. -
లక్ష్యాన్ని సాధించాం. పాక్ కాళ్లబేరానికొచ్చింది. అందుకే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశామన్న రాజ్‌నాథ్ సింగ్
-
సభలో సిందూరం
న్యూఢిల్లీ: పహల్గాం ఉదంతం, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి సోమవారం వివరణలతో చర్చను మొదలెట్టిన అధికార పక్షం, ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్షసభ్యులు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు లోక్‌సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను బలంగా వినిపించారు. ఇదేసమయంలో జైశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడం, అడ్డుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగానే బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైనా చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదాపడి చివరకు అర్థాంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడింది.పాక్ కాళ్లబేరానికి వచ్చిందితొలుత లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ముమ్మాటికీ చరిత్రాత్మకమైన సైనిక చర్య. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది. యుద్ధరంగంలో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ధైర్యవంతులైన సైనికులందరికీ నా సెల్యూట్. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌కు పథకరచన చేశారు. కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చాం. కేవలం 22 నిమిషాల్లో 9 కీలక ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి మన సత్తా చాటాం. ఊహించని మెరుపుదాడితో చేష్టలుడిగిన పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్వయంగా ఫోన్ చేసి తమకు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యంలేదని స్పష్టంచేశారు. ఆలోపు పాక్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులను మన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వీర్యంచేశాయి. మన దాడులకు ప్రతీగా పాక్ జరిపిన దాడుల్లో భారత్‌లో ఏ ఒక్క కీలక స్థావరం, ఆయుధాగారం దెబ్బ తినలేదు. ఉగ్రవాదుల స్థావరాలు, వాళ్లకు మద్దతిచ్చేవాళ్లను అంతంచేసేందుకే ఆ ఆపరేషన్. లక్ష్యం నెరవేరిన కారణంగానే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశాం. ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, ప్రమేయం లేవు. బయటిశక్తుల (అమెరికా, ట్రంప్) కారణంగానే పాక్‌పై మనం దాడులను ఆపేశామనడంలో వాస్తవం లేదు. భారత వాయుసేన అసాధారణ దాడులు, సరిహద్దు వెంట ఆర్మీ దీటైన జవాబుకు తోడు నావికాదళం దాడులకు దిగొచ్చన్న భయాలతో పాక్ కాళ్లబేరానికొచ్చింది’’ అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మమ్మల్ని విపక్షాలు అడగదల్చుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? అని ఒక్కటే ప్రశ్న వేయాలి. అందుకే మేం అవును అని సూటి సమాధానం చెప్తాం. పాక్ దాడుల్లో మన సైనికులెవరూ వీరమరణం పొందలేదు. ఏ పరీక్షలోనైనా ఫలితమే ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు పెన్సిల్ విరగడము, కలం కనిపించకుండా పోవడమూ సాధారణం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ముఖ్యం. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సైనికదళాలు 100 శాతం కచ్చితత్వంతో సాధించాయి. పాక్తోగానీ మరే ఇతర దేశంతోగానీ ఎప్పుడూ విజయవంతమైన ప్రభుత్వాల సారథ్యంలో స్నేహాన్నే భారత్ కోరుకుంటోంది. గతంలో భారత్ ‘లాహోర్ బస్సు యాత్ర’ బాషలో మాట్లాడితే ధూర్త పాక్‌కు బోధపడలేదు. వాళ్లకు అర్థమయ్యేలా ఈసారి మేం ‘బాలాకోట్ దాడి’ భాషలో మాట్లాడాం. భారత్ ఏ దేశంతోనైనా కరచాలనం కోసం స్నేహహస్తమే అందిస్తుంది. చేతిని మెలిపెట్టాలని చూస్తేమాత్రం ఆ చేతినే విరిచేస్తుంది. పౌరుల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుంతో ఆపరేషన్ సిందూర్ కళ్లకుకట్టింది. భారత్‌ను ఏనాటికీ ఓడించలేమని పాక్ పాలకులకు అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. కానీ అది వాళ్లనే మింగేస్తోంది. అమాయక పాక్ ప్రజలనూ చంపేస్తోంది. ఆపరేషన్ ముగియలేదు. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సిందూర్ మొదలవుతుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.వాణిజ్య అంశాల్లో సిందూర్ ప్రస్తావన రాలేదు: జైశంకర్‌ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. అమెరికాతో వాణిజ్యానికి, ఈ ఆపరేషన్‌కు సంబంధం లేదు. ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడంలో విజయంసాధించిన భారత దౌత్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మనం పాక్ నడిబొడ్డులోని బహావల్పూర్, మురిద్కేలోని స్థావరాలను నేలమట్టంచేయగలమని ఎవరైనా ఊహించారా?. పహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములేకాదు ఎన్నో దేశాలు ఖండించాయి. పాక్‌పై దాడిచేశాక దాడులను ఆపాలని పాక్ నుంచే అభ్యర్థన వచ్చింది. కానీ మేం పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి అభ్యర్థన వస్తేనే ఆపుతామని చెప్పాం’’ అన్నారు. ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం..విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తుంటే విపక్ష సభ్యులు పదేపదే అడ్డుత గిలారు. హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సభ్యులు అస్సలు విశ్వసించట్లేరు. బయటివాళ్లు (ట్రంప్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఎక్కువ. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువుందో ఇప్పుడే తెలుస్తోంది. మీ అభిప్రాయాలను పార్లమెంట్‌పై రుద్దకండి. విదేశీయులను నమ్మినందుకే మీరు విపక్షంలో కూర్చున్నారు. ట్రంప్ వంటి విదేశీయుల మాటలను ఇలాగే నమ్ము తూ పోతే మీరు ఇలాగే మరో 20 సంవత్సరాలు విపక్షంలోనే ఉండిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.ప్రశ్నలు కురిపించిన కాంగ్రెస్చర్చలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ‘‘ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్‌కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపాల్సి వచ్చింది?. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనంచేసుకుంటాం?. పాక్, భారత్ పరస్పర సైనిక చర్యలకు ముగింపు పలికింది తానేనని ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. భారత్, పాక్ యుద్దం ఆపితేనే వాణిజ్యం కొనసాగి స్తానని ట్రంప్ అమెరికా వాణిజ్య కత్తిని చూపి బెదిరించారా?. ఇంట్లో చొరబడి మరీ చంపుతామని ఇప్పటికి ఎన్నోసార్లు మోదీ అదే డైలాగ్‌లు కొడుతున్నారు. మరి సిందూర్ పరిసమాప్తంకాలేదని, పాక్ దాడిచేస్తే మళ్లీ మొదలవుతుందని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు సిందూర్ విజయవంతమైందని ఎలా అంటారు? యుద్ధం చేయడం తమ విధానం కాదంటారు? మరి సిందూర్వేళ చేసిందేంటి? వాళ్ల అధీనంలోని భూభాగాన్ని స్వాధీనంచేసుకోవడానికి సిందూర్ చేయలేదంటున్నారు. మరి దేని కోసం చేసినట్లు? సిందూర్ వేళ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయాం?’’ అని గొగోయ్ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్‌కు 26 నోటీసులుబిహార్ ఓటర్ల జాబితా అంశంతోపాటు ఇతర రాష్ట్రాల్లో బెంగాళీ వలసకూలీలు వివక్షను ఎదుర్కొనే పలు అంశాలపై రాజ్యసభలో చర్చించాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు మొత్తం 26 వాయిదా తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. జోరీఅవర్ సెషన్‌ను మొదలుపెట్టాలని నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తిని హరివంశ్ కోరగానే విపక్షసభ్యులు ఆందోళన పెంచారు. ఓటు చోరీని ఆపాలి అని నినాదాలుచేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్‌లోపే సభ రెండుసార్లు వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక సభను మంగళవారానికి వాయిదావేశారు. ó డీ చర్చ -
‘అంతా నా ఇష్టం’.. రాహుల్‌తో శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోక్‌సభలో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ తీసుకున్న లైన్‌కు అనుగుణంగా మాట్లాడలేనని.. తాను మొదటి నుంచి ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందనే మాటకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీకి శశిథరూర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసింది. ఎంపీ శశి థరూర్‌ను సైతం పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.అయితే, శశి థరూర్ మాత్రం ఒప్పుకోలేదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే తన అభిప్రాయాన్ని మార్చలేనని శశిథరూర్ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వంపై విమర్శలు చేయమని కోరినప్పుడు.. ఆయన మౌనం (మౌనవ్రత్)వహించారు. ఈ క్రమంలో పార్లమెంటులోకి వచ్చే సమయంలో ఆపరేషన్ సిందూర్‌పై మీడియా ప్రశ్నలకు శశిథరూర్ మౌనవ్రత్, మౌనవ్రత్ అని అంటూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ శశిథరూర్.. పార్టీ కార్యాలయంలో రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ వద్ద పార్టీ తీసుకున్న నిర్ణయంపై శశిథరూర్ విభేదించినట్లు సమాచారం. కాబట్టే పార్టీ పెద్దలు లోక్ సభలో శశిథరూర్‌కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.తాజా పరిణామంతో శశి థరూర్ తన స్వతంత్ర అభిప్రాయాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ హస్తిన పెద్దలు గుసగుసలాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. "Maunvrat, maunvrat..."😂😂😂.@ShashiTharoor destroys CONgress without saying anything. 🔥 pic.twitter.com/qi1wbLTgWi— BhikuMhatre (@MumbaichaDon) July 28, 2025 -
ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనం: రాజ్‌నాథ్ సింగ్
-
ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో అపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్‌ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్‌కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్‌లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్‌లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. -
థరూర్ మౌన వ్రత్.. తప్పించారా? తప్పుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లోక్‌సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్ కారు దిగి పార్లమెంట్ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్.. మౌన వ్రత్’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, "Maunvrat, maunvrat..." pic.twitter.com/YVOwS7jpk5— ANI (@ANI) July 28, 2025Interesting moment in #Parliament:On @NDTV’s question about whether he’ll speak today, @ShashiTharoor walked in silently.@RenukaCCongress, standing nearby, remarked: “He has every right to speak.”Then, interestingly asked him: “Why didn’t you invite me to the mango party?” pic.twitter.com/dkBb590z1W— AISHVARYA JAIN (@aishvaryjain) July 28, 2025ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.2020 నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో శశిథరూర్‌కు గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్‌తో కాంగ్రెస్ గ్యాప్ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. -
పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారు?.. బోర్డర్లో భద్రత లేదా?
ఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది.అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొని ఉండవచ్చు. ఈ దాడికి పాల్పడిన హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఎక్కడ. అవి కేంద్రం, ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయా?. ఉగ్రవాదుల్ని గుర్తించారా? వారు ఎక్కడ నుంచి వచ్చారు? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఆధారాలు లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.P. Chidambaram, former UPA-era Home Minister and the original proponent of the infamous “Saffron Terror” theory, covers himself with glory yet again:“Have they (NIA) identified the terrorists or where they came from? For all we know, they could be homegrown terrorists. Why do… pic.twitter.com/c32I1KzqOg— Amit Malviya (@amitmalviya) July 27, 2025చిదంబరం వ్యాఖ్యలకు తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యూపీఏ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు. మరోసారి తనను తాను కీర్తించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోంది. కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ.. చిదంబరం వ్యాఖ్యలు సరైనవే. పహల్గాం దాడి ఘటనలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొన్నారు. సరే.. బీజేపీ నేతలు చెబుతున్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాదులే ఈ దాడి చేస్తే.. మన సరిహద్దు ప్రాంతం భద్రత ప్రశ్నార్థకంగా ఉందా?. సరిహద్దులు భద్రంగా లేవా?. నిజంగా వారు సరిహద్దులు దాటి వస్తే.. సెక్యూరిటీ ఏం చేస్తోంది?. వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వెళ్లిపోయారు?. ఈ విషయం తెలుసుకునే హక్కు మాతో పాటు.. దేశ ప్రజలకు కూడా ఉంది అని అన్నారు. -
Watch Live: పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ ఫైట్
-
Live: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ.. విపక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లు
Parliament Monsoon Session Liveభారత సైనికులు సింహాలు : రాజ్‌నాథ్ సింగ్పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్యఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాంఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారుమతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చపంపారుమన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఉరుకునేది లేదుపాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాంభారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసిందిపాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు చేశాం100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాంహిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాంటెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసిందిపాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాంఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్ పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదుభారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిందిపాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదుతమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరిందిమనదాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది.ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. గ్యాప్ ఇచ్చాంఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదుబాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాంప్రతి పక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లుపరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం అన్నది మాత్రమే చూడాలి. పెన్సిల్ విరిగిందా,అరిగిందా అన్నది చూడకూడదుపాక్ ఆర్మీ,ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని హతమార్చాంపాక్ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ లెక్క చేయలేదుఎటుచూసుకున్నా.. పాక్ మనతో సమమానం కాదుప్రతిపకక్షాలు భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదుభారత సైనికులు సింహాలుభారత్ దాడులకు పాక్ తట్టుకోలేకపోయిందిదేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలి లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చప్రారంభమైన పార్లమెంట్లోక్సభలో ఆపరేషన్ సిందూర్‌పై మొదలైన చర్చచర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్: పీయూష్ గోయల్ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చబీహార్ ఓటర్ల జాబితా అంశంతో ఉభయ సభల్ని అడ్డుకుంటున్న విపక్షాలుమూడుసార్లు వాయిదా పడ్డ సభలువిపక్షాల తీరుపై కేంద్రం ఫైర్ఆపరేషన్ సింధూర్ చర్చ నుంచి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్భారత సైన్యం సాధించిన విజయాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పీయూష్ వ్యాఖ్యమూడోసారి లోక్‌సభ వాయిదాఆపరేషన్ సిందూర్‌కు ముందు లోక్‌సభలో గందరగోళంవిపక్షాల ఆందోళనతో లోక్‌సభ మరోసారి వాయిదామధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాఇవాళ మూడోసారి పడ్డ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడేది వీళ్లేబీజేపీ తరపున.. రాజ్‌నాథ్ సింగ్బజ్యంత్ పాండాఎస్ జైశంకర్తేజస్వి సూర్యసంజయ్ జైశ్వాల్అనురాగ్ ఠాకూర్కమల్జీత్ షెరావత్కాంగ్రెస్ నుంచిగౌరవ్ గోగోయ్ప్రియాంక గాంధీ వాద్రాదీపేంద్ర హుడాపరిణితీ షిండేసప్తగిరి ఉలాకాబిజేంద్ర ఒలాఇతరులులావు కృష్ణదేవరాయ(టీడీపీ)హరీష్ బాలయోగి(టీడీపీ)రామశంకర్ రాజ్‌భర్(ఎస్పీ)చోటేలాల్(ఎస్పీ)కల్యాణ్ బెనర్జీ(ఏఐటీసీ)సయోని ఘోష్(ఏఐటీసీ)కే ఫ్రాన్సిస్ జార్జ్(కేరళ కాంగ్రెస్)ఏ రాజా(డీఎంకే)కనిమొళి(డీఎంకే)అమూర్‌కాలే(ఎన్సీపీ ఎస్పీ)సుప్రియా సూలే (ఎన్సీపీ ఎస్పీ) ఆపరేషన్ సిందూర్‌పై.. లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఆపరేషన్ సిందూర్‌పై.. కాంగ్రెస్‌కు 2గంటల సమయంసాయంత్రం 4.30. గం. ప్రాంతంలో ప్రియాంక వాద్రా గాంధీ ప్రసంగించే ఛాన్స్సాయంత్రం ఏడున్నర గంటలకు మాట్లాడనున్న విదేశాంగ మంత్రి జైరాం రమేష్రాత్రి 10గం. దాకా సాగనున్న ఆపరేషన్ సిందూర్ చర్చలోక్‌సభ మళ్లీ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ముందు లోక్‌సభలో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టులోక్ సభ వెల్‌లో విపక్షాల ఆందోళనబీఏసీ మీటింగ్‌లో ప్రతిపక్ష నేతలంతా ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఒప్పుకున్నారు: స్పీకర్ ఓం బిర్లాఇప్పుడు ఆందోళన ఎందుకు చేస్తున్నారు?: స్పీకర్ ఓం బిర్లాఆందోళన చేస్తే ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ఎలా జరుగుతుంది?: స్పీకర్ ఓం బిర్లావాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాలోకసభ 1గం. వరకు వాయిదాఅటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనరాజ్యసభ 2.గం వరకు వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చఅధికార, ప్రతిపక్షాలకు స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తివిపక్షాల తీవ్ర ఆందోళనచర్చ ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్మొత్తం 16 గం. పాటు జరగనున్న చర్చప్రభుత్వం తరఫున మాట్లాడనున్న కేంద్ర మంత్రులుచర్చలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశంకాంగ్రెస్ నుంచి చర్చను ప్రారంభించనున్న గౌరవ్ గగోయ్కాంగ్రెస్కు 2 గంటల సమయంప్రారంభమైన లోక్సభమరికాసేపట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చపార్లమెంట్లో 16 గంటలపాటు కొనసాగనున్న చర్చఇవాళ, రేపు లోక్‌సభలో చర్చ నడిచే అవకాశంరేపు రాజ్యసభలో చర్చ జరిగే చాన్స్లోక్సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్దేశ జాతయ భద్రతకు హాని కలిగించేలా, పహల్గాం బాధితులు నొచ్చుకునేలా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరెన రిజిజు విజ్ఞప్తిపార్లమెంట్ ప్రారంభం.. ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంవాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టుస్పీకర్ చైర్లో ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నేటీఉభయ సభల్లో ఆందోళనల నడుమ.. వాయిదా వేసిన స్పీకర్, చైర్మన్12గం. ప్రారంభం కానున్న ఉభయ సభలు మరికాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చచర్చను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకోకపోవడంపై ప్రశ్నించనున్న విపక్షాలుఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యంఆపరేషన్ సిందూర్‌ను మద్యలోనే నిలిపివేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరందౌత్యం తన ప్రమేయం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంపైనా ప్రశ్నించే అవకాశంశశిథరూర్ .. గప్చుప్పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్.. చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చర్చకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ ప్రకటన చేశాయి. ఒకవేళ ఆయన గనుక చర్చలో పాల్గొంటే మాత్రం అది పార్టీ లక్ష్మణరేఖ దాటినట్లే కానుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఐదో రోజు సెషన్ ప్రారంభమైంది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయ సభలు గత నాలుగు రోజులుగా సజావుగా సాగని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చతో ఇవాళ సభ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.దేశాన్ని అవమానించొద్దు: రిజిజుఆపరేషన్ సిందూర్‌పై చర్చవేళ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో దేశ హుందాతనం, గౌరవాన్ని కాపాడాలి. విపక్షాలు పాక్ భాష వాడొద్దు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు అని కోరారు. రావణుడు లక్ష్మణ రేఖ దాటాడు కాబట్టే లంకా దహనం అయ్యింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటారు కాబట్టే వాళ్ల ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయంటూ రిజిజు ట్వీట్ఉగ్రవాదులు మన దేశం వారేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంఇన్నిరోజులు జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందని ప్రశ్నపాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాల్లేవ్ఇప్పటిదాకా ఉగ్రవాదుల జాడ ఎందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నచిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలుచిదంబరాన్ని వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ ఆయన అడిగినదాంట్లో తప్పేంటి? అని బీజేపీకి కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది. విపక్షాల తరఫున ప్రసంగించే నేతల వివరాలపై స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ, మరికొందరు ఎంపీలు ప్రసంగిస్తారని సమాచారం. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఏప్రిల్ 25వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఉగ్రవాదుల భరతం పట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఓవైపు.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకేనని కేంద్రం చెప్పిన ఆపరేషన్ సిందూర్‌ను అర్దంతరంగా ఆపేయడం పైనా మండిపడ్డాయి. మరోవైపు.. తన వల్లే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యమని మండిపడుతున్నాయి. అయితే ట్రంప్ జోక్యాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, ఆ ఆపరేషన్ విజయవంతంపైనా పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతోంది. అటు రేపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూరపై చర్చ జరగనుంది. -
‘సిందూర్’తో సత్తా చాటాం
గంగైకొండ చోళపురం: భారతదేశ శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు, మన శత్రువులకు సురక్షిత స్థానం అంటూ ఎక్కడా లేదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. మన సార్వభౌమత్వంపై దాడి జరిగితే ప్రతిస్పందన ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలకు నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని స్పష్టంచేశారు. ఆదివారం తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో చొళరాజు రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఆది తిరువత్తిరై’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ–1 చక్రవర్తుల పేర్లు మన దేశ గుర్తింపునకు పర్యాయపదాలు అని కొనియాడారు. వారు మనందరికీ గర్వకారణమని చెప్పారు. తమిళనాడులో భారీ ఎత్తున వారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మన చరిత్రకు అవి దర్పణాలు అవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. సాధారణంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు యూకేలోని మాగ్నాకార్టా గురించి మాట్లాడుతుంటారని, నిజానికి వెయ్యి సంవత్సరాల క్రితమే చోళుల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉందని గుర్తుచేశారు. బృహదీశ్వర ఆలయంలో పూజలు గంగైకొండ చోళపురంలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ సంప్రదాయ వస్త్రాలు ధరించి, పవిత్ర జలంలో కూడిన కలశం చేతబూని ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. అనంతరం భారత పురావస్తు సర్వే విభాగం నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అంతకముందు గంగైకొండ చోళపురంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. 3 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీల జెండాలు రెపరెపలాడాయి. ప్రధానితో పళని స్వామి భేటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో శనివారం రాత్రి ఏఐఏడీఎంకే ప్రధా న కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి సమావేశమయ్యారు. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో ఈ భేటీ జరిగింది. తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ, పళనిస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే అసెంబ్లీ ఎ న్నికలపై వారు చర్చించుకున్నట్లు సమాచారందివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప దార్శనికుడిగా, శాస్త్రవేత్తగా, గురువుగా, దేశభక్తుడిగా కలాం చిరస్మరణీయులు అని మోదీ కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి చేసుకొనే దిశగా కలాం ఆలోచనలు, ఆశయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. కలాంకు మోదీ నివాళులు -
పహల్గాం దాడి, సిందూర్‌పై నేడు పార్లమెంటులో చర్చ
న్యూఢిల్లీ: వారం రోజులపాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు. ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్‌తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగశాఖ తోసిపుచ్చినా.. ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇక, ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు... కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే సంశయం నెలకొంది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా మూడు రోజులపాటు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్.జైశంకర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు సూపర్‌గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్‌లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్‌పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్‌గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్‌పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్‌ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్‌గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్‌తోపాటు కశ్మీర్‌లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్‌లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్‌లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ను రాజ్ పాల్ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్‌దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్‌లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
స్పెషల్ సిలబస్‌గా ‘ఆపరేషన్ సిందూర్’..!
ఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తరగతి గదుల్లో పిల్లలు చదువుకునే పాఠాల్లోకి రావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇది తరతరాలు గుర్తుపెట్టుకునే దిశగా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిలబస్‌లో ఆపరేషన్ సిందూర్ ను పాఠ్యాంశంగా చేర్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. దీన్ని స్పెషల్ క్లాస్రూమ్ సిలబస్’గా ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఎన్సీఈఆర్టీ. మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టాలనే దిశగా కసరత్తు జరుగుతుంది. దీన్ని రెండు భాగాలుగా విభజించి.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఒక పార్ట్‌గా, తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ రెండో పార్ట్‌గా విభజించి సదరు సిలబస్‌లో చేర్చడానికి ఎన్సీఈఆర్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పులకు దేశాలు ఎలా స్పందిస్తాయో అనే అంశంతో పాటు జాతీయ భద్రతలో రక్షణ, దౌత్యం మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనేది విద్యార్థులకు చేరువ చేయడమే ఈ సిలబస్ యొక్కు ముఖ్య ఉద్దేశంగా సమాచారం. -
ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. -
రెండో రోజూ అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండో రోజు మంగళవారం సైతం అట్టుడికాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదేపదే ప్రకటించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తేచ్చిచెప్పాయి.మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రక్రియలో అమెరికా జోక్యం, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలపై పెరుగుతున్న దౌర్జన్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన, మణిపూర్ హింసాకాండ తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ సభకు హాజరై, వీటిపై సమాధానం ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. విపక్షాల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విపక్ష ఎంపీల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్ ఓటర్ల జాబితా సవరణతోపాటు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాయి. నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించాయి. సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఉన్నందు వీటిపై చర్చకు సహకరించాలని వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన కొనసాగింది. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ... విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సైతం మాట్లాడారు. సభకు సహకరించాలని విపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభ తిరిగి 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన విరమించలేదు. వారి వైఖరిని స్పీకర్ తప్పుపట్టారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిడ్డారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వాయిదా తీర్మానం నోటీసులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడం పట్ల విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. సభ తొలుత 12 గంటలకు వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎగువ సభ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఓటర్ల హక్కులు కాలరాస్తున్నారు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. -
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి. పహల్గాం ఉదంతంలో కేంద్ర నిఘా వర్గాల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆపరేషన్ సిందూర్‌పై వెనువెంటనే చర్చ మొదలెట్టాలన్న విపక్షాల డిమాండ్లు ఓవైపు.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం, కేసులను మోస్తున్న రాబర్డ్ వాద్రాపై అధికార పార్టీ ప్రతివిమర్శలతో తొలిరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృతస్థాయిలో సవరించడం, మణిపూర్‌లో జాతుల మధ్య వైరంపై అధికార, విపక్ష పార్టీల పరస్పర ఆరోపణలతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాతావరణం ఓవైపు మరింత ఉద్రిక్తంగా మారినా.. కాలిన కరెన్సీ కట్టల వ్యవహారంలో అపకీర్తిని మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో అంతా ఏకతాటి మీదకు రావడం విశేషం. అవినీతిమరకలు అంటుకున్న జడ్జీని న్యాయపీఠం నుంచి పక్కకు తప్పించే క్రతువులో పార్టీలకతీతంగా సభ్యులు ఒకేమాటపై నిలబడ్డ సందర్భానికీ పార్లమెంట్ వేదికైంది. తొలిరోజే నాలుగుసార్లు వాయిదాసోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు సభల్లో సభ్యులు నివాళులర్పించారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో సజీవదహనమైన ప్రయాణికులకూ ఇరుసభల సభ్యులు నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. తర్వాత లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ బిర్లా మొదలెట్టగానే విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఘోర నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉదంతం చోటుచేసుకుందని, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలని డిమాండ్లుచేశారు. ఈ అంశంలో సభకు వచ్చి ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ‘‘ప్రశ్నోత్తరాల గంట ముగిశాకే మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. క్వశ్చన్ అవర్ సజావుగా సాగనివ్వండి. మనల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలపై చర్చ జరగనివ్వండి. మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే బయటికెళ్లి ఇచ్చుకోండి’’ అని బిర్లా సూచించినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 12 గంటల దాకా వాయిదావేశారు. తర్వాత 12 గంటలకు సభ ఆరంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మీరు ఎత్తిచూపిన అంశాలపై సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అప్పటిదాకా ఓపిక పట్టాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సభావ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) ఎదుట విపక్ష సభ్యులు తమ వాదనల్ని మధ్యాహ్నం 2.30గంటలకు వినిపించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. దీంతో అప్పుడు సభాధ్యక్షపీఠంపై కూర్చున్న జగదాంబికా పాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా ఎలాంటి మార్పులేదు. అప్పటి స్పీకర్ స్థానంలో కూర్చున్న సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదావేశారు. నాలుగు గంటలకు సభ సమావేశమైంది. అప్పుడు కూడా విపక్షసభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనలతో సభను హోరెత్తించారు. ఇక చేసేదిలేక సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా లోక్‌సభను మంగళవారానికి వాయిదావేశారు. ఇలా తొలిరోజే లోక్‌సభ నాలుగుసార్లు వాయిదాపడింది. రాజ్యసభ లోనూ ఇదే వాయిదా పర్వం కొనసాగింది. వచ్చే వారం సిందూర్‌పై చర్చపహల్గాంలో ఉగ్రదాది, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై విస్తృతస్థాయి చర్చకు కేంద్రప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. వచ్చే వారం ఈ అంశాలపై సమగ్రస్థాయిలో లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈవారం ఆయన పార్లమెంట్‌కు రాలేరని, వచ్చే వారం ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయాలను విపక్ష నేతలకు తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలువేసే ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు– 2025’ కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మార్చిలోనే లోక్‌సభ ఆమోదం పొందింది. -
సిందూర్‌తో పాటే బీసీ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదంపై చర్చించేలా పట్టు పట్టాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ ముఖ్య నాయకత్వం కోరనుంది. ఈ మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత, రిజర్వేషన్ల ఖరారుకు ఉన్న సమయం తదితర అంశాలపై హైకమాండ్‌తో మరోసారి మాట్లాడిన తర్వాత, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఇవ్వాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చారు.ఈ నెల 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి దేశంలోని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ పీపీటీ ద్వారా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నారు. అంతకంటే ముందు రాహుల్, ఖర్గేలతో ఇరువురు నేతలు ఈ అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళుతున్న తెలంగాణకు మద్దతివ్వాలని, ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలను సీఎం కోరనున్నారు.పీపీటీ అంశాలపై భట్టి, ఉత్తమ్లతో చర్చ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొనాల్సిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో రేవంత్‌రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఈ చర్చలు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగాయని తెలుస్తోంది. ముఖ్యంగా కులగణన, అసెంబ్లీలో బిల్లు, కులగణనపై నిపుణుల నివేదిక తదితర పరిణామాలకు సంబంధించి పీపీటీలో పేర్కొనాల్సిన కీలకాంశాలపై వీరు చర్చించారని, ఈ నెల 24న ఇవ్వాల్సిన పీపీటీ మంగళవారం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని సమాచారం. ఇందిరా భవన్లో పీపీటీ: మల్లు రవి సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కనీ్వనర్ మల్లు రవి వెల్లడించారు. ఈ నెల 24 సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఈ కార్యక్రమం ఉంటుదన్నారు.సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీలు రామసహాయం రఘురామి రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, సీఎం అనే కనీస మర్యాద లేకుండా రేవంత్ రెడ్డిపై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు. -
ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది: ప్రధాని మోదీ
-
సిందూర్‌పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురుగన్‌తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
ఆపరేషన్ సింధూర్ ‘లిటిల్ హీరో’కు సన్మానం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.ఇదిలా ఉంచితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సాయం చేసిన ఒక 10 ఏళ్ల లిటిల్ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పంజాబ్ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్ హీరోను సత్కరించింది ఆర్మీ. పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్ ఆర్మీ కీర్తించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.Indian Army decides to sponsor all educational needs of the Youngest Warrior of '#OperationSindoor' from Punjab, Master Shvan Singh.This 10-years old from Ferozepur kept on providing essential eatables, day and night, to the army men deployed in his fields in the border… pic.twitter.com/8xv7kozth4— All India Radio News (@airnewsalerts) July 20, 2025ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు. -
మోదీ జీ.. ఇంతకీ నిజం ఏమిటి?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఈ మే నెలలో జరిగిన యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కార్నర్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. ట్రంప్ చెప్పినదాంట్లో నిజం ఏమిటి? అని ప్రశ్నించారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.मोदी जी, 5 जहाज़ों का सच क्या है?देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025 కాగా, ఇరు దేశాల యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెప్పినప్పటికీ, అవి ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. ఇరు దేశాల యుద్ధ విమానాలు కలిపి ఐదా.. లేక పాకిస్తాన్‌వా.. భారత్‌కు చెందినవా? అనేదే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్.. ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జై రాం రమేశ్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్ మిసైల్ దూసుకుపోతోంది. ఇప్పటికి 24 సార్లు ఒకే సందేశాన్ని ట్రంప్.. పదే పదే చెబుతూ వస్తున్నారు. "2019, సెప్టెంబర్‌లో 'హౌడీ మోడీ', 2020, ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధాని మోదీ.. గత 70 రోజులుగా ట్రంప్ ఏమి చెబుతున్నారనే దానిపై పార్లమెంట్లో స్పష్టత ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి ట్రంప్ మాట్లాడుతున్న ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని జై రాం రమేశ్ ముందుగానే తాము ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తనున్నామని విషయాన్ని స్పష్టం చేశారు. -
భారత్–పాక్ ఘర్షణలో 5 ఫైటర్ జెట్లు నేలమట్టం
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు నేలమట్టమయ్యాయని చెప్పారు. అవి గాల్లోనే పేలిపోయి నేలకూలాయని, అది నిజంగా దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. అయితే, కూలిపోయిన యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి? అనే సంగతి ట్రంప్ బయటపెట్టలేదు. అవి భారత్‌కు చెందినవా? లేక పాకిస్తాన్‌కు చెందినవా? లేక ఇరు దేశాలకు చెందినవా? అనేది ప్రకటించకపోవడం గమనార్హం. వైట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి రిపబ్లికన్ సెనేటర్లు ఇచ్చిన విందు కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. తాను చొరవ తీసుకోవడం వల్లే భారత్–పాక్ మధ్య యుద్ధంగా ఆగిపోయిందని పునరుద్ఘాటించారు. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు పరస్పరం ఘర్షణకు దిగాయని, దాడులు చేసుకున్నాయని.. తాను రంగంలోకి దిగి ఆపకపోతే అది తీవ్రమైన యుద్ధంగా మారేదని అన్నారు. తన హెచ్చరికలతో రెండు దేశాలు దిగొచ్చాయని, ఘర్షణకు ముగింపు పలికాయని స్పష్టంచేశారు. భారత్, పాక్‌లపై ‘వాణిజ్య’హెచ్చరికల అస్త్రం ప్రయోగించానని, దాంతో అవి తన మాట విన్నాయని తెలిపారు. గత ఆరు నెలల పాలనలో ఎంతో సాధించామని, ఎన్నో యుద్ధాలు ఆపేశామని, అందుకు గర్వపడుతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. #WATCH | Washington, D.C.: US President Donald Trump says, "We stopped a lot of wars. And these were serious, India and Pakistan, that was going on. Planes were being shot out of there. I think five jets were shot down, actually. These are two serious nuclear countries, and they… pic.twitter.com/MCFhW406cT— ANI (@ANI) July 18, 2025ట్రంప్ ప్రమేయం లేదు ఆపరేషన్ సిందూర్‌లో తమకు కొంత నష్టం వాటిల్లిందని, యుద్ధ విమానాలు కోల్పోయామని భారత్ సైన్యం ఇప్పటికే అంగీకరించింది. అయితే, పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ, అందుకు ఆధారాలేవీ చూపించలేదు. పాక్ ప్రకటనను భారత సైన్యం ఖండించింది. మే 31వ తేదీన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై, శిక్షణా శిబిరాలపై దాడులు చేశామని వెల్లడించారు. ముష్కరులను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టామని, ఈ క్రమంలో తమకు కొంత నష్టం జరిగిన మాట నిజమేనని తెలిపారు. ఇండియాకు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశామంటూ పాక్ చేసిన ప్రకటనలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. భారత్–పాక్ ఘర్షణను ఆపేశానంటూ ట్రంప్ గతంలోనూ తనకు తానే కితాబిచ్చుకోగా, భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాక్ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడంతో స్పందించి దాడులు నిలిపేశామని, ఇందులో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని తేల్చిచెప్పింది. భారత సైన్యం మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. -
‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్‌కు మా బాధ అర్థమవుతుంది’
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్ఎఫ్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు. కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది. -
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో పురోగతి లభించింది. కేంద్రం భద్రతా సంస్థల దర్యాప్తులో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించి 26మంది అమాయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాలు తీసే సమయంలో దాడిని వీడియో రికార్డు చేసుకున్నారు.అనంతరం, హింసాత్మక చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ.. టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు రక్షణగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు తుపాకుల్ని తెచ్చి వారికి ఇచ్చారు. ఆ తుపాకుల్ని గాల్లోకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపి రాక్షసానందం పొందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎన్ఐఏకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో మరణించిన 26మంది టూరిస్టులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు సుశీల్ నాథ్యాల్ – ఇండోర్సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాంహేమంత్ సుహాస్ జోషి – ముంబైవినయ్ నార్వాల్ – హర్యానాఅతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్రనీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్బిటన్ అధికారి – కోల్కతాసుదీప్ నియుపానే – నేపాల్శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశామనీష్ రంజన్ – బీహార్ఎన్. రామచంద్ర – కేరళసంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబైదినేష్ అగర్వాల్ – చండీగఢ్సమీర్ గుహార్ – కోల్కతాదిలీప్ దసాలీ – ముంబైజే. సచంద్ర మోలీ – విశాఖపట్నంమధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరుసంతోష్ జాఘ్డా – మహారాష్ట్రమంజు నాథ్ రావు – కర్ణాటకకస్తుబ గంటోవత్య – మహారాష్ట్రభరత్ భూషణ్ – బెంగళూరుసుమిత్ పరమార్ – గుజరాత్యతేష్ పరమార్ – గుజరాత్టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్శైలేష్భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ కొట్టిన భారత్పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మే7న (మంగళవారం) అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ప్రపంచ దేశాల ముందు పాక్‌ను భారత్‌ను దోషిగా నిలబెట్టింది. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్‌కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్‌లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్‌లోని సర్గోధా, రహీంయార్‌ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్‌కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్‌పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్‌చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
డ్రోన్ మార్కెట్ @ రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్‌జెన్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్ తయారీ పరిమాణం 23 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్‌జెన్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్‌కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్‌ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్ (వస్తు రవాణా), ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్ ప్రదర్శన ఈ డిమాండ్‌నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్‌జెన్ తెలిపింది. నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ఆధార్ బన్సాల్ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్‌జెన్ నివేదిక ప్రస్తావించింది. -
ధైర్యం, ధర్మం, కర్మ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ ద్వారా ధైర్యం, ధర్మం, కర్మను ప్రపంచానికి పరిచయం చేశామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. పహల్గాంలో భారతీయులను చంపినవారినే ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం చంపేశామని చెప్పారు. పహల్గాంలాంటి ఘటనలు మరోసారి జరిగితే సకాలంలో సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. శుక్రవారం శిల్పకళావేదికలో స్వాతంత్య్ర పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రజలతోపాటు మొత్తం భారతదేశ స్వాభిమానానికి చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అల్లూరి పోరాట యోధుడే కాదని, ప్రజల కోసం అన్నీ కోల్పోయిన గొప్ప నాయకుడన్నారు. దశాబ్దాలపాటు సాగిన పోరాటాలకు సీతారామరాజు బాటలు వేశారని అన్నారు. వేగంగా గిరిజనుల అభివృద్ధి ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టామని, 50 వేలకుపైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నక్సల్స్ అ«దీనంలోని ప్రాంతాల్లో ఇప్పుడు వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఆదివాసీలను పీడిస్తున్న నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామని ప్రకటించారు. ‘అల్లూరి కలను మేం నిజం చేయబోతున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ, వెదురు పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో 8 వేల సెల్ టవర్లు ప్రారంభిస్తాం. దానివల్ల టీవీ, ల్యాప్‌ట్యాప్, మొబైల్స్ వినియోగం పెరుగుతుంది’అని వివరించారు.అంతకు ముందు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటే హృదయం ఉప్పొంగుతోందని అన్నారు. క్షత్రియుడు ధైర్య సాహసాలతో తన మాతృభూమిని రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన యోధులందరినీ మనం గుర్తుంచుకోవాలని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అనేకమంది గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.అల్లూరి చరిత్ర తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఆ యోధుడి 125వ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రధాని ఆదేశాలతో అల్లూరి జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అప్పటికి సీతారామరాజు వారసులు చిన్న గుడిసెలో నివసించేవారని, వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాలో సీతారామరాజు స్నానమాచరించిన మంపకొలనును వర్చువల్‌గా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, కర్ణాటక చిన్ననీటి పారుదల శాఖ మంత్రి ఎన్.సుభాష్ చంద్రబోష్ , మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు బీహెచ్ సత్యనారాయణరాజు, కార్యదర్శి రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా, తుర్కియే సాయం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్‌కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్‌కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు. #WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm— ANI (@ANI) July 4, 2025అరువు తెచ్చుకున్న కత్తి చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్‌ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్‌కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్‌కు 81 శాతం మిలటరీ హార్డ్‌వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్‌గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్‌ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు. ‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్‌ను ముందుపెట్టి భారత్‌కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికా–పాక్ రక్షణ బంధం బలోపేతం!
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్‌లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్‌ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది. -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో హడలిపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ సలహాదారు రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో భారత్ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు. ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు. తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్‌తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.‘ భారత్ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను భారత్ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు. అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్ వార్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు.పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ పరిధిలోని పాకిస్తాన్ శాటిలైట్ వ్యవస్థ నాశనమైంది. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ప్రాంతంలో భారత్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్ ఖాన్ ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసి పాక్‌ను కోలునీయకుండా చేసింది. -
భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోంది అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్ గనుక మరోసారి పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మున్నీర్.. భారత్‌కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోంది. భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించింది. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. మరోసారి పాకిస్తాన్‌పై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. అంతకుముందు కూడా మునీర్.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ నెట్‌వర్క్‌కు ఆప్ఘనిస్థాన్ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్తాన్‌పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే, పాక్.. ఆప్ఘనిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడులు పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు కీలకమైన ఎయిర్‌బేస్‌లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి.Pakistan Failed Marshal Asim Munir once again rants & pokes India, reaffirms his support for the continued terrorism against India in Jammu and Kashmir.Also vowed continued political, moral, & diplomatic backing for proxy insurgency.#PakistanIsATerrorState #AsimMunir #Pakistan pic.twitter.com/6zHSA6gk8o— TIger NS (@TIgerNS3) June 29, 2025 -
పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
కరాచీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్‌లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్.. ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్ నేలకూల్చిన నిర్మాణాలను పునః నిర్మించుకునే పనిలో పడింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్‌కు విదేశీ ఫండింగ్ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్రస్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. దాంతో పాటు పాక్ ఆర్మీ క్యాంప్‌లకు సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్దరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్ మరియు జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఈ మేరక పాకిస్తాన్ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి యత్సిస్తున్నట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఉగ్రవాద శిబిరాల పునః నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను అప్పులు చేసి మరీ తిప్పలు తెచ్చకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
‘రా’ చీఫ్‌గా పరాగ్ జైన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై భారతసైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌కు ముఖ్యమైన పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) నూతన చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. పరాగ్ జైన్ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుత ‘రా’ చీఫ్ రవి సిన్హా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నూతన చీఫ్(సెక్రెటరీ)గా పరాగ్ జైన్ నియామకానికి కేబినెట్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరాగ్ జైన్ ఇప్పటిదాకా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్‌గా వ్యవహరించారు. ప్రతిభావంతుడు పరాగ్ జైన్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్‌కు ప్రతిభావంతుడిగా పేరుంది. గొప్ప నేరపరి శోధకుడిగా నిఘా వర్గాల్లో గుర్తింపు సాధించారు. మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి అనుకున్న ఫలితం సాధించడంలో దిట్ట. దేశంలో పలు కీలక ఆపరేషన్లలో స్వయంగా పాలుపంచుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఆయనది కీలక భూమిక. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ప్యాడ్లను నేలమట్టం చేయడంలో ఆయన హస్తం ఉంది. పరాగ్ జైన్ ఇచ్చిన కచ్చితమైన నిఘా సమాచారంతోనే పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఆయనకు జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. తన పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అణచివేశారు. 2021 జనవరి 1న పంజాబ్‌లో డీజీపీ ర్యాంక్ పొందారు. డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. కెనడా, శ్రీలంకలోనూ వివిధ మిషన్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెనడాలో ఉన్నప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద శక్తులపై నిఘా పెట్టి, కీలక సమాచారం సేకరించారు. -
‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అన్నారు. అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ వేరుకాదని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్ దాడి వారు చేసినదేనని అక్తర్ పేర్కొన్నారు.పాకిస్తాన్‌లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్‌లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ను ఆహ్వానించారన్నారు. పాక్‌లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అభినందన్‌ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి -
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్‌కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్‌కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్‌కు భారత్‌కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్‌యార్డ్‌లో అప్పర్ డివిజన్ క్లర్క్‌గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్‌కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్‌ను ఆకట్టుకుంది. తాను భారత్‌కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్‌కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్‌కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్‌కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్‌కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్‌కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
పాక్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు చైనా సైలెంట్!
బీజింగ్: చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "It is my pleasure to be here in Qingdao to participate in the SCO Defence Ministers meeting. I would like to thank our hosts for their warm hospitality. I would also like to… pic.twitter.com/c9SyHOaZDp— ANI (@ANI) June 26, 2025ఇదే సమయంలో రాజ్‌నాథ్.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్ చేపట్టాం. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT— All India Radio News (@airnewsalerts) June 26, 2025ఇదిలా ఉండగా.. ఎస్ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు. -
శశి థరూర్... ఈసారి ఫ్రెంచ్‌లో!
కీవ్: తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్‌లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్ స్లట్స్కీతో థరూర్ బృందం సమావేశమైంది. భారత్ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్ స్లట్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.పాకిస్థాన్ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్‌లో స్లట్‌స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్ వ్యాఖ్యలను విన్న స్లట్స్కీ పాకిస్థాన్‌ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!Shashi Tharoor takes on Pakistan in fluent French pic.twitter.com/2H7lbg1pxE— Shashank Mattoo (@MattooShashank) June 25, 2025 -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాక్‌పై పోరులో మేకిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలకైనా తమ సర్కారు వెనకాడే సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త నారాయణగురు, మహాత్మాగాంధీ మధ్య చరిత్రాత్మక సంభాషణకు వందేళ్లయిన సందర్భంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.బలోపేతమైన భారత్ కోసం వాళ్లు కన్న కలలను నిజం చేసే దిశగా సాగుతున్నట్టు చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం వరకూ దేశాన్ని పాలించిన వారి హయాంలో కోట్లాది ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొ న్నారు. మా పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11 ఏళ్లుగా దేశం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలోపే తమవుతూ వస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తోంది. భారత్ తయారు చేసే ఆయుధాలు ప్రపంచమంతటా జెండా ఎగరేసే రోజులు ఎంతో దూరం లేవు’’ అని ధీమా వెలిబుచ్చారు. -
అమెరికాతో పాక్ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్ విషయంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు పాక్ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్ టాపిక్‌గా మారింది.వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్ మాత్రం పాకిస్తాన్‌పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.🇵🇰 BREAKING: Pakistan nominates Donald Trump for Nobel Peace Prize! 🏆Because obviously, “ceasefire magic” happened just on Trump’s request 🙃No military diplomacy, no DGMOs, no backchannel talks - just one phone call from The Donald, and India-Pakistan hugged it out! 💥📞🕊️… pic.twitter.com/BQSkJt936b— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 21, 2025రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.JUST ANNOUNCED: Pakistan nominates President Donald Trump for 2026 Nobel Peace Prize 🇺🇸PEACEMAKER-IN-CHIEF TRUMP! 🇺🇸 pic.twitter.com/ihGlDz1iZp— Ape𝕏 (@CubanOnlyTrump) June 20, 2025అయితే, ట్రంప్ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్ విషయాలు, కశ్మీర్ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్.. కశ్మీర్ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్ సిందూర్ సమయంలో కశ్మీర్, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు నోబెల్ అంటే ఎంత ఇష్టమంటే.. అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ మాట్లాడుతూ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది. -
Shashi Tharoor: కాంగ్రెస్-శశిథరూర్ విభేదాల్లో ట్విస్ట్
తిరువనంతపురం: కాంగ్రెస్ వర్సెస్ ఆ పార్టీ కేరళ ఎంపీ శశి థరూర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు నీలంబూర్ బై పోల్ ఎలక్షన్ ప్రచారం వేదికగా మారింది. మలయాళ సినీ ప్రముఖుడు ఆర్యదన్ షౌకత్ నీలంబూర్ బై ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. ఆ ఎన్నిక కోసం కేరళ కాంగ్రెస్ యూనిట్ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంపీ శశిథరూర్ పేరు సైతం ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ చెబుతున్నారు.కానీ స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ శశిథరూర్ చెప్పడం విశేషం. పార్టీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవరూ అడిగింది లేదు. ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి నాకు ఫోన్ చేసింది లేదు. అయినప్పటికీ, ఆర్యధన్ షౌకత్ తరుఫున పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కువ భాగం విదేశాలలో అధికారిక దౌత్య పర్యటనలో ఉన్నాను’ అని చెప్పారు. అయితే, శశిథరూర్ పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సన్నీ జోసెఫ్ ఘాటుగా స్పందించారు. ‘నీలంబూర్ ఉప ఎన్నికలో భాగంగా ఆర్యదన్ షౌకత్ తరుఫున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశాం. ఆ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. శశిథరూర్ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం విదేశాల్లో తిరుగుతుంటారు. లేదంటే ఢిల్లీలో ఉంటారు. కేరళ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేనని ముగించారు. గురువారం శశిథరూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. ఆ విభేదాలేంటి? అనే అంశాన్ని దాట వేశారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల ఎదుట పాక్‌ను దోషిగా నిలబెట్టేలా కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు స్థానం కల్పించింది. నాటి నుంచి కాంగ్రెస్-ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందం విదేశీ పర్యటన సమయంలో శశిథరూర్ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందంటూ ప్రశంసలు కురిపించారు. శశిథరూర్ చేసిన ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంతర్ఘతంగా శశిథరూర్‌ను తీరును పార్టీ పెద్దల ఎదుట తప్పుబట్టినట్లు సమాచారం. తాజాగా, కేరళలో జరిగిన ఉప ఎన్నికకు శశిథరూర్‌కు ఎటువంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం."I wasn't invited by party (for Nilambur by-election campaign). Yes, there are some differences b/w me & leadership. Those can be sorted out in closed-door conversations. So far, no one has reached out to me. When nation needs my service, I am always ready."- .@ShashiTharoor pic.twitter.com/NPzj89NJdr— BhikuMhatre (@MumbaichaDon) June 19, 2025 -
భారత్ దాడులతో వణికిపోయాం.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్ సిందూర్‌పై ఇషాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోర్కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్‌పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్ వేగంగా స్పందించింది. భారత్‌తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేసిన దాడులను పాక్ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
Shashi Tharoor: స్వరం మార్చిన కాంగ్రెస్ ఎంపీ!
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్టీలో విభేదాలపై స్వరం తగ్గించారు. గురువారం నీలంబూర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా.. ఆ ఎన్నిక ప్రచారానికి థరూర్ దూరంగా ఉండడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన పార్టీ నుంచి పిలుపు లేకపోవడం వల్లే దూరంగా ఉన్నానని చెబుతూనే.. అయినా అదేమీ పెద్ద విషయం కాదన్న రీతిలో మాట్లాడారు.దౌత్య సంబంధమైన మిషన్ కోసం నేను విదేశాలు వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా అధిష్టానం నుంచి నాకు ఫోన్ రాలేదు. కనీసం ప్రచారం చేయాలని కూడా నాకు సూచించలేదు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నన్ను ఆహ్వానించలేదు. అయినా ఫర్వాలేదు. కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానంతో విభేదాలు ఏర్పడడం సహజమే అని అన్నారాయన.నేను ఇవాళే కేరళకు వచ్చాను. ఇవాళ ఓటింగ్ రోజు(నీలంబూర్ ఉప ఎన్నికకు). మా పార్టీ అభ్యర్తి మంచి వ్యక్తి. ఆయనకు ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని గురువారం ఉదయం ఎయిర్‌పోర్టులో మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు.అయితే పార్టీతో విభేదాల నేపథ్యంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారా? అనే మీడియా ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. గత నాలుగు ఎన్నికలుగా తిరువనంతపురం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. నా గెలుపు కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. రాజకీయాల్లో అధిష్టానంతో కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తడం సహజమే. అయితే అవి అంతర్గతంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగినవే. వాటి ఇప్పుడు చర్చించడం అప్రస్తుతం. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఇలాంటివి సహజమే. కాంగ్రెస్ పార్టీ విలువలకు నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను’’ అని థరూర్ స్పష్టం చేశారు. Shashi Tharoor left out of Nilambur Congress rally | Kerala politics takes a turn #BusinessToday #ShashiTharoor #Congress #CongressVsBJP #KeralaPolitics #RahulGandhi pic.twitter.com/Hn6Rcr2mo4— Business Today (@business_today) June 19, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఉగ్ర స్థావరాలను, ఎయిర్‌బేస్‌లను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. అఖిలపక్ష ఎంపీల బృందాన్ని పలు దేశాలకు పంపింది. కాంగ్రెస్ ప్రమేయం లేకుండా శశిథరూర్‌ను ఆ బృందంలోకి ఎంపిక చేసి కేంద్రంలోని బీజేపీ ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో.. విదేశీ పర్యటనల్లో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగడుతూనే.. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందంటూ థరూర్ ఆకాశానికెత్తారు. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా థరూర్ ప్రస్తావించి ఉంటే బాగుండేదని, మరీ బీజేపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కొందరు కీలక నేతలు సైతం థరూర్ లక్ష్మణరేఖ దాటారంటూ వ్యాఖ్యానించారు. అయితే తాను సందర్భానుసారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తిస్తే మంచిదంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారాయన. ఈ క్రమంలో ఆయనకు పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని అంతా భావించారు. అయితే తిరిగి స్వదేశానికి చేరుకున్న ఆయన.. ఆ విభేదాలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగనవే అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ సూపర్ సక్సెస్.. ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్‌ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్ ఖాన్ బేస్‌ను పాక్ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఫేజ్1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్2లో రహీమ్ యార్ ఖాన్ బేస్‌ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్ సైన్యం తాజాగా నోటామ్(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఎయిర్‌బేస్‌ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్‌కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్ ప్రావిన్స్‌లో పాక్‌కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్‌బేస్‌కు అనుసంధానంగా రహీమ్ యార్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్‌వే ఉన్న ఈ ఎయిర్‌పోర్టును భారత్ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్ బికనీర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్‌బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు. -
మధ్యవర్తిత్వం మాటే లేదు
కననాస్కీస్(కెనడా): ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్‌తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మాట్లాడటం విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్‌తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మంగళవారం ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్‌తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తర్వాత వెనువెంటనే భారత్, పాక్ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే భారత్ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్‌కు మోదీ స్పష్టంచేశారు.వాణిజ్య అంశాల ఊసేలేదుయుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్‌ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్‌కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్‌లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్‌చేశారు. పాకిస్తాన్ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్‌కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్‌లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్‌బేస్‌లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్‌తో మోదీ చెప్పారు.అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్‌కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు. -
‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్’
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్-పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్-పాకిస్తాన్ సీజ్ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్.రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్ - అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మోదీ సైప్రస్ యాత్ర...తుర్కియేకు గట్టి హెచ్చరిక!
ప్రపంచ దేశాల్లో మనవారెవరు, పరాయివారెవరు అన్నదానిపై ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు బాగా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా తుర్కియే నైజం పూర్తిస్థాయిలో బయటపడింది. అప్పట్లో భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా స్పందించి అన్నివిధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్ పట్ల సిందూర్ వేళ తుర్కియే అక్షరాలా విషం కక్కింది. పాకిస్తాన్‌కు డ్రోన్లతో పాటు అన్నివిధాలా సాయుధ సాయం చేసి మనపట్ల కృతఘ్నత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది యాదృచ్చికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కియేకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆదివారం మోదీ సైప్రస్‌లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఎంపిక వెనక పలు భౌగోళిక, రాజకీయ ప్రాథమ్యాలు దాగున్నాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు మోదీ ఈ యాత్ర చేపట్టారు. అంతేగాక విమానాశ్రయంలో మోదీని ఆయన స్వయంగా స్వాగతించారు. సైప్రస్ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. తద్వారా భారత్‌తో మైత్రీ బంధానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక వ్యాపార దిగ్గజాల సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రధాని సైప్రస్ యాత్రకు పలు రకాలుగా ప్రాధాన్యముంది. ఉగ్రపోరులో దన్ను కశ్మీర్ విషయంలో తుర్కియే తొలి నుంచీ పాక్‌కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సిందూర్ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలినుంచీ మెతక వైఖరే. కానీ సైప్రస్ అలా కాదు. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ భారత్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటినుంచీ పూర్తిగా దన్నుగా నిలిచింది. పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్ యూనియన్ వేదికపై ఎండగడతానని హమీ ఇచ్చింది. ఈ విషయమై ఈయూ దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సైప్రస్ మద్దతు భారత్‌కు చాలా కీలకం. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్–అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు సైప్రస్ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనడంలో అంతరార్థం కూడా అదే. పహల్గాం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తోడు నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞత తెలిపేందుకు తాజా మూడు దేశాల పర్యటన చక్కని అవకాశమని మోదీ ప్రకటించారు కూడా. తుర్కియేతో వైరం వీటికి తోడు తుర్కియేతో సైప్రస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్‌ను ఆక్రమించాలని గ్రీస్ ఎప్పటినుంచో ప్రయతి్నస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్ పూర్తిగా సహకరించింది. అదే అదనుగా తుర్కియే మరోవైపు నుంచి సైప్రస్‌పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు. వర్తక పరంగానూ... అంతేగాక మోదీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్‌తో సైప్రస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్–పశ్చిమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్‌లో భౌగోళికంగా సైప్రస్ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టుల్లో సైప్రస్ కీలక భాగస్వామి కూడా. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు, జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ7 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అందేగాక పలువురు జీ7, ఇతర దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవలే చెప్పారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే. అందులో భారత ఏజెంట్ల ప్రమేయముందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేగాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యతో సంబంధముందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హైకమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలూ పరిశీలిస్తున్నాయి. భారత్‌కు ప్రాధాన్యం భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతుండటం ఇది వరుసగా ఆరోసారి. 1975లో ఫ్రాన్స్ ప్రారంభించిన జీ7కు ఇది 50వ సంవత్సరం. ఫ్రాన్స్‌తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్య దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా జీ7కు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై జీ7 దృష్టి సారిస్తుంది. భారత్ వంటి దేశాలను ‘ప్రచార భాగస్వామి’గా జీ7 ఏటా ఆహ్వానిస్తోంది. సైప్రస్, క్రొయేషియాలకు తొలిసారి మోదీ ఆదివారం తొలుత సైప్రస్ వెళ్తారు. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో పలు అంశాలపై చర్చిస్తారు. గత 20 ఏళ్లలో అక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ కెనడాలో జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. క్రొయేషియా ప్రధాని ఆంద్రే ప్లెంకోవిక్‌తో పాటు అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్‌తో కూడా మోదీ భేటీ అవుతారు. -
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్‌కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్‌లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్‌తో కవర్ చేశారని సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్‌ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025 -
అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్చేస్తున్న కృషిని, భారత్‌పై పాక్ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు.రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా(బీజేపీ), శశిథరూర్(కాంగ్రెస్), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్ శిందే(శివసేన), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్ యూనియన్‌లో పర్యటించడం తెల్సిందే. భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్ అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఎందుకు ఉగ్ర, పాక్ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్‌కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్ అన్నారు.‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్‌శర్మ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్‌లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్‌ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్‌రాజ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్‌గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్‌లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
డ్రోన్.. స్టార్టప్‌లు పెరిగెన్
డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను డ్రోన్స్ స్టార్టప్స్ అందిపుచ్చుకుంటున్నాయి. మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్‌ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్ కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్ అవకాశాలను అంచనా వేయొచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్‌లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్ తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోని టాప్–100 స్టార్టప్స్‌లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్ స్టార్టప్‌లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.బెంగళూరు టాప్..డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్ కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 14 మంది, బిట్స్ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్ స్టార్టప్స్‌ను అందించిన టాప్ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.వెన్నుతడుతున్న ప్రభుత్వం..ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్‌నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.నిధులు వెల్లువెత్తాయి..దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్ కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. 2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్ ఊపు మీద ఉంది. 2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్ 4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్ కంపెనీలు అందుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్‌లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి. -
మానవత్వంపై పాక్ దాడి
కాట్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవత్వంపై, కశ్మీర్ గుర్తింపుపై దాడి చేసిందని నిప్పులు చెరిగారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కశ్మీర్ ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని కాట్రాలో పర్యటించారు. రూ.46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వేలింక్(యూఎస్బీఆర్ఎస్) ప్రాజెక్టులో భాగమైన చినాబ్ రైల్వే బ్రిడ్జితోపాటు అంజి వంతెన ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూని చినాబ్ బ్రిడ్జిపై కాసేపు నడిచారు. అనంతరం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. చినాబ్, అంజి వంతెనలపై వందేభారత్ రైలులో ప్రయాణించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కాట్రాలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మన పొరుగు దేశం మానవత్వం, సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధికి ముమ్మాటికీ వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదని విమర్శించారు. పర్యాటక రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని నాశనం చేసి, కశ్మీర్ ప్రజల పొట్టకొట్టాలని చూసిందని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. జమ్మూకశ్మీర్‌లో శాంతి సౌభాగ్యాలు ‘‘రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. జమ్మూకశ్మీర్ ప్రగతిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ పదేపదే కుట్రలు సాగిస్తోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తుండడం పొరుగు దేశానికి కంటగింపుగా మారింది. అందుకే పహల్గాంలో దాడులకు పాల్పడింది. ఇక్కడ పర్యాటక రంగం కుప్పకూలితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. పర్యాటకంపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అదిల్ హుస్సేన్ షా ధైర్యంగా ఎదుర్కొంనేందుకు ప్రయత్నించాడు. గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్తూ వచి్చన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొనే ఆ యువకుడు ముష్కరుల దాడిలో బలైపోవడం నన్ను కలచివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పాం. ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు సిగ్గుచేటైన పరాజయమే గుర్తుకొస్తుంది. బడి పిల్లలపై బాంబు దాడులా? పహల్గాంలో ఉగ్రవాద దాడి జరగ్గానే వేగంగా స్పందించాం. మనం తీసుకున్న చర్యలను పాకిస్తాన్ సైన్యం గానీ, ఉగ్రవాద ముఠాలు గానీ ఊహించలేకపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలోనే శిథిలాలుగా మార్చేశాం. దశాబ్దాలపాటు నిర్మించుకున్న స్థావరాలను నేలమట్టం చేశాం. మన సైనిక శక్తిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం ఆక్రోశంతో పూంచ్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లో దాడులకు దిగింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలపై బాంబులు విసిరింది. స్కూళ్లు, ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, గురుద్వారాలపై దాడులకు పాల్పడింది. మన దేశంలో ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారు. పాకిస్తాన్ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యోగాలు కలి్పస్తాం. ఆర్థిక సాయం అందిస్తాం. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లిస్తాం. యువత కలలు సాకారం జమ్మూకశ్మీర్‌లో ప్రజలు గతంలో ఉగ్రవాదానికి అలవాటు పడిపోయారు. ఎంతో మంది తమ కలలు వదిలేసుకోవాల్సి వచ్చింది. హింసాకాండను అంతా తమ తలరాత అనుకున్నారు. కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ యువత మళ్లీ కలలు కంటున్నారు, వాటిని సాకారం చేసుకుంటున్నారు. జనంతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు, సందడితో వెలిగిపోతున్న షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ సంబర పడుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు 500 నుంచి 1,300కు చేరాయి. పహల్గాం లాంటి దాడులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్మూకశ్మీర్ యువత కలలను ఛిద్రం చేయాలనుకుంటే అంతకంటే ముందు మోదీని ఎదుర్కోవాలన్న సంగతిని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని జమ్మూకశ్మీర్ యువత నిర్ణయించుకున్నారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు నూతన, సాధికార జమ్మూకశ్మీర్‌కు ప్రతీక. భారత నవశక్తికి ఉదాహరణ. చినాబ్, అంజి వంతెనలు జమ్మూకశ్మీర్ సౌభాగ్యానికి గవాక్షాలుగా నిలుస్తాయి. ఇక్కడి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాళ్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి అని తరచుగా అంటుంటాం. రైల్వే ప్రాజెక్టుతో అది వాస్తవ రూపం దాలి్చంది’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతం.. చినాబ్ వంతెన → జమ్మూకశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లలో ఈ వంతెన నిర్మించారు. → ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా అని చెప్పొచ్చు. చినాబ్ నదీ గర్భం నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు అధికం.→ చినాబ్ బ్రిడ్జి పొడవు 1.32 కిలోమీటర్లు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను తట్టుకోగలదు. 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి 2002లో అనుమతి లభించింది. 2017లో పనులు మొదలయ్యాయి. → ఈ వంతెన నిర్మాణం కంటే ముందే 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు, 400 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. → చినాబ్ బ్రిడ్జితో జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. దీని జీవిత కాలం 120 ఏళ్లు. తీగల వంతెన అంజి బ్రిడ్జి → అంజి వంతెనకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చినాబ్ బ్రిడ్జి తర్వాత ఇది రెండో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి. ఇండియాలో అత్యంత ఎత్తయిన కేబుల్ రైల్వే బ్రిడ్జి ఇదే. నదీ గర్భం నుంచి దీని ఎత్తు 196 మీటర్లు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది. → చినాబ్‌కు ఉప నది అయిన అంజి నదిపై నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన. నిర్మాణానికి పూర్తిగా ఉక్కు ఉపయోగించారు. → దీని మొత్తం పొడవు 725 మీటర్లు. ప్రధాన వంతెన పొడవు 473 మీటర్లు. 82 మీటర్ల నుంచి 295 మీటర్ల పొడవైన 96 ఉక్కు తీగలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆయనకు ప్రమోషన్, నాకు డిమోషన్ జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కోరారు. కాట్రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. గతంలో పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అప్పట్లో నేను జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా. మోదీ ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో మనోజ్ సిన్హా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎదిగారు. మనోజ్ సిన్హాకు ప్రమోషన్, నాకు డిమోషన్ లభించాయి. నాకు త్వరలో పదోన్నతి కలి్పస్తారని ఆశిస్తున్నా’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. -
పాక్‌కు మరోసారి ప్రధాని మోదీ గట్టి వార్నింగ్
కత్రా: ఆపరేషన్ సిందూర్‌లో మన ఆయుధ సత్తాను ప్రపంచం చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్థాన్ ఆటలను జమ్మూకశ్మీర్‌లో సాగనివ్వమంటూ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు కనెక్టివిటీ ఉందన్నారు.కశ్మీర్లో ఈ ప్రాజెక్టుతో లక్షల మంది కల సాకారమైంది. మా హయాంలో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయింది. కోవిడ్ వల్ల కొన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చూపించాం. చీనాబ్ బ్రిడ్జ్ వల్ల టూరిజం మరింత అభివృద్ధి అవుతుంది. మన ఇంజనీర్లు అద్భుతం చేసి చూపించారు. కశ్మీర్లో మరిన్ని మెడికల్ కాలేజీలు రానున్నాయి. టూరిజం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ పాకిస్థాన్ మానవత్వం మరిచి.. పర్యాటకులపై దాడి చేయించింది. రికార్డు స్థాయిలో పర్యాటకులు సంఖ్య పెరుగుతోందని పాకిస్థాన్ కుట్ర చేసింది. కశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ కుట్రలు చేసింది. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.#WATCH | Katra, J&K | Prime Minister Narendra Modi says, "Remember exactly one month ago, on the night of 6 May, Pakistan saw its doomsday. Now, whenever Pakistan hears the name of Operation Sindoor, it will remember its shameful defeat. The Pakistani Army and terrorists had… pic.twitter.com/Umab57Waat— ANI (@ANI) June 6, 2025భారత్ దాడులతో పాక్ వణికిపోయింది. పక్కాగా చేసిన స్ట్రైక్స్‌తో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను క్షమించం అనే సందేశం పంపాం. 22 నిమిషాల్లోనే పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. భారత్ ఈ స్థాయిలో దాడి చేస్తుందని పాకిస్థాన్ ఊహించలేకపోయింది. మనం ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తే.. పాక్ మన ప్రజలను, ఆలయాలను టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పేందుకు జమ్ముకశ్మీరీలు సిద్ధంగా ఉన్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. -
దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్‌పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌పై భారత్‌కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్‌కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్‌కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్‌పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్‌ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్‌పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు. -
శర్మిష్ఠ పనోలీకి హైకోర్టు బెయిల్
కోల్‌కతా: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలీ(22)కి కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన కామెంట్లు చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు గతవారం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉండగా అరెస్ట్ చేశారు. లా స్టూడెంట్ అయిన శర్మిష్ట ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌లోని ఓ వర్గం నటులు మౌనంగా ఉన్నారంటూ మే 7న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఆన్లైన్లో వైరలయ్యింది. తీవ్రమైన కామెంట్లు రావడంతో మరునాడే మే 8న వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. బెదిరింపులు రావడంతో కుటుంబంతో సహా వేరే చోటుకు మకాం మార్చింది. అయినప్పటికీ, ఆమె తన వీడియో ద్వారా మత విద్వేషాలను ప్రేరేపించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. దీంతో మే 30వ తేదీన గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు కోల్‌కతాకు తరలించారు. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనపై జస్టిస్ రాజా బసు చౌదరి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు వింది. గురువారం తీర్పు విడుదల చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. అదేవిధంగా, పనోలీకి తగు భద్రత కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
దాచటం దేశభక్తిని చాటడమా?
దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్ సిందూర్’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్.) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్గామ్ దురంతం, ఆపరేషన్ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్ సరఫరా చేసిన రఫేల్ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్ విమానాలు కూలి పోవటం! రఫేల్ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్ దస్సాల్ట్ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్దూ కంపెనీ స్టాక్స్ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్ స్టాక్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అయిన ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్ చౌహాన్ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘స్వదేశీ’ సత్తా చాటాం: మోదీ
న్యూఢిల్లీ: ‘‘స్వదేశీ ఆయుధాలు ఆపరేషన్ సిందూర్‌లో అద్భుతంగా సత్తా చాటాయి. ప్రపంచంలో ఏ దేశానికీ తీసిపోమని నిరూపించుకున్నాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత దాడుల్లో కోలుకోలేని నష్టాలు చవిచూసినట్టు పాక్ అంగీకరించడమే ఇందుకు తాజా నిదర్శనమన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆయన అధ్యక్షతన సమావేశమైంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల తయారీకి ప్రభుత్వం ఇస్తున్న అమితమైన ప్రాధాన్యం ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాల్సిందిగా మంత్రివర్గ సహచరులకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కి జూన్ 9కి ఏడాది పూర్తవుతున్నందున ఈ 12 నెలల్లో సాధించిన ఐదు ప్రధాన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ జట్టుకు సన్మానం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. -
మలేసియాలో పారని పాక్ పాచిక
కౌలాలంపూర్: మలేసియా గడ్డపై పాకిస్తాన్ చేసిన భారతవ్యతిరేక కుయుక్తులు నిష్ఫలమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను వివరిస్తూనే ఉగ్ర విషం చిమ్ముతున్న పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు మలేసియాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష దౌత్య బృందం ఆ దేశాధికారులతో సమావేశమైంది. అయితే ఈ భేటీను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. మతాన్ని అడ్డుగా పెట్టే ప్రయత్నంచేసి చివరకు భంగపడింది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని భారత అఖిలపక్ష దౌత్య బృందం మలేసియాలో 10 వేర్వేరు భేటీలకు సిద్దమవగా ఈ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని మలేసియా ప్రభుత్వానికి అక్కడి పాకిస్తాన్ ఎంబసీ లేఖ రాసింది. ‘‘ మనం మనం ఒక్కటే. మన రెండు దేశాలూ ముస్లిం దేశాలే. భారత ప్రతినిధి బృందం చెప్పే అంశాలకు విలువ ఇవ్వకండి. అసలు వాళ్లకు అనుమతే ఇవ్వకండి. మొత్తం 10 వేర్వేరు కార్యక్రమాలను జరగనివ్వకండి’’ అని ఆ లేఖలో పాకిస్తాన్ తన అక్కసు వెళ్లబోసుకుంది. అయినాసరే మలేసియా సర్కార్ భారత్‌కే మద్దతు పలికింది. మొత్తం 10 కార్యక్రమాలకూ అనుమతి ఇచ్చింది. మలేసియా పార్లమెంట్ స్పీకర్ వైబీ టాన్ శ్రీ దాటో జొహారీ బిన్ అబ్దుల్‌తో సంజయ్‌ఝా బృందం భేటీ అయి పాక్ ఉగ్రధోరణిని వివరించింది.బిలావల్ భుట్టోకు చేదు అనుభవంభారత్కు పోటీగా అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ దౌత్య బృందానికి సారత్యంవహిస్తున్న ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ(పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీకి న్యూయార్క్‌లకు చేదు అనుభవం ఎదురైంది. పహల్గాం దాడి తర్వాత భారత్‌లో ముస్లింలను దూషించడం ఎక్కువైందని, వాళ్లను దయ్యాల్లా చూస్తున్నారని బిలావల్ అమెరికాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఈయన వ్యాఖ్యలను ముస్లిం జర్నలిస్ట్ అహ్మద్ ఫథీ మీడియా సమావేశంలో లేవనెత్తి బిలావల్‌ను ఇరుకునపెట్టారు. ‘‘ పహల్గాం ఘటనను భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతోందనేది పూర్తిగా తప్పు. ఆపరేషన్ సిందూర్ వివరాలను భారత్ తరఫున ముస్లిం మహిళా నావికాధికారి మీడియాకు వివరించారు. ముస్లింలను భారత్ తన ప్రతినిధులుగా భావిస్తోందికదా?’’ అని ప్రశ్నించారు. దీంతో బిలావల్ ముఖం ఎర్రబడింది. ఏం చెప్పాలో తెలీక నీళ్లు నమిలారు. భారత దాడి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషి వివరించడం తెల్సిందే. -
‘సింధూర్’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పాక్ జరిపిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్(Operation Sindhur)’ పేరిట ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ వైమానిక దాడులను ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా పర్యవేక్షించారని, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే విషయంలో ఆయనకున్న సంకల్పాన్ని ఈ దాడులు మరింత బలోపేతం చేశాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.మే ఏడున భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై దాడులు చేసిందని, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నదని సింగ్ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన ఇతర వ్యాపకాలను పక్కనపెట్టి, పరిస్థితులను అనుక్షణం పర్యవేక్షించారన్నారు. ప్రశాంతత అలవాటైన ఆయనకు ఆందోళన అంటే ఏమిటో తెలియదని తాను అనుకున్నానని సింగ్ అన్నారు. గతంలో ప్రధాని రాత్రివేళల్లో కూడా పని చేశారని, అయితే ఇప్పుడు తాను చూసినది ప్రత్యేకమైనదని సింగ్ తెలిపారు.పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రధాని రక్షణ దళాలకు అక్కడున్న పరిస్థితులు, వారి విచక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎంతో స్పష్టతతో నిర్ణయం తీసుకున్నారని, పౌరులకు హాని కలిగించకుండా, ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద వనరులను అణిచివేయాలని సూచించారన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత్ ఎంతో సంయమనంతో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, దాడులు చేసిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘సిందూర్’లో తునాతునకలైన పాక్ యుద్జ విమానాలివే.. -
‘సిందూర్’లో తునాతునకలైన పాక్ యుద్జ విమానాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, భారతదేశం ప్రతీకార సైనిక చర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీనిలో పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్)నకు చెందిన ఆరు యుద్ధ విమానాలు(Fighter jets), రెండు ఎంతో విలువైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమయ్యిదని భారత అధికార వర్గాలు తెలిపాయి.భారత వైమానిక రక్షణ విభాగాలు పాక్ విమానాలను గగనతల పోరాటంలో నాశనం చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ జెట్ల కూల్చివేతలను రాడార్ ట్రాకింగ్ ద్వారా నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢీకొన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తానీ విమానం ట్రాకింగ్ గ్రిడ్ల నుండి అదృశ్యమైందని ఆ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్‌కు చెందిన మరో ఏఈడబ్ల్యూ అండ్ సీవిమానం ఎయిర్-టు-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది.ఐఏఎఫ్ మానవరహిత వ్యవస్థలపై కూడా దాడులు చేసింది. రాఫెల్, ఎస్‌యూ-30 జెట్లతో కూడిన ఆపరేషన్‌లో చైనాకు చెందిన ఎలిట్యూడ్, లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్లను కలిగిన హ్యాంగర్ ధ్వంసమయ్యింది. భారత వైమానిక రక్షణ విభాగాలు సంఘర్షణ సమయంలో జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు పాకిస్తాన్ యూసీఏవీలను అడ్డగించి కూల్చివేశాయి. మే ఆరు-ఏడు తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్(Pakistan)లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో భారతదేశం తన సైనిక ప్రతిస్పందన ప్రారంభించింది.బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా శిబిరం, ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, భీంబర్, చక్వాల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత సైన్యం గుర్తించింది. భారత్ తన తొలి దాడుల తర్వాత, పశ్చిమ సరిహద్దు వైపు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కాగా తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి అనంతరం పాకిస్తాన్ డిజిఎంఓ, మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా.. భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ను సంప్రదించి తక్షణ కాల్పుల విరమణకు అభ్యర్థించారు. తదనంతరం భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తిరిగి భారత్ ప్రతీకార దాడులకు దిగుతుందని హెచ్చరించింది. ఇది కూడా చదవండి: బీహార్‌లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల -
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21వ తేదీ నుంచి ఆగష్టు 12వ తేదీ దాకా సెషన్ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్న వేళ.. వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది పార్లమెంట్ తొలి సమావేశం.. జనవరి 31వ తేదీన బడ్జెట్ సెషన్‌తో ప్రారంభమైంది. కాస్త విరామంతో రెండు దఫాలుగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన లోక్‌సభ, రాజ్యసభల నిరవధిక వాయిదాతో ఈ ఏడాది పార్లమెంట్‌కు తొలి సమావేశాలు(బడ్జెట్) జరిగాయి. -
డ్రోన్ వార్ఫేర్!
డ్రోన్ల రంగప్రవేశంతో యుద్ధాల తీరుతెన్నులే సమూలంగా మారిపోతున్నాయి. యుద్ధ విమానాలు మొదలుకుని చిన్నపాటి ఆయుధాల దాకా అన్నింటికీ డ్రోన్లు అతి సమర్థమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ఈ కొత్త తరం డ్రోన్ వార్ఫేర్కు ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పరాకాష్టగా నిలిచింది. ఇది ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పక్కలో పాక్ వంటి దాయాది ఉన్న భారత్‌కు పెను హెచ్చరిక సంకేతమే. నిఘా నేత్రాలకు చిక్కకుండా డ్రోన్లను కీలక సైనిక స్థావరాల, పౌర వ్యవస్థల సమీపానికి చేర్చగలిగితే చాలు, వాటిపై పెను దాడులకు పాల్పడవచ్చు.ఊహించలేనంత నష్టం కలగజేయవచ్చు. పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాల స్లీపర్ సెల్స్ దేశమంతటా చొచ్చుకుపోయి మాటేసి ఉన్నాయన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో మనకిది ఆందోళనకర పరిస్థితేనని రక్షణ నిపుణులు అంటున్నారు. అలాంటి దాడులను కాచుకోవడం నిజంగా కత్తిమీద సామేనని అభిప్రాయపడుతున్నారు.నాలుగేళ్ల క్రితమే: మన సైనిక దళాలను లక్ష్యం చేసుకుని నాలుగేళ్ల క్రితమే డ్రోన్ దాడులకు తెగబడ్డారు. 2021లో జమ్మూలోని వైమానిక స్థావరంపై రెండు డ్రోన్లతో దాడులు చేశారు.వాటి ద్వారా అత్యాధునిక పేలుడు పదార్థాలను (ఐఈడీ) ఎయిర్‌బేస్‌పైకి జారవిడిచారు. అవి అదృష్టవశాత్తూ బహిరంగంగా నిలిపి ఉంచిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లకు, సిబ్బందికి దూరంగా పడి పేలడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ ఐఈడీలు పాక్ సైన్యం అందజేసినవేనని దర్యాప్తులో తేలింది. వాటి తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలన్నీ మిలిటరీ గ్రేడ్‌కు చెందినవని నిర్ధారణ అయింది. పాక్ నుంచి మనకు ఎన్నిరకాలుగా పెను ముప్పు పొంచి ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే.అదే పాక్ యుద్ధ తంత్రం!: ప్రత్యక్ష పోరులో పాక్ కనీసం కొద్ది రోజుల పాటు కూడా భారత్ ముందు నిలవలేదని ఆపరేషన్ సిందూర్, అనంతర ఘర్షణలు మరోసారి నిరూపించాయి. కనుక పాక్ తనకు బాగా అలవాటైన సూడో యుద్ధ నీతినే నమ్ముకుంటుందనడంలో సందేహం లేదు. ఉగ్ర ముఠాలకు మనపై దాడులకు ప్రేరేపించి, అందుకు కావాల్సిన సరంజామా అంతా అందించి సాయపడుతుంది. ఈ ముప్పుకు డ్రోన్ల రూపంలో ఇప్పుడు కొత్త కోరలు మొలిచినట్టే. కనుక భారత్ అత్యంత అప్రమత్తతతో మెలగక తప్పదు. అందుకే భారత్ డ్రోన్ దాడులను సమర్థంగా కాచుకుని, పూర్తి స్థాయిలో తిప్పికొట్టే వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. భారత్ తన కీలక సైనిక స్థావరాలు, మౌలిక వ్యవస్థల రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.’సిందూర్’లో డ్రోన్ల హవాఆపరేషన్ సిందూర్, తదనంతర ఘర్షణల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ తొలి రోజు మే ఏడో తేదీన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలు, స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడం తెలిసిందే.⇒ అందుకు ప్రతి చర్యగా పాక్ ప్రధానంగా నమ్ముకున్నది డ్రోన్ దాడులనే. మన సరిహద్దుల పైకి వందలాది డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావరకు మన భూభాగంలోకి ప్రవేశించాయి.⇒ ఫలితంగా పాక్‌తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణల్లో భారత్ కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించింది.⇒ పాక్ వైమానిక స్థావరాలపై దాడులకు ముందు యుద్ధ విమానాల ముసుగులో డ్రోన్లను పంపి దాయాది కీలక రాడార్ వ్యవస్థలు ఎక్కడెక్క డున్నదీ పక్కగా పసిగట్టింది. ఆ వెంటనే గుక్కతిప్పుకోనివ్వని క్షిపణి దాడులతో వాటిని ధ్వంసం చేసింది.⇒ తర్వాత పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి చావుదెబ్బ తీసింది. రాడార్ వ్యవస్థలను కోల్పోయిన పాక్ నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. పాక్ ఆర్మీ చీఫ్‌తో పాటు సైనిక ఉన్నతాధికారులు బ్యాంకర్లలో తల దాచుకోవాల్సి వచ్చింది. కేవలం డ్రోన్లను ఎరగా వేసి భారత్ ఇంతటి ఫలితాలు సాధించడం విశేషం. -
ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఆపరేషన్ సిందూర్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన భోపాల్‌లోని రవీంద్ర భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని.. నరేందర్.. సరెండర్ అనగానే భయపడ్డారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారంటూ మండిపడ్డారు. 1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్ణయాత్మక వైఖరిని ప్రస్తావిస్తూ... ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదన్నారు. యూఎస్ సెవెంత్ ఫ్లీట్ ముందుకు సాగినప్పుడు ఆమె నేను చేయవలసినది చేస్తానంటూ గట్టిగా చెప్పారంటూ రాహుల్ గుర్తు చేశారు.సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారికి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ లొంగిపోదు. గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్.. వీరు లొంగిపోయే వ్యక్తులు కాదు, అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు ’’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. -
జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి: సీడీఎస్
పుణే: నీరు, రక్తం కలిసి పారవని.. పహల్గామ్ లాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ పాకిస్థాన్‌కు సీడీఎస్ అనిల్ చౌహన్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా మార్చుకుందని.. ఉగ్రవాదం పడగ నీడ కింద భారత్ ఉండబోదని అనిల్ చౌహన్ అన్నారు.‘‘చిన్నచిన్న నష్టాలు జరుగుతాయి., వాటికన్నా ఏం సాధించామన్నదే ముఖ్యం. జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ ఆపేయాలి. జరిగిన నష్టంపై సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’’ అని సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు. -
ఇండియా కూటమి నేతల కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి, కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం సమావేశ వివరాలను ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో మధ్యాహ్నం మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం.. సుమారు 200 మంది ఎంపీలతో సంతకాల సేకరణ జరిపింది ఇండియా కూటమి. పలు రాజకీయ పక్షాల ఎంపీలు సమ్మతి తెలిపిన ఆ ఉమ్మడి లేఖను సైతం ప్రధానికి పంపగా.. ఇవాళ మీడియా ముందు దానిని విడుదల చేయనున్నట్లు సమాచారం. -
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. తొలిసారి జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్రధాని మోదీ
సాక్షి,ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఈ నెల 6న (జూన్6) జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చీనాబ్ రైల్వే బ్రిడ్జీని ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉగ్రవాదం అణిచివేతపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోదీ తన పర్యటనలో సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తద్వారా జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు తొలగనున్నాయి.PM Modi is expected to inaugurate the Chenab Bridge—the world’s highest railway bridge—during his upcoming visit to Jammu and Kashmir on June 6, 2025.@DrJitendraSingh shared this update on platform X.Watch as @anchoramitaw, @MohitBhatt90 & @ShreyaOpines bring us more details. pic.twitter.com/3IZtoq9LIT— TIMES NOW (@TimesNow) June 3, 2025 దీంతో పాటు ఈ మార్గమధ్యంలో చీనాబ్ నది (Chenab River)పై నిర్మించిన బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. -
పీఓకేలో నిరసనల హోరు
గిల్గిత్: ఆపరేషన్ సిందూర్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్–బాల్టిస్టాన్‌లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మార్ట్ నగర్లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిసాŠత్క్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)లో కలికితురాయి వంటి కారాకోరమ్ జాతీయ రహదారిని గత మూడు రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్(నవాజ్) పారీ్టకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లబి్ధచేకూర్చేలా ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారని సరకు ఎగుమతి, దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్‌ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2023 అక్టోబర్‌లోనూ గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రజలు భారత్ అనుకూల ఉద్యమం చేశారు. భారత్‌లోని కార్గిల్‌ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని స్థానికులు ఉద్యమించారు. ‘సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దును తెరవండి’’అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగడడం తెల్సిందే. తర్వాత ఆయనను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్ సర్కార్ అరెస్ట్‌చేసింది. పరస్పర నిందారోపణలు గిల్గిత్–బాల్టిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలతో తమకు సంబంధంలేదని పీఎంఎల్(నవాజ్) పార్టీ చెబుతోంది. ‘‘పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కారి్మకులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు, హోటళ్లు, చిరువ్యాపారులు అందరూ ఆరు నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా?’’అని పీఎంఎల్(నవాజ్) పార్టీ నేత జావేద్ హుస్సేన్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ‘‘ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు’’అని గిల్గిత్–బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ అలీ ఖయీద్ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థిక చితికిపోతున్నారు. సరకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు. కస్టమ్స్ క్లియరెన్సుతో.. సరిహద్దుల్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా 257 కన్సైన్మెంట్లు ఇలా డ్రై పోర్ట్‌లోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరకు పాడయింది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరకుకు సైతం రోజువారీ నిల్వ చార్జీలు ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరకుకు మోక్షం కల్గించేదాకా కారాకోరమ్ హైవేను తెరిచేదిలేదని వ్యాపారులు భీషి్మంచుకుని కూర్చున్నారు. నగర్, హూంజా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్–బాల్టిస్తాన్ దిగుమతి, ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్–చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. -
సంయమనం అవసరం
నెత్తురు చిందకుండా, నష్టం జరగకుండా యుద్ధం సాగుతుందనీ, ముగుస్తుందనీ ఎవరూ అనుకోరు. ప్రత్యర్థిని చిత్తు చేద్దామని ఇరుపక్షాలూ విశ్వప్రయత్నం చేస్తాయి. కానీ అనేక కారణాలవల్ల ఎవరో ఒకరినే విజయం వరిస్తుంది. ఇందులో సరైన అంచనాలకు రాలేకపోవటం దగ్గరనుంచి స్థానిక వాతావరణ స్థితిగతుల వరకూ చాలా వుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా మన విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో మనకు కలిగిన నష్టాలగురించి వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. యాదృచ్ఛికంగానే కావొచ్చుగానీ... మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శనివారం సింగపూర్‌లో మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. ఆ అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు వదలటం లేదా వారితో చర్చించి ఎప్పుడు ఏ విధంగా చెప్పాలో సలహా తీసుకోవటం సరైన విధానం. విదేశీ గడ్డపై చెప్పటమైతే ఎంతమాత్రమూ సరికాదు. పైగా ఆయన సింగపూర్ వెళ్లింది ఏటా జరిగే అంతర్ ప్రభుత్వాల భద్రతా వ్యవహారాలపై నిర్వహించే ‘షాంగ్రీ లా డైలాగ్’ కోసం. అందులో పాకిస్తాన్ త్రివిధ దళాల చీఫ్ కూడా పాల్గొన్నారు. ఒకపక్క మన ఎంపీల అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ ఆగడాల గురించీ, వాటిని నిలువరించక తప్పని స్థితి గురించీ వివరించటానికి వేర్వేరు దేశాల్లో పర్యటిస్తున్నాయి. కనుక జనరల్ చౌహాన్ ప్రకటన ఏ రకంగా చూసినా సమయం, సందర్భం లేనిది. కొందరు మాజీ సైనికాధికారులూ, నిపుణులూ చెప్పినట్టు పాకిస్తాన్‌కు మన దళాలు కలిగించిన భారీ నష్టంతోపాటు దీన్నీ చెప్పివుంటే ఇంత వివాదమయ్యేది కాదేమో! గత నెల 7 నుంచి పదో తేదీ వరకూ సాగించిన దాడుల్లో మన నష్టం ఏపాటో చెప్పాలని విపక్షాలు కోరుతున్నాయి. దాడి చేయటానికొచ్చిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ డిమాండ్ మొదలుపెట్టారు. మన సైనిక దళాలు సాధిస్తున్న విజయాలను ఎన్డీయే ప్రభుత్వం తన సత్తాకు ప్రతీకగా చెప్పుకోవటాన్ని నిరోధించేందుకు విపక్షాలు ఈ ప్రయత్నం చేసివుండొచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడిచేయాలనే అంశాలను పూర్తిగా త్రివిధ దళాలకు అప్పగించాక వాటిపై అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరు చేసినా తప్పే. యుద్ధంలో తొలి క్షతగాత్ర సత్యమేనంటారు. ఎందుకంటే అవతలి పక్షాన్ని చావుదెబ్బ తీశామని, అనేకమంది శత్రు సైనికుల్ని హతమార్చామని, కీలక స్థావరాలు ధ్వంసం చేశామని ప్రభుత్వాలు చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. యుద్ధం ముగిసిన కొన్నాళ్లకుగానీ వాస్తవ గణాంకాలు బయటకు రావు. మన విపక్షాలు అంతవరకూ ఆగలేకపోయాయి. పాక్ మీడియా వార్తల్ని విశ్వసించి మన ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాయి. ఇదంతా రాజకీయంగా బీజేపీకి లాభిస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. ఎప్పుడూ లేనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో మన సేనలు పాకిస్తాన్ నగరాలను నేలమట్టం చేయటం మొదలుకొని పలు విజయాలు సాధించినట్టు ప్రచారం సాగింది. ఇదెంత ముదిరిందంటే... ఒక దశలో మన ప్రభుత్వం ఖండించాల్సి వచ్చింది కూడా. మరోపక్క యుద్ధంవల్ల కలిగే అనర్థాల గురించి చెప్పిన మాజీ సైనికాధికారులనూ, వారి కుటుంబసభ్యులనూ దూషించటం, ఉగ్రవాదుల దుర్మార్గానికి భర్తను కోల్పోయిన యువతి ముస్లింలపై ద్వేషం వద్దని అన్నందుకు ఆమెను దుర్భాషలాడటం వంటి వైపరీత్యాలూ చోటుచేసుకున్నాయి. కొందరైతే దాడులు నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శిపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా నోరుపారేసుకున్నారు. యుద్ధకాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలనూ, సలహాలనూ పాటించటం తప్ప ఉన్మాదం ఆవహించినట్టు ఊగిపోవటం సరైంది కాదు. ఇందువల్ల మన జవాన్లకు వీసమెత్తు ఉపయోగం లేదు సరికదా... ప్రజల్లో తప్పుడు భావాలు వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. దాడులు ఎప్పుడు మొదలెట్టాలో, ఎప్పుడు ఆపాలో, ఏ దశలో ఏం చేయాలో నిర్ణయించటానికి ప్రభుత్వం ఉన్నప్పుడు గుంపులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం అనర్థదాయకం.చౌహాన్ చెబుతున్న ప్రకారం నాలుగు రోజుల దాడుల్లో తొలి రెండు రోజులూ మనకు నష్టం వాటిల్లింది. వెంటనే లోపాలు గుర్తించి సరిచేసుకోవటం పర్యవసానంగా ఆ తర్వాత మన జెట్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగాయని ఆయన అన్నారు. ఏ లోపమూ చోటుచేసుకోకుండా, ఏ నష్టమూ జరగకుండా మనం కోరుకున్న ప్రకారం అంతా జరిగిపోవాలనుకునేవారికి ఇది నిరాశ కలిగించవచ్చు. బీజేపీ అగ్ర నాయకులంతా ఈ విజయాలను తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపు కావొచ్చు. కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో సంయమనం పాటించటం అందరి బాధ్యత. దాడులు ప్రారంభించటానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరిన ప్రభుత్వం ముగించటానికి ముందు కూడా ఆ పనే చేసివుంటే బాగుండేది. కనీసం మన దళాలు సాధించిన విజయాలు, మన నష్టాల గురించి ఈ నెల్నాళ్లలోనైనా అఖిలపక్షం నిర్వహిస్తే సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ తరహా ఉదంతాలు ఇకపై పునరావృతం కాకూడదనుకుంటే కేంద్రం ఆ పని చేయాలి. అందులో అధికార, విపక్షాల వ్యవహారశైలి గురించీ, కొన్ని శక్తులనుంచి అతిగా వచ్చిన స్పందనల గురించీ తన వైఖరేమిటో చెప్పాలి. కష్టకాలంలో సంయమనం పాటించటం ఎంత ముఖ్యమో వివరించాలి. -
Sharmishta Panoli: ‘ఆమెకు కిడ్నీలో రాళ్లున్నాయి..’
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను అరెస్టు చేసిన అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.అయితే ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆమె ఉన్న మహిళా సెల్ కూడా శుభ్రంగా లేదని ఆమె తరఫు న్యాయవాది ఎండీ సమీముద్దీన్ సోమవారం మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆమెకు ఉన్న హక్కులను కాపాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ ఆమెకు ఆరోగ్యం బాలేదు. ప్రస్తుతం ఆమెకు కిడ్నీలు రాళ్లు ఉన్నాయి. కిడ్నీ సమస్యతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతోంది. ఆమెకు కేటాయించిన బార్లో పరిశుభ్రత లేదు. అంతేకాకుండా కనీసం న్యూస్ పేపర్ సౌకర్యం కూడా అక్కడ లేదు. ఆమె కనీస హక్కులు కూడా లభించడం లేదు’ అని న్యాయవాది సమీముద్దీన్ పిటిషన్లో పేర్కొన్నారు. ‘మేము ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. జూన్ 13వ తేదీ లోపు ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. ఆమె అరెస్టుకు కారణమైన అంశంపై కూర్చొని చర్చిస్తాం. ఒకటి రెండు రోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’ అని న్యాయవాది పేర్కొన్నారు.శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్‌స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంలో ఆమె చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. అనంతరం వాటిని ఆమె డిలీట్ చేసినప్పటికీ కేసు నమోదు కావడం, అరెస్ట్ కావడం జరిగిపోయాయి. -
ఏకాంత వీడియోలు ఒక్కొక్కరివిగా బయటకు..!
పొరుగుదేశం పాకిస్తాన్లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల కమ్యూనిటీని వణికిపోతోంది. గత కొన్నిరోజులుగా అక్కడి ఇన్ఫ్లుయెన్సర్ల పరువు బజారున పడుతోంది. వరుసబెట్టి ఒక్కొక్కరి ఏకాంత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనాలు వాళ్లను తిట్టిపోస్తుండగా.. మరోవైపు వాళ్ల కవరింగ్‌లు, వివరణలు, చట్టపరమైన చర్యలతో ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.పాక్‌లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాపులర్ అయిన కొందరు యువతుల ప్రైవేట్ వీడియోలు గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్నాయి. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మినాహిల్ మాలిక్, ఇమ్షా రెహమాన్‌ల వీడియోలు తొలుత సర్క్యులేట్ కావడంతో.. వాళ్లకున్న మిలియన్ల ఫాలోవర్లు షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే టాక్ షోలు, మ్యూజిక్ వీడియోలతో పాపుల్ అయిన మథీరా ఖాన్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా.. కన్వాల్ అఫ్తాబ్ అనే మరో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోలను ఆ ఇన్ఫ్లుయెన్సర్లు(Influencers) ఖండిస్తున్నారు. అవి తమవి కావని, ఇదంతా ఏఐ సృష్టి అని వివరణలు ఇస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు వెెళ్తున్నామని ప్రకటించారు. మినాహిల్ ఓ అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ కామెంట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు కారణం.. ఆమె చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్ గతంలో చెప్పిన మాటలు కావడం!.ఇదిలా ఉంటే.. ఈ డర్టీ వ్యవహారంలో భారత్ ప్రస్తావనతో అక్కడి టీవీ చానెల్స్‌లో చర్చలు నడిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంతో అక్కడి మీడియా ఛానెల్స్‌ను, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలామందిని భారత్ నిషేధించింది. ఈ క్రమంలో ఇది భారత్ నుంచి జరుగుతున్న వ్యవహారమేనని అక్కడి మీడియా చర్చ జరపడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది.SHOCKING NEWS 🚨 Private videos of several Pakistani influencers of Pakistan have leaked online.Pakistan’s influencer community is facing a wave of scandals one after another 😱After viral incidents involving TikTok stars Minahil Malik and Imsha Rehman, now videos of Mathira… pic.twitter.com/rFdRAPIBY8— BALA (@erbmjha) June 1, 2025 -
‘జీ-20కి భారత్ ఆతిథ్యం.. టాప్ 20 ఉగ్రవాదులకు పాక్ ఆతిథ్యం’
లండన్: దాయాది దేశం పాకిస్తాన్‌పై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది విరుచుకుపడ్డారు. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం టాప్ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ బుద్ధి ఎలాంటి అంటే.. మనం వారితో కరచాలనం చేసి ఇటు వైపు తిరిగిన వెంటనే.. మన వెనుక నుంచి దాడి చేస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఆపరేషన్ సిందూర్‌పై వివరణ, పాక్ దౌత్యపరంగా దెబ్బతీసేందుకు అఖిలపక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్‌కు చేరుకుంది. ఈ అఖిలపక్ష బృందంలో శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సభ్యులుగా ఉన్నారు. తాజాగా లండన్‌లో ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే.. పాకిస్తాన్ మాత్రం టాప్ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇదీ వారి విధానం. జీ-20 అధ్యక్ష పదవిలో భారత్ ఒక ఏడాది పాటు కొనసాగింది. ఈ సమయంలో అధ్యక్ష పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాం.ఇదే సమయంలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక మాట్లాడుతూ.. బిన్ లాడెన్ గురించి ఇక్కడున్న వారిలో ఎంత మందికి తెలుసు. మీలో ఎంత మంది లాడెన్ డాక్యుమెంటరీ చూశారో నాకు తెలియదు. ఒక్కసారి లాడెన్ డాక్యుమెంటరీ చూడండి. పాకిస్తాన్ ఎంత సాయం చేసిందో తెలుస్తుంది. అల్ ఖైదాకు నిధులు ఇచ్చారు.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలో జరిగిన దాడుల సూత్రధారి లాడెన్. ఈ దాడి తర్వాత లాడెన్ పాకిస్తాన్లో దాక్కున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పాలని కోరారు.#WATCH | London, UK | Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "...We had a very successful presidency of G-20... While we host the G-20, Pakistan hosts the T-20. The top 20 terrorists of the world will be found being hosted by the Pakistani state government. It's their… pic.twitter.com/c8njvaCYRS— ANI (@ANI) June 1, 2025 -
భారత్ దెబ్బకు ఎడారిగా మారుతున్న పాక్
-
ముస్లిం ఓట్ల కోసమే బుజ్జగింపు రాజకీయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ముస్లింల ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్‌ను, వక్ఫ్ సవరణ బిల్లును గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కోల్‌కతాలో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ శకం 2026లో ముగుస్తుందని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచివేయడాన్ని మమతా బెనర్జీ భరించలేపోతున్నారని విమర్శించారు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని ఆక్షేపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశి్చమబెంగాల్ వ్యక్తులు కూడా మరణించారని, అయినప్పటికీ మమతా బెనర్జీ నోరెత్తలేదని తప్పుపట్టారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన హింసాకాండ వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హస్త ఉందని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. వసలదార్ల కోసం సరిహద్దులు తెరిచేశారని విమర్శించారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తుతోనే కాకుండా.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని అమిత్ షా స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో హింసను ఆశ్రయించకుండా డిపాజిట్లు అయినా తెచ్చుకోలగరా? అని మమతా బెనర్జీకి సవాలు విసిరారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఖండించింది. సరిహద్దుల రక్షణ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుందని గుర్తుచేసింది. బంగ్లాదేశ్ నుంచి వలసదార్లు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. -
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్‌స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్‌ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్‌ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్‌కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
మహిళలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లే
భోపాల్: పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న సూత్రధారులు భారత నారీశక్తిని సవాలు చేసి స్వయంగా వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పహల్గాం ఉగ్రవదాడిలో భార్యల కళ్లెదుటే భర్తలు చనిపోయారని అన్నారు. మన ఆడబిడ్డలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ చరిత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ అత్యంత విజయవంతమైన ఆపరేషన్ అని స్పష్టంచేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు కేవలం రక్తం పారించలేదని... మన సంస్కృతిపై దాడి చేశారని, మన దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్రలు సాగించారని మండిపడ్డారు. రాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైనిక దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల అడ్డాలను నేలమట్టం చేశాయని అన్నారు. ముష్కరుల ఇళ్లలోకి చొరబడి మరీ అంతం చేయగలని నిరూపించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు. మరోసారి భారత్‌పై దాడికి పాల్పడే సాహసం చేస్తే ఉగ్రవాదులు, వారి పోషకులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టంచేశారు. వీరత్వానికి ప్రతీక సిందూరం ఉగ్రవాదులను ప్రయోగించి దొంగచాటు యుద్ధాలు చేద్దామనుకుంటే కుదరని పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. తుపాకీ తూటాలకు ఫిరంగి గుండ్లతో బదులిస్తామని ఘాటుగా హెచ్చరించారు. మన సంప్రదాయంలో సిందూరం మహిళా శక్తికి ప్రతీక అని, రామభక్త హనుమాన్ సైతం సిందూరం ధరిస్తారని తెలిజేశారు. ఇప్పుడు సిందూరం వీరత్వానికి, ఉగ్రవాదంపై ప్రతిఘటనకు గుర్తుగా మారిందన్నారు. మహిళల సాధికారత కోసం నారీశక్తి వందన్ అధినియం బిల్లు తీసుకొచ్చామని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో 75 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళలదే కీలక పాత్ర అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో బీఎస్ఎఫ్ మహిళా దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ దళం ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో ఫార్వర్డ్ పోస్టులను పాకిస్తాన్ దాడుల నుంచి విజయవంతంగా కాపాడిందని వెల్లడించారు. రక్షణ శాఖలో భారతీయ మహిళల శక్తి సామర్థ్యాలు ప్రపంచం తిలకిస్తోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో 17 మంది తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. -
బీఎస్ఎఫ్ అధికారిణి నేహాకు పురస్కారం
జమ్మూ: సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న నేహా భండారీకి శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ప్రశంసా పురస్కారం అందజేశారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూ యుద్ధ క్షేత్రంలో నేహా అసమాన ధైర్య సాహసాలను, ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహారించారని కొనియాడారు. అంతర్జాతీయ సరిహద్దుల్లోని పాకిస్తానీ పోస్ట్‌కు అత్యంత సమీప జీరో లైన్‌లోని బీఎస్ఎఫ్ పోస్టుకు సారథ్య బాధ్యతలు తీసుకున్న నేహా భండారీ..తన సహచరులను ప్రోత్సహిస్తూ శత్రువుకు చెందిన మూడు పోస్టులను నేలమట్టం చేసి, తగు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ఈ పోస్టులో నేహాతోపాటు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లున్నారు. వీరంతా ఏకమై అంతర్జాతీయ సరిహద్దుల్లోని అఖూ్నర్, సాంబ, ఆర్‌ఎస్‌పురా సెక్టార్ల వెంబడి ఉన్న శత్రువును తీవ్రంగా దెబ్బతీశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నేహాది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం. ‘మా తాత ఆర్మీలో పనిచేశారు. మా అమ్మానాన్న కూడా సీఆర్పీఎఫ్లో పనిస్తున్నారు’అని నేహా చెప్పారు. -
కొన్ని జెట్లను కోల్పోయాం
సింగపూర్/న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్‌తో జరిగిన ఘర్షణల్లో మనకు వైమానికంగా నష్టం జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. మన ఫైటర్ జెట్లను దాయాది కూల్చేసినట్టు వెల్లడించారు. షాంగ్రిలా డైలాగ్ నిమిత్తం సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆయన శనివారం బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్‌తో యుద్ధం భారత్ ఫైటర్ జెట్లను నష్టపోయిందా అన్న ప్రశ్నకు బదులుగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి పెను రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వాస్తవాలను మోదీ సర్కారు తొక్కిపెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. సీడీఎస్ వ్యాఖ్యల నేపథ్యంలో మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై లోతుగా చర్చించేందుకు తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అణు’ స్థాయికి పోలేదు పాక్‌పై దాడుల సందర్భంగా యుద్ధ విమానాలను నష్టపోయినట్టు వాయుసేన గతంలోనే పరోక్షంగా అంగీకరించింది. పాక్ వైమానిక స్థావరాలపై దాడుల వివరాలను ఆర్మీ, నేవీ సైనిక ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్‌తో కలిసి వాయుసేన డీజీ ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి అప్పట్లో ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. మన ఫైటర్ జెట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11 నాటి భేటీలో విలేకరులు ప్రశ్నించగా, ‘‘యుద్ధమన్నాక నష్టాలు సహజం. కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున మనం ఫైటర్ జెట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులివ్వలేను’’ అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్‌తో సాగిన ఆ నాలుగు రోజుల ఘర్షణల్లో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి ఇలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, అదీ స్వయానా త్రివిధ దళాలకు అధిపతి అయిన సీడీఎస్ నోటినుంచి రావడం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలను నష్టపోయిందీ చెప్పేందుకు జనరల్ చౌహాన్ నిరాకరించారు. అంతేగాక ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్ వాదన కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘తొలి దశలో, అంటే మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన రోజు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలను కోల్పోవడం కాదు. అలా జరగడం వెనక కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను రెండు రోజుల్లోపే కనిపెట్టగలిగాం. కాబట్టే పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని యుద్ధ విమానాలన్నింటినీ తిరిగి రంగంలోకి దించాం. మే 8, 10 తేదీల్లో శత్రువును చావుదెబ్బ తీయగలిగాం. పాక్ లోలోపలికి చొచ్చుకుపోయి మరీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం’’ అని ఆయన వివరించారు. ‘‘చైనా అందజేసిన భారీ ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్‌ను ఏ మాత్రమూ ఆదుకోలేకపోయాయి. వాటి గురించి పాక్ చెప్పుకున్న గొప్పలన్నీ వట్టివేనని మన దాడులు రుజువు చేశాయి. ఎందుకంటే పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తుత్తునియలు చేస్తూ దాని భూభాగంలో 300 కి.మీ. లోపలి దాకా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చే శాం’’ అన్నారు. పాక్‌తో ఘర్షణ ఏ దశలోనూ అణుయుద్ధానికి దగ్గరగా రాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం తెలిసిందే. పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలను బ్రహ్మో స్ తదితర అత్యాధునిక క్షిపణులతో నామరూపాల్లేకుండా చేసింది. మర్నాడు పాక్ డ్రోన్లు తదితరాలతో సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై ప్రతీకార దాడులకు దిగింది. బదులుగా మన సైన్యం పాక్‌లో కి 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. నాలుగు రోజుల ఘర్షణల అనంతరం ఇరుదేశా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్ సై న్యం విజ్ఞప్తి మేరకే అందుకు ఒప్పుకున్నట్టు భారత్ పేర్కొనగా తానే ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు.స్వదేశీ శక్తికి తార్కాణం రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్ అద్దం పట్టిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో జరిగిన ఆసియా స్థాయి రక్షణ శిఖరాగ్ర సదస్సు షాంగ్రిలా డైలాగ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆకాశ్ వంటి పూర్తి దేశీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ దాడులను అత్యంత సమర్థంగా అడ్డుకుని తిప్పికొట్టాయని గుర్తు చేశారు. గగనతల రక్షణకు విదేశాల సాయంపై ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకున్న దేశవ్యాప్త సమీకృత రాడార్ వ్యవస్థ అద్భుతంగా రాణించి సత్తా చాటిందన్నారు. దాయాది విద్వేష మంత్రం శాంతి కోసం భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బదులుగా పాక్ విద్వేషమే వెల్లగక్కిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ దుయ్యబట్టారు. ‘‘2014లో ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌కు స్నేహ హస్తం సాచారు. రెండు చేతులు కలవనిదే చప్పట్లు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ను దూరం పెట్టడమే సరైన వ్యూహం. ఇప్పుడు భారత్ చేస్తున్నది అదే’’ అని వివరించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, తలసరి ఆదాయంలోనూ పాక్ మనకంటే చాలా ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మనం పాక్ అందుకోలేనంతగా ప్రగతి సాధించాం’’ అని గుర్తు చేశారు.దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్రం: కాంగ్రెస్ పాక్‌తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఫైటర్ జెట్లను కోల్పోయామన్న సీడీఎస్ ప్రకటనను ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్‌తో నాలుగు రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘సీడీఎస్ ప్రకటన నేపథ్యంలో సిందూర్‌కు సంబంధించి ఎన్నో కీలక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గం. కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలి’’ అంటూ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంపై కూడా వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కమిటీ వేసి సమీక్ష జరిపిందని గుర్తు చేశారు. ‘‘మన వీర పైలట్లు ప్రాణాలకు తెగించి దేశ గౌరవాన్ని కాపాడారు. వారికి వందనం’’ అంటూ ఖర్గే కొనియాడారు. -
‘ప్రధాని మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సైతం ఫైటర్ జెట్స్‌ను కోల్పోయిందంటూ సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ తన మాటల యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాయో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్.. సీడీఎస్ వ్యాఖ్యల అనంతరం తన స్వరాన్ని మరింత పెంచింది. సీడీఎస్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ పూర్తయిన వెంటనే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసి ఆ యుద్ధం వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తే, మోదీ మాత్రం అలా చేయకుండా ఆపరేషన్ సిందూర్ సక్సెస్ ను మాత్రమే బహిరంగ సభల్లో చెప్పుకొస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి చాలా విషయాలను మాట్లాడిల్సి ఉందని, ఇందులో ట్రంప్ ట్వీట్ పై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కోసం పట్టుబట్టామని, అది కేంద్ర ప్రభుత్వం చేయలేదంటూ మండిపడ్డారు. యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించి దాని ముసుగు తొలగించాలని, ఇప్పటికైనా పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు మల్లిఖార్జున ఖర్గే. 1999లో కార్గిల్ వార్ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని సమీక్ష కోసం ఏర్పాటు చేశారని, ఇప్పుడు అదే తరహాలో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్ -
మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నేరుగా పాక్ లో కి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను భారత్ నేలమట్టం చేసింది. దీన్ని తిప్పికొట్టాలని పాక్ ప్రయత్నించినా ఆపరేషన్ సిందూర్ విధ్వంసాన్ని ఆపడం వారి వల్ల కాలేదు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యిందనే నిజాన్ని కూడా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ధృవీకరించారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీన్ని లేవెనెత్తింది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందా.. లేదా చెప్పాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం ఏమీ క్లారిటీ ఇవ్వకపోయినా, భారత బలగాల సీడీఎస్(చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్ ఎట్టకేలకు తొలిసారి స్పందిస్తూ.. ‘ అవును.. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ ను కోల్పోయిన మాట వాస్తవమే. యుద్ధం అన్నాక కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని కోల్పోయాం అనేది ప్రశ్న కాదు.. ఎందుకు కోల్పోయాం అనేది మాత్రమే సమీక్షించుకోవాలి. అయితే పాకిస్తాన్ చెప్పినట్లు ఆరు ఫైటర్ జెట్స్ ను మనం కోల్పోలేదు. అందులో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. సింగపూర్ లోని బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అనిల్ చౌహాన్. అయితే కోల్పోయిన ఫైటర్ జెట్స్ ఏమిటనేది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయమనేది కూడా చెప్పలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతం అన్న రీతిలోనే ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ సంఖ్య అనేది ముఖ్యం కాదంటూ బదులిచ్చారాయన. -
అద్భుతమైన ‘ఆపరేషన్’ నిర్వహించారు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఢిల్లీ: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రాపెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సిడిఎస్ అనిల్ చౌహన్ మాత్రం స్పష్టం చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఇకనైనా భారత్ ప్రభుత్వం దీన్ని నిరాకరించడం మానుకోవాలననారు. ‘ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక కాల్పుల విరమణ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత ఎయిర్‌ఫోర్స్ విజయం పట్ల మేము గర్విస్తున్నామని, ఇదొక అద్భుతమైన ఆపరేషన్ అని ఉత్తమ్ కొనియాడారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం భారత్ ఎయిర్‌ఫోర్స్ సాధించిన విజయమన్నారు.ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయ్ ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కల్గిస్తోందన్నారు. చైనా, పాకిస్తాన్లతో ముప్పు నేపథ్యంలో భారత భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తేలికపాటి యుద్ధ విమానాల సప్లై ఆంశం కూడా ఆలస్యం అవుతుందని, అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్ , ఆర్ అండ్ డి(రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విభాగాలలోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. -
టెర్రరిజంపై సిందూర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్: ప్రధాని మోదీ
భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జంబోరి గ్రౌండ్లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరయ్యారు. అక్కడ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.‘‘టెర్రరిజంపై సిందూర్ సక్సెస్ ఫుల్ ఆపరేషన్. పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రదేశాలలో మన దళాలు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. ఉగ్రవాదం ద్వారా పరోక్ష యుద్ధాలను ఇకపై సహించబోమని ఈ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకుంటారు’’ అని మోదీ హెచ్చరించారు.పహల్గామ్ దాడి.. భారత సాంప్రదాయాలపై దాడి.. సిందూరం అనేది భారత సాంప్రదాయంలో ఒక భాగంగా మోదీ పేర్కొన్నారు. ‘‘పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా, మన సంస్కృతిపై కూడా దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు’’ అని మోదీ అన్నారు.కాగా, లోకమాత దేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ.300 ప్రత్యేక నాణెం ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోర్ మెట్రో, దాతియా-సత్నా ఎయిర్ పోర్టును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌కు కూడా ప్రధాని.. వర్చువల్ భూమిపూజ నిర్వహించారు. -
ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు.. విద్యార్థిని అరెస్ట్
ముంబై: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పూణేకు చెందిన యువతినిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. పుణెకు చెందిన లా స్టూడెంట్ షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందించింది. ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ అభ్యంకర వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఒక మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.Respected @KapilMishra_IND Ji @TajinderBagga JiSave this girl, Make sure that Kolkata police don't let her go outside Delhi borderIf we can't save #sharmistha then other girls of the country will also not come forward for the nation!#ReleaseSharmistha#IStandwithSharmishta pic.twitter.com/cj4HADXSB2— Arkadip 🇮🇳🚩(The Kattar Hindu🕉️) (@Ek_Sanatani77) May 30, 2025అనంతరం.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. అప్పటికే ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం అదృశ్యమై ఆ నోటీసులపై స్పందించలేదు. దీంతో.. ఇక లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. ఇక, ఈరోజు పనోలిని కోల్కత్తా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం. ఆమె ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అయితే, పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్ట్ చేయడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. -
118 పాక్ ఫార్వర్డ్ పోస్టులు, నిఘా వ్యవస్థలు తుత్తునియలు
పూంఛ్: ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ బలగాలు పాకిస్తాన్‌కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులతోపాటు సమాచార, నిఘా వ్యవస్థను తుత్తునియలు చేశాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తీవ్రంగా నష్ట పోయిన శత్రుదేశం తిరిగి కోలుకునేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల ఉద్రిక్తతల సమయంలో పౌర ఆవాసాలతోపాటు, మన సరిహద్దులపైకి దాడులకు పాల్పడిన పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన బీఎస్ఎఫ్ బలగాలను ఆయన ప్రశంసించారు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న సమయంలో సైతం ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ, ముందుగానే కచ్చితమైన సమాచారంతో విజయవంతంగా దాడులను పూర్తి చేయగలమని బీఎస్ఎఫ్ రుజువు చేసిందన్నారు. ఎడారులు, పర్వతప్రాంతాలు, అడవులు, కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అచంచలమైన అంకిత భావంతో పనిచేస్తూ దేశానికి మొదటి రక్షణ శ్రేణిగా సేవలందిస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం జమ్మూ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో మంత్రి పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అమర్నాథ్ యాత్రకు చేపట్టిన ఏర్పాట్లు, జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఇటీవల పాక్ కాల్పులతో పూంఛ్ జిల్లాలో నష్టపోయిన సరిహద్దు ప్రాంతాల వాసులతో మాట్లాడారు. జవాన్లతో స్వయంగా ముచ్చటించారు. -
ఉగ్రవాద విష సర్పాన్ని నలిపేస్తాం
కారాకాట్/కాన్పూర్: ఉగ్రవాదం ఒక విష సర్పమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది మరోసారి మనవైపు తల ఎత్తిచూస్తే, కలుగులోంచి బయటకు లాగి, కాలితో నలిపి చంపేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న కుట్రదారుల స్థావరాలను మన సైనిక దళాలు శిథిలాలుగా మార్చేశాయని చెప్పారు. మన అమ్ములపొదిలో ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక బాణం అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం ఆగదని, ఆపే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. శుక్రవారం బిహార్‌లోని కరాకాట్ పట్టణంలో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,600 కోట్ల విలువైన 15 మెగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులకు సరి్టఫికెట్లు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రెండుచోట్లా బహిరంగ సభల్లో ప్రసంగించారు. గత నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే బిహార్‌లోని మధుబని జిల్లాలో పర్యటించానని, ముష్కరులను కలలో కూడా ఊహించలేని రీతిలో శిక్షిస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చానని గుర్తుచేశారు. ఆ మాట నిలబెట్టుకొని, మళ్లీ బిహార్‌లో అడుగు పెట్టానని పేర్కొన్నారు. మన ఆడబిడ్డలు ధరించే సిందూరం శక్తి ఏమిటో పాకిస్తాన్‌తోపాటు మొత్తం ప్రపంచం చూíసిందన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... అణు బాంబులకు భయపడం ‘‘పాకిస్తాన్ సైన్యం రక్షణలో భద్రంగా ఉన్నట్లు ఉగ్రవాదులు భావించేవారు. కానీ, వారిపై దాడిచేసి మోకాళ్లపై నిలబెట్టాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక కేంద్రాలను ధ్వంసం చేశాం. ఇది నవ భారతం. మన శక్తి ఏమిటో అందరికీ తెలుస్తోంది. ఉగ్రవాదులకు మరింత బాగా అర్థమవుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాడుతూ అమరుడయ్యాడు. బీఎస్ఎఫ్ జవాన్లు దేశమాత సేవలో తరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ ఆయుధ బలాన్ని, మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రదర్శించాం. బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, విధ్వంసం సృష్టించాయి. మనం కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక యుద్ధం ఆపాలంటూ పాకిస్తాన్ వేడుకుంది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు. అణు బాంబులకు భారత్ భయపడదు. శత్రువుల వద్దనున్న అణ్వాయుధాలను బట్టి నిర్ణయాలు తీసుకొనే రోజులు పోయాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ముష్కరులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో సైనికులే నిర్ణయించుకుంటారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను ఇకపై ఒక్కటిగానే పరిగణిస్తాం. మావోయిజం అంతమయ్యే రోజు దగ్గర్లోనే.. దేశానికి శత్రువులైన వారందరిపైనా మన పోరాటం కొనసాగుతోంది. వారి సరిహద్దులో ఉండొచ్చు లేదా దేశం నడి»ొడ్డున ఉండొచ్చు. హింస, అశాంతిని ప్రేరేపించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో నక్సలైట్ల అరాచకాల వల్ల బిహార్ ప్రజలు భయంభయంగా బతికారు. నక్సలైట్ల కారణంగా అభివృద్ధి ఆగిపోయింది. పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. రోడ్లు వేస్తున్న కారి్మకులను కూడా హత్య చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పట్ల నక్సలైట్లకు ఏమాత్రం విశ్వాసం లేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచి్చన తీవ్రవాద నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మా కృషి ఫలితంగా దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి 18కి పడిపోయింది. రోడ్లు నిర్మిస్తున్నాం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మావోయిజం పూర్తిగా అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. శాంతి, సౌభాగ్యం, విద్య ప్రతి గ్రామానికీ చేరుకుంటాయి’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘పహల్గాం’ బాధిత కుటుంబానికి పరామర్శ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి పరామర్శించారు. కాన్పూర్‌లోని చాకేరి ఎయిర్‌పోర్టులో వారిని కలుసుకున్నారు. మోదీని చూసి వారంతా బోరున విలపించారు. ఈ సందర్భంగా మోదీ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆందోళన వద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని శుభం ద్వివేది కుటుంబానికి భరోసా కల్పించారు. -
‘వారికి నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టాం’
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టామన్నారు మోదీ. ఈ రోజు(శుక్రవారం) యూపీలోని కాన్పూర్ పర్యటనలో భాగంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ఆపరేషన్ సిందూర్.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. బ్రహ్మోస్ క్షిపణి తరహా రక్షణ వ్యవస్థ కల్గిన మనదేశ సామర్థ్యంతో పాక్ ను చావుదెబ్బ కొట్టాం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ మూలాల్లోకి పోయి మరీ విధ్వంసం సృష్టించాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగంతో పాక్ కు ఊపిరి సలపలేదు. ఇది భారత్ దేశ శత్రువులకు ఒక హెచ్చరిక లాంటిది. మమ్మల్ని తక్కువ అంచనా వేసే వారికి కూడా ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఆరంభం మాత్రమే.. ఇది ఇంకా ముగిసిపోలేదు. దీన్ని మరిచిపోవద్దు’ అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ పాత కాలంలో రాష్ట్ర, రాష్ట్రేతర సంస్థల మధ్య తేడాను చూపించే ఆట ఇకపై పనిచేయదు’ అని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. -
‘రాహుల్‌కు వయసు పెరిగినా.. మెచ్యూరిటీ మాత్రం రాలేదు’
ఢిల్లీ : పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భాగంగా భారత సైన్యం సామర్ధ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు.. దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్‌కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం నిజంగా సిగ్గచేటన్నారు. ఈరోజు(శుక్రవారం) ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘రాహుల్ అడగాల్సింది.. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి అని కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని.. రాహుల్ రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏళ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడే మియా మాటలకు వత్తాసుగా, చోటే మియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల బృందాలు .. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారు. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియచేస్తున్నారు. రాహుల్, రేవంత్ ల మాటలను దేశ ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో రేవంత్ మూడు రోజులు ఉన్నా.. రాహుల్ దర్శనం దక్కలేదు.. అవమానానికి గురై వెనక్కి పోయారు. భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గందేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. రాహుల్ ప్రధాని అయి ఉంటే.. పీఓకేను స్వాధీనం చేసుకుంటారు అని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జన్మలో రాహుల్‌కు ప్రధాని అయ్యే అవకాశం రాదు. పాక్ ఎటువంటి దాడులు చేసినా, మోదీ సర్కార్ ఊరుకోలేదు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాంకాంగ్రెస్ హయంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయి. రాహుల్ దుర్బుద్ధి తో మాట్లాడుతున్నారు. మనదేశం పాక్, చైనాలతో యుద్ధం వచ్చినా.. ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ప్రజలందరూ రాజకీయాలు.. కులాలు.. మతాలు పక్కన పెట్టీ ఒక్కటిగా నిలబడ్డారుపహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలంతా ఆకాక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం,. ఆపరేషన్ సింధూర్ ఎవరికి తెలియని సంఘటన కాదు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ లో 23 నిమిషాల్లో.. పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. పాక్ ప్రదానితో కూడా ఒప్పుకున్నారు. పాక్ పై చేసిన దాడుల వీడియోలు ప్రపంచం ముందు సైన్యం పెట్టింది’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్‌కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్‌ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్‌లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్‌ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా! -
మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ
పాట్నా: పహల్గాం నిందితుల్ని మట్టిలో కలిపేస్తానని ఆరోజు మాట ఇచ్చా.. ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదాల్ని హతమార్చాం’ అని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి బీహార్‌లో పర్యటించిన సమయంలో మీకు హామీ ఇచ్చా. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది. వాళ్ల వెనకున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని. మీకు మాట ఇచ్చినట్లుగా ఆపరేషన్ సిందూర్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. ఆ నాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని బీహార్ గడ్డపై అడుగుపెట్టా. #WATCH | Karakat, Bihar | Prime Minister Narendra Modi says, "... Pakistan and the world have seen the power of India's daughters' Sindoor... The world has seen the unprecedented valour and courage of the BSF during Operation Sindoor... While performing the sacred duty of serving… pic.twitter.com/38eFvCPtww— ANI (@ANI) May 30, 2025ఆపరేషన్ సిందూర్‌లో మన దళాలు నిమిషాల వ్యవధిలో మెరుపు వేగంతో వారిని అణిచేశాయి. పాక్ ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేయడమే కాదు, నిమిషాల వ్యవధిలోనే పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాయి. పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్ పవర్‌ని చూశాయి. ఉగ్రవాదంపై మా పోరు ఆగదు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుంది. చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయి. ఇది నయా భారత్. ఇదే భారత్‌కు కొత్త బలం అని పునరుద్ఘాటించారు.ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేస్తాం.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీహార్‌లో ప్రధాని మోదీ ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం.శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు. -
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపై పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ స్పందించారు. సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.పాకిస్తాన్లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ.. రెడ్‌లైన్ అనేది పాకిస్తాన్ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.గత నెల ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ ఆటకట్టించేందుకు ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్ 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది. అదే సమయంలో భారత్- పాక్ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది. తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. -
కాంగ్రెస్‌కు హార్ట్ బ్రేక్.. ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయం.. హస్తం నేత వ్యాఖ్యలు
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ముందు వరుసలో ఉండగా.. ఇక, తాజాగా ఆ లిస్టులోకి కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా చేరిపోయారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆయన ప్రశంసించడంతో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 విషయమై ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దౌత్య బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అభినందనీయం. ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి జమ్ముకశ్మీర్ వేరుగా ఉందనే భావన చాలా కాలంగా ఉంది. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసింది. దీంతో, జమ్ముకశ్మీర్ కూడా భారత్‌లోని ప్రాంతమనే భావన ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉంది. ఇది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఇదిలా ఉండగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ చేసిన తర్వాత కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు తప్పుబట్టారు. ఆర్టికల్ 370ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ రద్దు కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రత్యేక హక్కులు కోల్పోతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. -
ఆపరేషన్ సిందూర్ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు
న్యూఢిల్లీ: మూడు రోజులు. రేయింబవళ్లు. రెండు పోస్టులు. ఏడుగురు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత మహిళా బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సైన్యం జడుసుకుంది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం మహిళా బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆపరేషన్ సిందూర్ గురించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక ఆపరేషన్ సిందూర్‌లో క్రితం బీఎస్ఎఫ్లో చేరిన అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో ఆరుగురు మహిళా బీఎస్ఎఫ్ జవానులు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ దళాలపై నేరుగా కాల్పుల్లో పాల్గొన్నారు. అఖ్నూర్‌లోని రెండు ఫార్వర్డ్ పోస్టులు, పాకిస్తాన్‌కు చెందిన సియోల్‌కోట్ ప్రాంతంలోని శత్రు పోస్టులపై మూడు రోజులు, మూడు రాత్రుల పాటు జరిపిన నిర్విరామంగా జరిపిన కాల్పులకు ఎదురొడ్డి ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. పాక్ సైన్యం చేస్తున్న కాల్పులకు ప్రతిఘటిస్తూ.. డ్రోన్లు, మోర్టార్ షెల్స్‌ను కూల్చేశారు. కాల్పుల ధాటికి కేవలం 150 మీటర్ల దూరంలో శత్రు దళాలు వెనక్కి తగ్గాయి. తమ స్థావరాల్ని వదిలి వెళ్లాయి. ఈ ఆరుగురిలో నలుగురు 2023లోనే బీఎస్ఎఫ్లో చేరారు. మంజీత్ కౌర్, మల్కీత్ కౌర్ వీళ్లద్దరు పంజాబ్‌కు చెందిన వారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఫార్వర్డ్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించగా, బీఎస్ఎఫ్లో కొత్తగా చేరిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న రాథ్, శాంపా బసాక్, ఝార్ఖండ్‌కు చెందిన సుమి జెక్స్, ఒడిశాకు చెందిన జ్యోతి బనియన్లు శత్రు దాడిని తిప్పికొట్టారు.ఈ సందర్భంగా నేహా భండారి మాట్లాడుతూ.. మాకు శిక్షణ పురుష జవాన్లతో సమానంగా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో పురుష సైన్యానికి సమానంగా శత్రువులను ఎదుర్కొనేందుకు అవకాశంగా భావించాం. దాయాది సైన్యాన్ని నిలువరించాం. మా తాత, అమ్మా,నాన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు దేశం కోసం పనిచేసేందుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం వీరి ధైర్య సాహసాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
ఆ వీడియో చూసి సిగ్గనిపించడం లేదా?
కోల్‌కతా: మధ్యప్రదేశ్ బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ‘మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనను చూసి మీకు సిగ్గనిపించడం లేదా? వీధిలోనే బ్లూ ఫిల్మ్ చూపినట్లుగా ఉంది’అని గురువారం ఆమె మీడియా ఎదుట విమర్శలు చేశారు. మందసౌర్‌కు చెందిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధాకడ్ ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిపి ఉంచిన వాహనంలో మహిళతో అభ్యంతరకరంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అతడు స్థానిక పంచాయతీ సమితి సభ్యురాలి భర్త అనీ, తమ పార్టీ సభ్యుడు కాదని బీజేపీ అంటోంది. అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ తరహాలో ఆపరేషన్ బెంగాల్ చేపడతామంటూ ప్రధాని మోదీ సభలో బీజేపీ నేతలు ప్రకటించడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు విచారకరం, అవి విని షాకయ్యామని మమత పేర్కొన్నారు. ‘ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు బెంగాల్ మహిళలను అవమానించారు. మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. కానీ, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేం. ఆ మాట అనడానికి ఆ నేతలకు ఎంత ధైర్యం?’అంటూ మండిపడ్డారు. ‘మహిళలంటే కనీస గౌరవం కూడా లేని నాయకుల పార్టీ బీజేపీ. ఆపరేషన్ సిందూర్‌పై నేనేమీ మాట్లాడలేను. మహిళలను గౌరవించాలనే విషయం గుర్తుంచుకోండి. మహిళలు తమ భర్తల నుండి సిందూరం తీసుకుంటారు. కానీ, ప్రధాని మోదీ ప్రతి స్త్రీకి భర్త కాదు. ప్రధాని మోదీ ఆయన శ్రీమతికి సిందూరం ఎందుకివ్వలేదు?’అని ఆమె నిలదీశారు. ఆపరేషన్ సిందూర్‌తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పహల్గాం ఘటనకు కారకులైన ముష్కరులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేదని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అంతకుముందు, ప్రధాని మోదీ పాల్గొన్న సభలో బీజేపీ బెంగాల్ చీప్, కేంద్ర మంత్రి సుకాంద మజుందార్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ తరహాలో ఆపరేషన్ బెంగాల్ చేపట్టాలి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని బంగాళాఖాతంలో విసిరేయాలి’అంటూ పిలుపునివ్వడం గమనార్హం. -
ఆపరేషన్ సిందూర్ ఆగదు: ప్రధాని మోదీ
గాంగ్టక్/అలీపూర్‌ద్వార్: ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులకు తగిన గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ఆగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తేల్చిచెప్పారు. ముష్కర మూకలను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టడం ఖాయమని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బిహార్‌లో పర్యటించారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి భారతీయ ఆత్మ, ఐక్యత, మానవత్వంపై జరిగిన దాడిగా ప్రధాని అభివర్ణించారు. ఈ దాడి పట్ల నిర్ణయాత్మకంగా స్పందించామని, ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ముష్కరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలు, వైమానిక కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో మనదేశం మొత్తం ఐక్యంగా ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో కుట్రపూరితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ప్రధాని ఆరోపించారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే చివరకు ఏం జరుగుతుందో చేసి చూపించామని స్పష్టంచేశారు. సిక్కిం రాష్ట్రం భారత్‌కు గర్వకారణమని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని ప్రశంసించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ వేడుకలకు తాను స్వయంగా హాజరు కాలేకపోవడం బాధగా ఉందన్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిన పాకిస్తాన్ భూభాగంలోకి మూడుసార్లు ప్రవేశించి దాడులు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ జిల్లాలో రూ.1,010 కోట్ల విలువైన సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ఆయన పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించారు. బెంగాలీ సంస్కృతికి సిందూర్‌తో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. దుర్గా పూజ సమయంలో ఇక్కడి మహిళలు ‘సిందూర్ ఖేలా’ వేడుక నిర్వహించుకుంటారని తెలిపారు.బెంగాల్లో రాక్షస పాలన పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో హింస, అవినీతి పెచ్చుమీరిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఇక్కడ చట్టబద్ధమైన పాలన ఉందా? అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు సంక్షోభాల్లో చిక్కుకున్నారని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు బెంగాల్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.పాట్నాలో మోదీ భారీ రోడ్ షో బెంగాల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బిహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నా ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త సివిల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం పాట్నాలో భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని అరణ్య భవన్ నుంచి బీర్చంద్ పటేల్ మార్గ్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దాకా ఈ రోడ్‌షో జరిగింది. శుక్రవారం బిహార్, ఉత్తరప్రదేశ్‌లో పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. -
మేల్కొనేలోపే మెరుపుదాడి చేసింది
లాచిన్(అజర్బైజాన్): భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేసిన వైమానిక దాడులకు దీటుగా స్పందించేలోపే భారత్ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతుందని తాము ఊహించలేదని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. అజర్బైజాన్ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్ గురువారం లాచిన్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సిందూర్ సంగతులను అందరితో పంచుకున్నారు. ‘‘ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేసిన దాడులకు స్పందనగా ప్రతీకార దాడులతో తెగబడాలని నిర్ణయించాం. మే 9వ తేదీ అర్ధరాత్రి దాటాక ఇందుకు ప్రణాళిక సిద్ధంచేశాం. తెల్లవారు జామున 4.30 గంటలకు ఫజర్ ప్రార్థనల తర్వాత దాడి చేయాలని భావించాం. కానీ ఆలోపే భారత్ బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. వేర్వేరు ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై క్షిపణిదాడులు జరిగాయి. రావల్పిండిలోని ఎయిర్పోర్ట్ సైతం దాడులకు ధ్వంసమైంది’’ అని షెహబాజ్ చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎదుటే ఈ దాడుల అంశాన్ని షెహబాజ్ ప్రస్తావించడం గమనార్హం. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థావరం పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ అత్యంత అధునాతన లాక్‌హీడ్ సీ–130 హెర్క్యులస్, ల్యూషిన్ ఐఐ–78 ఇంధనం నింపే విమానాలు ఉన్నాయి. -
ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్
భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్థాన్.. పచ్చి అబద్ధాలతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదంటూ బీరాలు పలికిన పాక్.. నిజాలను ఒక్కొక్కటిగా ఒప్పుకుంటోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ (Shehbaz Sharif) భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు.భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిదని.. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందంటూ షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్‌లో పర్యటిస్తున్న షెహ్బాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారత్‌పై దాడి చేయాలని పాక్ ప్లాన్ చేసింది. అయితే, పాకిస్తాన్ చర్య తీసుకునే ముందే భారత్ మరో బ్రహ్మోస్‌ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని షెహ్బాజ్ చెప్పుకొచ్చారు. కాగా, దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని మూడు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్‌తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది. -
ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్ ర్యాలీలో ఉగ్రవాది
ఇస్లామాబాద్: మిని స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా కమాండర్ సయిఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తేలింది. సైఫుల్లా కసూరి మరోవెరో కాదు లష్కరే తోయిబా చీఫ్,భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకే.పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ నాయకులే కాదు సయిఫుల్లా కసూరి, ఇతర మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టులు సైతం పాల్గొన్నారు.Lashkar-e-Taiba (LeT) chief Hafiz Saeed's son with Pak Punjab Assembly MLAs openly inciting violence against India.Does anyone need more proof that Pakistan is a rogue state ? pic.twitter.com/NCtLXJTtxd— Zubair Alvi (@Alvi_Zubair45) May 29, 2025పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ,‘పహల్గామ్ ఉగ్ర దాడి సూత్రదారి నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోంది’ అంటూ భారత్‌కు వ్యతిరేకంగా స్లోగన్లు వినిపించారు.ఈ ర్యాలీలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ సైతం ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ను చావుదెబ్బ తీసింది. పాకిస్తాన్లో ఉగ్రమూకలకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లను భూస్తాపింతం జరిగింది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు.తాజాగా, కసూర్ ర్యాలీలో మాట్లాడిన సైఫుల్లా కసూరి పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో ఆస్పత్రులు, భవనాలు నిర్మిస్తామని చెప్పడం గమనార్హం. -
అన్నా యుద్ధం చెయ్.. అన్నీ నేనందిస్తా
చండీగఢ్: జనం కేవలం బాంబు శబ్దం వినపడితేనే ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతారు. అదే బాంబులు పడుతుంటే అసలు కనుచూపు మేరలో జనం కనపించరు. కానీ పదేళ్ల బాలుడు కాల్పుల మోతకు ఏమాత్రం భయపడకుండా తాపీగా వచ్చి భారత సైనికులకు ఛాయ్, లస్సీ, మంచినీళ్లు.. ఇలా చిరు ఆహార పదార్థాలు ఇచ్చి ఔరా అనిపించాడు. బాలుడి ధైర్యసాహసాలు మెచ్చి భారత ఆర్మీ సత్కరించింది. 7వ ఇన్ఫ్యాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అయిన మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ స్వయంగా గ్రామానికి వెళ్లి బాలుడిని అభినందించారు. పాకిస్తాన్ సైనికులకు తూటాలతో జవాబు చెప్తూ యుద్ధంలో మునిగిపోయిన భారత సైనికులకు తాగునీరు, తేనీరు, పాలు, లస్సీ, ఐస్ అందించిన ఈ అబ్బాయి పేరు శ్రవణ్ సింగ్. వయసు కేవలం పదేళ్లు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్దోత్ పరిధిలోని తారావాలీ గ్రామం ఇతని స్వస్థలం. ఈ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. దీంతో ఆపరేషన్ సిందూర్ వేళ ఈ గ్రామంపైనా పాకిస్తాన్ కాల్పుల మోత మోగించింది. గ్రామంలో శ్రవణ్‌సింగ్ కుటుంబానికి కొంత సాగుభూమి ఉంది. ఇక్కడ మొహరించిన భారత సైనికులు పాక్ కాల్పులకు దీటుగా బదులివ్వడం మొదలెట్టారు. తమ సొంతస్థలంలోకి సైనికుల వచ్చారని తెల్సుకుని శ్రవణ్ వాళ్లకు ఏదోలా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లాస్్కలో చాయ్‌తో పాటు తాగడానికి టీ గ్లాసులు పట్టుకెళ్లి ఇచ్చాడు. పాలు, లస్సీ, మంచినీళ్లు, ఐస్ కూడా అందించాడు. సైనికులకు సాయపడిన బాలుడిని అంతా మెచ్చుకున్నారు. పెద్దయ్యాక సైనికుడినవుతా అని పిల్లాడు బదులిచ్చాడు. ‘‘మా వాడిని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. ఇక సైనికుల సంగతి చెప్పనక్కర్లేదు. మా వాడిని తెగ మెచ్చుకున్నారు’’అని బాలుడి తండ్రి ఆనందంతో చెప్పారు. ‘‘సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు కొత్తగా దేశభక్తి నూరిపోయాల్సిన పనిలేదు. చిన్నతనం నుంచే నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది’’అని ప్రముఖులు వ్యాఖ్యానించారు. -
‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘చేయాలనుకుంటే మనం ఇంకా ఎక్కువే చేయగలం. అయితే ప్రపంచానికి సంయమనం అనే సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వెనుకకు తగ్గాం. ఒక ఉదాహరణగా నిలిచాం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోమారు పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ, భారతదేశం సంయమనంలో మెలిగిందని, మన సైన్యం ప్రపంచం ఎదుట వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు (గురువారం) న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భద్రత, స్వావలంబనలోని ద్వంద్వ లక్ష్యాలను నొక్కిచెప్పారు, భారతదేశ రక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను ఆయన ప్రశంసించారు. తాము మొదట ఉగ్రవాద స్థావరాలను, ఆపై శత్రువుల సైనిక స్థావరాలను, వైమానిక స్థావరాలను ఎలా నాశనం చేశామనేది అందరూ చూశారన్నారు. మనం ఇంకా ఎక్కువ చేయగలిగినప్పటికీ సంయమనం పాటించామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారతదేశం నుంచి వచ్చిన సైనిక ప్రతిస్పందన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక కొలత కలిగిన నిర్ణయాత్మక దాడి రాజ్‌నాథ్ అన్నారు.భవిష్యత్‌లో పాక్‌తో ఎప్పుడు చర్చలు జరిగినా అవి ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(Pakistan-occupied Kashmir) గురించి మాత్రమే ఉంటాయి. పాకిస్తాన్‌తో మరే ఇతర అంశంపై చర్చ ఉండదని రాజ్‌నాథ్ ప్రకటించారు. పీఓకే ప్రజలు మన కుటుంబ సభ్యులు. భౌగోళికంగా, రాజకీయంగా మన నుండి వేరయిన మన సోదరులు, ఏదో ఒక రోజు వారు ఖచ్చితంగా భారత ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని గట్టిగా నమ్ముతున్నామని రాజ్‌నాథ్ అన్నారు. దశాబ్దాలుగా విడిగా ఉంటున్నప్పటికీ, పీఓకే-భారత ప్రజల మధ్య భావోద్వేగ , సాంస్కృతిక బంధం బలంగా ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
ఆపరేషన్ షీల్డ్ వాయిదా
న్యూఢిల్లీ: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ(మే 29న) సాయంత్రం చేపట్టాల్సిన ఆపరేషన్ షీల్డ్(Operation Shield) వాయిదా పడింది. గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే.. పాలనాపరమైన కారణాల వల్ల దానిని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రయత్నది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు.. మే 7వ తేదీన తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి సాయంత్రం 5గం.లకు గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో రెండోసారి నిర్వహించాలనుకున్నాయి. అయితే..హర్యానా తప్పించి మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రానికే హోం శాఖ ప్రకటించింది. కానీ, హర్యానా కూడా వాయిదాకే మొగ్గు చూపించడంతో తాజా ప్రకటన చేశారు. అధికారిక కారణాల వల్ల మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని కేంద్ర హోం శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం.. భద్రతా బలగాలు వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఇందులో ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. చివరిసారిగా.. 1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్‌లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అవి సరిహద్దు జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి.ఇదీ చదవండి: శాంతిని మేం బలంగా కోరుకుంటున్నాం-పాక్ ప్రధాని -
Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు
గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్‌కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్‌రాజ్ అన్నారు. ‘‘1965లో భారత్ పాకిస్థాన్‌లోని లాహోర్ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్‌లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్‌రాజ్ పోస్ట్ చేశారు.My dear @ShashiTharoor Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025కాంగ్రెస్ నేత పవన్‌ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్ మీద పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్‌కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.థరూర్ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. బీజేపీ మద్దతుగా.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్‌పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్‌కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్ రిజిజు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు.. What does the Congress party want & How much they really care for the country? Should the Indian MPs go to foreign nation and speak against India and its Prime Minister? There’s limit to political desperation! https://t.co/JiuYqpW2tN— Kiren Rijiju (@KirenRijiju) May 28, 2025బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్‌కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు. "పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది! -
ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్) -
రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ఎత్తున పాకిస్తాన్ తన సైన్యాన్ని భారీ ఎత్తున మొహరించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. రేపు (మే29న) పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో మాక్ డ్రిల్‌ను నిర్వహించనుంది. అయితే, మాక్ డ్రిల్ జరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసింది. The grand welcome for the #PakistanArmy in Pakistan Occupied Jammu & Kashmir. pic.twitter.com/znELGTYUN7— Lt Col Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) May 27, 2025 ఇదే తరహా మాక్ డ్రిల్ ఈ నెల ప్రారంభంలో జరిగింది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 6, 7 తేదీల మధ్య పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. BIG BREAKING NEWS 🚨 India to conduct mock drills tomorrow in 4 states, UT.Mock drills will be conducted in Gujarat, Rajasthan, Punjab, and Jammu and Kashmir tomorrow.The drills will be held in districts bordering Pakistan.This comes weeks after India launched ‘Operation… pic.twitter.com/GbWJkDB1nr— Times Algebra (@TimesAlgebraIND) May 28, 2025 భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు, మే 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్‌ను నిర్వహించించింది. ఆపరేషన్ అభ్యాస్ కొన్ని వారాల తర్వాత ఈ గురువారం పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. కాగా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ఉద్దేశం. ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిలటరీ ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ముందు కంటే 1971లో పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడం, అంతకుముందు 1962,1965 యుద్ధ సమయంలో మాక్ డ్రిల్ జరిగింది. మళ్లీ దాదాపూ 50ఏళ్ల తర్వాత పౌరుల భద్రత దృష్ట్యా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌కు ముందు మాక్ డ్రిల్స్ చేపట్టింది. -
Operation Sindoor: శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన భారత ఆర్మీ
-
OP Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్ గట్టి దెబ్బ
పహల్గాం దాడికి ప్రతీకారంగా.. ఉగ్ర శిబిరాల నాశనమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించి తాజాగా మరికొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి.తాజా శాటిలైట్ ఫొటోల ప్రకారం.. మురిద్ ఎయిర్‌బేస్(Murid Airbase) లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు’’ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు డామియన్ సైమన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.This report spotlights damage at Pakistan’s Murid Airbase - the Indian Air Force strike has caused structural damage to a Command & Control building, a section of the roof has collapsed as well, likely causing internal damage @TheIntelLab #Skyfi pic.twitter.com/k7O4FO0tKS— Damien Symon (@detresfa_) May 26, 2025 ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో.. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు(Pahalgam Terror Attack). ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ‘‘ఆపరేషన్ సిందూర్’’ను భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి నాశనం చేశాయి.మురిద్ కీలకమేఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత సాయుధ దళాలు పాక్ పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం, భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు ఎంతో కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్థాన్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్తార్ టీబీ2ఎస్, బేరక్తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.A review of Nur Khan Airbase, Pakistan reveals the entire complex near India's strike location has now been demolished, suggesting the strike’s effect went beyond the two special-purpose trucks - possibly presenting a broader footprint of the damage @TheIntelLab #SkyFi pic.twitter.com/gUhqG3nemL— Damien Symon (@detresfa_) May 25, 2025ఇక.. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్థాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో.. భారత్ దౌత్య యుద్ధం ప్రారంభించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదంపై పోరును ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపింది.మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. అక్కడ దేశీయంగా రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు. శత్రు దేశాలు ప్రయోగించే మానవ రహిత వైమానిక వ్యవస్థను అడ్డుకోవడానికి సరికొత్త డ్రోన్లు, ఆయుధాలను భారత్ రూపొందించింది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ -
ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF
-
12 టీబీ డాటా డిలీట్ చేసి.. ఐఎస్ఐ ఏజెంట్లతో ముచ్చట్లు
పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఐఎస్ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..జ్యోతి వ్యక్తిగత డివైజ్‌లను(ఫోన్లు, ల్యాప్‌ట్యాప్) పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్‌ల్లో భారీగా మెసేజ్‌లు, డాటా డిలీట్ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లోగింగ్ చానెల్ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్‌లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి.. అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్‌లో ఆమె అసలు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు! -
‘సిందూర్’పై అరగంట తర్వాతే పాక్‌కు సమాచారం: జైశంకర్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ మొదలైన అరగంట తర్వాతే దాని గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచి్చనట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఆయన సారథ్యంలో పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సోమవారం సమావేశమైంది. పహల్గాం దాడికి తెగబడ్డ ఉగ్ర మూకల పీచమణచేందుకు చేపట్టిన ఆ ఆపరేషన్‌తో పాటు పాక్ సీమాంతర ఉగ్రవాదం తదితరాలపై చర్చించింది. అన్ని పారీ్టల ఎంపీలూ భేటీలో పాల్గొన్నారు. ‘‘సిందూర్ గురించి ఆపరేషన్ మొదలైన అరగంటకు పాక్‌కు సమాచారమిచ్చాం. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టం చేశాం’’అని మంత్రి వెల్లడించారు. సైనిక చర్య గురించి పాక్‌కు జైశంకర్ ముందే సమాచారమిచ్చారని విపక్ష నేత రాహుల్‌గాంధీ కొద్దిరోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇలా స్పష్టతనివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏ మాత్రమూ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత డీజీఎంఓకు పాక్ డీజీఎంఓ విజ్ఞప్తి చేసిన కారణంగానే ఒప్పందం కుదిరిందని పునరుద్ఘాటించారు. ‘‘పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మనకు సమాచారమిచ్చారు. అదే జరిగితే అంతే స్థాయిలో వాళ్లకు బదులిస్తామని చెప్పాం’’అన్నారు. సిందూర్ అనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ నడుమ అణుయుద్ధం తరహా పరిస్థితి నెలకొందన్న వాదన పూర్తిగా సత్యదూరమని జర్మనీ వార్తాపత్రిక ఫజ్కు ఇచి్చన ఇంటర్వ్యూలో జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్ ఓ వ్యాపారంగా బాహాటంగా నిర్వహిస్తోందంటూ నిప్పులు చెరిగారు. పాక్ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదానికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తూ పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. -
వాళ్లకు టెర్రరిజమే టూరిజం
భుజ్/వడోదర: ఆపరేషన్ సిందూర్‌తో భారత ఆర్మీతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, పాలకులకు బుద్ధిచెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ దేశ ప్రజలకూ హితవు పలికారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వం, సైన్యానికి ఆదాయ వనరుగా మారిందని, ఇకనైనా మీరు మేల్కొనాలని పాక్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం గుజరాత్లో సోమవారం పర్యటించిన ప్రధాని మోదీ దాహోద్, భుజ్, గాం«దీనగర్లలో రూ.82,950 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశాక భుజ్, దాహోద్‌లలో బహిరంగ సభల్లో ప్రస ంగించారు. పాక్ సరిహద్దులోని కఛ్ జిల్లాలోనూ మోదీ పర్యటించారు. ‘‘భారత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే పర్యాటకంలా ప్రోత్సహిస్తోంది. పాక్ ఈ తరహా పంథా కేవలం వాళ్లనే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. పాకిస్తాన్ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. మీ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకనైనా ఉగ్రవాదానికి అంతం పలికేందుకు మీరంతా ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంత జీవనం గడపండి. కడుపారా తినండి. రోటీ కావాలో మా తూటా కావాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఒక్కటే అడగదల్చుకున్నా. మేం 11 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు జపాన్ను దాటేసి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి మీరేం సాధించారు?. మీ పరిస్థితేంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రభుత్వాలు, సైన్యం మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి సరైందో కాదో యువతే నిలదీయాలి. మిమ్మల్ని ఆర్మీ, పాలకులు అంధకారంలోకి నెట్టేస్తున్నారు’’అని మోదీ పాక్ ప్రజలకు హితవు పలికారు. పక్షం రోజులు వేచి చూశా ‘‘పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కఠిన చర్యల కత్తి పట్టుకుంటుందేమోనని 15 రోజులపాటు వేచి చూశా. కానీ ఉగ్రవాదమే పాకిస్తాన్‌కు తిండిపెడుతోందని స్పష్టమైంది. అందుకే పాక్‌పై దాడులకు మా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. మే 9న భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడులకు తెగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దాడి చేసి మేం పాక్ వైమానిక స్థావరాలను నేలమట్టంచేశాం’’అని మోదీ అన్నారు. తర్వాత మోదీ 1971లో పాక్ బాంబుదాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌ఫీల్డ్‌ను 72 గంటల్లో పునర్నిర్మించిన మధాపార్ గ్రామంలోని 300 మంది మహిళలతో మోదీ మాట్లాడారు. వీళ్లు మోదీకి సిందూర్ మొక్కను బహూకరించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీనిని నాటుతానని మోదీ చెప్పారు.మూడు రోడ్‌షోలు తొలుత గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం మోదీ ఏకంగా మూడు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉదయం వడోదరలో భారీ రోడ్‌షో చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించి దేశం దృష్టిని ఆకర్షించిన కల్నల్ సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, కవల సోదరి షాయనా సున్సారా కూడా ఈ రోడ్‌షోలో పాల్గొనడం విశేషం. ఖురేషి స్వస్థలం వడోదరే. రోడ్ షో సందర్భంగా జనం జాతీయ జెండాలు చేతపట్టుకుని సైన్యాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. మోదీ కారు నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం భుజ్‌లో, అహ్మదాబాద్‌లో కూడా మోదీ రోడ్‌షోలు చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.82,950 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. -
ఇదెక్కడి విడ్డూరం.. ఇలా కూడా పరువు పొగొట్టుకుంటారా?
హుర్రే.. ఆపరేషన్ సింధూర్‌కి కౌంటర్‌గా ఆపరేషన్ భున్యన్తో భారత్‌పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఆపరేషన్ భున్యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్యన్ ఉన్ మర్సూస్తో తామూ భారత్‌పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ, అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్‌పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా! -
తుర్కియే అధ్యక్షుడితో పాక్ ప్రధాని భేటీ.. భారత్ గురించి చర్చ?
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌తో యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఆయుధపరంగా మద్దతు ఇచ్చినట్టు ఎర్డోగన్‌కు షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకున్నారు.తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక చర్చలు జరిపారు. అనంతరం, షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇస్తాంబుల్‌లో నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు ఎర్డోగన్‌ను కలిసే గౌరవం నాకు లభించింది. ఇటీవలి పాకిస్తాన్-భారత్ ప్రతిష్టంభనలో పాకిస్తాన్‌కు ఆయన దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని వేళలా ఎర్డోగన్ మాకు అండగా నిలిచారు. పాకిస్తాన్, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను.ఈ చర్చలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో రెండు దేశాల మధ్య బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించాం. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, రక్షణ రంగాలలో పురోగతులే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిఘా భాగస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత వంటి రంగాలలో సహకారంపై చర్చించాం. ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.Had the honor of meeting my dear brother President Reccep Tayipp Erdogan in Istanbul this evening. Thanked him for his resolute support to Pakistan in the recent Pakistan India standoff which resulted in Pakistan's overwhelming victory Alhamdolillah!Conveyed the sentiments of… pic.twitter.com/EEYxZdIf7g— Shehbaz Sharif (@CMShehbaz) May 25, 2025మరోవైపు, పాక్ ప్రధాని షరీఫ్‌తో చర్చలపై ఎర్డోగన్ స్పందిస్తూ..‘రెండు దేశాల మధ్య సోదరభావం, గౌరవం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇస్లామాబాద్‌కు మా పూర్తి మద్దతు కొనసాగుతుంది. తుర్కియే, పాకిస్తాన్ మధ్య ప్రతి రంగంలో చారిత్రక, మానవ, రాజకీయ సంబంధాలున్నాయి. వీటిని బలోపేతం చేయాలనేదే మా సంకల్పం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. భారత్-తుర్కియే మధ్య విభేదాలు నెలకొన్న వేళ.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలంటూ ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం మార్మోగుతోంది. -
పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ దీనికి ప్రతీకార చర్యగా ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)ను విజయవంతంగా చేపట్టింది. అయితే పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన దాడులపై కొందరు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హెచ్చరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దీనిలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీ నేతలు అన్ని అంశాలపై మాట్లాడకూడదని, అసవసర ప్రకటనలు చేయవద్దని సూచించారని తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’పై కొందరు బీజేపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం సంచలనంగా మారింది. ఇది పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం జరిగిన ఒక బహిరంగ సభలో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా(Madhya Pradesh Minister Vijay Shah) మాట్లాడుతూ సాయుధ దళాల ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరుకోగా, న్యాయమూర్తులు సదరు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విజయ్ షాను ‘ఉగ్రవాదుల సోదరి’ అని వ్యాఖ్యానించారు.ఇదేవిధంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలను విమర్శించారు. వారిలో వీరోచిత లక్షణాలు లేకపోవడం కారణంగానే బాధితులుగా మిగిలిపోయారని ఎంపీ వ్యాఖ్యానించారు. హర్యానాలోని భివానీలో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాంగ్రా మాట్లాడుతూ ‘భర్తలను కోల్పోయిన స్త్రీలలో యోధుల స్ఫూర్తి, ఉత్సాహం లేదని, వారు చేతులు ముడుచుకున్నందునే ఉగ్రవాదులు తెగబడ్డారని వ్యాఖ్యానించారు. పర్యాటకులు అగ్నివీర్ శిక్షణ పొందినట్లయితే కేవలం ముగ్గురు ఉగ్రవాదులు 26 మందిని చంపలేరని అన్నారు. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా, అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి శత్రువులతో పోరాడలేదా? మన సోదరీమణులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ సమాధానమిచ్చారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న