
శశిథరూర్ ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం తెర మీదకు వచ్చింది. సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ ఓ క్రిప్టిక్ పోస్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతోనే కావడం గమనార్హం.
ఆపరేషన్ సిందూర్ చర్చకు శశిథరూర్‌తో పాటు మనీశ్ తివారీని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందంటూ నిన్నంతా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. భారతీయుడిగా భారత్ మాటే చెబుతానని ఎక్స్‌లో పోస్టు చేశారాయన. మరోవైపు.. ప్రభుత్వానికి అనుకూలంగా థరూర్, తివారీ మాట్లాడతారనే ఆపరేషన్ సిందూర్ చర్చకు కాంగ్రెస్ దూరంగా ఉంచిందా? అనే కథనం తాలుకా కట్టింగ్‌ను షేర్ చేశారు. దానికి..
ప్రేమే జీవన మూర్తి అయిన దేశం.. ఈ దేశ గీతాలను నేను ఆలపిస్తాను.. నేను భారత్‌లో నివసించే ఒక భారతీయుడిని.. భారత్ మాటలు నేనే వినిపిస్తాను అంటూ అలనాటి బాలీవుడ్ చిత్రం ఉపకార్‌లోని దేశభక్తి పాట సాహిత్యాన్ని పోస్ట్ చేశారాయన.
है प्रीत जहां की रीत सदा
मैं गीत वहां के गाता हूं
भारत का रहने वाला हूं
भारत की बात सुनाता हूं
Hai preet jahaan ki reet sada
Main geet wahaan ke gaata hoon
Bharat ka rehne waala hoon
Bharat ki baat sunata hoon
- Jai Hind pic.twitter.com/tP5VjiH2aD— Manish Tewari (@ManishTewari) July 29, 2025
కాంగ్రెస్‌లో మనీష్ తివారి ట్వీట్ కలకలం రేపుతోంది. శశిథరూర్‌తో పాటే గతంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారీయన. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వైఖరికి అనుగుణంగా లోక్ సభలో మాట్లాడేందుకు ఈ ఇద్దరూ నిరాకరించినట్లు సమాచారం.