అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశ మ్యూజియంలో ఉన్న భారత్‌కు చెందిన పురాతన కాంస్య విగ్రహాలను తిరిగి స్వదేశానికి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ విగ్రహాలు అక్రమంగా ఆ దేశానికి చేరుకున్నాయని ఒప్పుకుంది.
వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యుజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్‌లో కీ.శ 990 నాటి శివనటరాజ విగ్రహాం,12వ శతాబ్ధపు నాటి సోమస్కంద, 16వ శతాబ్ధానికి చెందిన సుందరర్ అనే సాధువుకు చెంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి తమిళనాడుకు చెందినవి అయితే ఈ విగ్రహాలు దొంగతనంగా ఆ మ్యూజియానికి చేరాయని భారత్ వాదించింది. తిరిగి వాటిని తమ దేశానికి అప్పగించాలని కోరింది.
అయితే ఇంతకాలం తర్వాత అవి అక్రమంగా ఆ మ్యూజియానికి చేరినట్లు మ్యూజియం అధికారులు అంగీకరించారు. వాటిని తిరిగి భారత్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో భారతీయ శిల్పసంపద తిరిగి దేశానికి వస్తుంది.


