మీకు భీకరమైన దాడి ప్యాకేజ్‌ని చూపించబోతున్నాం: యూఎస్‌ఏ | Iran to face biggest strikes today America | Sakshi
Sakshi News home page

మీకు భీకరమైన దాడి ప్యాకేజ్‌ని చూపించబోతున్నాం: యూఎస్‌ఏ

Mar 19 2026 7:36 PM | Updated on Mar 19 2026 7:42 PM

Iran to face biggest strikes today America

పశ్చిమాసియా యుద్ధం మొదలై ఇప్పటికే మూడు వారాలు కాగా, ఈ పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుట లేదు.  అటు అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి తీవ్రతను పెంచగా, ఇరాన్‌ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఏ ఒక్క వర్గము వెనక్కి తగ్గడానికి ఆసక్తి చూపడం లేదు. 

ఆ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఇప్పటికే పలు రకాల సంక్షోభ పరిస్థితులు చోటు చేసుకోగా, ఇంకా యుద్ధ తీవ్రత ముదిరితే ఎటువైపుకు వెళుతుందోననే  ఆందోళన ప్రజల్లో కనబడుతోంది. అయితే   నాయకుల్లో మాత్రం  ఎటువంటి భయం కనపడకపోగా, యుద్ధాన్ని మేము ముగిస్తాం( మేమెంటో చూపిస్తాం) అంటే మేము ముగిస్తాం అని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌కు మరొకసారి తామేంటో చూపిస్తామని, అందుకు సిద్ధంగా ఉండాలని ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈరోజు(గురువారం) ఇరాన్‌  మరో భీకర యుద్ధాన్ని చూడబోతోంది. అది కూడా ఒక భారీ యుద్ధ ప్యాకేజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.  ఇరాన్‌లో 7,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై అమెరికా దాడి చేసింది. గురువారం అత్యంత పెద్ద యుద్ధ ప్యాకేజ్‌ను ఇరాన్‌కు చూపించబోతున్నాం. అది మునుపటి దానితో సమానంగా ఉంటుంది. కానీ అది మీ ఊహకు అందదు. మా సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఇరాన్‌వి తగ్గుతున్నాయి,  ఇప్పటికే ఇరాన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు సమూలంగా ధ్వంసమయ్యాయి’అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement