‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్‌ నిజాలు | Major escalation South Pars strike and why it matters | Sakshi
Sakshi News home page

‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్‌ నిజాలు

Mar 19 2026 6:18 PM | Updated on Mar 19 2026 6:32 PM

Major escalation South Pars strike and why it matters

ఇరాన్‌కు , ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సౌత్‌ పారిస్

చమురు కంటే వేగంగా మారుతున్న గ్యాస్‌ ధరలు

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ (South Pars) గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్  దాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. ప్రపంచ ఇంధన సరఫరా , ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత రాజేస్తోంది. అసలు సౌత్ పార్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత కీలకం?  తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  "నియంత్రించలేని పరిణామాలు" ఉంటాయని  హెచ్చరించిన ఇరాన్  అన్నంత పనీ చేస్తోంది.ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపం
అరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిక్షేపాల్లో ఒకటి. దీనిని ఇరాన్, ఖతార్ దేశాలు పంచు కుంటున్నాయి. అయితే ఇరాన్‌లో ఉన్న భాగాన్ని 'సౌత్ పార్స్' అని పిలుస్తారు. అలాగే ఖతార్ భాగాన్ని 'నార్త్ ఫీల్డ్' అని పిలుస్తారు.

ఈ రెండింటి సామర్థ్యం సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్. ఇది ప్రపంచం మొత్తానికి పదేళ్ల పాటు సరిపోయేంత భారీ నిక్షేపం. సౌత్ పార్స్ కేవలం ఇంధన వనరు మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక వంటిది. అందుకే ఇరాన్‌కు  అంత ముఖ్యం.  అంతేకాదు ఇరాన్ ఉపయోగిస్తున్న మొత్తం సహజ వాయువులో సుమారు 80శాతం ఈ ఒక్క ఫీల్డ్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, గృహాలు, పరిశ్రమల నిర్వహణకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ వినియోగించే దేశాల్లో ఇరాన్ ఒకటి.

ఇదీ చదవండి: నో జీన్స్‌, నో టీషర్ట్స్‌, నో పార్టీవేర్‌ : ఉద్యోగులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

ప్రభావం ఎంత?
ఈ గ్యాస్ ఫీల్డ్‌కు ఏదైనా అంతరాయం కలిగితే, ఇరాన్ అంతటా విద్యుత్  సంక్షోభం ఏర్పడటమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఇప్పటికే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ దాడి అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది.  ఇంతపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం  తప్పదనే ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం గమనార్హం.  ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కూడా  కుదిపేస్తున్నాయి.

ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement