బెంగళూరు: గదగ్ జిల్లాలో లక్కుండిలో పురాతత్వశాఖ చేపట్టిన తవ్వకాల్లో శుక్రవారం ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎ–1 గుంతలో తవ్వకాలు చేస్తుండగా రెండున్నర అడుగుల పాము ప్రత్యక్షమైంది. సూపర్‌వైజింగ్ చేస్తున్న సిబ్బంది కాసేపు తవ్వకాలు ఆపేశారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా పురాతన కాలం నుంచి గుప్త నిధులను పాములు కాపాడుతున్నట్లు గతంలో స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాము కనిపించడంతో తాము చెప్పినది నిజమని పేర్కొంటున్నారు.


