breaking news
snake
-
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
అమెరికాలోని వ్యోమింగ్, వైట్ రివర్ ఫార్మేషన్లో శాస్త్రవేత్తలకు సుమారు 38 మిలియన్ సంవత్సరాల నాటి 4 పాముల శిలాజాలు లభించాయి. ఇవి ఒకదానికొకటి చుట్టుకుని, బొరియలాంటి ప్రదేశంలో కలిసి ఉన్న స్థితిలోనే శిలాజాలుగా మారాయి. ఈ కొత్త జాతికి హైబర్నోఫిస్ బ్రెయితాప్టి అని పేరు పెట్టారు.వైట్ రివర్ ఫార్మేషన్లో లభించిన ఈ శిలాజాలను అగ్నిపర్వత బూడిద, మట్టి, వరద నీరు కలిసి వేగంగా కప్పివేయడంతో ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా పాముల శిలాజాలు విడిపోయిన వెన్నెముక భాగాల రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ పూర్తి అస్థిపంజరాలు లభించడం ప్రత్యేకత.మూడు పాములు ఒకే చోట కలిసి ఉండటం వల్ల అవి చలికాలంలో ఒకే బొరిలో ఆశ్రయం పొందేవని, బహుశా కలిసి నిద్రాణ స్థితిలో ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, పాములు నిజంగానే నిద్రాణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించడానికి శిలాజ ఆధారాలు సరిపోవని వారు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాచీన పాముల పరిణామక్రమంతో పాటు వాటి సామూహిక ప్రవర్తనపై కూడా కీలక సమాచారం లభించింది.పాముల శరీరంలో తల నుంచి తోక వరకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో వెన్నుపూసలు ఉంటాయి. పాముల వెన్నెముకలో సాధారణంగా వందలాది వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకు పక్కటెముకలు అనుసంధానమై ఉంటాయి. వెన్నెముక చాలా వంగేలా ఉండటం వల్ల పాములు మెలికలు తిరుగుతూ కదలగలుగుతాయి. పాములకు చేతులు, కాళ్లు లేకపోయినా వెన్నెముక మాత్రం ఉంటుంది.ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవి.. కాగా, ఈ పాములు ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తర అమెరికాలోని చిన్న బొరియల్లో నివసించే పాముల చరిత్రపై కొత్త సమాచారం లభించింది. ఈ పాముల సమూహం గురించి శాస్త్రవేత్తలు 1986లోనే తొలిసారి వివరించారు. ఈ శిలాజాలు పాములు కలిసి ఆశ్రయం పొందిన ప్రదేశానికి సంబంధించినవి కావచ్చని సూచించారు. శిలాజాల వెన్నుపూసలు, పుర్రెను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇవి గతంలో తెలిసిన ఒగ్మోఫిస్, కలమాగ్రాస్ పాముల నుంచి భిన్నమైనవని తేలింది. పరిణామ విశ్లేషణలో ఈ కొత్త పాము ఇతర బోయిడ్ పాములన్నింటికీ సోదర సమూహంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని కుమారుడు -
షారుక్ ఇంటి వద్ద 2 పాముల కలకలం.. ఒకటి చిక్కి, మరొకటేమో..
ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇంటి వద్ద పాము కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పాము కనిపించడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. దీంతో పామును సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షారుక్ ఖాన్ ముంబై నివాసంలోని పచ్చిక ప్రదేశంలో పాము కనిపించడంతో దానిని పట్టుకునేందుకు సంబంధిత సిబ్బంది శ్రమించారు. బాంద్రా వెస్ట్‌లోని మన్నత్‌లో 2 పాములు చుట్టుకుని తిరుగుతున్నట్లు రాత్రి 8 గంటల సమయంలో స్నేక్ క్యాచర్ విక్కీ దూబేకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే దూబే అటవీ శాఖ రౌండ్ అధికారి దీపక్ దాదా గైక్వాడ్‌కు, ముంబై రేంజ్ కార్యాలయం, థానేకు కంట్రోల్ రూమ్ ద్వారా ఫోన్ చేసి ఘటన గురించి తెలియజేశారు.విషపూరిత పాము కాదుఅధికారులు అక్కడికి చేరుకున్నప్పుడు మన్నత్ బంగ్లా ప్రాంగణంలోని మెట్ల కింద విషపూరితంకాని ధామన్ పాము కనిపించింది. దీనిని ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారు. పాము చుట్టుకుని ఉండి భయపడినట్లు కనిపించింది.పామును సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం తిరిగి సహజ ఆవాసంలోకి వదిలేశారు. విషపూరితంకాని ధామన్ పాము సుమారు 8 అడుగుల పొడవు ఉంది. పామును పట్టుకున్న తర్వాత దూబే అక్కడ ఉన్న వారికి పాము గురించి వివరించి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, చుట్టుపక్కల ప్రజలు తిరుగుతున్నట్లు గమనించిన రెండో పాము బంగ్లా ప్రాంగణం నుంచి తప్పించుకుంది. -
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్. తెలంగాణలో ఈ సర్పం అరుదైనది. ఈ సర్పాన్ని పట్టుకున్న యువకులు పాకాల అటవీ ప్రాంతంలో మంగళవారం వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామానికి చెందిన చెర్ప శ్రీకాంత్, సాయికుమార్, ప్రకాశ్, నవీన్, భాస్కర్, ధనసరి రాజులకు సోమవారం అర్థరాత్రి అశోక్‌నగర్ సబ్‌స్టేషన్ సమీపంలో అరుదైన పాము కనిపించింది. వీరిలో శ్రీకాంత్ అనే యువకుడు గతంలో అటవీశాఖలో పనిచేసిన అనుభవంతో ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని సంచిలో బంధించారు. దీనిని మంగళవారం పాకాల అటవీప్రాంతంలో వదిలేశారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి పుప్పాల రవికిరణ్‌ను సంప్రదించగా పాము ప్రత్యేకతను వివరించారు. రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుందని, తడిగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుందని, చీమల పొదల్లోకి వెళ్తుందని వివరించారు. ఇది చైనా, నేపాల్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, సౌత్ చైనాలో అధికంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తుందని తెలిపారు.ఈ పాము తíప్పిపోయి లేదా లారీల్లో పడిపోయి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇది అత్యంత విషపూరితమైన సర్పమని, కాటువేస్తే నేరుగా మెదడుపై ప్రభావం పడి పక్షవాతం వచ్చి మృత్యువాత పడతారని, వెంటనే ఐసీయూలో చేరితేనే ప్రాణాలను రక్షించుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా దీనిని చూసినట్లు తెలిపారు.పాకాలలో అరుదైన విషసర్పాన్ని వదిలేస్తున్న యువకులు శ్రీకాంత్, తదితరులు వరంగల్ జిల్లా: -
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
పంట పొలాల్లో కనిపించే పాములు మనకు ప్రాణాంతక శత్రువుల్లాగే కనిపిస్తాయి. కానీ, అవగాహనతో చూస్తే.. నిజానికి అవి ఉచితంగా పంటలను కాపాడేందుకు ప్రకృతి ప్రసాదించిన రైతు మిత్రులేనని అర్థమవుతుంది. దేశంలో ఏటా 15–20 శాతం ధాన్యం ఉత్పత్తి ఎలుకలు, పందికొక్కుల వల్ల నాశనమవుతోందని అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక జత ఎలుకలు ఒక ఏడాది వ్యవధిలో 800 నుంచి 1,000 వరకు సంతతిని పెంచగలవు. వీటిని అరికట్టటానికి విష రసాయనాలను రైతులు వాడుతుంటారు. అవి నేల సారాన్ని పాడుచేయటమే కాకుండా, ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నా యని నిపుణులు చెబుతున్నారు. 80% పాములతో ప్రమాదం లేదుమన దేశంలోని పొలాల్లో కనిపించే పాముల్లో 80 శాతానికి పైగా (జెర్రిపోతు వంటివి) అసలు విషం లేనివే. ఒక నాగు పాము లేదా జెర్రిపోతు తన జీవితకాలంలో వేలాది ఎలుకలను వేటాడి తింటుంది. అయితే, ఈ విషయంపై అవగాహన లోపి స్తోంది. 20% విషపూ రిత పాముల భయంతో.. కనిపించిన పామునల్లా చంపటం వల్ల పొలాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగి రైతులకు రెట్టింపు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.పాముల నుంచి రక్షణ ఎలా?పాము కాట్ల వల్ల గత పాతికేళ్లలో మన దేశంలో లక్షా ఇరవై వేల మంది చనిపోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది ఈ కారణంతో చనిపోవటం లేదు. పొలాల్లో రాత్రివేళల్లో టార్చ్‌లైట్ ఉపయోగించటం, లాంగ్ గమ్ బూట్లు ధరించటం వంటి చర్యల ద్వారా 90% వరకు పాము కాటు ప్రమాదా లను అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతు న్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన పాములను పారదోలే ఎలక్ట్రానిక్ చేతి కర్రలు వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని రైతులకు అందుబాటు లోకి తేవటానికి ప్రభుత్వం చర్యలు తీసుకో వాలి. అంతేకాదు, పాము కాటు బాధితుల ప్రాణరక్షణ కోసం గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవెనమ్‌ను అందుబాటులో ఉంచాలి. పాముల సమస్యపై గ్రామీణులు, రైతులకు అవగాహన కల్పించటంపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
పామును కాపాడి అడవిలో వదిలిన హీరోయిన్.. వీడియో వైరల్
తెలుగు ప్రేక్షకులకు 'జయం' సినిమాతో సుపరిచితురాలైన హీరోయిన్ సదా..నటనతో పాటు జంతువులు, వన్యప్రాణుల సంరక్షణలోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె ఓ పాముని రక్షించి, అడవిలో వదిలిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.‘కొన్ని ప్రయాణాలు మీకు ఛాయాచిత్రాలను మిగులుస్తాయి. మరికొన్ని, జీవితాన్ని చూసే మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తాయి. త్రిపుర ట్రిప్ నాకు ఆ రెండింటినీ ఇచ్చింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ రాష్ట పర్యటన నా జీవితంలో ఎప్పటకీ మర్చిపోలేను. యానిమల్ ఎయిడ్ అలయెన్స్ అనే స్వచ్ఛంధ సంస్థ పాములను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.నా పక్కన నిలబడిన వ్యక్తి డాక్టర్ గౌతమ్ మల్లిక్, వృత్తిరీత్యా దంత వైద్యుడు, కానీ క్లినిక్ సమయం ముగిశాక, పాములను రక్షించే స్వచ్ఛంద సేవకుడిగా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. మనమందరం భయపడాలని నేర్పబడిన, తరచుగా అపార్థం చేసుకోబడే ఈ సరీసృపాలకు జీవితంలో రెండవ అవకాశం ఇవ్వాలనే ఒకే లక్ష్యంతో వారందరూ ఏకమయ్యారు.స్థానిక సమాజం వారిపై పెంచుకున్న నమ్మకం నన్ను మరింత కదిలించింది. భయం వల్ల పామును హింసించడం లేదా చంపడం మానేసి, ఇప్పుడు చాలా మంది ఈ స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక్క జూన్ నెలలోనే 295 పాములను రక్షించారు. అవగాహన అంటే ఇలా ఉంటుంది. కరుణ సాధించగలది ఇదే. అది దృక్పథాలను మార్చగలదు మరియు ప్రాణాలను కాపాడగలదు.కొన్ని రక్షణ చర్యల సమయంలో వారితో పాటు వెళ్ళే అదృష్టం నాకు కలిగింది. వారు కఠినమైన నియమావళిని పాటిస్తారు. అటవీ శాఖతో చాలా సన్నిహితంగా పనిచేస్తారు. రక్షించి, అడవిలో తిరిగి వదిలిన ప్రతి పాము వివరాలను ప్రతి పాము రక్షకుడు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.రక్షించబడిన పాములలో ఒకటైన, అందమైన, విషరహిత జాతి ఇండో-చైనీస్ రాట్ స్నేక్‌ను తిరిగి అడవిలోకి వదిలివేయడం నాకు చాలా పులకించిపోయింది. అది అడవిలో కలిసిపోవడాన్ని చూడటం కేవలం ఆ పాముకు విముక్తి కలిగించడమే కాదు, ప్రతి జీవికి తన సొంత ప్రదేశానికి తిరిగి వెళ్ళే అవకాశం ఉండాలనే విషయాన్ని గుర్తు చేసినట్లు అనిపించింది’ అని త్రిష రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sadaa | Wild Stories (@sadaa_wildlifephotography) -
వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం..
కరీంనగర్, రాజన్న సిరిసిల్లా: జిల్లాలో ఓ పాము కలకలం రేపింది. వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందున్న బెల్లం దుకాణం సమీపంలో దాదాపు 10 అడుగుల పాము ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఆలయంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ తీవ్రంగా శ్రమించి, సాహసోపేతంగా ఆ పామును పట్టుకోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
వానాకాలం పాము కాట్లు.. ఒక్క తప్పు చేసినా ప్రాణం పోయే ప్రమాదం
వానాకాలం వచ్చిందంటే పాములు బయటకు వస్తాయి. పొలాలు, చెట్లు, ఇళ్ల పరిసరాలు, నీరు నిలిచిన చోట మనుషులకు పాము కాటు ప్రమాదం పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుంటే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. పాము కాటు వేస్తే వెంటనే సరైన ప్రథమ చికిత్స తీసుకుని ఆసుపత్రికి చేరడం అత్యంత ముఖ్యం. విషపూరిత పాము కాటు వేస్తే అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది?పాము విషంకాటు గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విషం సాధారణంగా రక్తంలోకి నేరుగా వెళ్లదు. ముందుగా లింఫ్ వ్యవస్థలో వ్యాపిస్తుంది. లింఫ్ వ్యవస్థ అంటే శరీర రక్షణ వ్యవస్థలో భాగమైన ద్రవ మార్గాల జాలం. ఎక్కువ కదలిక ఉంటే విషం వేగంగా వ్యాపిస్తుంది. ప్రశాంతంగా ఉంటే విషం వ్యాపించే వేగం తగ్గుతుంది. విషపూరిత పాము కాట్లలో ఎక్కువగా కాటు చోట నొప్పి, వాపు కనిపిస్తాయి. కొన్ని పాములు న్యూరోటాక్సిక్ విషాన్ని విడుదల చేస్తాయి. అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. న్యూరోటాక్సిక్ విషం అంటే నాడులు, మెదడు పనితీరును దెబ్బతీసే విషం. న్యూరోటాక్సిక్ విషం వల్ల కనురెప్పలు వాలిపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, మింగడం కష్టమవుతుంది. తీవ్ర న్యూరోటాక్సిక్ విష ప్రభావం వల్ల శ్వాస ఆగే ప్రమాదం ఉంటుంది. కొన్ని పాములు హీమోటాక్సిక్ విషాన్ని విడుదల చేస్తాయి. అది రక్తం, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. హీమోటాక్సిక్ విషం అంటే రక్తం, రక్తనాళాలపై హాని చేసే విషం. హీమోటాక్సిక్ విషం వల్ల రక్తస్రావం, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సమస్యలు వస్తాయి. కొన్ని పాముల విషం కండరాలు, చుట్టుపక్కల కణజాలాన్ని నాశనం చేస్తుంది. లక్షణాలు కొన్ని నిమిషాల్లో కనిపించవచ్చు. లేక కొన్ని గంటల తర్వాత కనిపించవచ్చు.ఏం చేయాలి?చిన్న పిల్లలు, వృద్ధుల్లో తీవ్ర సమస్యల ప్రమాదం ఎక్కువ. కాటు పడిన వెంటనే పాము దగ్గర నుంచి దూరంగా వెళ్లాలి. పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు. కాటు పడిన అవయవాన్ని వీలైతే స్ప్లింట్తో కదలకుండా ఉంచాలి. స్ప్లింట్ అంటే గాయమైన అవయవాన్ని స్థిరంగా ఉంచే గట్టి ఆధార పరికరం. వాపు మొదలయ్యే ముందు ఉంగరాలు, గాజులు, గడియారం, బిగుతైన దుస్తులు తొలగించాలి.వీలైనంత త్వరగా సమీప ఆసుపత్రికి చేరాలి. యాంటీ స్నేక్ వెనం మాత్రమే విషపూరిత పాము కాటుకు ప్రత్యేక చికిత్స. లక్షణాలను బట్టి ఎంత మోతాదు ఇవ్వాలో వైద్యులు నిర్ణయిస్తారు. శ్వాసపై ప్రభావం ఉంటే ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సహాయం అవసరం కావచ్చు.ఇవి మర్చిపోవద్దుకాటు గాయాన్ని కోయవద్దు. నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయవద్దు. కాటు చోట మంచు లేదా వేడి పెట్టవద్దు. కాటు పడిన అవయవానికి బిగుతుగా కట్టు వేయవద్దు. మూలికలు, రసాయనాలు, ఇంటి చిట్కాలు వాడవద్దు. సురక్షితంగా ఉంటే పాము రూపాన్ని గుర్తుంచుకోవాలి లేదా దూరం నుంచి ఫొటో తీయాలి. లక్షణాలు తక్కువగా కనిపించినా అనుమానాస్పద పాము కాటుకు వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. వెంటనే ప్రథమ చికిత్స, త్వరగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తగ్గి, సమస్యలు తగ్గుతాయి. -
కాటేసిన తాచుపాముపై శునకం ప్రతీకారం..!
కాకినాడ: ఓ ఇంటి ఆవరణలోకి చొరబడిన తాచుపామును ఓ శునకం వెంటాడి చంపింది. కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. తన ఇంటి ఆవరణలోకి శనివారం గోధుమ రంగు తాచుపాము ప్రవేశించింది. దీనిని వారి పెంపుడు శునకం పసిగట్టింది. ఇంటి ఆవరణ నుంచి లోపలకు వెళుతున్న ఆ పామును శునకం బెదిరించేందుకు ప్రయత్నించగా, పాము తిరగబడి శునకం మూతిపై కాటు వేసింది. కాటువేసిన కోపంలో శునకం పామును వెంటాడి హతమార్చింది. శునకం నీరసంగా ఉండటంతో శ్రీనివాస్, అతని సోదరుడు సురేష్‌లు కాకినాడకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. -
ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?
సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైనా దూరంగా జరిగిపోతారు. కానీ ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటెకు బతికి వున్న పామును తినిపించడం చూస్తే ఎవరైనా షాక్‌కు గురి కావాల్సిందే. శాకాహారి అయిన ఒంటె నోరు బలవంతంగా తెరిచి మరీ ఒక బతికున్న విషపూరితమైన పాములను వెనుక ఉన్న రహస్యం ఏంటి? అరబ్ దేశాల్లో తరతరాలుగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి.రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెల కాపరులు ఈ వింత పద్ధతిని పాటిస్తారు. ఒంటెలకు 'హయాం' (Hayam) అనే ఒక రకమైన వ్యాధి వస్తుంది (ఇది సాధారణంగా ఈగలు, దోమల ద్వారా వచ్చే పరాన్నజీవి వ్యాధి). ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒంటె శరీరం వేడెక్కి, ఆహారం తీసుకోవడం మానేస్తుంది. ఆ సమయంలో దానికి బ్రతికున్న విషసర్పాలను తినిపిస్తే, ఆ విషం వల్ల ఒంటె ఒంట్లోని రోగం నయమవుతుందని, దాని కళ్ల వెంట నీళ్లు వచ్చి వ్యాధి బయటకు పోతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తరతరాలుగా ఈ పద్ధతిని పాటస్తున్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.అసలు నిజంఒంటెలు కేవలం శాకాహారులు (Herbivores). అవి సహజంగా పాములను తినవు. పశువైద్య నిపుణుల ప్రకారం, బ్రతికున్న పామును తినిపించడం వల్ల ఒంటెకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా ఇది ఆ ఒంటె ప్రాణాలకే ప్రమాదం. పైగా జంతు హింస కిందికి వస్తుంది. ఒకవేళ ఆ చికిత్స తర్వాత ఒంటె బ్రతికినా, అది దాని స్వయం నిరోధక శక్తి వల్ల బ్రతికిందే తప్ప పాము వల్ల కాదు.మన దేశంలో నాగపంచమి వంటి పండుగల సమయంలో పాములు పాలు తాగుతాయనే ఒక పెద్ద అపోహ ఉంది. పాములు క్షీరదాలు కావు, అవి సరీసృపాలు. వాటి శరీరంలో పాలను అరిగించుకునే శక్తి (Lactase enzyme) ఉండదు. పండుగలకు కొన్ని వారాల ముందు పాములవాళ్లు అడవి పాములను పట్టుకుని, వాటి విషపు పళ్లను పీకేసి, వాటికి ఆహారం, నీరు లేకుండా ఉంచుతారు. బాగా దాహంతో ఉన్న పాము, ఆకలి తట్టుకోలేక ఎదురుగా ఉన్న పాలను నీళ్లు అనుకుని తాగుతుంది. ఆ పాలు వాటి ఊపిరితిత్తుల్లోకి చేరి, ఇన్ఫెక్షన్ వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ పాములు విలవిల్లాడుతూ చనిపోతాయి.భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పాము కుడితే ఆసుపత్రికి వెళ్లేకంటే, సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రగాళ్లు, నాటు నాటు వైద్యులు దగ్గరికి వెళ్లి మంత్రాలు వేయించడం, వేర్ల పసరు పూయించడం చేస్తుంటారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుంది. విషసర్పం కుట్టినప్పుడు ప్రాణాలను కాపాడగలిగేది కేవలం యాంటీ-స్నేక్ వెనమ్ (Anti-Snake Venom) ఇంజెక్షన్ మాత్రమే. కొన్నిసార్లు విషం లేని పాములు కుట్టినప్పుడు మంత్రగాళ్ల వల్ల నయమైందని ప్రజలు నమ్మి, నిజంగా విషమున్న పాము కుట్టినప్పుడు కూడా అక్కడికే వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది నిర్ధారణ లేదు. ఇలాంటిమ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. -
ఓర్నీ దీని వేషాలో.. చచ్చినట్టు ఎంత నాటకం ఆడింది!
-
హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థిని కరిచిన పాము
అనంతపురం జిల్లా: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాల (Tribal Welfare Residential School) లో తొమ్మిదో తరగతి చదువుతున్న తులసీ నాయక్ అనే విద్యార్థి, రాత్రి సమయంలో హాస్టల్ గదిలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. గదిలో కింద పడుకున్న సమయంలో పాము కరవడంతో విద్యార్థి గట్టిగా కేకలు వేశాడు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చూసేసరికి అక్కడ పాము కనిపించింది.పాముకాటు వేసిన వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని అనంతపురం సర్వజనాస్పత్రి (GGH Anantapur) కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చేర్చి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. -
చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు
-
హైదరాబాద్‌లో పెరిగిన పాముల సంచారం
నలువైపులా కమ్ముకొస్తున్న కాంక్రీట్ ధాటికి నాగులు బుసలు కొడుతూ బయటకు వస్తున్నాయి. సాధారణంగా వానల సీజన్ తొలిదశలో సర్ప సంచారం కనిపించడం సహజమే అయినప్పటికీ ఈ ఏడు మరింతగా పెరగడం గమనార్హం. నగరానికి చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (ఎఫ్ ఓఎస్) గణాంకాలు ఈ పెరుగుదలను థృవీకరిస్తున్నాయి.వాతావరణ మార్పుల ప్రభావం...సాధారణంగా పాముల కదలికలో వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ మార్పుల ఆధారంగానే నివాస ప్రాంతాలలో పాముల సంచారంలోనూ సీజనల్ పెరుగుదల కనిపిస్తుంది. వానలు ప్రారంభం అయే జూన్ నెలలో భిన్న జాతుల పాముల పిల్లలను పొదుగుతాయి. ముఖ్యంగా తొలి రుతుపవనాల తేమ పాముల కార్యకలాపాలను, గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత వరుస వర్షాలు సాధారణంగా పాముల జాడలను తగ్గిస్తాయి. ‘నిరంతరాయంగా వర్షాలు కురిసినప్పుడు, ఉష్ణోగ్రతలు పడిపోతాయి పాములు బొరియలలో లేదా పగుళ్లలో దాక్కోవడానికి ఇష్టపడతాయి. వర్షం కారణంగా, బయట కనిపించడం తగ్గిపోతుంది, కాబట్టి పాముల్ని గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది,జూన్‌లో జూమ్...ఈ ఏడాది జూన్ మొదటి 25 రోజుల్లో హైదరాబాద్‌లో పాముల సంచారం బాగా పెరిగింది. గత ఏడాది ఇదే నెల మొత్తంతో పోలిస్తే ఈసారి ‘సొసైటీ’కి ఎక్కువ కాల్స్ అందాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా, బలహీనంగా ప్రారంభం కావడం, వరుస వర్షాలు పడకపోవడంతో పాములు చురుకుగా మారే అవకాశం పెరిగింది. గత ఏడాది 30 రోజుల్లో 1,200 పాముల్ని పట్టుకున్నట్టు ’ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ గణాంకాలు చెబుతున్నాయి. అదే ఈ ఏడాది 25 రోజుల్లోనే 1,300 పాములను రెస్క్యూ చేశారు. వీటిలో 500కు పైగా నాగుపాములు, దాదాపు 300 ఎలుక పాములు ఉన్నాయి.‘రుతుపవనాల ప్రారంభంతో పాము పిల్లలు బయటకు రావడం మొదలవుతాయి కాబట్టి, జూన్ నెలలో మాకు పని పెరుగుతుంది,‘ అని సొసైటీ జనరల్ సెక్రటరీ అవినాష్ అంటున్నారు. స్వాధీనం చేసుకున్న పాములను అటవీ శాఖ సహాయంతో సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నామని వెల్లడించారు..ఒకవేళ రుతుపవనాలు బలపడి, జూలై నెల లో విస్తారంగా వర్షాలు కురిస్తే, ఈ కాలంలోనే పిల్ల పాములు పొదుగుతున్నప్పటికీ, భూమిపై పాముల సంచారం తగ్గవచ్చునన్నారు.పదేళ్లలో 16శాతంపైగా పెరుగుదలనగర విస్తరణ పెరగడంతో పాటుగానే గత పదేళ్లలో పాముల రెస్క్యూ సంఘటనలు 16.90% పెరిగాయి. గత 2013 నుంచి 2022 వరకు నగరంలో అన్నిరకాలు కలిపి 55,467 పాములను రెస్క్యూ చేశారు. మొత్తంగా చూస్తే గత పదేళ్లలో సగటున ఏటా 16.90% పెరుగుతూ వస్తోంది. లభ్యమవుతున్న వాటిలో నాజా నాజా (భారతీయ నాగుపాము) ప్టయాస్ మ్యూకోసా (ఇండియన్ ర్యాట్ స్నేక్ / ఎలుకల పాము) 76% వాటాను ఆక్రమించాయి. వర్షాకాలంలో, ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ మధ్య పాములు కనిపించడం ఎక్కువ కాగా, వానలు తగ్గుముఖం పట్టే అక్టోబర్ నెలలో అత్యధికంగా రెస్క్యూలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం రెండూ కలిసి పాముల సంచారంపై ప్రభావం చూపుతున్నాయని గత ఏప్రిల్‌లో విడుదలైన అర్బన్ స్నేక్ ఎకాలజీ అధ్యయనం వెల్లడించింది. అలాగే ప్రతి జాతికి దాని జీవనశైలి, అలాగే మానవ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పగలు–రాత్రి చురుకుదన నమూనాలు ఉన్నట్లు తేల్చింది. నగరం చుట్టుపక్కల మొత్తం 3,379 గ్రిడ్లలో 232 (6.90%) ప్రాంతాలు పాముల సంచారానికి ముఖ్యమైన హాట్స్పాట్లుగా గుర్తించబడ్డాయి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ శివార్లలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న అవుటర్ రింగ్‌రోడ్ పరిసరాల్లో నెలకొని ఉన్నాయి.అలవాటు పడుతూన్నాయా?ఈ పరిశోధన చెబుతున్న ప్రకారం, నగరంలో కొన్ని జాతుల సర్పాలు పట్టణ వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది పాముల సంరక్షణతో పాటు ప్రజారోగ్య పరంగా కూడా కొత్త సవాళ్లను సృష్టించనుంది. ఈ నేపధ్యంలో పాముల రక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, దీర్ఘకాలిక పర్యవేక్షణ, వన్యప్రాణి అనుకూల పట్టణ ప్రణాళిక వంటి చర్యలు అత్యవసరమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాదిలో 15వేలు..గత ఏడాది మేం నగరం చుట్టుపక్కల 15వేలకు పైగా పాముల్ని రెస్కూ చేయడం మా చరిత్రలోనే ఒక రికార్డ్‌గా చెప్పాలి. ఈ ఏడాది అంతకు మించేలా పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజల్లో పాములు కనపడగానే చంపాలనే ఆలోచన పోవడం, రెస్క్యూ కార్యకలాపాల పట్ల అవగాహన పెరగడం హర్షణీయం. పాముల్లో అత్యధిక శాతం మనుషులకు ఎటువంటి హానీ చేయనివే. కాబట్టి వాటి సంచారం గురించిన భయాందోళనలకు బదులు అప్రమత్తత అవగాహన పెంచుకోవడం ఉత్తమం.–అవినాష్, సొసైటీ కార్యదర్శి -
పాములనే నమిలి తిన్న తాగుబోతు.. ఏమైందంటే?
రాంచీ: జార్ఖండ్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో విచిత్రంగా ప్రవర్తించాడు. పూటుగా తాగాడు.. అనంతరం అక్కడికి ప్రాకుతూ వచ్చిన పామును తిన్నాడు.. అంతటితో ఆగకుండా అక్కడే చంపి ఉన్న మరో పామును కొరికి మింగాడు.. దీంతో పరిస్తితి విషమించడంతో అతని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఏం జరిగిందంటే?స్థానికుల కథనం ప్రకారం... (శనివారం )కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాదిహ్ తోలా గ్రామంలో బుధన్ భారతి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ, పేకాట ఆడుతున్నాడు. ఆ సమయంలో సమీపంలోని పొలం నుండి ఒక పాము అతని వైపునకు పాకుతూ వచ్చి, కరవడానికి ప్రయత్నించింది.దీంతో అక్కడున్న వారంతా పరారయ్యారు. అయితే బుధన్ భారతి మాత్రం అక్కడున్న వారు ఎంత వారించినా వినకుండా, ఆ పామును చేతులతో పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆ పామును ప్రాణంతో ఉండగానే కొరికి తినేశాడు.అక్కడితో అతని కిక్కు దిగలేదు.. మొదటి పామును తిన్న తర్వాత, బుధన్ పక్కనే ఉన్న పొలానికి పరిగెత్తాడు. అక్కడ గ్రామస్థులు అంతకుముందే కొట్టి చంపిన మరో పామును కూడా తీసుకెళ్లి తినేసాడు. ఇంతటితో ఆగకుండా రెండు పాములను తిన్న తర్వాత కూడా బుధన్ మళ్లీ మద్యం తాగుతూనే ఉన్నాడు. అంతలో అక్కడికి మరో మూడో పాము రాగా, దాన్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు అతడిని ఎలాగోలా అడ్డుకున్నారు.ఈ వింత ఘటన జరిగిన కొద్దిసేపటికే బుధన్ ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం తెల్లగామారడం ప్రారంభమైంది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రతాప్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స అందుతోంది. అయితే అతడు తిన్న పాములు ఏవి అనేవి తెలియలేదు. -
పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం
పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ఈమె నటించిన 'నాగబంధం' సినిమా ఈ శుక్రవారం(జూలై 03) థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)'పాములంటే నాకు అస్సలు భయం లేదు. మాది చిక్‌మగళూరు. అక్కడ మా పూర్వీకుల ఇళ్లలో పాములు ఉండేవి. చెప్పాలంటే నేను, మా తమ్ముడు భోజనం చేస్తూ వాటిని చూసేవాళ్లం. కానీ పెద్దగా పట్టించుకునేవాళ్లం మాత్రం కాదు' అని నభా నటేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కన్నడ అమ్మాయి అయిన నభా.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ తదితర చిత్రాలు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. కరోనా టైంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు రెండు మూడేళ్ల పాటు నటనకు దూరమైంది. అనంతరం ఈమె తెలుగులో స్వయంభు, నాగబంధం అనే భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. 'నాగబంధం' రెండురోజుల తర్వాత రిలీజ్ కానుండగా.. స్వయంభు కూడా మరికొన్ని నెలల్లో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
బాబోయ్... పాములు!
న్యూయార్క్: ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు వింత సమస్య వెంటాడుతోంది. ఆ జట్టు బస చేసిన నార్త్ కరోలినా క్యాంప్‌లో పాముల బెడద ఎక్కువగా ఉందని జట్టు సభ్యులు వాపోతున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఎవరితో తలపడాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే ఆలోచనలతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోందని జర్మనీ కెప్టెన్ జోషువా కిమ్మిచ్ వెల్లడించాడు. ‘జర్మనీలో అయితే వ్యూహాలు, గాయాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ గడ్డిలో ఏం ఉన్నాయో అని భయపడాల్సి వస్తోంది. మా జట్టు సభ్యులకు పలు చోట్ల పాములు దర్శనమిస్తున్నాయి. వాటితో ప్రాణహాని లేకపోయినా... పాముకాటుకు గురవ్వాలని ఎవరూ కోరుకోరు కదా’ అని కిమ్మిచ్ పేర్కొన్నాడు. మరోవైపు స్విట్జర్లాండ్, నార్వే జట్లు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాయి. -
ఓసి నీ దుంపతెగ.. పాములు, బొమ్మలు కాదు!
-
ఆపరేషన్ టేబుల్.. పేషెంట్‌గా నాగుపాము
తూర్పు గోదావరి జిల్లా: పాము పేరు వింటేనే అందరూ భయపడతారు. ఇక నేరుగా చూస్తే దూరంగా పారిపోతారు. అలాంటిది పొలంలో మట్టి తీస్తుండగా గాయపడిన నాగు పాముపై జీవ కారుణ్యాన్ని చూపించి దానిని కాపాడాడు ఒక రైతు. ఆ విష నాగును ఎంతో చాకచక్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వి.సావరంలో గుత్తుల సత్యనారాయణ శనివారం తన పొలంలో మట్టిని తీస్తుండగా నాగుపాముకు దెబ్బ తగిలింది. వెంటనే ఆ పామును వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లారు. వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు పాముకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుట్లు వేశారు. -
అది పామో లేక చెట్టు కొమ్మో..
గ్రీన్ వైన్ స్నేక్ (పసిరిక పాము) గా పిలిచే ఈ పాము రంగు అచ్చం పచ్చటి ఆకులా ఉంటుంది. ఇది చెట్ల కొమ్మల మధ్య ఉన్నప్పుడు, అది పామో లేక చెట్టు కొమ్మో కనిపెట్టడం చాలా కష్టం!శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ రంగు దీనికి బాగా సహాయపడుతుంది. చాలా పాములకు చూపు అంతగా తెలియదు, కానీ పసిరిక పాములకు చూపు చాలా ఎక్కువ. వీటి కంటి పాపలు అడ్డంగా, తాళం రంధ్రం ఆకారంలో ఉంటాయి. దీనివల్ల ఇవి దూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా చూడగలవు. చాలా సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల ఇది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మపైకి వేగంగా, సులువుగా వెళ్తుంది. పసిరిక పాములకు కొద్దిగా విషం ఉంటుంది, కానీ అది కేవలం అవి తినే చిన్న చిన్న బల్లులు, కప్పలను పట్టుకోవడానికే సరిపోతుంది. -
'షూటింగ్లో పాము కాటు.. వనితా మాటలకు షాకయ్యాం..'
కోలీవుడ్ నటి వనితా విజయ్‌కుమార్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. 1999లోనే దేవి మూవీలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కూతురు సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పాల్గొన్న జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న అగధ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్ రాజు మాట్లాడారు. 1999లో వచ్చిన దేవి మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్‌ను పాము కాటేసిందని తెలిపారు. అప్పుడు మేమంతా తెగ కంగారు పడిపోయామని వెల్లడించారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని ఎంఎస్ రాజు ప్రశంసలు కురిపించారు. కాగా.. 1999లో వచ్చిన దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో కామాక్షీ భాస్కర్ల మహాదేవి పాత్రలో కనిపించనుంది. -
రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. ఎదురుగా భారీ సర్పం
నయాగఢ్: ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో ఓ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోవడంతో పాటు.. పక్కనే భారీ కొండచిలువ(విషసర్పం) కూడా ఉండటంతో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఎనిమిది గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు బాలుడిని క్షేమంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళ్లితే. బాలుడు శిబా ప్రధాన్ తన మామతో కలిసి తేనె సేకరించడానికి కనిపాడ అడవికి వెళ్లాడు. అక్కడ పెద్ద రాళ్ల సందులో తేనెతుట్టెలను చూసి.. వాటిని సేకరించేందుకు శిబా ప్రయత్నించాడు. ఆ క్రమంలో సందు లోపలి భాగంలో ఉన్న తేనెను తీయడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోయింది. శిబా మామ అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో.. గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.A rescue operation is underway near Odagaon in Odisha after a minor boy got trapped between big rocks while collecting honey in the forest.His head is stuck between the rocks, making the rescue extremely challenging. Odisha Fire Services team is working to save him safely. pic.twitter.com/1eNDLvZlM6— Manas Muduli (@manas_muduli) May 6, 2026సమాచారం అందుకున్న ఒడగావ్, నయాగఢ్ నుండి రెండు అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. రక్షణ చర్యల్లో స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే, శిబాకు సమీపంలోనే ఒక పెద్ద విషసర్పం ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కొంత ఆటంకం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది మొదట బాలుడికి ధైర్యం చెప్పి.. ఆపై వివిధ పరికరాలను ఉపయోగించి అతన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఎనిమిది గంటల శ్రమ తర్వాత శిబాను సందులోంచి సురక్షితంగా బయటకు తీసి.. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు
-
రీల్స్ పిచ్చితో పాముతో ఆటలా!
-
నాగుపాముకు నీళ్లు తాగించి..!
తిరుపతి జిల్లా: పుత్తూరులో మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండల మధ్య దాహంతో అలమటిస్తున్న నాగుపాముకు స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ నీళ్లు తాగించి, అనంతరం అడవిలో విడిచిపెట్టాడు.పుత్తూరులోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము నీటి ట్యాంక్ కింద దాక్కుంది. దీనిని గమనించిన ఇంటి సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ వెంటనే అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును సురక్షితంగా పట్టుకున్నాడు..ఎండ తీవ్రతకు పాము దాహంతో అలమటిస్తున్నట్లు గుర్తించిన స్నేక్ క్యాచర్ శ్రీకాంత్, దానికి నీళ్లు తాగించాడు. అనంతరం ఆ నాగుపామును సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సమస్య పరిష్కారమవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వంటింట్లో తిష్ట వేసిన 14 అడుగుల కింగ్ కోబ్రా!
కర్ణాటక: రోడ్డు మీద వెళ్తున్న కింగ్ కోబ్రా పాము ఇంట్లోకి దూరింది. జిల్లాలోని కాచిబట్టి గ్రామంలో రోడ్డు దాటుతున్న సుమారు 14 అడుగుల గిరినాగు ఒకటి వాహనం తగలడంతో పక్కనే రాజు నాయక్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. వంటింట్లో తిష్టవేసిన అతిథిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. అటవీ సిబ్బందికి కాల్ చేయగా, వారు మహేశ్ నాయక్‌కు చెప్పారు. మహేశ్ నాయక్, ఆయన కుమారుడు గగన్ నాయక్ చాలాసేపు కష్టపడి కింగ్ కోబ్రాను క్షేమంగా పట్టుకున్నారు. దానిని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. -
టీవీ ఆన్ చేస్తే నాగు గర్జన.. లోపల చూసి షాక్!
కర్ణాటక: సామాన్యంగా టీవీ పాడైపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళతారు. అయితే చామరాజనగర మల్లయ్యనపుర గ్రామంలో దొడ్డమాదప్ప ఇంటిలో జరిగింది వేరే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో టీవీ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ శబ్ధాలు ఎక్కువ కావడంతో టీవీ లోపల చూసి నిశ్చేష్టులయ్యారు. లోపల ఏదో కదులుతూ కనిపించింది. ఆ తర్వాత అది పాము అని తెలిసి వెంటే స్నేక్ చాపు నకు కాల్ చేశారు. స్నేక్ చాపు టీవీని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి అందులో మకాం వేసిన 8 అడుగుల విషపూరిత పామును పట్టుకున్నాడు. టీవీ వైర్ల మధ్య చుట్టుకుని ఉందది. ఇంటి చుట్టుపక్కల ఎలుకలు, కప్పలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం వచ్చి టీవీలో చేరినట్లు స్నేక్ చాపు తెలిపాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. -
ద్విచక్రవాహనంలో రక్తపింజరి
హైదరాబాద్: ఏసీగార్డ్స్‌లోని టూవీలర్ మెకానిక్ ఫకృద్దీన్‌కు ఓ ద్విచక్రవాహనంలో రక్తపింజరి పాము ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి శనివారం తన వాహనాన్ని మరమ్మతుకు ఇచ్చాడు. రిపేరు చేసే క్రమంలో డిక్కీలో రక్తపింజరి పాము కనిపించింది. దీంతో ఫకృద్దీన్ మరొకరి సహాయంతో పామును ఖాళీ బాటిల్లోకి పంపించి దూరంగా వదిలేశారు. -
డాన్స్ చేసే పాముని ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఇది మీకోసం!
-
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
-
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు. -
అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్‌ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు. అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్‌కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్‌ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు. అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట. 1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది. దీనికి విరుగుడు బ్రెజిల్‌లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు. అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.జానికి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
తాచుపాముతో కౌన్సిల్ సమావేశానికి..
నిడదవోలు: విష సర్పాల సంచారం ఎక్కువగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ కౌన్సిలర్ కౌన్సిల్ సమావేశానికి తాచుపామును తీసుకువచ్చి నిరసన తెలిపిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలను చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. 20వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఏకంగా తాచుపాముతో సమావేశానికి వచ్చారు. తన పరిధిలోని ఎంవీ నగర్ మదర్ థెరిస్సా మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, పాత కమిటీ భవనాల ప్రాంతాల్లో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉందని చెప్పారు. కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాల సమీపంలో సంచరిస్తున్న తాచుపామును పట్టించి, ఓ తెల్లని డబ్బాలో పెట్టి, ఆ డబ్బాను సంచిలో పెట్టుకుని కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. పామును అధికారులను చూపించి, వినూత్నంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. చైర్మన్ ఆదినారాయణకు ఈ విషయం తెలిసింది. సమావేశంలో ఓ కౌన్సిలర్ పాములు తీసుకువచ్చినట్లు సమాచారం వచి్చందని, దానిని వెంటనే బయటకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీంతో, కౌన్సిలర్ అనిల్ కుమార్ తాచుపాము ఉన్న సంచీని బయట పెట్టారు. సమావేశం ముగిసిన తర్వాత మున్సిపల్ కార్యాలయం బయట తాను తీసుకువచి్చన పామును విలేకరులకు చూపిస్తూ నిరసన తెలిపారు. -
లక్కుండిలో సర్పబంధం?
బెంగళూరు: చారిత్రక లక్కుండిలో తవ్వకాలు కొనసాగుతుండగా, అక్కడ నిధులకు పెద్ద సర్పం రక్షణగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తవ్వకాల సమయంలో ఓ నాగుపాము రావడంతో అందరూ భయపడ్డారు. ఇప్పుడు చారిత్రక కోడి బసవణ్ణ దేవాలయం గర్భగుడిలో నాగుపాము కుబుసం బయటపడింది. గర్భగుడి కుడి భాగంలో గుండ్రని ఆకారపు రాతి బండ ఉంది. బండ పక్కలో నాగుపాము పొర కనిపించింది. దీంతో సర్ప బంధం ఉందని ప్రచారం సాగుతోంది. లక్కుండి తవ్వకాల్లో పాము ప్రత్యక్షం -
లక్కుండి తవ్వకాల్లో పాము ప్రత్యక్షం
బెంగళూరు: గదగ్ జిల్లాలో లక్కుండిలో పురాతత్వశాఖ చేపట్టిన తవ్వకాల్లో శుక్రవారం ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎ–1 గుంతలో తవ్వకాలు చేస్తుండగా రెండున్నర అడుగుల పాము ప్రత్యక్షమైంది. సూపర్వైజింగ్ చేస్తున్న సిబ్బంది కాసేపు తవ్వకాలు ఆపేశారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా పురాతన కాలం నుంచి గుప్త నిధులను పాములు కాపాడుతున్నట్లు గతంలో స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాము కనిపించడంతో తాము చెప్పినది నిజమని పేర్కొంటున్నారు. -
కొంప తగలబడుతుంటే బాధతో ఎలా చూస్తుందో
-
గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?
పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.బ్రిస్సెన్స్కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు. కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు. -
కరిచిన పాముతో నేరుగా ఆస్పత్రికి
ఉత్తరప్రదేశ్: అడుగున్నర పొడవున్న ఒక సర్పాన్ని చలికోటులో దాచుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ హల్చల్ సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. 39 ఏళ్ల దీపక్ వృత్తిరీత్యా ఇ–రిక్షా డ్రైవర్. పాము కాటేసిందంటూ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అయితే ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అక్కడి సిబ్బంది అడగ్గా.. ఇదిగో ఇదే పాము అంటూ తన జర్కిన్‌లో దాచి తెచ్చిన తాచుపామును బయటకు తీశాడు. దీంతో అక్కడి వాళ్లంతా హడలిపోయారు. వెంటనే పామును దూరంగా వదిలేసి రావాలని సూచించినా వినకుండా విరుగుడు మందు కావాలని డిమాండ్చేశాడు. దీంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ‘‘సమీపంలోని బృందావన్ నుంచి వచ్చా. అరగంట నుంచి వేచిచూస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు’’అని దీపక్ చెప్పాడు. వైద్యం చేస్తాంగానీ ముందు ఆ పామును వదిలేయాలని సూచించామని జిల్లా ప్రభుత్వాసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ చెప్పారు. -
Hyderabad: అపార్ట్మెంట్ రెండో అంతస్తులోకి పాము
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తుకు వచ్చిన నాగుపాము కార్మికులకు భయాందోళనకు గురిచేసింది. నార్సింగి సర్కిల్, నెక్నాంపూర్ గోల్కొండ హిల్స్‌లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్లోకి శనివారం ఐదు అడుగుల నాగుపాము వచి్చంది. దీంతో కారి్మకులు చూసి భయాందోళన చెందారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి బంధించి తీసుకువెళ్లారు. ఎక్కడ పాములు కనిపించినా తమకు ఫోన్ నెంబర్ 83742 33366 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
తాగిన మైకంలో పాముతో హల్చల్
-
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ హంగామా.. పోలీసులపై పాము
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
పాము Vs ముంగిస ఫైట్: ఉలిక్కిపడకపోతే ఒట్టు!
-
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?
పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.అదొక ఫైవ్ స్టెప్ స్నేక్చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి. పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.విష ప్రభావంరక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం. -
నాగిని పాటకు పాము డాన్స్.. వీడియో వైరల్
-
బిజీ బ్యాంకులోకి అనుకోని అతిథి!
అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ— Hellobanker (@Hellobanker_in) November 29, 2025 -
పురాతన శివాలయం : వందల సంఖ్యలో పాములు,వీడియో వైరల్
పవిత్ర కార్తీకమాసంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన ఒకటి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయంలో ఉన్నట్టుండి కుప్పలుగా సర్పాలు కనిపించాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా వందల సంఖ్యలో తిరుగాడుతున్న దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది.చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!కృష్ణా జిల్లా నాగాయలంకలో రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నవంబరు 19న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతీ ఏటా కార్తీకమాసంలో ఇలా పాములు గుంపులుగా కనిపించడం తమకు అలవాటే అంటున్నారు స్థానికులు. కానీ ఈ ఏడాది వీటి సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదంతా ఆ కార్తీక దామోదరుడి మహిమే అంటూ ఆ శివయ్యకు మొక్కుకోవడం విశేషం. నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు🙏🏼🙏🏼నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఇలా పాములు కనిపించాయి.🙏🏼🙏🏼ఇవాళ సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా కనిపిస్తాయి అంటున్నారు 🙏🏼🙏🏼 pic.twitter.com/rjZmi72VXb— Bhaskar Reddy (@chicagobachi) November 19, 2025 నోట్ :క్కడి భక్తుల నమ్మకం ఎలా ఉన్నా కొన్ని రకాల చేపలు పాముల్లా ఉంటాయి. వీటిని ఈల్స్ (Eels) అంటారు.ఘ ఈ స్నేక్ ఈల్స్ (Ophichthidae) కుటుంబానికి చెందినవి. ఇవి అచ్చం పాముల్లాగే పొడవుగా సన్నగా ఉంటాయి. మామూలు చేపల్లాగా కాకుండా చాలా సన్నగా, పొడవుగా ఉంటాయి. -
‘కారు సైడ్ మిర్రర్లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది’
సాక్షిచెన్నై: ఓ ఫ్లైఓవర్‌పై కారు వేగంగా దూసుకెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే... ఆ కారు సైడ్ మిర్రర్ వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తోంది! ఆ పామును చూసిన డ్రైవర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కారు యజమానులు మన కారులో ఇలాంటి పాములు దాగి ఉన్నాయేమో అన్న భయంతో తమ వాహనాలను పరికించి పరికించి పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే?ఇటీవల తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో ఓ డ్రైవర్ కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. కారు నడుపుతుండగా సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తొలుత కారు అద్దంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. అయినా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా..అగస్మాత్తుగా ఓ పాము బుసలకొడుతూ బయటకు రావడాన్ని గమనించాడు. వాహనదారులకు జాగ్రత్తలు చెప్పేందుకు వీడియో తీశాడు.అనంతరం, కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఊపిరి ఆడక కారు అద్దం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్న పాము రక్షించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కారు అద్దంలో ఇరుక్కున్న పామును పట్టుకున్నారు. స్థానిక అటవీ ప్రాంతానికి తరలించారు. ⚠️ Safety Alert for Drivers!Shocking Incident on Namakkal–Salem Road: Snake Discovered Inside Car’s Side Mirror While DrivingAs the cold and rainy season sets in, motorists are urged to be extra cautious before hitting the road. Always inspect your vehicle thoroughly… pic.twitter.com/AOGzVdArxi— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025 -
మీటింగ్ పెట్టుకున్న పాములు.. మరీ ఇన్నా!
మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని నసురుల్లాబాద్ సమీపంలో పొలం వద్ద రైతు కావలి యాదయ్య ఇల్లు ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర్లో పాము కనిపించడంతో సర్పరక్షకుడు సదాశివయ్యకు సమాచారమిచ్చారు. ఆయన తన శిష్యులైన రవీందర్, భరత్‌ను పంపగా వారు బండకింద ఉన్న పామును బయటకు తీసేందుకు యత్నిస్తుండగా.. ఒకటి తర్వాత మరొకటి మొత్తం 7 పాములు బయటపడ్డాయి. బయటపడ్డ పాములు వాన కోయిల (బాండెడ్ రేసర్)లని.. ఆర్ఘోరోజైస్ ఫెసియోలేట శాస్త్రీయనామం గల ఈ పాములు కొలుబ్రిడే కుటుంబానికి చెందినవని, విష రహితమని సర్పరక్షకుడు తెలిపారు. ఈ జాతి పాములు సాధారణంగా ఒకటి, రెండు మాత్రమే కలిసి ఉంటాయని.. అంతకంటే ఎక్కువ ఉండటం అరుదన్నారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒకే ప్రదేశంలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. -
మున్నేరు ఉగ్రరూపం.. ఇళ్లలోకి వస్తున్న విషసర్పాలు
-
వింత పాము ప్రత్యక్షం
అన్నమయ్య జిల్లా : తంబళ్లపల్లెలో వింత పాము ప్రత్యక్షమైంది. మల్లయ్యకొండ కింద పొలం పనులకు వెళ్లిన రైతులకు ఈ పాము కనిపించింది. బ్రాహ్మణ బ్లైండ్ స్నేక్ (ప్లవర్ పాట్ స్నేక్) గా పిలవబడే ఈ పాము ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పాము 1–018 సెంటీమీటర్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. భూమి లోపల ఉండే పాము వర్షం పడిన సమయాల్లో అరుదుగా బయటకు వస్తుందన్నారు. -
కరెంట్ షాక్ నుంచి పాముని కాపాడారు!
జడ్చర్ల టౌన్: విద్యుదాఘాతంతో గాయపడిన జెర్రిపోతుకు సర్ప రక్షకుడు సదాశివయ్య బుధవారం చికిత్స చేసి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీలక్ష్మి రాజేంద్రనగర్ ఇండస్ట్రీలో పవర్ బోర్డులోకి జెర్రిపోతు చేరడంతో విద్యుదాఘాతానికి గురైంది.ఇది గమనించిన ఇండస్ట్రీ యజమాని సర్ప రక్షకుడు (Snake Saver) సదాశివయ్యకు సమాచారం అందించాడు. దీంతో ఆయన బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంలో చికిత్స చేశారు. ప్రస్తుతం జెర్రిపోతు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయుడు పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి (parvathagiri) మండలంలోని రావూరు ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదుగురు విద్యార్థులు ఉండే విధంగా ఉపాధ్యాయుడు చూడాలని కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓ ఆదేశించారు. అయినా ఆ పాఠశాలకు ఐదుగురు విద్యార్థులు రాలేకపోయారు.పాఠశాలను తీసేద్దామనుకున్న క్రమంలో ఒక విద్యార్థి చేరగా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. పాఠశాలను గ్రామంలో ఉంచే విధంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. చదవండి: అయ్యో.. హైదరాబాద్‌లో ఇన్ని కేసులు మూసేశారా? -
పాము కడుపులో ప్లాస్టిక్ బాటిల్.. ఎలా బయటకు వచ్చిందో చూశారా?
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. 2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే.. చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్‌ను తొలగించింది. అది ఒక సన్‌స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ! -
స్నేక్హితుడు..!
శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్‌గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్‌కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్‌తో పాటు ప్రత్యేక యూట్యూబ్ చానల్ సైతం ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నాడు. -
కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కట్నం డబ్బుల(dowry) కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) కాన్పూర్నగరంలోని కల్నల్‌గంజ్‌లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది.బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్‌తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. చదవండి: నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది! -
కాటేసిన కట్లపాము తల కొరికేశాడు
తిరుపతి జిల్లా: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను కాటేసిన కట్లపామును పట్టుకుని తల కొరికేశాడు. ఆ పామును ఇంటికి తీసుకువెళ్లి తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ విచిత్ర ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో గురువారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు... చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్ (47) గ్రామంలో జాతర సందర్భంగా గురువారం రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కట్లపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ వెంటనే ఆ పామును పట్టుకుని తల కొరికేశాడు. ఆ పామును చేతపట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి మంచంలో తన పక్కనే పెట్టుకుని నిద్రించాడు. ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచే సమయానికి వెంకటేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పక్కన చనిపోయిన పాము ఉంది. వెంటనే అతడ్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాము కాటు వేయడం వల్ల వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. -
ప్యాషన్‌ప్లస్ బైక్‌లో కట్లపాము
నాగర్‌కర్నూల్ జిల్లా: మండలంలోని ఎల్లూరుకుకి చెందిన యువకుడు గణేశ్ బైక్‌లో కట్లపాము దాక్కుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గణేశ్ ప్యాషన్‌ప్లస్ బైక్‌పై గురువారం ఉదయం భయలుదేరాడు. పట్టణంలోని ద్వారకా లాడ్జ్ ముందు రోడ్డుపై వెళ్తుండగా బైక్ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చి బైక్‌ను ఆపుకొని చూడగా కట్ల పాము కనిపించింది. దాన్ని భయటకు తీసేందుకు కొద్దిసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మెకానిక్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్ సద్దాం బైక్ పార్ట్స్ విప్పి పామును భయటికి లాగాడు. ఈ పాము దాదాపు మూడున్నర ఫీట్ల మేర పొడవు ఉంది. రాత్రి ఇంటిముందు పార్కుచేసిన సమయంలో బైక్‌లోకి పాము ఎక్కి ఉండొచ్చని గణేశ్ చెప్పాడు. పామువల్ల ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
Garam Garam Varthalu: కరవకముందే కంగారెందుకు
-
బుస్ బుస్..స్నేక్ వెరైటీల్లో టాప్ 10 దేశాలివే...
ఇది వానాకాలం...సిటీలో ఉన్నవారికి ఈ సీజన్లో ఏవేవో గుర్తు రావచ్చు గానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రం వెంటనే గుర్తొచ్చేవి, వారిని అప్రమత్తం చేసేవి పాములు అని చెప్పాలి. ఈ సమయంలో పాములు పొలాల్లో నుంచి ఇళ్లలోకి కూడా ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామీణులు, నగర శివార్లలో ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు ప్రపంచంలో పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఎన్నెన్ని జాతులు పాములు ఉన్నాయి? మన దేశం ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి పరిశీలిస్తే...పాముల సంఖ్యలో తొలిస్థానం మెక్సికో దేశం దక్కించుకుంటోంది. ఈ దేశంలో దాదాపుగా 400కిపైగా సర్ప జాతులు ఉన్నట్టు అంచనా. వీటిలో రాటిల్ స్నేక్స్, కోరల్ స్నేక్స్, బోవా పాములు వంటివి ఉన్నాయి.పాముల సంఖ్యలో 2వ స్థానాన్ని దక్కించుకుంది బ్రెజిల్. అయితే జాతుల రీత్యా చూస్తే ఈ దేశంలో 420కిపైగా పాములు ఉన్నట్టు లెక్కించారు. వీటిలో చెట్లలో నివసించే వాటి నుంచి అనకొండ వంటి భారీ సర్పాల వరకూ ఉన్నాయి.ఈ జాబితాలో ఇండోనేసియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సముద్ర సర్పాలు, పైథాన్స్ వంటి రకాలతో కూడిన 376 సర్ప జాతులకు ఈ దేశం నిలయంగా ఉంది.పామును దైవంగా కొలిచే కోట్లాది మంది ప్రజలున్న మన భారత దేశం ఈ లిస్ట్‌లో 4వ ప్లేస్ దక్కించుకుంది. కోబ్రాలు, పచ్చని పల్లి పాములు, క్రైట్స్ సహా 305 సర్ప జాతులు మన దేశంలో ఉన్నాయట.దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలకు చిరునామా అయిన కొలంబియా మన తర్వాత 5వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 305 రకాల స్నేక్ వెరైటీలు ఉన్నాయి. బుష్ మాస్టర్స్, కోరల్ స్నేక్స్ వంటి పాముల జాతులకు ఈ దేశం పేరొందింది.జనాభాలో నెం2గా ఉన్న చైనా పాముల జనాభాలో 6వ స్థానం చేజిక్కించుకుంది. పిట్ వైపర్స్ వంటి అరుదైన జాతులతో సహా 246 వెరైటీలు చైనాలో ఉన్నాయి.సైజులో చిన్న అయినా పాముల పాప్యులేషన్లో పెద్ద దేశాల సరసన చోటు సంపాదించింది ఈక్వడార్. ఈ దేశంలో అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్స్ వంటివి పాముల నిలయాలుగా మారి 241 సర్పజాతులకు ఈ దేశాన్ని అడ్రెస్‌గా మార్చాయి.మొత్తం 226 సర్ప జాతులతో వియత్నాం 8వ స్థానం అందుకుంది. కోబ్రాలు, కీల్ బ్యాక్స్ వంటి వెరైటీలతో ఈ దేశంలోని అడవులు సర్ప నిలయాలుగా పేరొందాయి.ప్రకృతి సౌందర్యంతో, పర్యాటకుల ఆకర్షణలో ముందున్న మలేషియా 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో రంగురంగుల పాములు ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా 216 స్నేక్ వెరైటీలు ఉన్నాయట.టాప్ 10లో చివరి దేశంగా నిలిచిన ఆస్ట్రేలియాలో 215 సర్పజాతులు ఉన్నాయని లెక్కించారు. అత్యంత ప్రమాదకరమైన టైపాన్స్, బ్రౌన్ స్నేక్స్, టైగర్ స్నేక్స్‌కు ఈ దేశం కేరాఫ్‌గా ఉంది. -
వామ్మో.. బామ్మ.. కోబ్రానే షేక్ చేసిందిగా..
-
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు పాములు.. మరో వైపు కుక్కలతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ కార్మికులు సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వెటర్నరీ కారి్మకులకు కౌన్సిల్ తీర్మానం 36 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 53 మంది కార్మికులు ఏళ్ల తరబడి పాములు, కుక్కలను పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని, కానీ వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, 2024 డిసెంబర్ 11న కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు పెంచుతూ తీర్మానించారని తెలిపారు. ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏడు నెలల బకాయిలతోపాటు పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పామును కరిచి బతికిన పిల్లాడు.. అసలు జరిగింది ఇదే!
పట్నా: బిహార్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన విషయం తెలిసిందే. బొమ్మ అనుకుని పామును పట్టుకున్న పిల్లవాడు. దానిని నోటితో కొరికి చంపాడు. స్వల్ప విష ప్రభావంతో ఆస్పత్రిపాలైన బుడ్డోడు.. చివరకు ప్రాణాలతో బయపడ్డాడు. అయితే పామును కొరికినప్పటికీ పిల్లాడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై సర్వత్రా ఆశ్యర్చానికి గురవుతున్నారు.తాజాగా చిన్న పిల్లాడు బతికి బయటపడటంపై గల కారణాలను వైద్యులు వెల్లడించారు. సాధారణంగా పాము వ్యక్తులను కరిచినప్పుడు దానికున్న విషం రక్తంలోకి ప్రసరిస్తుందని, ఇది , నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీనివల్ల అనారోగ్యానికి గురికావడం లేదా కొన్నిసార్లు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అయితే గోవింద్ విషయంలో విషం నోటి ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిందన్నారు. మానవ జీర్ణవ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి తట్టుకోగలదని, ప్రాణాపాయాన్ని నివారిస్తుందన్నారు. ఒకవేళ శరీరంలో అంతర్గత రక్తస్రావం అయితే.. బాలుడుపరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ అదృష్టవశాత్తు అలాంటి సమస్యలు ఏం రాలేదని అన్నారు. అసలేం జరిగిందంటే.. బీహార్‌లో, ఏప్రిల్ 2023 మరియు మార్చి 2024 మధ్య 934 మంది పాముకాటు కారణంగా మరణించారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అదే సమయంలో, 17,800 మందికి పైగా రాష్ట్ర ఆసుపత్రులలో పాముకాటుకు చికిత్స పొందారు వెస్ట్చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే పిల్లాడు నీరసించిపోయి తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. -
పాములే ఆహారం.. వాగులే ఆవాసం
గిరినాగు (కింగ్ కోబ్రా) అత్యంత ప్రమాదకరమైన సర్పం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులకు ఇతర పాములే ఆహారం. వర్షాకాలంలో పాములను తినేందుకు ఇవి బయటకు వస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు సమీపంలో వీటి జాడ ఎక్కువగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అరుదైన గిరినాగులు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల మధ్య 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నిలయంగా ఉన్న ఈ అభయారణ్యంలో గిరి నాగుల సంచారం ఎక్కువగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు పరిమితమయ్యే ఈ సర్పాలు అత్యంత విషపూరితం. అలాగే ఇవి అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగులు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు పరిసర ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయని వైల్డ్ లైఫ్ అధికారులు అంటున్నారు.ఆహారం కోసం బయటకు.. మార్చి నుంచి జూలై వరకు గిరినాగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో జల వనరులు తగ్గినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. రబీ సీజన్ అనంతరం ఇతర పాములు పొలాల్లో ఉండటంతో ఆహారం కోసం వాటిని వెతుక్కుంటూ గిరినాగులు వస్తుంటాయి. గతేడాది వర్షాకాలంలో బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం సమీపంలో, ఇనుమూరు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అటవీ ప్రాంతంలో, ఇటీవల గడ్డపల్లి, ముంజులూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో గిరినాగులతో పాటు పది అడుగుల తాచుపాములు, రక్తపింజర వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. పట్టుకుని అడవిలో వదిలేస్తూ.. ఇటీవల కాలంలో వర్షాకాలంలోనూ గిరిజనులు పొలాల్లో సంచరిస్తున్నాయి. వీటి సమాచారం అందిస్తే ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇవి అరుదైన పాములు కావడంతో వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 20 అడుగుల పొడవు గిరినాగు పాము చాలా ప్రమాదమైంది. 20 అడుగుల పైగా పొడవు ఉంటుంది. బాగా ముదిరిన పాము చాలా డేంజర్. నేను చాలాసార్లు వాటిని చూశాను. అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అవి కనిపిస్తే పరుగులు తీసేవాళ్లం. –ఎస్.ప్రసాద్, బుట్టాయగూడెం మనుషులపై దాడి చేయవు గిరినాగులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే వాటిని భయపెట్టడం లేదా రెచ్చగొట్టడం చేస్తే కాలువేస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము. కాటు వేస్తే మరణమే తప్ప జీవించే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. –గంధం విక్టర్, బుట్టాయగూడెంసమాచారం ఇవ్వండి పశి్చమ ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. ప్రాణభయంతో పాములను చంపవద్దు. మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. ఈ పాములు అరుదైనవి. అభయారణ్యంలో వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –ఎస్కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరంఅత్యంత ప్రమాదకరం గిరినాగులు అత్యంత ప్రమాదకరం. వీటిని పట్టుకోవడం అంత సులువు కాదు. పాపికొండలు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నట్టు ఫోన్లు వస్తున్నాయి. గిరినాగు పాము కనిపిస్తే ఎవరూ చంపవద్దు. 8099855153 నంబర్‌కు ఫోన్ చేస్తే నేను పట్టుకుని అడవిలో వదిలేస్తా. –చదలవాడ క్రాంతి, స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, జంగారెడ్డిగూడెం -
ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు. -
చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్.. వీడియో వైరల్
పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్ లైఫ్‌లో పాములను రేర్‌గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. కానీ ‘రియల్ హీరో’, నటుడు సోనూ సూద్(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ముంబైలో సోనూ సూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS— sonu sood (@SonuSood) July 19, 2025 -
భక్తి పారవశ్యం: చేతుల్లో పాములతో ఆలయానికి.. వీడియో చూస్తే గగుర్పాటే
భక్తి అనేది పలు రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, దాస్యం అను నవవిధ భక్తి మార్గాలు గురించి విన్నా. కానీ ఇలాంటి భక్తి మార్గాన్ని మాత్రం చూసుండరు. ఆ భక్తి చూస్తేనే షాక్‌కి గురిచేసేలా ఉంటుంది. అలాంటి భక్తి పారవశ్యాన్ని బీహార్‌లో చూడొచ్చు. ఆ భక్తుల అసమాన భక్తికి భయం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలుగుతాయి.బీహార్‌లోని సమస్తిపూర్లోని సింగియా ఘాట్ వందలాది మంది భక్తులతో సందడిగా ఉంది. వారంతా నాగ పంచమి ఉత్సవంలో పాల్గొనడానికి పెద్త ఎత్తున వచ్చారు. అక్కడ మతపరమైన ఆచారంలో భాగంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పాములను ఉట్టి చేతులతో నేరుగా పట్టుకుని వెళ్లే సాంప్రదాయం చూస్తే నోటమాట రాదు. అక్కడి ప్రజలంతా సింగియా బజార్‌లోని మా భగవతి ఆలయంలోకి ఆ పాములను తీసుకుని వెళ్తున్నారు. వారంతా ఆ పాములును కర్రలకు లేదా తలకు, చేతులకు చుట్టుకుని తీసుకువెళ్తుడటం విశేషం. అది చాలా సర్వసాధారణం అన్నట్లుగా ఆ పాములను చేత్తో పట్టుకుని స్థానిక సర్ప దేవత అయిన మాతా విషరి నామాన్ని జపిస్తూ మా భగవతి ఆలయానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత పూజలు చేసి వాటిని అటవీ ప్రదేశంలో వదిలేస్తారట. అక్కడ బిహార్ చుట్టుపక్కల గ్రామలైన ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, మిథిలా, ముజఫర్‌పూర్ జిల్లాతో సహా అంతటా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. విదేశీయలును ఆకర్షించే ప్రధాన ఉత్సవం కూడా ఇదే. అయితే అక్కడ స్థానికులు మాత్రం ఇదంతా సంప్రదాయమని చెబుతుండటం విశేషం. ఊరేగింపుగా పాములను తీసుకొచ్చి పవిత్ర తోటలు లేదా ఆవరణంలో వాటిని ఉంచి పూజలు చేస్తారట. వారంతా తమ కుటుంబ రక్షణ, ఆరోగ్యం కోసం నాగ దేవతను ఇలా ప్రార్థిస్తారట. కోరికలు తీరిన తర్వాత నాగపంచమి నాడు కృతజ్ఞతగా నైవేద్యాలు నివేదించి ఇలా పాములను చేత పట్టుకుని ఉత్సవం చేస్తారట. అయితే ఇంతవరకు ఈ ఉత్సవంలో అప్పశృతి చోటు చేసుకోలేదట. పైగా ఈ పండుగలో ఇంతవరకు ఎవ్వరికి పాము కాటు, లేదా గాయం అయిన దాఖాలాలు కూడా లేవట. ఆ విచిత్రమైన పండుగకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pradeep Yadav (@br_vlogger17) (చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్‌గా..
పాముల్లో రాజు..కాటేసిందో అంతే మటాష్ అంత భయంకరమైన పాయిజినస్ పాము కింగ్ కోబ్రా. దాన్ని చూస్తేనే భయం. అవి చాలా భయంకరమైన కారడవుల్లో ఉంటాయని విన్నాం, పలు వీడియోల్లో చూశాం. కానీ రియల్‌గా దాని సైజు ఎంత ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..వామ్మో అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ అందుకు సంబంధించిన 11 సెకన్ల క్లిప్‌ని నెట్టింట షేర్ చేశారు. అందులో ఒక వ్యక్తి చాలా నిర్భయంగా భారీ కింగ్ కోబ్రాని ఉత్తిచేతులతో పట్టుకుని నిలబడినట్లు కనిపిస్తుంది. ఆ భారీ కింగ్ కోబ్రాని పట్టుకున్నానన్న భయం, బెరుకు లేకుండా చాలా ప్రశాంతంగా పట్టుకుని నిల్చున్న తీరు చూస్తే..వామ్మో ఏం గుండె రా నీది అని అనిపించక మానదు. ఈ వీడియోకి పర్వీన్ ఈ పాములు భారతదేశంలో ఎక్కడుంటాయో తెలుసా అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.(చదవండి: చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?: వీడియో వైరల్) -
తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే కర్తవ్యం
జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు. భీష్మునితో ధర్మరాజు... ‘పట్టుదలతో చుట్ట పక్కాలను చంపుకున్నాను. దుర్యోధనుడు రాజ్యం పంచుకోవటానికి ఇష్ట పడలేదు. నేనైనా కోపం మాని, అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరి వల్ల ఇంత జన నష్టం జరిగింది’ అని బాధ పడ్డాడు. అప్పుడు భీష్ముడు ‘చంపటానికి మనిషి కర్త కాడు’ అని ఉదాహరణ పూర్వకంగా ఒక కథ చెపుతాడు.గౌతమి అనే వనిత కుమారుడు పాము కాటుకు చనిపోతాడు. ఆమె దుఃఖిస్తుండగా ఒక వేటగాడు ఆ పామును చంపబోయాడు. ఆమె వారించి, ‘పామును చంపితే నా బిడ్డ బతుకుతాడా? శత్రువునైనా చేత చిక్కితే చంపటం న్యాయం కా’దంది.పాము తాను మృత్యు దేవత పంపగా వచ్చాను కానీ, స్వయం కర్తను కాదంది. అంతలో మృత్యువు వచ్చి, తాను యముడు పంపగా వచ్చానని, తాను ఆ బాలుడి మరణానికి కారణం కాదంది. యమధర్మరాజు వచ్చి... పాము, మృత్యువు, తాను ఈ బాలుడి మరణానికి కారణం కాము; అతడి కర్మలే కారణం. జీవుడు కర్మఫలాన్ని తప్పించుకోలేడని చెబుతాడు. వేటగానికి జ్ఞానోదయమై వెళ్ళిపోతాడు. కాబట్టి, ‘యుద్ధంలో బంధు మిత్రులు మరణించటానికి వారి కర్మలే కారణం కానీ, నీవు గానీ, దుర్యోధనుడు గానీ కారణం కాదు’ అని భీష్మ పితామహుడు చెప్పాడు. తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే మనుషుల కనీస కర్తవ్యం. – డా.చెంగల్వ రామలక్ష్మి -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్‌లో పామ్‌ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్‌లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్Bangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025 -
వామ్మో పాము.. విమానంలో కలకలం
ఆస్ట్రేలియాలోని విమానంలో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టు నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే విమానంలోకి పాము దూరింది.విమానంలో ప్రయాణికుల లగేజ్ భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్ క్యాచర్‌ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.మొదట పాము విషపూరితమైనదిగా అనుమానించారు.. కానీ పట్టుకున్న తర్వాత అది విషపూరితం కాదని.. అది పసిరిక పాముగా గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ తనిఖీల వద్ద బాగా ఆలస్యం జరిగినట్లు స్నేక్ క్యాచర్ పెల్లీ వెల్లడించాడు. -
‘కస్టమ్స్’ చేతికి 16 అందమైన పాములు
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్ ఆరోపణలతో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్‌కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్బర్డ్ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? -
పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?
కాకులు దూరని కారడవులు చీము దూరని చిట్టడవులు గురించి విన్నాం కానీ..భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి ఎపుడైనా విన్నారా? అవును ఈ భూ ప్రపంచంలో పాములు, దోమలు లేని దేశం ఒకటి ఉంది. కనీసం జూలో చూద్దామన్ని కూడా కనిపించవు. అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు అక్కడ మనుగడ సాగించలేకపోయాయి. మరి భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా? అమెరికా, చైనా, జపాన్, టర్కీ, రష్యానో అనుకుంటున్నారా? కానే కాదు. పదండి తెలుసుకుందాం.ప్రపంచంలో 3,900 కంటే ఎక్కువ రకాల పాములు ఉన్నాయి మరియు భారతదేశంలో 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం విషపూరితం కానివే. దాదాపు 60 విషపూరిత మైనవి. కొన్ని పాములు కరిస్తే ప్రాణాపాయం కూడా. కొన్ని నివేదికల ప్రకారం, ఏ సమయంలోనైనా 110 ట్రిలియన్ దోమలు సజీవంగా ఉన్నాయని అంచనా.ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశంభారతదేశంలో, కేరళ తీరప్రాంతాలు మొదలు ఢిల్లీ, ముంబై వంటి సందడిగా ఉండే నగరాల వరకు, చల్లగా ఉండే హిమాచల్, కాశ్మీర్లో కూడా దోమలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం ఐస్లాండ్. పాములు,ఇతర సరీసృపాలు లేకపోవడానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి "పాములు లేని దేశం" అనే మరో పేరు కూడా వచ్చింది. అంతేకాదు అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు , దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు మాత్రం ఇక్కడ జీవించలేవు. ఐస్లాండ్లో వేగంగా మారుతున్న వాతావరణం, ఎక్కువశీతల వాతావరణం దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాతావరణం దోమల గుడ్ల అభివృద్ధి ,పొదగడానికి ఆటంకం కలిగిస్తుందట. అందుకే దోమలు, పాములు లేని ప్రశాంతమైన, శుభ్రమైన, చల్లగా ఉండే దేశం ఐస్లాండ్.ఎందుకు లేవంటేదోమలు సాధారణంగా మురుగు నీరు, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. దోమల గుడ్లు దోమలగా మారడానికి స్థిరమైన ఉష్ణోగ్రతలు కూడా అవసరం. అయితే, ఐస్లాండ్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఐస్లాండ్ సహజ పారుదల , వేగంగా కదిలే నీటి వ్యవస్థల కారణంగా, దోమల పెంపకానికి అవసరమైన నిలిచిపోయిన నీరు, దోమల పునరుత్పత్తికి అనుమతించేంత కాలం ఉండదు.ఇక్కడి జనసాంద్రత, తక్కువ ఉష్ణోగ్రతలు దోమల గుడ్లు లేదా లార్వాల కనుగుణంగా ఉండవు. దీని వలన దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది. దోమలు తక్కువగా ఉండటానికి ఇతర కారణాలు:కొన్ని అధ్యయనాల ప్రకారం, ఐస్లాండ్లోని భూమిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది దోమల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే, ఐస్లాండ్లో దోమల సహజ శత్రువులు కూడా ఉన్నాయి, ఇవి వాటి జనాభాను నియంత్రిస్తాయి ఇస్లాండ్లో దోమల్ని పోలిన కీటకాలుంటాయి. కానీ ఇవి కట్టవు, వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే పాములు నివసించలేని చల్లని దేశం ఐస్లాండ్. ఐస్ లాండ్ పేరుకు తగ్గట్టే.. చల్లటి మంచు ప్రదేశంలో వాతావరణం పాముల మనుగడకు ఏమాత్రం అనువుగా ఉండదు.ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు. చుట్టూ నీటితో నిండి ఉండటం కూడా ఒక కారణం. పాములు మహా సముద్రాలను దాటవు. దోమలు అంత దూరం ఎగరవు. అందుకే ఐర్లాండ్‌లో కూడా దోమలు కనిపించ వని చెబుతారు. ఇదీ చదవండి: నేచురల్ బ్యూటీ లుక్ : సీక్రెట్ షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కాగా ప్రపంచంలో పాములు లేని ఐర్లాండ్, దేశం న్యూజిలాండ్ , గ్రీన్లాండ్, అలాస్కా లాంటి ప్రాంతాల్లో కూడా పాములు కనిపించవు. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. -
సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్‌లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్‌కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్‌లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 -
బస్సు గేర్ బాక్సులో బుస్‌బుస్..!
జగిత్యాల టౌన్: ఆర్టీసీ బస్సు గేర్ బాక్సులో పాము దూరడంతో ప్రయాణికులు భయభ్రాంతులై పరుగులు తీశారు. వివరాలివి. మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు వస్తున్న పల్లె వెలుగు బస్సు.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ డెయిరీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ రోడ్డుకు అడ్డంగా పాము రావడాన్ని గమనించిన డ్రైవర్.. దాన్ని కాపాడే ఉద్దేశంతో బస్సును అకస్మాత్తుగా నిలిపివేశాడు. రోడ్డు దాటి వెళ్లాల్సిన పాము.. బస్సు కింది భాగం నుంచి గేర్ బాక్సులోకి దూరింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై బస్సు దిగి పరుగులు తీశారు. ఏం చేయాలో తెలియని డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపి ఉంచడంతో అర్ధగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక యువకులు గేర్‌బాక్సులో దూరిన పామును బయటకు లాగి చంపిన అనంతరం.. బస్సు అక్కడి నుంచి బయలుదేరింది. -
నిర్లక్ష్యం.. బుసలు కొడుతోంది!
నాలుగు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎన్టిఆర్ వైద్యసేవ కార్యాలయంలో పది అడుగుల నాగుపాము కనిపించింది. గది బయట బుసలుకొడుతున్న పామును చూసి ఓ ఉద్యోగికి గుండె ఆగినంత పనయింది. వెంటనే తేరుకొని కేకలు వేయగా చుట్టుపక్క ఉద్యోగులు వచ్చేసరికి ఓ తొర్రలోకి జారుకుంది. దీంతో మళ్లీ అది బయటకు రాకుండా సిమెంట్‌తో ఆ తొర్రను మూసేశారు. ఆసుపత్రిలోని ఓ అధికారి ఛాంబర్లో ఎలుకలు విపరీతంగా వచ్చి ఫైళ్లు పాడుచేసేవి. ర్యాట్ప్యాడ్లు పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కాస్త తెలివిగా ఆలోచించాడు. ఎక్కడికక్కడ బిస్కెట్లను ఏర్పాటు చేయడంతో వాటిని తిన్న ఎలుకలు ఫైళ్ల జోలికి వెళ్లకపోవడం గుర్తించాడు. ఇదేదో బాగుందని అదే ఉపాయాన్ని కొనసాగించారు. ఆసుపత్రిలో చెట్ల నీడ ఉందని వెళ్లి భోజనానికి కూర్చుంటే చాలు పందులు, కోతులు, కుక్కలతో పాటు ఎలుకలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల రోగుల సహాయకులు ప్రశాంతంగా నాలుగు ముద్దలు కూడా తినలేని పరిస్థితి. రాత్రయితే చాలు దోమల దండయాత్ర నిద్రను దూరం చేస్తోంది. రాత్రిపూట అటుంచితే.. పట్టపగలే ఆసుపత్రి ఆవరణలో పాములు తిరుగాడుతుండటంతో రోగుల గుండె జారుతోంది. ఎలుకలు పట్టేందుకు బోధనాసుపత్రిలో ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు మెడికల్ కాలేజీ, ప్రాంతీయ కంటి ప్రభుత్వ ఆసుపత్రిలలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు బోధనాసుపత్రిలో సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ కింద దోమలు, బల్లులు, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, పాములు, ఇతర విషకీటకాల నివారణకు వాడే పెస్టిసైడ్స్‌ను మధ్యాహ్నం వరకు హెల్త్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలుకలు, పాములు ఉంటే వాటిని పట్టుకుని సంహరించాలి. ఈ మేరకు నిర్వహణకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు రూ.5లక్షలు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో రూ.30వేలు, మెడికల్ కాలేజిలో మరో రూ.30 వేలు కలిపి నెలకు రూ.5.90 లక్షలు, ఏడాదికి రూ.70,80,000 వెచ్చిస్తున్నారు. నిర్వహణ సంస్థలో పది మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆరుగురితో మమ అనిపిస్తుండటం వల్లే విష పురుగులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయని తెలుస్తోంది. పట్టపగలే ఎలుకలు, పాముల సంచారం ఆసుపత్రి, కళాశాల ఆవరణలో రాత్రేమో గానీ ఖాళీ ప్రదేశాల్లో పట్టపగలే ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి బయటకు వచ్చి వార్డులు, కార్యాలయ గదుల్లోకి దూరుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ గైనిక్ విభాగం, శక్తిసదన్, కంటి ఆసుపత్రిలోని ఖాళీ ప్రదేశాలు, డైట్ విభాగం, దాని పక్కనున్న ఖాళీ ప్రదేశాలు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రాంతం, సూపర్‌స్పెషాలిటి విభాగం పక్కనున్న ఖాళీ ప్రదేశం, ఐడీ వార్డు, మానసిక వ్యాధుల విభాగం, యుపీ, పీజీ హాస్టల్స్ పరిసరాలు పాములకు నిలయాలుగా మారాయి. ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మొక్కలు ఏపుగా పెరగడంతో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటిని తినేందుకు పాములు వస్తున్నాయి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వద్ద ఇటీవల నిరుపయోగంగా ఉన్న ఇనుప సామాను అంతా కుప్పపోసి ఉంచారు. వాటిని టెండర్ పాడిన వారు తీసుకెళ్లకపోవడంతో ఆ ప్రాంతంల్లో పాముల సంచారం అధికంగా ఉంటోందని రోగుల సహాయకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల బంధువులు ఆరుబయట భోజనం చేసి, అక్కడే చేతులు కడుక్కోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని తినేందుకు ఎలుకలు, బొద్దింకలు అధికంగా పుట్టుకొస్తున్నాయి. చీకటి పడితే చాలు దోమల బెడద బోధనాసుపత్రిలో రోజూ సాయంత్రం అయితే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. వాటి బారి నుంచి రక్షణ పొందేందుకు రోగులు, వారి సహాయకులు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడుతున్నారు. అన్ని విభాగాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తూతూ మంత్రంగా పెస్ట్‌కంట్రోల్ నిర్వహణఆసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణ తూతూ మంత్రంగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్ర మే సంబంధిత ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాములు, ఎలుకలు, పందికొక్కులు తిరిగే చోటును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. వీరి పనితీరును బట్టి అధికారులు మార్కులు వేయాల్సి ఉంటుంది. పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే ఇటీవల మూడు నెలలుగా బిల్లులకు ఆసుపత్రి అధికారులు బ్రేక్ వేశారు. టెండర్ కాలపరిమితి ముగియడంతో అధికారుల చర్యలకు సైతం కాంట్రాక్టర్ స్పందించడం లేదని సమాచారం. పగలు ఈగలు, రాత్రి దోమల బాధ మా అక్క కూతురు కాన్పు కోసం 16 రోజుల క్రితం గైనిక్ వార్డులో చేర్చాం. ఆమెకు రక్తస్రావం అవుతుంటే ప్రసవం ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో పగలు, రాత్రి వార్డు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడి కారు షెడ్డులో రాత్రివేళ ఉంటున్నాం. ఇక్కడ పగలు ఈగలు, రాత్రి దోమల బాధ భరించలేకున్నాం. ఏదైనా తిందామంటే కూడా తిప్పలే. అందుకనే నెట్ తెచ్చుకొని అందులో ఉంటున్నాం. – అంజలి, నంద్యాల పట్టణంఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఆసుపత్రిలో ఎలుకలు పట్టేందుకు అవసరమైన ప్యాడ్లను ఏజెన్సీ వారు తెప్పించారు. పాములు రాకుండా అవసరమైన రసాయనాలు అక్కడక్కడా ఉంచుతున్నారు. ఎక్కడైనా ఎలుకలు, పాములు సంచరిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..
-
ప్రసాదంలో పాము పిల్ల
హోసూరు(కర్ణాటక): ఆలయ సిబ్బంది, ప్రసాదం నిర్వాహకుల నిర్లక్ష్యం భక్తులను కలవరపరచింది. హొసూరు కార్పొరేషన్ పరిధిలో వెలసిన ప్రసిద్ధ మరగతాంబ సమేత శ్రీ చంద్రచూడేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంలో పాము పిల్ల వచ్చింది. వివరాలు.. కొండమీద ఉన్న ఆలయానికి నిత్యం వందలాది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుని ప్రసాదాలు కొంటారు. ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ ప్రసాదాల దుకాణం ఉంది. మంగళవారం ఓ భక్తుడు పులిహోర ప్రసాదం డబ్బా కొనుగోలు చేశాడు. తెరవగానే అందులో చచ్చిన పాము పిల్ల కనిపించగానే దిగ్భ్రాంతి చెందాడు. భక్తులు కలిసి దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంట సిబ్బంది వండేటప్పుడు పాము పిల్ల పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
ఇంట్లో పాముల కలకలం
అన్నానగర్(తమిళనాడు): నాగర్‌కోయిల్ సమీపంలోని పల్లందురై లూర్దేస్ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. -
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
తిరుపతి,సాక్షి: తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారు. ఈవో శ్యామలరావు సమాచారంతో పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకిచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును గోనె సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం రవీందర్ నాయుడును స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స కొనసాగుతోంది. -
నీటితొట్టెలో పాముల ఫ్యామిలీ
కర్ణాటక: ఒక్క పామును చూస్తేనే హడలిపోతారు. ఇంకా ఎక్కువ పాములను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. ఇలాంటి ఘటనే శివమొగ్గ నగరంలో జరిగింది. కువెంపు లేఔట్లో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటిలో ఉన్న నీటి తొట్టిలో ఓ పాము గుడ్లను పెట్టి పొదిగింది.ఆదివారం తొట్టి బయట ఒక పాముపిల్లను చూసిన కుటుంబ సభ్యులు తొట్టెలో లైటు వేసి చూడగా పుట్టల కొద్దీ పాము పిల్లలు కనిపించడంతో భయపడిపోయారు. వెంటనే స్నేక్ కిరణ్‌కు(snake kiran) సమాచారం ఇచ్చారు. స్నేక్ కిరణ్ అప్పటినుంచి పాము పిల్లలను సేకరించసాగారు. సోమవారం నాటికి 69 పిల్ల పాములను పట్టి బకెట్లో నిల్వ చేశారు. వాటిని తీసుకెళ్లి దూరంగా ఓ చెరువులో వేశారు. కాగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పాముల బ్యాగు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు(Indira Gandhi Airport)లో కలకలం చెలరేగింది. కస్టమ్స్ అధికారులు అరుదైన జీవ జాతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారత పౌరులను అదుపులోనికి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిన్న(శనివారం) రాత్రి బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఏఐ 303లో ముగ్గురు ప్రయాణికులు అరుదైన జీవ జాతులను అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. వీరి బ్యాగులను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) షాక్ తిన్నారు. ఆ బ్యాగులో పాములు, బల్లులు, కప్పలు, కీటకాలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జీవ జాతులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ జీవ జాతులను వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అథారిటీకి అప్పగించారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే! -
శివాలయంలో అనుకోని అతిథి
-
అక్కడ స్నాక్‌గా స్నేక్‌లు..!
మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్‌లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్‌గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..ఫుడ్ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్ వ్లాగర్. అంతేకాదండోయ్ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Chaudhary (@kaash_chaudhary) (చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
అంగన్వాడీ కేంద్రంలో పాము కలకలం
అన్నానగర్: పర్వతాలతో కూడిన కృష్ణగిరి జిల్లాలో తేన్కనికోట అంతెవనపల్లి కొండ గ్రామం ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పాము కలకలం సృష్టించింది. పిల్లలు కేంద్రంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్క సారిగా పాము కనిపించడంతో సిబ్బంది చిన్నారులను బయటకు పంపించి తెన్కనికోట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు పామును పట్టుకుని అడవుల్లోకి వదిలేశారు. -
పాము గుడ్లు కూడా విషపూరితమేనా? తింటే ఏమవుతుంది?
పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నివాసి, స్నేక్ క్యాచర్ మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని, ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని మహదేవ్ పటేల్ వివరించారు.సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము
తిరుమల: తిరుమలలో మంగళవారం 8 అడుగుల నాగుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో స్థానికులు నివాసముంటున్న బీ–టైపు 23వ క్వార్టర్స్ ప్రాంతంలో నాగుపాము వచ్చింది. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకు అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
HYD: ఎయిర్‌పోర్టులో పాముల కలకలం
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్ 25) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు -
10 రోజులుగా ఆటబొమ్మలో నాగుపాము
భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. -
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
ఎగిరే పామును చూశారా..?
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్‌లుగా ఉన్న ఈ పామును చూసి స్థానికులంతా భయాందోళన చెందారు. స్థానికుల ఫోన్‌తో వచ్చిన స్నేక్ క్యాచర్ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
గరీభ్‌రథ్ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు..
సాక్షి, ముంబై: ప్రయాణంలో రైలులో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణీకులకు భయాందోళనకు గురిచేసింది. గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్(12187) రైలు ముంబైకి బయలుదేరింది. రైలు నడుస్తుండగానే మార్గ మద్యంలో కాసర రైల్వే స్టేషన్ వద్ద ఏసీ కోచ్ జీ-17లో పాము కనిపించింది. రైలు కోచ్‌లో అప్పర్ బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణీకులు వేరే కోచ్‌లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో కోచ్ డోర్లు మూసివేశారు.కాసర రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే.. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, స్నేక్ క్యాచర్స్ టీమ్ వచ్చి పామును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Snake in train! Snake in AC G17 coach of 12187 Jabalpur-Mumbai Garib Rath Express train. Passengers sent to another coach and G17 locked. pic.twitter.com/VYrtDNgIIY— Rajendra B. Aklekar (@rajtoday) September 22, 2024 ఇది కూడా చదవండి: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య! -
రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
పులి భయపడింది
-
బంగారం దగ్గర పాములు ఎందుకున్నాయి?
‘తంగలాన్’ సినిమాలో బంగారానికి పాములు కాపలా కాస్తున్నట్లు దర్శకుడు చూపించాడు. గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయని పూర్వం చందమామ కథల్లో విఠలాచార్య సినిమాల్లో చూపించేవారు. తంగలాన్‌లో బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి. బంగారం గునుల్లో, నిధుల దగ్గర పాములు నిజంగానే ఉంటాయా? కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అని. బంగారం, యురేనియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయని వారి అధ్యయనంలో కనిపించింది. పాములు తమ శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్ను దాస్తాయట. పాములు బయో ఇండికేటర్స్‌గా పని చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. యురేనియం దోరికే ప్రాంతాల్లో గాని బంగారం దొరికే కోలార్ వంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తుండేది అందుకే అని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. -
పడక గదిలో కింగ్ కోబ్రా
శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
పీకలదాకా తాగి పాముతో ఆటలు..
-
వికాస్‌ను ఎనిమిదో‘సారీ’ కాటేసిన పాము!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..దేవుని దయతో వికాస్‌కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్‌ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్‌కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది. -
శ్రీశైలంలో అద్భుతం..
-
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.సబౌర్‌లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
కాటు వేసిందని పామునే కరిచి చంపేయడంతో..!
పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్ లోహార్ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్ ఆస్పత్రిపాలయ్యాడు. ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తప్పక చేయాల్సినవి..పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. -
అమెజాన్ పార్సిల్ లో పాము కలకలం
-
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్‌లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్‌ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
పొదల్లో బుస్.. బుస్
రాయవరం: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువవుతోంది. వాతావరణంలో వేడి తగ్గి భూమి చల్లబడిన సమయంలో విష పురుగులు సహజంగా బయటకు వస్తుంటాయి. ఇలా బయటకు వచ్చిన విషసర్పాలు, పురుగులు రాళ్ల గుట్టలు, దట్టమైన పొదల మాటున ఉంటాయి. పొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే పొలాల్లోని గడ్డివాములు, గట్ల వెంబడి తిరుగుతుంటాయి. ఇళ్ల పరిసరాలు, పొలాల్లోనూ సంచరించే విష సర్పాలు, తేళ్లు, ఇతర విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పొడపాము, రక్తపింజర వంటి వాటివల్లే ప్రమాదం అఽధికంగా ఉంటుంది. సాధారణంగా 50 శాతం పైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.రైతన్నా.. జాగ్రత్త అవసరంపొలం గట్ల వెంబడి వెళ్లేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. రాత్రి పూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లేటప్పుడు టార్చిలైట్లు తీసుకు వెళ్లాలి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు, తడిగా ఉంటే కప్పలు తిరుగుతాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు పాములు చేరతాయి. అలాగే తేళ్లు, జెర్రెలు వంటి ప్రమాదకర ప్రాణులు సంచరించే అవకాశముంది. ఎక్కువగా పాములు పొదలు, గోడల వారగా చేరతాయి. ప్రజలు చీకట్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.విషసర్పాల కాటు లక్షణాలువిషసర్పం కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏమీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారవచ్చు. కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. నాగుపాము అత్యంత ప్రమాదకరం. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎవరినైనా పాము కరిస్తే అది విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స కచ్చితంగా చేసేందుకు వీలవుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలి. నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లరాదు. పాముకాటుకు గురైన వారు ఆందోళన చెందితే గుండెపోటు వచ్చే అవకాశముంది.జిల్లాలో పరిస్థితి ఇదీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 191 మందికి పాము కాటుకు గురయ్యారు. 2022 జూలైలో అధికంగా 25 మంది, నవంబరులో 24 మంది పాముకాటు బారిన పడ్డారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 154 మంది పురుషులు, 37 మంది మహిళలు పాముకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకూ 227 మంది పాటుకాటుకు గురయ్యారు. ఈ బాధితులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ మందులు అందుబాటులో ఉంచారు. బాధితులకు ఉచితంగా మందులు వేస్తున్నారు.వైద్యం ఆలస్యం కారాదుపాముకాటు వేసిన వారికి ధైర్యం చెప్పి, వెంటనే వైద్యం అందించేందుకు ప్రయత్నించాలి. ముందుగా ప్రథమ చికిత్స చేయాలి. కట్ల, నాగుపాములు కాటువేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి బాధితుడు కోమాలోకి వెళ్లే అవకాశముంది. పాముకాటు వేయగానే నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రిలో చేర్చాలి.–వి.అనిరుథ్, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరంఆసుపత్రుల్లో ఉచితంగా మందులుజిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో యాంటీ స్నేక్ వీనమ్ (పాము కాటు మందులు) అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏర్పడితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మందులు కొనుగోలు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కొరత లేదు.–దుర్గారావుదొర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అమలాపురం -
సేవ్ స్నేక్ (ఫోటోలు)
-
Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్‌పై పాము
హిమాయత్‌నగర్: లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై మొదట పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్పైకి చేరింది. నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద ఒక్కసారిగా పాము కనిపించడంతో వాహనదారులు ఖంగుతిన్నారు. ఆ పాము ఎక్కడ మీద పడుతుందో అని ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొద్దిసేపటికి సిగ్నల్ పోల్ సహాయంతో కిందకు చేరిన పాము..పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లార్ లోకి వెళ్లింది. దీంతో వాహనదారులు, పోలీస్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా కొందరు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించారు. -
పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అన్నానగర్: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్ క్యాచర్ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. #Coimbatore Forest Department arrested two individuals for illegally handling an Indian rat snake and posting a video of it on social media, which went viral on May 25. The snake, listed under Schedule I of the Wildlife Protection Act, 1972, is a protected species.@THChennai📽️:… pic.twitter.com/WCenHD66Sf— Avantika Krishna (@AvantikaKrish) May 28, 2024 -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్‌లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
Cutest Snakes AI Photos: ఈ పాములు ఏంట్రా బాబు ఇంత ముద్దుగా ఉన్నాయ్ (ఏఐ ఫోటోలు)
-
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్‌గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్‌గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!) -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్‌లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
బైక్ ఆఫ్ అవడంతో బైక్ సీటు తెరిచి చూస్తే.. ఒక్కసారిగా షాక్!
మహబూబ్‌నగర్: బైక్ ఆఫ్ అయితుందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు, వినయ్ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్ ఆఫ్ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
వామ్మో ఆఫ్రికన్ నత్తలు! ఇవి ఎంత ప్రమాదమో తెలుసా?
ఆఫ్రికన్ నత్తలు(జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్) మార్కాపురం–తర్లుపాడు రోడ్డులోని మాగుంట పార్కులో ప్రత్యక్షమయ్యాయి. గత మూడు రోజులుగా సుమారు 100 నత్తలు పార్కులో సంచరిస్తూ వాకర్లను ఆకర్షిస్తున్నాయి. మన ప్రాంతంలో కనిపించే సాధారణ నత్తల కంటే ఇవి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ నత్తలు వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఇవి మామూలు నత్తలు కావు.. అచాటినిడే కుటుంబానికి చెందిన ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రపంచ వ్యాప్తంగా చీడ సమస్యలకు ప్రధాన కారణం. వ్యవసాయ పంటలతోపాటు స్థానిక మొక్కలకూ నష్టం కలిగిస్తాయి. అత్యంత హానికరమైన ఇన్వాసివ్(ఆక్రమిత) జాతుల్లో ఒకటైన ఈ ఆఫ్రికన్ నత్తలు మానవుల్లో మెనింజైటిస్కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో టాప్ 100 ఆక్రమిత జాతుల్లో ఈ నత్తలూ ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పష్టం చేసింది. ఇవి చదవండి: వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి.. -
Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము కలకలం రేపింది. నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Dev Shrestha (@d_shrestha10) ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దేవ్ శ్రేష్ట అనే వ్యక్తి నవంబర్1న షేర్ చేశారు. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. దాని దగ్గరకు ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నాలుగు మిలియన్లకు పైగా వీక్షించారు. 43వేల మంది లైక్ కొట్టారు. కాగా పాములు జనావాసాల్లోకి రావడం వస్తువుల్లోకి దూరడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లో పార్క్ చేసిన బైక్ హెల్మెట్‌లో పాము దాక్కుంది. సోజన్ అనే వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో ఓ చోట బైక్ పార్క్ చేసి ఉంచాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్దామని సాయంత్రం బైక్ తీయబోయాడు. అందులో పాము పిల్ల కనిపించిడంతో నిర్ఘాంతపోయిన సోజన్.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. హెల్మెట్‌లో నుంచి దాన్ని బయటకు తీసి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ‼️WATCH: A man in Kerala narrowly avoided a venomous snake bite when he discovered a small cobra inside his two-wheeler helmet. The incident unfolded at his workplace in Kerala’s Thrissur. Sojan, who is a native of Thrissur, had placed his helmet on the platform beside his… pic.twitter.com/8OMTiqMGYE— truth. (@thetruthin) October 8, 2023 -
వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్‌ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! One of the main reasons for breaking of snack trays or defective snack trays in #VandeBharat and other trains! Even with photographic evidence, whiners would say that I pass on the blame only to passengers! #IndianRailways #Responsibility #passengers pic.twitter.com/ykv0VNED9a — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2023 -
అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది. సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది. నాగ్‌పుర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్‌లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది. నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు. చంద్రయాన్ 3 విజయం భారత్‌కు గర్వకారణం అని అన్నారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్‌క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ తెలిపాడు. -
పాముకు ప్రాణదానం
రాయచూరు రూరల్: పాము అంటేనే ప్రాణాలు తీస్తుందని భయపడతాం. కనిపిస్తే పరుగులు తీస్తాం... కానీ అస్వస్థతకు గురైన ఓ పామును వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేసి ఊపిరిపోశారు. ఈ సంఘటన మంగళవారం కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటుచేసుకుంది. లింగసూగూరు తాలూకా హట్టి సమీపంలోని పామనకల్లూరు క్రాస్ వద్ద ఓ జెర్రిపోతు పాము కారులోకి దూరింది. హట్టి ఆస్పత్రి వైద్యుడు రవీంద్రనాథ్ ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకలేదు. అది కారు నుంచి బయటకు రావాలని ఫినాయిల్ చల్లడంతో వాసన తట్టుకోలేక బయటకొచ్చింది. కానీ స్పృహ తప్పి అచేతనంగా పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లింగసూగూరుకు చెందిన పాముల వైద్యుడు ఖాలిద్ చావుస్ వచ్చి ఆ పామును గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పాము నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స చేయడంతో కోలుకుంది. తర్వాత ఆ పామును ఊరికి దూరంగా వదిలిపెట్టారు. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్‌గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట!
పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!. బ్రిటన్ , ఐర్లాండ్‌లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్‌లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
అది పాము కళేబరం కాదు.. ప్లాస్టిక్
చిత్తూరు: గర్భిణికి పంపిణీ చేసిన పౌష్టిక ఆహారంలోని ఎండు ఖర్జూజ ప్యాకెట్లో వచ్చింది పాము కళేబరం కాదని, అది ప్లాస్టిక్ అని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ స్పష్టం చేశారు. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టిక ఆహారంలో పాము కళేబరం అంటూ బుధవారం పచ్చ పత్రికల్లో, చానళ్లలో వార్తలు ప్రచురితమైయ్యాయి. దాంతో ఐసీడీఎస్ పీడీ శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారనీ, అందులో ఎండు ఖర్జూరం ఫ్యాకెట్‌ను మంగళవారం తెరిచినట్లు ఆమె తెలిపింది. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొంది. తరువాత ఎండు ఖర్జూరం ప్యాకెట్లో పాము లాంటి వస్తువును చేతిలోకి తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారు. దాని వాసన చూశారు. చేతిలో పట్టుకుని గట్టిగా విరిచారు. విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్థారించారు. పీడీ మాట్లాడుతూ పాము కళేబరం ఐతే తునిగి ముక్కలుగా విరిగిపోయేదన్నారు. ప్యాకింగ్ సమయంలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఎండు ఖర్జూజంతో ఫ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాకెట్లో ఉన్న వస్తువు గట్టిగా అంగుళంపైగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు కలిగి ఉందని, ల్యాబ్‌కు పంపుతామన్నారు. అంగన్వాడీ సిబ్బంది పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాము కళేబరం ఫ్యాకెట్లో ఉంటే వాసన వచ్చేదన్నారు. పచ్చపత్రికలు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేయడం గర్హనీయమని తెలిపారు. -
పెంపుడు పాములను ఎప్పుడైనా చూసారా?
-
ఇంటి బయట ‘షూ’ విడుస్తున్నారా?.. ఈ వీడియో మీకోసమే..
సాక్షి, హైదరాబాద్: పాములను చూస్తే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది.. ఇటీవలే ఒకరి హెల్మెట్‌లో పాము పిల్ల దూరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా భయంకరమైన కింగ్ కోబ్రా.. ఒక మహిళ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పాముకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. నాగుపాము షూలోకి దూరింది. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. Cobra trying a new footwear😳😳 Jokes apart, as the monsoon is coming to a close, please be extra careful. pic.twitter.com/IWmwuMW3gF — Susanta Nanda (@susantananda3) October 5, 2023 ఇంతలో షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం -
తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, సింగర్, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నెగెటివ్ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
పాముకాటుతో కాంగ్రెస్ నాయకురాలి మృతి
అనంతపురం: పాముకాటుతో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ (50) శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. జానకమ్మ కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి దేవాల యం వద్ద పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తోంది. వారి కుటుంబం సభ్యులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువజామున జానకమ్మను పాము కాటేయడంతో గమనించిన భర్త ఆంజనేయులు పామును చంపేశాడు. తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. వైద్య సిబ్బంది సూచన మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానకమ్మ సాయంత్రం మృతి చెందింది. -
పూజగదిలో బుస్....
కర్ణాటక: దేవుని గదిలో పాము బొమ్మను పెట్టుకుని నాగదేవత అని పూజలు చేస్తారు. అదే నిజమైన పాము వస్తే బెంబేలెత్తిపోతారు. ఆహారం వెతుక్కుంటూ వచ్చిన నాగుపాము ఒకటి ఇంటిలోకి వెళ్లి ఏకంగా దేవుని గదిలో తిష్టవేసింది. పడగ విప్పి బుస్ మంటున్న పామును చూసి ఇంట్లోనివారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ సంఘటన తుమకూరు నగరంలోని యల్ళాపురలోని వినాయక నగరలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దరాజు అనే వ్యక్తి ఇంటిలోని దేవుని గదిలోకి ఎక్కడి నుంచో నాగుపాము వచ్చింది. పూజ చేయాలని వచ్చిన సిద్దరాజు పామును చూసి భయపడిపోయాడు. పాములు పట్టడంలో నిపుణుడైన దిలీప్‌కు కాల్ చేయగా ఆయన వచ్చి పామును పట్టుకుని దేవరాయన దుర్గ అడవిలో వదిలిపెట్టాడు. -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
ఆహా పాము రుచి..! తినరా మైమరచి!!
సాక్షి, హైదరాబాద్: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆరగిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్నను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు -
ఈ పాములు కరిస్తే సెకన్లలోనే ప్రాణం పోతుంది..
మార్కాపురం: పొలాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు కురవడంతో పాములు పుట్టల్లో నుంచి పొలాల్లోకి వచ్చి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలాంటి పాము వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప పొలాల్లోనే పాముల సంచారం అధికంగా ఉంది. వారం రోజుల క్రితం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామచంద్రాపురం రైతు పాముకాటుకు గురయ్యారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణానికి ప్రమాదం తప్పింది. హలో.. సార్.. పాము! పాముల్లో అత్యంత విషపూరితమైన పాముల్లో మొదటిది రక్తపింజర, రెండోది తాచు, మూడోది కట్ల పాము. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా రక్తపింజరలు సంచరిస్తుండటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యుడైన నిరంజన్ 20 రోజుల వ్యవధిలో 10 పాములను పట్టుకున్నారు. రామచంద్రాపురం, రాయవరం, కొండేపల్లి, నికరంపల్లి బడేఖాన్‌పేట, బుడ్డపల్లి, మాల్యవంతునిపాడు, సీతానాగులవరం తదితర గ్రామ పొలాల్లో పాములను గుర్తించిన రైతులు సకాలంలో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో బంధించి అటవీ ప్రాంతంలో వదిలారు. వీటిలో ఎక్కువగా రక్తపింజర, తాచు, కట్లపాములు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ ‘సాక్షి’కి వివరించారు. రక్తపింజర యమా డేంజర్ ఐదు అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే ప్రాణానికి ప్రమాదం. కాలుకు గురైన వారి శ్యాస వ్వవస్థ దెబ్బతినడంతోపాటు శరీరమంతా చెమటలు పడతాయి. రక్తపింజర విషం రక్తాన్ని వేగంగా పలుచన చేస్తుంది. తద్వారా గుండె బలహీనపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లోకి కొండచిలువలు మార్కాపురం ప్రాంతంలో కొండచిలువలు జనావాసాల మధ్యకు వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు పొలాల్లో రైతులను భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో 3 ప్రాంతాల్లో భారీ కొండచిలువలు పట్టుకుని అడవుల్లో వదిలేశారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి వస్తున్న కొండచిలువలు కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను భుజిస్తున్నాయి. భారీ కొండచిలువలు మనిషిని చుట్టేస్తే దాని పట్టు నుంచి బయటపడటం చాలా కష్టం -
పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా..?
పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే.. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు. పాము కాటు వేస్తే ఏం చేయాలి పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏం చేయకూడదు..? పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్‌ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్‌క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
తెలంగాణ: 200 ఏళ్లకు ఆ పాము దర్శనం
మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో బుధవారం అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు. ఆయన బయోలజి ఉపాధ్యాయు డు దేవిలాల్‌కు చెప్పడంతో వెళ్లి పామును పట్టుకుని ఫొటోలను సదాశివయ్యకు పంపించారు. పట్టుకున్న పాము అరుదైనదిగా గుర్తించారు. విషరహిత పాము కావటం వల్ల దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేయాలని సూచించటంతో దేవిలాల్ దానిని గుట్టపై ఉన్న అటవీప్రాంతంలో వదిలేశారు. సదాశివయ్య మాట్లాడుతూ నల్లటిరంగులో తెల్లటి పట్టీలు కలిగి అందంగా కనిపించే పామును శాసీ్త్రయంగా డ్రయోకలామస్ నింఫా అని పిలువబడే కోలుబ్రీడే కుటుంబానికి చెందినదిగా వివరించారు. 50సెం.మీ. వరకు పాము పొడవు అవుతుందన్నారు. ఈ పామును మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరు సమీపంలో 1803లో గుర్తించారని తెలిపారు. దీనిమెడపైన ఉన్న తెల్లని మచ్చ పెళ్లికూతురు మెడమీద ఉన్న ఓణిలా ఉండటం మూలాన వెల్లూర్ బ్రైడల్ స్నేక్ అని పిలుస్తారన్నారు. కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దీనిని గుర్తించినా ఇప్పటి వరకు పాముకు సంబంధించిన అనేక విషయాలు ప్రపంచానికి తెలియవన్నారు. ఎన్నిగుడ్లు పెడుతుంది, ఎన్ని రోజులకు పిల్లలుగా మారుతాయి, ప్రత్యుత్పత్తి వివరాలు తెలియవన్నారు. ఎలాంటి గోడలైనా సునాయాసంగా ఎక్కగలదని, ఎలుకలు, బల్లులు ప్రధాన ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
చల్లారని పాము పగ?.. 3 నెలల్లో తొమ్మిదిసార్లు కాటు!
కర్ణాటక: పాము పగ 12 ఏళ్లు అనే నానుడి ఉంది, అది నిజమో, అబద్ధమో తెలియదు కానీ ఒక సర్పం బాలున్ని పదే పదే కాటేస్తూనే ఉంది. వివరాలు.. కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమారు మూడు నెలల వ్యవధిలో 9 సార్లు కాటు వేసిందంటే అశ్చర్యం కలగకమానదు. జూలై 3న మొదటిసారిగా బాలున్ని నాగుపాము కాటు వేయడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందించారు. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన మూడు రోజులకే మళ్లీ పాము కరిచింది. ఇలా తొమ్మిదిసార్లు కాటు వేయగా ఆరుసార్లు ఆస్పత్రిలోను, మూడుసార్లు నాటు ఔషధంతో చికిత్సలు చేయించారు. చివరకు కుటుంబసభ్యులు పాముకు భయపడి సొంతూరు హలకర్ణి గ్రామం వదిలి వాడి అనే ఊరుకు వలసపోయారు. అక్కడ కూడా బాలున్ని పాము కాటు వేసింది. అయితే కరిచిన పాము తల్లిదండ్రులకు గానీ, స్థానికులకు గానీ కనిపించడం లేదని చెబుతున్నారు. -
హడలెత్తించిన భారీ నల్లతాచు
శ్రీకాకుళం: మందసలో భారీ నల్లతాచు శనివారం స్థానికులను భయపెట్టింది. పట్టణంలోని వాసుదేవ స్వామి ఆలయం సమీపంలోని కూరగాయల తోటలకు శనివారం ఉదయం స్థానికులు పనికి వెళ్తుండగా చలనం లేకుండా పడి ఉన్న 14 అడుగుల నల్లతాచు కనిపించింది. సర్పాన్ని చూసిన వెంటనే వారు హడలెత్తిపోయారు. కాస్త పరిశీలనగా చూసి మరణించిందని నిర్ధారించుకున్నారు. ఆ పామును చూసేందుకు స్థానికులంతా అక్కడకు వచ్చా రు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, జూవాలజీ అధ్యాపకుడు చింతాడ శరత్‌బాబు మాట్లాడుతూ ఇది అరుదైన కింగ్‌కోబ్రా అని, దీనినే రాచనాగు అనికూడా పిలుస్తారన్నారు. దీని జాతి పేరు ఓఫియోఫేగస్ అని, సుమారు 18 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుందని, జీవితకాలం 20 ఏళ్లన్నారు. ఇది సిగ్గరి అని, ఎవరి కంట పడడానికి ఇష్టపడదని, నాగుపాములు, ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్
కొన్ని పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అవి చూసేందుకు కూడా చాలా వింతగా ఉంటాయి. పురాణల్లోనో, సినిమాల్లోనో చూసి ఉంటాం అలాంటి రెండు తలలు పాముల లేదా ఐదు తలల పాములు. అంతేతప్ప మాముటుగా చూడటం కుదరదు. పైగా తాచుపాము జాతుల్లోని ప్రత్యేక పాములే ఇలా ఉంటుంది. ఆ ఐదు తలలు సెపరేట్‌గా ఉండి ఆ తలలన్నింటికి ఒకటే దేహంలా కింద భాగం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పాము అందుకు విభన్నం రెండు తలలు కలిసి పోయి ఉంటుంది. అచ్చం మనుషులకు జన్మించే అవిభక్త కవలల మాదిరిగా ఆ పాము ఉంది. నిజానికి ఆ రీతిలో జన్మించినవి పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. కానీ ఇది అలా కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంది. హాయిగా కదులుతుంది. కాస్త ఆహారం తినేటప్పుడూ ఇబ్బంది పడుతుందేమో గానీ చూస్తే మాత్రం మాములు పాముల మాదిరిగానే పాకుతుండటం విశేషం. ఈ ఘటన యూకేలోని ఓ దుకాణంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Exeter Exotics (@exeter_exotics) (చదవండి: గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!) -
నాగుల పంచమి నాడు నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు
శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మాసంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాగానే నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతాయి. ఇక నిన్న శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగపంచమి అంటే పుట్టలో పాలుపోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ పామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే వ్యక్తులు ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏంటో తెలియాలంటే స్టోరీ చదివేయండి. నాగ పంచమి రోజున నాగపామునే నట్టింట్లోకి తీసుకొచ్చి పూజ చేసింది ఓ కుటుంబం. చక్కగా పూలు, పాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రశాంత్ హులేకర్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగులపంచమికి కుటుంబంతో కలిసి పాములకు ప్రత్యేకంగా పూజలు చేస్తారట. అది కూడా ఇంటికి తీసుకొచ్చి మరీ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాగుల పంచమి సందర్భంగా ఓ పామును తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టారు. తనకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటానని ప్రశాంత్ తెలిపాడు. అతని తండ్రి సురేష్ కూడా పాముల సంరక్షణ కోసం చాలా చేశాడట. ఇక ప్రతీ ఏడాది నాగుల పంచమి నాడు ఇలా పాముని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని అడవిలో వదిలివేయడం చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుందని, ఇప్పటివరకు దీని వల్ల కుటుంబంలో ఎవరికి హానీ జరగలేదని తెలిపాడు. పాముల పట్ల తమకు ప్రత్యేక భక్తి ఉందని, అందుకే ఇలా చేస్తానని వెల్లడించాడు. -
పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..
చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్దాస్పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now. During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people. With God’s grace and… pic.twitter.com/vQkX14xltK — Harjot Singh Bains (@harjotbains) August 19, 2023 మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
బడిలో ఏడు పాములు.. ఒకేసారి విద్యార్థిపైకి..
సంగారెడ్డి: మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుపాములు బయట పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు పామును చూసి అరిచారు. అక్షయ పాత్ర సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపివేశారు. అయితే మరోవైపు నుంచి ఒక్కో పాము రావడంతో వారు విస్తుపోయారు. మొత్తం ఆరు పాములను చంపివేశారు. తరగతి గది అపరిశుభ్రంగా ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పాముకాటుతో నర్సింగ్ విద్యార్థిని షఫీనా మృతి
వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎంపీ షేక్ యాకూబ్ కుమార్తె నర్సింగ్ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్‌తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్ వెంటనే మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్ యానాల గంగాధర్‌రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య, సత్యనారాయణ, సైదులు, రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. -
లంక ప్రీమియర్ లీగ్‌లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన
లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్చల్ చేసింది. Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW — Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023 మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u — FanCode (@FanCode) August 13, 2023 ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు. LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023 — Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023 జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు. -
డోంగర్ గామ్ లోని హనుమాన్ ఆలయంలో పాము సంచారం


