
సంగారెడ్డి: మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుపాములు బయట పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు పామును చూసి అరిచారు.
అక్షయ పాత్ర సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపివేశారు. అయితే మరోవైపు నుంచి ఒక్కో పాము రావడంతో వారు విస్తుపోయారు. మొత్తం ఆరు పాములను చంపివేశారు. తరగతి గది అపరిశుభ్రంగా ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.