ప్రార్థన మందిరం కూల్చివేత
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని కర్మెల్ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. కొన్నేళ్లుగా ఆ స్థలంలో ప్రార్థన మందిరాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకురాలు తెలిపారు. దాదాపు 200 మంది సభ్యులతో ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో స్థలం విషయంలో వివాదాలు జరగగా, కోర్టుకు వెళ్లగా కోర్టులో తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఇదివరకే మూడు, నాలుగు సార్లు ప్రార్థన మందిరాన్ని కూల్చివేస్తే మళ్లీ కట్టుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలున్నాయని, ఈ ఘటనౖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.


