రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేస్తాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు
రామాయంపేట(మెదక్): రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా బాధిత రైతులు విలువైన తమ భూములను కోల్పోతున్నారని గుర్తు చేశారు. మార్కెట్ ధర ప్రకారం బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతులకు న్యాయం జరగకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.


