రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆకునూరు శివారు మాసిరెడ్డిపల్లికి చెందిన గణపురం యాదయ్య(70) ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించేందుకు కొత్త దొమ్మాట అడ్డబాట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లోకి వెళ్తుండగా ఆకునూరు నుంచి చేర్యాలకు వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ యాదయ్యను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.


