ఓపీఎం పట్టివేత
పటాన్‌చెరు టౌన్: ఓపీఎం మత్తు పదార్థాన్ని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు... ఎస్‌ఓటీ పోలీసులు అమీన్‌పూర్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజస్థాన్‌కు చెందిన మార్వాడీ హేతారాం వద్ద నుంచి 2.7 కిలోల ఓపీఎం మత్తు పదార్థంతో పాటు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓపీఎంను రాజస్థాన్ నుంచి తెచ్చి అమీన్‌పూర్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హేతారాంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులను అడగగా శనివారం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
నంగునూరు(సిద్దిపేట): తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్ ప్రకారం... నాగరాజుపల్లికి చెందిన ముక్కేర వెంకటేశం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఇది గమనించిన శివరాత్రి దివాకర్ గురువారం ఇంటి తాళాలు పగులగొట్టి మూడు తులాల నెక్లెస్, రెండు ఉంగరాలు దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుని వద్ద నగలు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు.
అక్రమ బియ్యం స్వాధీనం
అల్లాదుర్గం(మెదక్): అక్రమంగా తరలిస్తున్న బియ్యంను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్ గ్రామ శివారులో బియ్యం లోడ్‌తో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఇది రేషన్ బియ్యమా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారా? అనే విషయంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. రెండు లారీల బియ్యం వస్తే ఒక లారీ మాత్రమే పట్టుబడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ శంకర్‌ను వివరణ కోరగా... ఆర్‌ఐ సమాచారం మేరకు గడిపెద్దాపూర్ శివారులో బియ్యం లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సతీశ్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 9 నుంచి 13 వరకు మధ్యప్రదేశ్‌లోని సేజ్ యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున సతీశ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. సతీశ్ ప్రస్తుతం కొంపల్లిలోని లయోలా డిగ్రీ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పోటీలకు ఎంపిక కావడంపై సతీశ్‌కు పెద్దలు, యువకులు అభినందనలు తెలిపారు.
దుబ్బాక: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్‌ఈఆర్‌టీ)ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో దుబ్బాక మండలం గంభీర్‌పూర్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వి.మాధవి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కాగా ఆమె ఉత్తమ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ హెచ్‌ఎంను అభినందించారు.
ఓపీఎం పట్టివేత
ఓపీఎం పట్టివేత
ఓపీఎం పట్టివేత


