మహిత్, మోహిత్‌లకు 100 స్కోర్
మహిత్ ఓబీసీ–ఎన్‌సీఎల్ విభాగంలో, మోహిత్ జనరల్ కేటగిరీలో దేశంలో టాపర్లుగా ఘనత
ఎస్సీ విభాగంలో దేవ శ్రీవేధ్ 99.99 స్కోర్‌తో టాపర్
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ 2026 సెషన్–1లో ఆంధ్రా విద్యార్థులు సత్తా చాటారు. జనరల్‌తో పాటు ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో దేశంలో టాప్ స్కోర్లు సాధించారు. సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ సెషన్–1 స్కోర్లలో ఏకంగా 12 మంది 100 పర్సంటైల్‌తో సత్తా చాటారు. వీరిలో రాజస్థాన్ నుంచి అత్యధికంగా ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు, ఢిల్లీ, బిహార్, ఒడిశా, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఒక్కొక్క అభ్యర్థి ఉండటం విశేషం.
ముఖ్యంగా ఏపీ నుంచి 100 పర్సంటైల్ సాధించిన నరేంద్రబాబుగారి మహిత్ రాష్ట్రంలో టాపర్‌గా నిలవడమే కాకుండా ఓబీసీ–ఎన్‌సీఎల్ కేటగిరీలో దేశంలో టాపర్‌గా ఘనత సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన మరో అభ్యర్థి పసల మోహిత్ జనరల్ కేటగిరీలోని టాపర్లలో ఒకరిగా నిలిచారు. ఎస్సీ కేటగిరీలో 99.99 పర్సంటైల్ స్కోర్‌తో దేవ శ్రీవేధ్ దేశంలోనే టాప్ స్కోరర్‌గా నిలిచారు. మహిళల విభాగంలో హర్యానాకు చెందిన ఆషి అగర్వాల్ 99.99 పర్సంటైల్ స్కోర్‌తో టాపర్‌గా ఉన్నారు.
96.26 శాతం హాజరు నమోదు
జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు 13,55,293 మంది రిజి్రస్టేషన్ చేసుకోగా.. 13,04,653 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే నమోదు చేసుకున్న వారిలో 96.26 శాతం మంది పరీక్ష రాశారు. దేశంలోని సిటీలతో పాటు భారతదేశం వెలుపల 15 సిటీలతో కలుపుకుని మొత్తం 326 సిటీల్లో ఎన్టీఏ పరీక్షలు నిర్వహించింది. పురుషులు 8,87,476 మంది, మహిళలు 4,67,817 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. వీరిలో పురుషులు 8,55,085 మంది, మహిళలు 4,49,568 మంది హాజరయ్యారు. అయితే.. 68 మంది అభ్యర్థుల స్కోర్లను మాత్రం ఎన్టీఏ వెల్లడించలేదు. పరీక్షల్లో అనైతిక చర్యలకు పాల్పడి న నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టు పే ర్కొంది. సెషన్–2 పరీక్షల అనంతరం ఉత్త మ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తామని వివరించింది.
100 పర్సంటైల్‌సాధించిన అభ్యర్థులు వీరే
1. శ్రేయాస్ మిశ్రా (ఢిల్లీ)
2. నరేంద్రబాబుగారి మహిత్ (ఏపీ)
3. శుభం కుమార్ (బిహార్)
4. కబీర్ చిల్లర్ (రాజస్థాన్)
5. చిరంజీబ్ కర్ (రాజస్థాన్)
6. భవేష్‌పాత్ర (ఒడిశా)
7. అనై జైన్ (హర్యానా)
8. అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్)
9. పసల మోహిత్ (ఏపీ)
10. మాధవ్ విరాడియా (మహారాష్ట్ర)
11. పురోహిత్ నిమయ్ (గుజరాత్)
12. వివాన్ శరద్ మహేశ్వరి (తెలంగాణ)


