National
-
2 కి.మీ నడుచుకుంటూ వెళ్లిన సీఎం.. తిరిగొచ్చేటప్పుడు క్యాబ్..
గువాహటి: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడిచారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరు అధికారులతో కలిసి క్యాబ్‌లో వెళ్లారు.ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పద్ధతులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై నిబద్ధత చూపిస్తూ తమాంగ్ ఇలా చేశారు. అధికారిక నివాసమైన మింటోక్గ్యాంగ్ నుంచి మనన్ కేంద్రా వరకు సుమారు 14 నిమిషాలు నడిచి కార్యక్రమానికి హాజరయ్యారు.అంతేకాదు మే 15న అదే వేదికలో జరిగిన మరో కార్యక్రమానికీ వెళ్లేటప్పుడు, తిరిగి వస్తున్నప్పుడూ నడిచారు. “ఇది కేవలం మొక్కుబడిగా చేసింది కాదు. నాయకత్వం వ్యక్తిగత క్రమశిక్షణ, చర్యలతో ప్రారంభం కావాలని సిక్కిం ప్రజలకు బలమైన సందేశం ఇచ్చింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.దేశం ఆర్థిక ప్రాధాన్యాలు, వనరుల సంరక్షణపై సమష్టిగా స్పందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. వ్యయాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం కేవలం విధానాలకే పరిమితం చేయకుండా ఆచరణలోనూ అమలు చేస్తున్నట్లు తెలియజేస్తోందని సీఎంవో చెప్పింది.ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన వినియోగ నియంత్రణపై సిక్కిం ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇవి శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలకు వర్తిస్తాయి.ఈ చర్యల్లో ముఖ్యమైనది ముఖ్యమంత్రి వాహన బృందాన్ని 50 శాతం తగ్గించడం. అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఆడ్-ఈవెన్ విధానం అమలు చేయనున్నారు. ట్యాక్సీలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.మే 14 నోటిఫికేషన్లో ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, అవసరంలేని వాహన వినియోగం తగ్గించాలని, వర్చువల్ సమావేశాలు, డిజిటల్ సమన్వయంపై ఎక్కువగా ఆధారపడాలని ప్రభుత్వం సూచించింది. బాధ్యత, సమర్థత, క్రమశిక్షణతో కూడిన పాలనా సంస్కృతిని పెంపొందించడమే ఈ చర్యల లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
ఇది ఒక కల.. ఆ కలను నిజం చేసుకున్నాం: అమిత్ షా
బస్తర్: భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత(నక్సల్స్ లేని) దేశమని గర్వంగా చెబుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ స్పష్టం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి నిర్దేశించిన మార్చి 31 గడువు తర్వాత చత్తీస్‌గడ్‌లోని బస్తర్‌లో అమిత్ షా తొలిసారి పర్యటించారు. దీనిలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశంగా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో సమాన స్థాయికి తీసుకురావడానికి, రాబోయే కాలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.బస్తర్ జిల్లాలోని జద్గల్పూర్లో జరిగిన కార్యక్రమంలో, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న వివిధ భద్రతా దళాల సిబ్బందిని, అలాగే మావోయిస్టు దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులను, పౌరులను ఉద్దేశించి షా ప్రసంగించారు. @ ఇది బస్తర్‌కు చాలా పెద్ద రోజు. ఈ రోజు ఇక్కడ నిలబడి, భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని నేను గర్వంగా తల ఎత్తుకొని చెప్పగలను’ అని తెలిపారు.‘ఈ విజయంలో మొత్తం క్రెడిట్ అంతా మన భద్రతా దళాలకు చెందుతుంది. నేను మీ ముందర తల వంచుతున్నాను. ఇది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి వేలాది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు’ అని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. -
చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?
లక్నో: స్కూటర్‌పై పద్మాసనం వేశాడు ఓ వ్యక్తి. హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై రైడింగ్ కాదు.. రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. స్కూటర్‌పై సన్యాసి పోజ్‌లో అతడు జనాలకు టెన్షన్ డోస్ పెంచేశాడు. అతడికి హెల్మెట్ లేదు.. భయం లేదు.. కామన్ సెన్స్ లేదు..లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫన్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై స్కూటర్ నడుస్తుండగానే ఆ వ్యక్తి బండిపై కాళ్లు మడిచి కూర్చున్నాడు. అలాగే హ్యాండిల్‌పై నుంచి రెండు చేతులూ తీసేసి, చుట్టూ వాహనాలు వెళ్తుండగానే ప్రయాణం కొనసాగించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినట్టు కనిపించింది. దీంతో స్కూటర్ ఒకే వేగంతో ముందుకు సాగింది. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించలేదని సమాచారం.ట్రాఫిక్ మధ్య అతడు ఈ విన్యాసం చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతకూ ప్రమాదం తెచ్చాడని మండిపడ్డారు. చాలామంది నెటిజన్లు లక్నో పోలీస్, యూపీ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా, నిర్లక్ష్య డ్రైవింగ్, విన్యాసాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర తీరుకు ఎందుకు ఫుల్స్టాప్ పడడం లేదని చాలామంది ప్రశ్నించారు.“నంబర్ లేని స్కూటర్, భద్రతా పరికరాలు లేవు, అసలు బాధ్యత అన్నదే లేదు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తన ప్రాణాలనే కాదు, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. లక్నో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కఠిన గుణపాఠం చెప్పాలి” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.మరో వ్యక్తి స్పందిస్తూ.. “ఇది చక్రాలపై యోగా లాంటిదే.. కానీ, రోడ్డు జాగ్రత్త మాత్రం లేదు. ఒక్క గుంతనో, ఒక్కసారిగా బ్రేక్ వేయడమో, లేదా ఇతర వాహనం ఎదురైతే అంతే సంగతి. అతడికే కాదు, ఇతరులకూ ప్రమాదం. ఇలాంటి విన్యాసాలు చూసి ఇంకొందరు నేర్చుకోకుండా ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.क्या ऐसे स्टंट पर सख्त कार्रवाई जरूरी है?लखनऊ के गोमतीनगर इलाके में ट्रैफिक नियमों की खुलेआम धज्जियां उड़ाने का मामला सामने आया है. फन मॉल के सामने सड़क पर दौड़ रही एक बाइक पर बैठा युवक बेहद लापरवाही भरे अंदाज़ में नजर आया. युवक बाइक पर सामान्य तरीके से बैठने के बजाय पलथी मारकर… pic.twitter.com/khv81zXoox— zingabad (@zingabad) May 18, 2026 -
పెట్రో, డీజిల్ ధరలు పెంచినా నష్టం తగ్గట్లేదు.. రోజు వందల కోట్లు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచినప్పటికీ ఇంధన కంపెనీలు రోజూ వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ పేర్కొన్నారు. ధరల పెంపుకు ముందు ఆ నష్టం రోజుకు సూమారు రూ. 1,600 కోట్ల వరకు ఉండేదని తెలిపారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమరు విషయమై తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో క్రూడాయిల్ బ్యారెళ్ ధర పెరగడంతో కేంద్రప్రభుత్వం సైతం పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా దీనిపై పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియా సమావేశం నిర్వహించారు.సుజాత శర్మ మాట్లాడుతూ.. ఇటీవల పెంచిన ఇంధన ధరలు చమురు కంపెనీల నష్టాలను కొంతవరకు తగ్గించగలిగాయి కానీ పూర్తి స్థాయిలో కాదు. లీటరుకు దాదాపు రూ.3 పెంచిన తర్వాత ఇప్పుడు రోజుకు రూ. 750 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. కంపెనీల అండర్- రికవరీలు (ఆదాయ లోటు) ,ఆర్థిక నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి... అయినప్పటికీ ఈ దశలో చమురు కంపెనీలకు ఎటువంటి బెయిలవుట్ ప్యాకేజీని (ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని) అందించే విషయం పరిశీలించడం లేదు అని ఆమె అన్నారు.అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం కాక ముందు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) నివేదిక ప్రకారం భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర బ్యారెల్‌కు 69.01 డాలర్లుగా ఉండగా... మే 15 నాటికి ఈ ధర బ్యారెల్‌కు 110.73 డాలర్లకు చేరుకుందన్నారు. అంటే యుద్ధ కాలంలో ఏకంగా 60.45 శాతం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగి ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. -
"నాకంటే చెడ్డవాడు ఎవరూ లేరు"
కోల్‌కతా : బెంగాల్ సీఎం సువేందు అధికారి అల్లరిమూకలపై రెచ్చిపోయారు.ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడుల పట్ల జీరో టాలరెన్స్ ప్రకటించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే "నాకంటే చెడ్డవాడు ఎవడూ ఉండరు" అంటూ అల్లరిమూకలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం కోల్‌కతాలోని పార్క్ సర్కస్-తిల్జాలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై జరిగిన బుల్డోజర్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశామని విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.కాగా ఈ ఘటనపై సీఎం సువేందు అధికారి స్పందించారు. "ఇలాంటి అ శాంతి, గూండాయిజం, దేశ వ్యతిరేక మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఇలాంటి వాటిని మేము కొనసాగనివ్వం. నేను గాయపడిన పోలీసు సిబ్బందిని, సీఆర్పీఎఫ్ జవాన్లను చూడటానికి, వారి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నిన్న మన దళం మొత్తం శాంతిభద్రతలను కాపాడింది, పెద్ద ప్రమాదాన్ని నివారించి ప్రజలను రక్షించింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను." అని అన్నారు.సువేందు మాస్ వార్నింగ్మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని రౌడీయిజం చేస్తే అస్సలు సహించేది లేదని తనకంటే చెడ్డవారు ఎవరూ లేరని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలీసుల కాళ్లు, చేతులు కట్టవేసి పని చేయించే రోజులు లేవన్నారు. గతంలో పోలీసు బలగాలు పరిమితుల మధ్య పనిచేశాయని పాత నిబంధనలే ఇంకా కొనసాగుతాయని అనుకోవద్దు. " అని అన్నారు.కశ్మీర్‌తో పోలికబెంగాల్ హింసపూర్వక ఘటనలను సువేందు కశ్మీర్ నిరసనలతో పోల్చారు. శ్రీనగర్, కాశ్మీర్లో పోలీసులపై రాళ్లు రువ్వడం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో కూడా ఇది ఆగుతుందని నేను నమ్ముతున్నాను. అని సువేందు స్పష్టం చేశారు. -
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన గుర్తింపుల ఆధారంగా సంక్షేమ పథకాలు ఉండకూడదని సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుండి మతపరమైన వర్గీకరణ ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖల ద్వారా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అవి వచ్చేలా మొదటి తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.2012లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇమామ్‌లకు నెలకు రూ. 2,500 గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తర్వాత ముయజ్జిన్లకు కూడా ఆర్థిక సహాయం అందించారు. 2020లో హిందూ పూజారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే పథకం ప్రారంభమైంది. మొదట రూ.1,000గా నిర్ణయించిన ఈ వేతనం 2026 ఎన్నికల ముందు రూ.2,000కి పెంచారు.అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపులపై ఆధారపడకూడదని స్పష్టం చేసింది. అందుకే ఈ పథకాలను నిలిపివేస్తూ, కోటా అర్హతను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కోల్కత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఒక నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది. -
స్నేహితుడి పెళ్లికి వెళుతూ ప్రమాదం.. 12 మంది మృతి
మహారాష్ట్ర: ఆ మిత్రుల బృందం స్నేహితుడి పెళ్లి వేడుకలో సరదాగా గడుపుదామని బయిలుదేరింది. అనుకున్న విధంగానే ఆడుతూపాడుతూ సాగుతున్న వారి ప్రయాణాన్ని ఒక్కసారిగా మృత్యువు కబలించింది. ముంబై- అహ్మదాబాద్ రహదారిపై జరిగిన ఘెర రోడ్డుప్రమాదంలో పెళ్లి వేడుకకు వెళుతున్న ఐషర్ ట్రక్కు- భారీ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగా అవకాశం ఉంది.మహారాష్ట్రలోని దహను తాలూకాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధనివారి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐషర్ వాహనాన్ని భారీ ట్రక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ట్రక్కులో ఉన్న 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం.అయితే మరికొద్ది సేపట్లో వేడుకకు చేరుకునే వారిమని అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Palghar - A horrific road accident occurred on the Mumbai-Ahmedabad National Highway in Palghar district when a truck carrying a baraat collided with a container truck.The accident took place in the Dhaniwari area of Palghar, As of now, 12 people have been confirmed dead. pic.twitter.com/RZNasohlC1— NextMinute News (@nextminutenews7) May 18, 2026 -
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. -
ఏనుగుల మధ్య తీవ్ర ఘర్షణ.. మధ్యలో వెళితే విషాదం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. రెండు ఏనుగులు ఘర్షణపడుతున్న సమయంలో ఒక మహిళా టూరిస్టు వాటిని చూస్తూ అక్కడే ఉంది. ఈ ప్రమాద ఘటనలో ఒక ఏనుగు ఆ మహిళపై పడిపోయింది. దీంతో ఆ మహిళ ఊపిరి ఆడక ప్రాణాలు వదిలింది. కొడుగు జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ రోజు సోమవారం ఈ ఘటన జరిగింది.చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే అనే పర్యాటకురాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా తిలకిస్తోంది. అయితే ఆ సమయంలో కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. కొంత సేపట్లోనే ఆ ఘర్షణ తీవ్రతరమైంది. దీంతో మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలోనే మార్తాండా అనే ఏనుగు జ్యూనేష్ దుబారేపై పడిపోయింది. వెంటనే జ్యునేష్ నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా తొక్కివేసింది. దీంతో ఆ పర్యాటకురాలు అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఈ మృతి పట్ల కర్ణాటక అడవీ శాఖ అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టమన్నారు. పర్యాటకులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోల కోసం దగ్గరగా నిలబడటం, ఏనుగులను కడగడం లేదా వాటికి ఆహారం పెట్టడం చేయకూడదన్నారు.కాగా ఇటీవల ఏనుగుల దాడులలో ప్రజలు మృతిచెందడం తీవ్ర కలవరం రేపుతోంది. గత నెలలో, ఛత్తీస్‌గఢ్‌లోని గౌరేలా-పెండ్రా-మార్వాహి జిల్లాలో ఒక అడవి ఏనుగు తొక్కడంతో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక ఏనుగు తొక్కడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది.ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.I have always been stunned by, and have marvelled at, the raw brute force of nature manifested in elephants.[in this tragedy, a life was lost]https://t.co/OfHTUtgkwn— Sandeep Manudhane (@sandeep_PT) May 18, 2026 -
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?
ప్రముఖ యాసిడ్ దాడి బాధితురాలు, సామాజిక కార్యకర్త లక్ష్మీ అగర్వాల్ మళ్లీ వార్తల్లోనిలిచారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫోటో నిజమైనది కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటో అని నెటిజన్లు భావిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు.లక్ష్మీ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని, ఏదో ఒక అధికారిక పత్రంపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్లో ‘ఢిల్లీ సర్కార్’ (Delhi Sarkar) బోర్డు, భారత జాతీయ చిహ్నం, రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె ముందున్న టేబుల్‌పై "లక్ష్మీ అగర్వాల్" అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ ఉంది. ఈ ఫోటోకు హిందీలో ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించారు: "ఒకప్పుడు ఏ గొంతునైతే నొక్కేయాలని చూశారో.. ఇప్పుడు అదే గొంతు మార్పును లిఖిస్తుంది. నన్ను బలహీనురాలిగా భావించిన వారు ఇకపై నా పేరు గుర్తుపెట్టుకోవాలి- లక్ష్మీ అగర్వాల్." ఈ పోటోతోపాటు, ఆ క్యాప్షన్ నెటిజన్లలో గందరగోళం నెలకొంది.ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యంఈ ఫోటో చూసి చాలా మంది లక్ష్మీ అగర్వాల్‌కు ఏదో ప్రభుత్వ పదవి లేదా అధికారిక నియామకం లభించిందని భావించి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. మరికొందరు ఆమె ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఆ క్షణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మరి కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా AI ఫోటోని గుర్తించారు. దీనికి భిన్నంగా కొందరు లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ పోస్ట్‌లో తనకు ఫలానా ప్రభుత్వ పదవి వచ్చిందని ఎక్కడా క్లెయిమ్ చేయలేదని, కేవలం ఒక ప్రతీకాత్మకమైన (Symbolic) సృజనాత్మకత కోసం మాత్రమే ఆ ఫోటోను వాడారని, నేమ్‌ప్లేట్‌పై కూడా ఎలాంటి హోదా రాయలేదని వారు వాదించారు. ఇదీ చదవండి: నలుగుర్ని కనండి : డా.శివరంజని తీవ్ర ఆందోళన వీడియో వైరల్ఒక సెలబ్రిటీ అయి ఉండి, ఇలాంటి నకిలీ ఫోటోలను వాస్తవం లాగా ఎందుకు షేర్ చేస్తున్నారని, కనీసం ఇది AI ఫోటో అని డిస్క్లైమర్ (Disclamer) ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది చట్టపరమైన వివాదం, ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగం అనే వ్యాఖ్యలు కూడా కనిపించాయి. భారతదేశ జాతీయ చిహ్నం, జాతీయ జెండాలు, మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయం లాంటి సెటప్‌ను AI ద్వారా సృష్టించి చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కొందరు వాదించారు. ఇది 'ది స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా (ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 2005' కింద చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని పలువురు న్యాయవాదులతో సహా పలువురు వినియోగదారులు హెచ్చరించారు.లక్ష్మీ అగర్వాల్‌కు ప్రభుత్వ పదవి వచ్చినట్టుగా లాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ, లక్ష్మికి అభిమానుల నుండి మద్దతు మాత్రం లభిస్తూనే ఉండటం గమనార్హం.ఎవరీ లక్ష్మీ అగర్వాల్ఈమె భారతీయ యాసిడ్ దాడి బాధితురాలు, మహిళా హక్కుల కార్యకర్త , టీవీ హోస్ట్. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరియు చట్టపరమైన సంస్కరణలు భారతదేశంలో ఆమెకు ఎంతో గుర్తింపునిచ్చాయి. 2005లో, ఆమెకు 15 ఏళ్ల వయసులో, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఒక వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కోలుకున్నతరువాత బాధితుల కోసం ఒక ప్రముఖ గళంగా మారి, 'స్టాప్ యాసిడ్ ఎటాక్స్' ప్రచారంలో చేరారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై కఠినమైన నిబంధనలు రావడానికి దారితీసింది. యాసిడ్ దాడుల బాధితులకు పునరావాసం, మద్దతు అందించే ఛన్వ్ ఫౌండేషన్ (Chhanv Foundation) కు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.ఆమె చేసిన సామాజిక సేవలకు గాను 2014లో అమెరికా ప్రభుత్వ ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డును అందుకున్నారు. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో ‘ఛపాక్’ (Chhapaak) అనే చిత్రం కూడా రూపొందింది. ఇదీ చదవండి: మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్ -
డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
తాజాగా నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సామూహిక పేదరికం తిరిగి రావడం’, ‘విపత్తుల దశాబ్దం’ (డికేడ్ ఆఫ్ డిజాస్టర్స్) అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే దేశీయంగా చమురు, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటం మానుకోవాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిపై కొంతమంది నిపుణుల మనోగతం కింది విధంగా ఉంది.ఈ వ్యాఖ్యలు వినగానే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన సంక్షోభంలోకి ప్రవేశించినప్పుడల్లా.. ప్రధానులు దేశభక్తిని మేల్కొలిపి విదేశీయుల నుంచి కొనుగోళ్లు తగ్గించుకోమని కోరడం పరిపాటిగా మారింది.70 ఏళ్లలో 9 సార్లు!మన ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. 1955, 1965, 1974, 1980, 1991, 1998, 2012, 2020.. ఇప్పుడు 2026. గడిచిన 70 ఏళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు దేశం ఇదే తరహా డాలర్ల కొరతను, చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశీయంగా ఉన్న సప్లై గ్యాప్ (సరఫరా లోటు)ను భర్తీ చేయడానికి అవసరమైన డాలర్లు మన వద్ద లేకపోవడమే వీటికి మూలకారణం.1972 వరకు ప్రధాన లోటు ఆహార ధాన్యాల్లో ఉండేది. క్రమంలో దాన్ని అధిగమించే స్థాయికి చేరుకోగలిగాం. 1980 తర్వాత ఈ లోటు ఇంధనం (చమురు, గ్యాస్) రూపంలోకి మారింది. మన పొరుగు దేశమైన చైనాకు కూడా ఈ రెండు లోటూ ఉన్నాయి. కానీ, వారు ఈ డాలర్ల సంక్షోభాన్ని మనకంటే మెరుగ్గా నిర్వహించగలిగారు. ఈ పరిస్థితిలో.. మన దేశంలో ఈ సరఫరా లోటు దశాబ్దాలుగా ఎందుకు కొనసాగుతోంది? మనం ఈ డాలర్ల కొరతను ఎందుకు అధిగమించలేకపోతున్నాం? అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.హరిత విప్లవం విజయం.. పారిశ్రామిక రంగంలో ఎందుకు సాధ్యం కాలేదు?వ్యవసాయ రంగంలో ఉన్న లోటును మనం హరిత విప్లవం ద్వారా విజయవంతంగా అధిగమించాం. స్వయంసమృద్ధిని సాధించాం కాబట్టే, 1979లో వచ్చిన తీవ్ర కరువు ప్రభావం 1980 నాటికి దేశంపై పడకుండా నిలిచింది. కానీ, ఇంధన లోటును మాత్రం గత 45 ఏళ్లుగా మనం పరిష్కరించలేకపోయాం. చమురు కొనడానికి డాలర్లు కావాలి, ఆ డాలర్లు రావాలంటే ఎగుమతులు పెరగాలి. కానీ మన ఎగుమతులు ఎప్పుడూ అంతంత మాత్రమే.ఇంధన విధానంలో లోపంమన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పర్యావరణ కారణాల వల్ల దాన్ని పక్కనబెట్టి చమురు, గ్యాస్ వంటి ఇతర హైడ్రోకార్బన్లపై ఆధారపడ్డాం. ఇది మన ఇంధన సంక్షోభాన్ని మరింత పెంచింది. దీనికంటే ముఖ్యమైన మరో కారణం.. గత 60 ఏళ్లుగా మన పాలకులు అనుసరించిన అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సింది పోయి, వాటిని భారీగా దిగుమతి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఫలితంగా డాలర్ల సంపాదన తగ్గిపోయింది.సంక్షోభం రావడం.. మళ్లీ మర్చిపోవడం!ప్రతిసారీ సంక్షోభం తీవ్రమైనప్పుడు ప్రభుత్వం డాలర్లను పొదుపు చేయమని చెప్తుంది. ఆ సమయానికి ఆ నిర్ణయం సరైనదే అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది అత్యంత హాస్యాస్పదమైన వ్యూహం. సంక్షోభం తొలిగిపోగానే మనం ఆ సమస్యను పూర్తిగా మర్చిపోయి విజయం సాధించామంటూ వీధుల్లో వేడుకలు చేసుకుంటాం. మళ్లీ కొన్నాళ్లకు అదే తప్పు చేస్తాం. ఈ దుస్థితి చూసి చాలా మంది ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.ఈ సమస్య పరిష్కారానికి గతంలో డజనుకు పైగా ఉన్నత స్థాయి కమిటీలు వేయడంతో చాలా సిఫార్సులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. దీనికి ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులనా, బ్యూరోక్రాట్లనా, పారిశ్రామికవేత్తలనా, గత వ్యూహకర్తలనా? సమాధానం ఒక్కటే.. వ్యవస్థలో అందరూ భాగస్వాములే అయినప్పుడు ఎవరి ఒక్కరినో బాధ్యులను చేయలేం.ప్రజాస్వామ్యం వర్సెస్ ఆర్థిక వృద్ధిఆర్థికవేత్త వాల్టర్ రోస్టో 1960లో తన ‘స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ పుస్తకంలో రాజకీయ వ్యవస్థల గురించి ప్రస్తావించలేదు. కానీ, రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఆర్థిక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును మూటగట్టుకున్న దేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవు. అవి ప్రజాస్వామ్య దేశాలుగా మారిన మరుక్షణమే వాటి వృద్ధి రేటు మందగిస్తుంది.ఆర్థిక నమూనాప్రధాన లక్షణంవృద్ధి రేటుహక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థప్రజల హక్కులు, ఉచితాలు, రాయితీలకు ప్రాధాన్యతతక్కువ, అస్థిరమైన వృద్ధిబాధ్యతల ఆధారిత ఆర్థిక వ్యవస్థజాతీయ ప్రయోజనాలు, ఉత్పత్తి, క్రమశిక్షణకు ప్రాధాన్యతస్థిరమైన, అత్యధిక వృద్ధిభారతదేశం ఎప్పటికీ ‘హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ గానే కొనసాగుతుంది. అలాంటప్పుడు గత 70 ఏళ్ల తప్పులను పునరావృతం చేయకుండా ఎలా ఉండాలన్నదే మన ముందున్న ప్రశ్న.ఆలోచన విధానం మారకపోతే..ఈ గందరగోళాన్ని ఎలా చక్కదిద్దాలో అందరికీ తెలుసు. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారాలు మన కళ్లముందే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మెజారిటీ సూచనలను పక్కనబెట్టాం. ఒకేసారి డజన్ల కొద్దీ భిన్నమైన లక్ష్యాలను పెట్టుకుని అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. కుక్క తన తోకను తాను పట్టుకోవడానికి తిరిగినట్లు ఉంది. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.ప్రస్తుత దశాబ్దం విపత్తులతోనే సాగుతోంది, మున్ముందు మరిన్ని సవాళ్లు రావచ్చు. కానీ, మన పాలకుల ఆలోచనా విధానం, ఆర్థిక విధానాలు సరైన దిశలో ఉండి ఉంటే.. ఈ విపత్తులు దేశాన్ని సామూహిక పేదరికం వైపు నెట్టేంత ప్రమాదకరంగా మారేవి కావు. ఇప్పటికైనా తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి ఎగుమతులను పెంచే దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన సంస్కరణలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో డాలర్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే మిగిలిపోతుంది.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి! -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లిఖింపూర్‌లో ఈ రోజు( సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిసైయా-లఖింపూర్ జాతీయ రహదారిపై వ్యాన్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.లిఖింపూర్ నుండి వ్యాన్ సిసైయా వైపు వ్యాన్ వెళ్తుండగా ఉంచ్‌గావ్, భరేహతా గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో తొమ్మిదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కాగా మరణించిన వారిలో ఏడుగురిని ఇదివరకే గుర్తించామని మరో ముగ్గురిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం, గుండెల్ని పిండేసే ఘటన. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలకు ఆ శ్రీరాముడు తన దివ్య చరణాల చెంత స్థానం కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సైతం ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. -
‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కేఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తిమాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు -
శబరిమల: ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్!
శబరిమల: కేరళలోని శబరిమల సన్నిధానంలో ఇకపై కలుషిత ఆహారానికి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్ పడనుంది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల సిండికేట్‌ను బద్దలు కొడుతూ, ఫుడ్ క్వాలిటీ కోసం ప్రముఖ విశ్వసనీయ సంస్థలను రంగంలోకి దించుతోంది.రంగంలోకి 'కుటుంబశ్రీ'.. హెల్త్ కార్డ్ తప్పనిసరిటెండర్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పంపా, సన్నిధానం వద్ద ఉన్న ఫుడ్ సెక్టార్‌లోకి కుటుంబశ్రీ, ఇండియన్ కాఫీ హౌస్, కేటీడీసీ లాంటి సంస్థలను దేవస్వం బోర్డు ఆహ్వానిస్తోంది. ఇకపై ప్రతి హోటల్ కార్మికుడికి ‘హెల్త్ కార్డ్’ ఉండటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా ఫుడ్ అవుట్లెట్లను తక్షణమే మూసివేస్తారు. ఇప్పటివరకు కేవలం తనిఖీలు, జరిమానాలతో సరిపెట్టుకున్న అధికారులు ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.కాంట్రాక్టర్ల లాబీయింగ్‌కు చెక్‘విజన్ శబరిమల’ చొరవలో భాగంగా ఈ భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఇటీవల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ స్వయంగా జరిపిన తనిఖీల్లో పారిశుద్ధ్య లోపం, కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం లాంటి పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కాంట్రాక్టర్లు లాబీయింగ్ చేస్తూ, రేట్లు తగ్గించే వరకు టెండర్లు వేయకుండా ఆపే పాత పద్ధతికి బోర్డు ముగింపు పలుకుతోంది. అవకతవకలను నివారించేందుకు టెండర్ ప్రక్రియ మొత్తాన్ని ‘ఈ-టెండరింగ్’ విధానంలోకి మార్చాలని యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యతమండల-మకరవిళక్కు సీజన్లో దేవస్వం బోర్డు ఉచిత అన్నదానం చేస్తున్నప్పటికీ, వేలాది మంది భక్తులు హోటళ్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇరుకైన దారుల్లో కొట్లు ఏర్పాటు చేయడంతో భక్తుల కదలికలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఇకపై భక్తుల సౌకర్యానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జయకుమార్ తెలిపారు. ఇక మహిళల సామూహిక సంఘమైన ‘కుటుంబశ్రీ’ విషయంలో వయసు నిబంధనలను పాటిస్తారు.ఇది కూడా చదవండి: గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది? -
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం -
గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
హరిద్వార్: లక్షలాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రసిద్ధ ‘హర్ కీ పౌరి’ ఘాట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ సోమవారం పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో బాంబు హెచ్చరికల వార్త తెలియగానే నగరవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్ కాల్పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఒక వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. నాలుగు రోజుల్లో హర్ కీ పౌరి సహా హరిద్వార్‌లోని పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి, నగరం నలుమూలల హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బహుళ పోలీస్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు.లోకేషన్ ట్రేసింగ్.. నిందితుడి అరెస్ట్బెదిరింపు కాల్ రాగానే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్, దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ నంబర్, లొకేషన్‌ను ట్రేస్ చేశాయి. నిందితుడిని పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సోహన్ సింగ్ రావత్గా గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఊహించని వాస్తవం వెలుగుచూసింది. తాను పీకలదాకా మద్యం సేవించి ఉన్నానని, కేవలం మత్తులోనే ఈ బాంబు బెదిరింపు కాల్ చేశానని నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.హర్ కీ పౌరి ప్రాముఖ్యతశ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయని భావించే హర్ కీ పౌరి ఘాట్‌కు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ సాయంత్రం జరిగే గంగా హారతికి, 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పవిత్రమైన ప్రదేశంపై బెదిరింపులు రావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడు సోహన్ సింగ్‌పై హరిద్వార్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు హరిద్వార్ ఎస్ఎస్పీ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు.ఇది కూడా చదవండి: రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఛప్రా నుండి లక్నో చేరుకున్న గోమతినగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ గుర్తుతెలియని ఓ మహిళ తలలేని మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసి, శరీర భాగాలను విడదీసి బాక్సుల్లో ప్యాక్ చేసిన తీరు చూసి రైల్వే అధికారులు సైతం నివ్వెరపోయారు.ఎస్ వన్ కోచ్‌లో భయానక దృశ్యంఛప్రా నుండి బయలుదేరిన గోమతినగర్ ఎక్స్‌ప్రెస్ (15114) లక్నోకు చేరుకున్న తర్వాత, ఒక పారిశుధ్య కార్మికుడు ఎస్ వన్ స్లీపర్ కోచ్ (217570 NER S1) శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఒక బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న ఒక బాక్సు, ఒక బ్యాగ్‌ను గమనించిన అతను వెంటనే అప్రమత్తమై సీనియర్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎప్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.పెట్టెలో మొండెం.. మరో బ్యాగులో కాళ్లు, చేతులుపోలీసులు ఆ బాక్సును తెరిచి చూడగా, అందులో సుమారు 30 నుండి 35 ఏళ్ల వయసున్న ఒక మహిళ మొండెం మాత్రమే కనిపించింది. దాని పక్కనే ఉన్న మరో బ్యాగులో పాలిథిన్ కవర్లో చుట్టి ఉన్న ఆమె కాళ్లు, చేతులు లభ్యమయ్యాయి. వెంటనే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతురాలి గుర్తింపు ఆరామే 17 ఆదివారం నాడు ఈ భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చినట్లు జీఆర్పీ అధికారులు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వివిధ మార్గాల ద్వారా ఆ మహిళ ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం అధికారులు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, పొరుగు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. -
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. -
మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
కాంగ్పోక్పి: మణిపూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలను ప్రాణాలతో రక్షించేందుకు భద్రతా దళాలు భారీ ‘ఆపరేషన్ రెస్క్యూ’ను ప్రారంభించగా, మరోవైపు తమ వారిని విడిపించాలంటూ గిరిజన సంఘాలు జాతీయ రహదారులను దిగ్బంధించడంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మే 13న జరిగిన దాడుల తర్వాత మొదలైన ఈ బందీల వ్యవహారం పతాక స్థాయికి చేరుకుని, ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతోంది.ఆపరేషన్ రెస్క్యూ షురూకాంగ్పోక్పి జిల్లాలో సాయుధ దళాల ఆధీనంలో ఉన్న వ్యక్తులను రక్షించేందుకు సోమవారం భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేపట్టాయి. అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తూ, బందీలను పట్టుకున్న వారి కోసం గాలిస్తున్నాయి. మే 14, 15 తేదీల్లో కుకీ, నాగా వర్గాలకు చెందిన దాదాపు 38 మందిలో 31 మంది బందీలను ఇప్పటికే భద్రతా దళాలు సురక్షితంగా విడిపించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశాయి.కలకలం రేపిన కిడ్నాప్‌లు ఈ కిడ్నాప్‌ల పర్వానికి మే 13న జరిగిన హింసాత్మక ఘటనలే ప్రధాన కారణం. కాంగ్పోక్పిలో ముగ్గురు చర్చి నాయకులను అనుమానిత మిలిటెంట్లు దారుణంగా కాల్చి చంపగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నోనీ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒక పౌరుడు మృతి చెందగా, అతని భార్య గాయపడింది. ఈ దాడుల అనంతరం మిలిటెంట్లు పలువురిని కిడ్నాప్ చేసి, ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు.హైవేల దిగ్బంధం - గిరిజనుల ఆందోళన బందీలందరినీ తక్షణమే సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆదివారం రాత్రి నుండి 2, 37వ జాతీయ రహదారులను పూర్తిగా దిగ్బంధించింది. ఇంకా ఆరుగురు నాగా యువకులు మిలిటెంట్ల చెరలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, తమ వర్గానికి చెందిన 14 మంది సెనాపతి జిల్లాలో వివిధ సాయుధ వర్గాల చేతిలో ఇంకా బందీలుగానే ఉన్నారని కుకీ ఇన్పి మణిపూర్ ప్రకటించడంతో రాష్ట్రంలో పరిస్థితి మరింత అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. -
కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం
సాక్షి, తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్‌తో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. డిప్యూటీ సీఎంలతో పాటు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. వాళ్లలో సీఎం రేసులో భంగపడ్డ చెన్నితల్ రమేశ్ కూడా ఉన్నారు. కున్హల్కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు. -
రైలులో ఒక్కసారిగా లేచిన మంటలు.. అంతటా ఆర్తనాదాలు
సాసారాం: నిద్రమత్తు వదలకముందే ఆ రైలు ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ప్రశాంతంగా సాగుతున్న వారి రైలు ప్రయాణం క్షణాల్లో భయానకంగా మారింది. బిహార్‌లోని సాసారాం జంక్షన్ సమీపంలో సోమవారం ఉదయం సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.ఉదయం 6 గంటలకు కలకలంసోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలు జంక్షన్ ఏరియా సమీపానికి చేరుకోగానే, రైలులోని ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. పొగతో పాటు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయడంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. Rohtas, Bihar: A fire broke out in the Sasaram-Patna passenger train at around 6AM due to a suspected short circuit Sasaram Junction. pic.twitter.com/HKaLPIIyzM— IANS (@ians_india) May 18, 2026షార్ట్ సర్క్యూటే కారణమా?ఈ అనుకోని అగ్నిప్రమాదానికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బోగీలో విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు.రంగంలోకి అత్యవసర బృందాలుప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రైల్వే సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాలేదని తెలుస్తోంది. -
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్‌షీట్‌లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్‌ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టగానే... ఆఫీసులు, ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లు అన్నీ కేవలం 15 నిమిషాల నడక దూరంలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదేదో ప్యారిస్ లేదా బార్సిలోనా లాంటి విదేశీ నగరాల్లోని అత్యాధునిక విధానం అనుకుంటున్నారా? కాదు.. పశ్చిమ దేశాలు ‘15 నిమిషాల నగరం’ (15-Minute City) అనే పదాన్ని కనిపెట్టక ముందే, మన భారతదేశంలోని పాత నగరాలు ఈ అద్భుతమైన జీవనశైలికి అసలైన చిరునామాలుగా నిలిచాయి. అయితే ఆధునికీకరణ వైపు పరుగెడుతూ, మన సొంత నమూనాను మనమే ఎలా చేజేతులా దూరం చేసుకున్నామో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.‘15 నిమిషాల నగరం’ అంటే ఏమిటి?కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సరికొత్త పట్టణ ప్రణాళికే ఈ ‘15 నిమిషాల నగరం’. పని ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, ఆస్పతులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు ఇలా రోజువారీ అవసరాలన్నీ ఇంటి నుండి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంలో అందుబాటులో ఉండాలన్నదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. రోజువారీ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్, బార్సిలోనా లాంటి ప్రపంచ నగరాలు ఇప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి.మన పాత నగరాలే దానికి జీవన ఉదాహరణలునిజానికి ఈ మోడల్ భారతదేశానికి ఏమాత్రం కొత్త కాదు. పాత ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరులోని బసవనగుడి, అలాగే హైదరాబాద్, చెన్నైలోని పాత కాలపు వీధుల్లో ప్రజల నివాసాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోయి ఉండేవి. ఇళ్ల కిందే దుకాణాలు, గుడి పక్కనే బడి, కూరగాయల మార్కెట్లు, మందుల షాపులు అన్నీ కూతవేటు దూరంలోనే దొరికేవి. అప్పట్లో నగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయకపోయినా, అన్నీ దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు నడిచి వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు.ఎక్కడ దారి తప్పాం?కాలక్రమంలో మన పట్టణీకరణ విధానం పూర్తిగా దారి తప్పింది. విశాలమైన రోడ్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, శివార్లలో ఐటీ కారిడార్ల నిర్మాణం కారణంగా నగరాల రూపురేఖలు విచ్ఛిన్నమయ్యాయి. ఆఫీసులు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోయాయి, నడక తగ్గిపోయింది. ఉదాహరణకు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల్లో ఆఫీసులు, మాల్స్ దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా, సరైన దారులు లేక ఆ కొద్ది దూరం వెళ్లడానికే నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ముంబై ఇప్పటికీ ఎందుకు భిన్నం?దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ముంబై నగరం ఈ ‘15 నిమిషాల నగరం’ విధానానికి నేటికీ చాలా దగ్గరగా ఉంటుంది. ముంబైలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడకుండానే రైల్వే స్టేషన్లు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఆస్పత్రులకు సులభంగా చేరుకోగలరు. ముంబైలో జనసాంద్రత ఎక్కువ అని విమర్శలు ఉన్నప్పటికీ, ఆ సాంద్రతే అన్నీ అందుబాటులో ఉండేలా చేసింది. ప్లానర్లు ఇప్పుడు కృత్రిమంగా సృష్టించాలని చూస్తున్న ‘మిక్స్డ్-యూజ్’ విధానాన్ని ముంబై ఏనాడో ఒంటపట్టించుకుంది.నడవలేని ఫుట్‌పాత్‌లు.. ప్రాణసంకటమైన రోడ్లు15 నిమిషాల నగరం వినడానికి చాలా బాగున్నా, ఆచరణలో మన దేశంలో ఎదురవుతున్న అతిపెద్ద అడ్డంకి ‘ఫుట్‌పాత్‌లు’. నేటి భారతీయ నగరాలు పాదచారులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఫుట్‌పాత్‌లు మధ్యలోనే మాయమైపోతాయి, లేదా వాహనాల పార్కింగ్, ఆక్రమణలతో నడవడానికి వీల్లేకుండా మారిపోయాయి. ఇక రోడ్డు దాటడం పెద్దలకే ఒక సాహసం అయితే, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సైకిల్ ట్రాక్‌లు కూడా పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. సురక్షితమైన దారులు లేకుండా ఈ అద్భుతమైన పద్ధతిని అమలు చేయడం అసాధ్యం.మళ్లీ మన పాత దారికి వెళ్లాల్సిన సమయంకరోనా తర్వాత పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, ఇంధన ధరల పెరుగుదల లాంటి కారణాలతో స్థానికంగానే అన్నీ అందుబాటులో ఉండే జీవనశైలిపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. గంటల తరబడి ప్రయాణాలు చేయలేక యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో భారతదేశం విదేశాల నుంచి ఈ ‘15 నిమిషాల నగరం’ ఆలోచనను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పాత నగరాల స్ఫూర్తిని కోల్పోకుండా, ఆధునికతను జోడిస్తూ, మళ్లీ పాదచారులకు అనుకూలమైన నగరాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఇది కూడా చదవండి: బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు! -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సీఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అభ్యంతరం..!
విజయ్ సీఎం అయ్యాక అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సీఎంవోలో ఓ జ్యోతిష్యుడిని నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అతన్ని తొలగించారు. తాజాగా విజయ్ మరో నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయ్‌కు సూచించారు.సీఎం విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను తీవ్రంగా నిరాశపర్చిందని విశాల్ అన్నారు. సినిమాతో విజయ్‌కు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా.. ఈ శాఖకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మీరేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని.. సినీరంగ అభివృద్ధికి తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.చిత్ర పరిశ్రమ, సంఘాలు, నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి అవసరమని విశాల్ అన్నారు. ఈ విషయంలో తాను రాజ్‌మోహన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సినిమా రంగంలో విజయ్‌కు ఉన్న అనుభవమే సరైన ఎంపిక అవుతుందని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సమస్యలు పరిష్కరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.విజయ్ ముందు డిమాండ్లు..విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సినిమా టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇది ప్రేక్షకులపై భారాన్ని తగ్గించి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను అనే సూత్రం ఉన్నప్పటికీ ద్వంద్వ పన్ను విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమేనని.. స్థానిక సంస్థల పన్నును తొలగించాలని కూడా ఆయన కోరారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలను పెంచాలని విశాల్ అభ్యర్థించారు. Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…— Vishal (@VishalKOfficial) May 17, 2026 -
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కు చేరుకోనుంది. సుప్రీంకోర్టు చట్టం–1956ను సవరిస్తూ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుపుకుని మొత్తం జడ్జీల సంఖ్య గతంలో 34 ఉండగా ఇకపై 38కి పెరగనుంది. కోర్టుల్లో ఏళ్లుగా పేరుకుపోతున్న కేసుల భారాన్ని తగ్గించి సామాన్యులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం జడ్జీల పెంపు నిర్ణయం తీసుకుందని న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ‘ఎక్స్’లో చెప్పారు. తాజా ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన బిల్లు ముసాయిదాను ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ఆయన వివరించారు. సుప్రీం జడ్జీల సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించే తొలి చట్టం 1956లో రూపుదిద్దుకుంది. అప్పట్నుంచి అవసరాలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. చివరిగా 2019లో జడ్జీల సంఖ్యను 30 నుంచి 34కు పెంచారు. -
కేరళంలో నేడు కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం
తిరువనంతపురం: కేరళలో దశాబ్దకాలంపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి నేడు నూతన ప్రభుత్వాన్ని కొలువు తీర్చనుంది. ఇందులోభాగంగా కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోకి సెంట్రల్ స్టేడియంలో సతీశన్‌తోపాటు 20 మంది నేతలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశముండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే సీఎం సతీశన్ శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి మంత్రివర్గం జాబితాను అందజేశారు. నేడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తన మంత్రివర్గంలో సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కె. మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్, ఏపీ అనిల్ ఉంటారని కాబోయే సీఎం సతీశన్ చెప్పారు. దీంతో, సీఎం కుర్చీ కోసం పోటీ పడిన చెన్నితాల కేబినెట్లో చేరే అవకాశం లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈసారి కేబినెట్లోకి 14 మంది కొత్తముఖాలకు అవకాశం కల్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోస్టుకు మరో సీనియర్ నేత టి.రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినట్లు సతీశన్ చెప్పారు. ఐయూఎంఎల్ నేతలు పీకే కున్హలికుట్టి, ఎన్.షంషుద్దీన్, కేఎం షాజీ, పీకే భాస్కర్, వీఈ అబ్దుల్ గఫూర్, ఆర్ఎస్పీ నేత శిబూ బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్(జాకబ్) నేత అనూప్ జాకబ్లకూ కేబినెట్ బెర్త్ ఖారారైంది. సీఎంగా సతీశన్ బాధ్యతలు చేపట్టక మునుపే మంత్రి పదవులకు ఎంపిక, అధికార పంపిణీ, అధిష్టానం నిర్ణయాలపై అంతర్గత అసమ్మతి రగులుతోంది. సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక కూటమి భాగస్వామ్య పక్షం ఐయూఎంఎల్ ఒతిళ్లున్నాయని నాయర్ సేమా సమాజం(ఎన్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి సుకుమారన్ ఆరోపించారు. కూటమిలో ఎస్ఎన్డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మణి కప్పన్ సంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కేబినెట్ కూర్పులో రొటేషన్ విధానాన్ని ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భారత్‌కు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
కాండ్లా : పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ పెద్దమొత్తంలో ఎల్పీజీ సరకుతో మరో నౌక భారత్‌కు చేరుకుంది. 20వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటి శనివారం గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది. ఖతర్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13వ తేదీన హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. 46,427 టన్నుల ఎల్పీజీతో నిండిన మరో నౌక ‘సన్‌షైన్’ గురువారం హార్మూజ్‌ను దాటిందని, సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా,హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు, నావికా సిబ్బందిని ప్రమాదంలో పడేయడంపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రత్యేక సమావేశంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. -
2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు ప్రయత్నాలను చేపట్టింది. ప్రైవేట్ కంపెనీలు రెండు రోజుల వర్క్–ఫ్రమ్–హోమ్ విధానాన్ని అమలుచేయాలని, ఆఫీసు పనివేళలను మార్చుకోవాలని, ఉద్యోగులు కార్ పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీ కార్మిక శాఖ ఆదివారం అడ్వైజరీని జారీ చేసింది. వర్క్–ఫ్రమ్–హోమ్ వల్ల ఇంధన వినియోగాన్ని పెద్ద మొత్తంలో నివారించవచ్చని పేర్కొంది. ‘జాతీయ ఇంధన పొదుపు ప్రయత్నాలకు తోడ్పడేందుకు, ఢిల్లీలోని ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల యజమానులందరూ వారానికి కనీసం రెండు రోజుల పాటు వర్క్–ఫ్రమ్–హోమ్‌ను అమలు చేయాలి. రద్దీ సమయాల్లో రహదారులపై వాహనాల భారాన్ని తగ్గించడానికి విడతల వారీగా పని గంటలను అమలు చేయాలి. ఉద్యోగులను ప్రజా రవాణా, కార్–పూలింగ్ లేదా మోటారు రహిత ప్రయాణ మార్గాలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి’ అని అడ్వైజరీలో సూచించింది. ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థలు, విద్యుత్, నీరు, పారిశుధ్యం, సంబంధిత మున్సిపల్ సేవలు వంటి అత్యవసర ప్రైవేట్ సంస్థలకు మినహాయింపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత కారణంగా వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఇంధన పొదుపు కార్యక్రమాలకు మద్దతివ్వాలని ప్రైవేట్ రంగాన్ని కోరనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఆమె 90 రోజుల ‘మేరా భారత్, మేరా యోగ్దాన్’ఇంధన పొదుపు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
త్రిభాషా తకరారు
న్యూఢిల్లీ: 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఏమిటీ త్రిభాషా సూత్రం? జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు. మొదట ఎప్పుడు ప్రతిపాదించారు? త్రిభాషా సూత్రాన్ని తొలుత ఎడ్యుకేషన్ కమిషన్(కొఠారీ కమిషన్) ప్రతిపాదించింది. 1964 నుంచి రెండేళ్లపాటు ఈ కమిషన్ పనిచేసింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్–1968లో దీన్ని చేర్చారు. భాషా వైవిధ్యం, జాతీయ ఐక్యతను ప్రోత్సహించేందుకు త్రిభాషా సూత్రాన్ని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు సమర్థించాయి. 1992లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం సవరణ చేసింది. దీనిప్రకారం మాతృభాష లేదా ప్రాంతీయ భాష, దేశ అధికారిక భాష, ఆధునిక భారతీయ లేదా యూరోపియన్ భాషను బోధించాలి. ఏయే విదేశీ భాషలు? జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం.. మాధ్యమిక స్థాయి విద్యార్థులు భారతీయ భాషలు, ఇంగ్లిష్ తోపాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి ఇతర విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. ఆంగ్లాన్ని ఒక విదేశీ భాషగా వర్గీకరించారు. దీన్నిబట్టి విద్యార్థులు ఇంగ్లిష్ ను, మరో విదేశీ భాషను తమ రెండు మూడో భాషలుగా ఎంచుకోవడానికి వీలుండదు. పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయా? ప్రత్యేక ఆర్3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చేవరకు, 9వ తరగతి విద్యార్థులు తాము ఎంచుకున్న భాషకు సంబంధించిన 6వ తరగతి ఆర్3 పాఠ్యపుస్తకాలను (2026–27 ఎడిషన్) ఉపయోగించుకోవాలని సీబీఎస్ఈ తెలిపింది. తగినంత అర్హత కలిగిన స్థానిక భారతీయ భాషా ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్న పాఠశాలలు, తాత్కాలిక ఏర్పాటుగా, సంబంధిత భాషలో ప్రావీణ్యం ఉన్న ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను నియమించుకోవచ్చని సూచించింది. అసలు వివాదం ఏమిటి? గతంలో డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య రాజకీయ వివాదానికి త్రిభాషా సూత్రం కేంద్ర బిందువుగా మారింది. త్రిభాషా సూత్రాన్ని దశాబ్దాలుగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు. తమిళంతోపాటు ఇంగ్లిష్‌ను బోధిస్తున్నారు. జాతీయ విద్యా విధానం–2020 చెప్పిందేమిటి? పాఠశాల స్థాయి నుండే బహుభాషావా దాన్ని ప్రోత్సహించడానికి త్రిభాషా సూ త్రాన్ని త్వరగా అమలు చేయాలని జాతీయ విద్యా విధానం స్పష్టంచేసింది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి బహుభాషావాదానికి పెద్దపీట వేయాలని సూచించింది. త్రిభాషా సూ త్రాన్ని అమలు చేయడం కొనసాగిస్తామని పేర్కొంది. అయితే, ఏ ఒక్క భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దకూడదని వెల్లడించింది. మూడు భాషల ఎంపికను రాష్ట్రాలకు, విద్యార్థులకే వదిలేయాలని స్పష్టంచేసింది. -
సహకారమే మన బలం
గోథెన్బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్సన్తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్‌పోర్స్ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. గోథెన్బర్గ్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్‌లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్‌సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్‌లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్ రాగానే భీకర పోరు
వాషిం జిల్లా: పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్ ట్యాంకర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్ వద్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.మొదట వెయిట్ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొచ్చు. డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.FUEL AND FURYFor the third consecutive day, Washim, Maharashtra witnessed a severe diesel shortage. Amid the rush to procure diesel, two groups clashed with each other, leading to a violent brawl. A video of the incident has surfaced. The footage is said to be from a petrol pump… pic.twitter.com/m0SO9JbP1G— Rahul Shivshankar (@RShivshankar) May 17, 2026 -
గోవులకు బర్త్ సర్టిఫికేట్.. బీజేపీ ఎమ్మెల్యేపై టీఎంసీ సెటైర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాల్ని అడ్డుకున్న ఆమె.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆవుల జనన సర్టిఫికేట్ చూపించాలి’అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా శనివారం హింగల్గంజ్లోని లేబుఖాలి ప్రాంతంలో గోవుల రవాణా వాహనాన్ని అడ్డుకున్నారు. రహదారి మార్గంలో వాటికి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేఖా పత్రా మాట్లాడుతూ.. 14 ఏళ్ల లోపు ఆవులను వధ చేయరాదు. ఎవరు అక్రమంగా ఆవులను తరలిస్తే వారిని పట్టుకోవాలి. ఆవుల జనన సర్టిఫికేట్ చూపించమని అడగాలి. చూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఆవుకు జనన సర్టిఫికేట్ ఇచ్చిన ఉదాహరణ చూపించగలరా? ఒకటి చూపిస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారో కూడా తెలుసుకోవాలి” అని వ్యంగ్యంగా అన్నారు.అయితే టీఎంసీ నేతల సెటైర్లపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. గోవధను అరికట్టాలంటే జనన దృవీకరణ పత్రాలు ఉండాల్సిందేనని అంటున్నారు. ఎమ్మెల్యే రేఖా పత్రా ఆలోచన బాగుందని తెలిపారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది 68 మంది ప్రయాణికులతో ఉన్న కోచ్‌ను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రైల్వే అధికారుల ప్రకారం, తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 12431 నంబరు గల రైలులోని బి-1 కోచ్‌లో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని విక్రమ్‌గఢ్ ఆలోట్,లునిరిచా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పీఆర్ఓ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఉదయం 3.45 గంటల ప్రాంతంలో రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది.ఈ ఘటన ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది, కనీసం ఐదు నుంచి ఆరు రైళ్ల షెడ్యూళ్లకు అంతరాయం కలిగింది. ఈ ఘటన తర్వాత పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రమాదం, రైళ్ల రాకపోకల అంతరాయంపై ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు. -
బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు!
నూహ్: నీరే ప్రాణాధారం... కానీ ఆ గుక్కెడు నీటి కోసమే ఓ గ్రామం ప్రతిరోజూ ప్రాణసంకటాన్ని ఎదుర్కొంటోంది. ‘హర్ ఘర్ జల్’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లా మలాబ్ గ్రామంలో సూర్యోదయంతోనే మహిళల నీటి కష్టాలు మొదలవుతాయి. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలయినా,పురుషులైనా, చివరికి నిండు గర్భిణులైనా ఆ నీటి కుండల బరువు మోయక తప్పని దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.కాగితాలపైనే పథకాలు... కన్నీళ్లలో మహిళలుజల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, మలాబ్ గ్రామంలో మాత్రం పైపుల ద్వారా చుక్క నీరు రావడం లేదు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో, దాదాపు 12,200 మంది గ్రామస్తులు తాగే నీటి కోసం ‘కుండ్’ అనే భూగర్భ ట్యాంకులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. 82 ఏళ్ల వృద్ధురాలు షకీలా తన జీవితమంతా తలపై నీళ్ల బిందెలు మోస్తూనే గడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారి నిరీక్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.నిండు గర్భిణులకూ తప్పని..నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఏడు నెలల గర్భిణీ అయిన 26 ఏళ్ల అర్షీ సైతం ప్రతిరోజూ బరువైన నీటి బకెట్లు మోస్తోంది. బరువులు ఎత్తకూడదని వైద్యులు హెచ్చరించినా, ఆమెకు వేరే దారి లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు పలుమార్లు ఈ భూగర్భ ట్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా స్థానిక మహిళలు నిరంతర వెన్నునొప్పి, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.చదువును మింగేస్తున్న నీటి కటకటనీటి కోసం సాగే ఈ జీవన్మరణ పోరాటం బాలికల భవిష్యత్తును సైతం ఛిద్రం చేస్తోంది. ఇంటి పనుల్లో, ముఖ్యంగా నీళ్లు మోయడంలో సహాయపడేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పైగా పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో నెలసరి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరుబయట ఉండే భూగర్భ ట్యాంకుల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టుల పేరిట కేవలం హామీలకే పరిమితమవుతున్నారు.ఇది కూడా చదవండి: హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు! -
'అందుకే స్టాలిన్‌ను కలిశా.. విజయ్‌పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్‌ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్‌ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్‌ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి అసూయ లేదన్నారు. కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్‌కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్‌తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
పెళ్లి నిరాకరించిందని... నలుగురిపై యాసిడ్ దాడి
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతో ఒక ఉన్మాది, నిద్రిస్తున్న వివాహిత కుటుంబంపై అత్యంత కిరాతకంగా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న అమాయక పిల్లలు సైతం ఈ రాక్షసత్వానికి బలైన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అర్ధరాత్రి పూట భయానక దాడిశేర్ఘర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ హృదయ విదారక ఘటన జరిగింది. బాధితురాలు దేవి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తమ ఇంటి వరండాలో దోమలతెర కట్టుకుని నిద్రిస్తున్నారు. అదే అదనుగా భావించిన నిందితుడు, చీకట్లో ఇంటి పైకప్పు మీదుగా లోపలికి ప్రవేశించి, వారిపై అత్యంత దారుణంగా యాసిడ్ (మండే స్వభావం గల ద్రవం) పోశాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కాలిన గాయాలతో ఉన్నారంటూ శేర్‌ఘర్ పోలీసులకు సమాచారం అందిందని మీర్గంజ్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు.ఉన్మాది వికృత చేష్టలుపోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడిని ఉమేష్ కశ్యప్‌గా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిందితుడికి అప్పటికే వివాహం అయింది. అయినప్పటికీ, వివాహిత అయిన దేవిని పెళ్లి చేసుకోవాలని అతడు వేధించేవాడు. అతని వివాహ ప్రతిపాదనను ఆమె తీవ్రంగా తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆ క్రోధంతోనే నిద్రిస్తున్న ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరిపై మండే ద్రవాన్ని పోసి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.కేసు నమోదు, గాలింపు చర్యలు ముమ్మరంఈ హఠాత్పరిణామంతో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురు కుటుంబ సభ్యులను స్థానికులు వెంటనే శేర్‌ఘర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు ఉమేష్ కశ్యప్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా? -
సిరియా టు గల్ఫ్.. ఇండియా మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్‌పై భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సర్జికల్ స్ట్రైక్ చేసింది. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో జరిపిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 182 కోట్ల విలువైన 228 కిలోల ‘క్యాప్టగాన్’ అనే ప్రమాదకరమైన డ్రగ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులు, సాయుధ దళాలు ఎక్కువగా వాడటం వల్ల దీనిని ‘జిహాదీ డ్రగ్’ అని పిలుస్తారు. భారతదేశంలో ఈ రకమైన నిషేధిత డ్రగ్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారి. సిరియా కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేయడానికి ఇండియానూ ఒక ట్రాన్సిట్ హబ్‌గా వాడుకుంటోందని ఈ ఆపరేషన్ కారణంగా వెల్లడయ్యింది.ఢిల్లీ టూ గుజరాత్: ఎన్సీబీ మెరుపు దాడులువిదేశీ నిఘా సంస్థ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు మే 11న ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై దాడి చేశారు. అక్కడ సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన ఒక చపాతీ కటింగ్ మెషీన్లో దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించారు. టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి అక్రమంగా నివసిస్తున్న ఒక సిరియా పౌరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆ నిందితుడిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వెంటనే అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుని, సిరియా నుండి దిగుమతి చేసుకున్న గొర్రెల ఉన్ని కంటైనర్‌లో దాచిన మరో 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.అధిక సమయం మేల్కొనేందుకు ‘జిహాదీ డ్రగ్’పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లోని ఘర్షణ ప్రాంతాలలో ఈ క్యాప్టగాన్ టాబ్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాద ముఠాలు రణరంగంలో అలసట లేకుండా పోరాడటానికి, ఎక్కువ సమయం మేల్కొని ఉండటానికి, భయాన్ని మర్చిపోయి తెగింపుతో వ్యవహరించడానికి ఈ యాంఫెటమైన్ రకానికి చెందిన స్టిమ్యులెంట్ను ఎక్కువగా వాడుతుంటారు. అందుకే దీనికి 'జిహాదీ డ్రగ్' అనే పేరు వచ్చింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో, ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ డ్రగ్స్ వినియోగం పెరగడం అక్కడి ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. వాణిజ్య కార్గో మార్గాలను వాడుకుంటూ అంతర్జాతీయ కార్టెల్స్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి.నార్కో టెర్రరిజంపై అమిత్ షా హెచ్చరికఈ అద్భుతమైన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డ్రగ్స్ రవాణాపై ఉన్న ‘జీరో-టాలరెన్స్’ విధానానికి ఈ ఘనతే నిదర్శనమన్నారు. ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా మన ఏజెన్సీలు రూ. 182 కోట్ల విలువైన ‘జిహాదీ డ్రగ్’ క్యాప్టగాన్‌ను తొలిసారిగా పట్టుకోవడం సంతోషకరం’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని డ్రగ్స్ కారిడార్‌గా మార్చాలని చూసే అంతర్జాతీయ ముఠాల ఆట కట్టిస్తామని, మన దేశ సరిహద్దుల్లోకి వచ్చే ప్రతి గ్రాము డ్రగ్‌ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసులో హవాలా నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలపై ఎన్సీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.ఇది కూడా చదవండి: ‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా? -
కేంద్రం మరో షాక్.. సీఎన్జీ ధరల పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. తాజాగా కిలో సీఎన్జీ ధరను రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రెండు రోజుల క్రితమే పెట్రో ధరల పెంపు సందర్బంగా సీఎన్జీ కూడా రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధరను కేంద్రం రెండుసార్లు పెంచడంతో వాహనదారులు మండిపడుతున్నారు. తాజా పెంపుతో సీఎన్జీపై మొత్తంగా మూడు రూపాయాలను పెంచినట్టు అయ్యింది. తాజాగా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.80.09కి చేరింది. ముంబైలో రూ. 84.09కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో రూ. 88.70కి పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో రూ.100కు చేరుకుంది.CNG rates have been increased by Re 1 from today. In Delhi, per KG CNG will cost Rs 80.09. In Noida-Ghaziabad, per KG CNG will cost Rs 88.70. This is the second increase in prices in 2 Days. Earlier on 15th May, CNG prices were increased to Rs 2/KG.— ANI (@ANI) May 17, 2026ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీకి చేరుకుంది. పెట్రోల్,డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ అధికమైలేజీతో పాటు కాలుష్య రహితం కావడంతో చాలా మంది వాహనాలను సీఎన్జీకి అనుగుణంగా ఇంధన ట్యాంకులను మార్చుకున్నారు. మరోవైపు సీఎన్జీ ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు బంకుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధన కొరత సమస్యను పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
మమతకు బిగ్ షాక్.. సువేందు అధికారి అదిరిపోయే దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను, గుర్తులను సువేందు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాల నుండి అధికారికంగా తొలగించడం ప్రారంభించింది. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కాగా, మాజీ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ 16, 2013న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను ప్రారంభించారు. బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు మరియు చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహించే చిహ్నంగా దీనిని రూపొందించారు. బెంగాలీ అక్షరం “B” చుట్టూ రూపొందించబడిన ఈ లోగో, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్సైట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు సుందరీకరణ కార్యక్రమాలలో క్రమంగా అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా మారింది.దశాబ్దానికి పైగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గుర్తింపుగా పనిచేసింది. కాగా, బెంగాల్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం, ఈ లోగో స్థానంలో మరో కొత్త లోగోను తీసుకువచ్చారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంలో 'బిస్వా బంగ్లా' గుర్తును తొలగించి, దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే 'ఎగియే బంగ్లా' పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ థీమ్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఉన్న తెలుపు-నీలం రంగుల స్థానంలో కాషాయ రంగును చేర్చారు.The 'Biswa Bangla' logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India's national emblem - the Ashok StambhBiswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026అయితే, ఒక వ్యక్తి సృష్టించిన లోగో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక గుర్తింపుగా పనిచేయకూడదని వాదిస్తూ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారిక ప్రభుత్వ వినియోగానికి అశోక చిహ్నమే అత్యున్నతమైన మరియు అత్యంత సముచితమైన చిహ్నంగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2017లో 'బిస్వా బంగ్లా' లోగో ఒక రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్, ఆ లోగో ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని, అది ప్రభుత్వానిది కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ ఖండించగా మమతా బెనర్జీ అసెంబ్లీలో ఆ లోగోను తానే స్వయంగా సృష్టించానని, రాయల్టీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించానని తరువాత స్పష్టం చేశారు.దాదాపు 13 సంవత్సరాలుగా బిస్వా బంగ్లా చిహ్నం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపుతో మరియు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారిక వ్యవస్థలు మరియు రాష్ట్ర నియంత్రిత వేదికల నుండి ఆ లోగో తొలగించడం ఎంతో కీలకంగా మారింది. ఇది బెంగాల్ రాజకీయ, పరిపాలనా బ్రాండింగ్‌లో ఒక ప్రతీకాత్మక మార్పును సూచిస్తుంది.రాజకీయ ప్రభావంటీఎంసీ గుర్తింపు తొలగింపు: బిశ్వ బంగ్లా లోగో తొలగించడం ద్వారా టీఎంసీ పాలనలో ఏర్పడిన గుర్తింపును తొలగిస్తున్నారు.బీజేపీ సంకేతం: అశోక స్తంభం ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర గుర్తింపుగా మార్చి, “సాఫ్రన్ బ్రాండింగ్”ను బలపరుస్తోంది.సాంస్కృతిక ప్రభావం: దుర్గాపూజ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనా. -
‘రాజధాని’లో మంటలు.. గార్డు సమయస్ఫూర్తితో..
కోట: దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో ఒకటైన తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో (12431) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజస్థాన్ లోని కోట రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సిబ్బంది అప్రమత్తతతో అత్యవసర సహాయక చర్యలు సకాలంలో మొదలుకావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.తెల్లవారుజామున చెలరేగిన మంటలుఆదివారం ఉదయం సరిగ్గా 5:15 గంటల సమయంలో ఈ రైలు లూని రిచ్ఛా, విక్రమ్‌గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ల మధ్య వేగంగా వెళేతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా రైలులోని బీ1 (B1) ఏసీ కోచ్‌తో పాటు ఇంజిన్ విభాగంలో అగ్ని కీలలు వెలువడ్డాయి. క్షణాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు.అప్రమత్తమైన రైల్వే యంత్రాంగంఈ ప్రమాదం జరిగిన వెంటనే కోట రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోమేటిక్ హూటర్ భారీ శబ్దంతో మోగడంతో స్థానిక రైల్వే పరిపాలనా విభాగం వెంటనే అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే కోట రైల్వే డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు, అత్యవసర రెస్క్యూ, రిలీఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు.గార్డు సమయస్ఫూర్తితో..రైలులో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన వెంటనే ఆన్‌బోర్డ్ గార్డు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంటలంటుకున్న విషయాన్ని అధికారులకు తెలియజేసి, అత్యవసరంగా రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి, ప్రమాదానికి గురైన బీవన్ కోచ్‌లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సకాలంలో రైల్వే సిబ్బంది చేపట్టిన చర్యలతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.ఇది కూడా చదవండి: ‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా? -
పెట్రో ధరల ఎఫెక్ట్.. బస్సు ఛార్జీలు పెంపు
భువనేశ్వర్: దేశంలో ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల బస్సు ఛార్జీలను పెంచింది. ఆటోమేటిక్ ఫేర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కింద బస్సు ఛార్జీలను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త చార్జీలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్టీఏ) కమిషనర్ కమ్ చైర్మన్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2024 మార్చి 16 నాటికి లీటర్‌కు రూ.92.62గా ఉన్న డీజిల్ ధర, ఈ ఏడాది మే 15 నాటికి రూ.95.87కు పెరిగింది. ప్రత్యక్షంగా రూ.3.25.. సంచితంగా (క్యారీ ఓవర్‌తో కలిపి) రూ.4.80 మేర ధర పెరిగినందున రాష్ట్రంలో తిరిగే టౌన్ బస్సులు మినహా ఇతర స్టేజ్ క్యారేజీల ఛార్జీల పెంపు నిర్ణయించి తక్షణమే అమలు చేశారు. ఎస్టీఏ నిర్ణయం ప్రకారం సాధారణ, ఎక్స్‌ప్రెస్ వర్గం బస్సు చార్జీలు కిలో మీటరుకు 2 పైసలు చొప్పున పెంచారు. ఈ నేపథ్యంలో సాధారణ బస్సులో ప్రయాణం ఛార్జీ కిలో మీటరుకు 88 పైసలు నుంచి 90 పైసలకు పెరిగింది. ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీని ప్రస్తుతం కొనసాగుతున్న 92 పైసలు నుంచి 94 పైసలకు పెరిగింది. డీలక్స్ మరియు ఎయిర్ కండిషన్ డీలక్స్ బస్సుల్లో ప్రయాణం ఛార్జీని కిలో మీటరుకు 4 పైసలు వంతున పెంచారు. సూపర్ డీలక్స్ బస్సు ప్రయాణం కిలో మీటరుకు 6 పైసలు పెంచారు. -
‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా?
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ‘భోజ్‌శాల’ సంచలన తీర్పు.. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా రగులుతున్న పలు చారిత్రక వివాదాలకు మళ్లీ ప్రాణం పోసింది. ధార్‌లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టి 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై పడింది. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులనే కొనసాగించాలనే ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటి చారిత్రాత్మక అయోధ్య తీర్పు తర్వాత, ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రముఖ మందిరం-మసీదు న్యాయ పోరాటాలివే..శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు (మధుర, ఉత్తరప్రదేశ్)హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల మధుర ఆలయ సముదాయం, దానిని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ పక్షాల ప్రధాన వాదన. అయితే ఈ కట్టడం 1991 ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ పరిధిలోకి వస్తుందని ముస్లిం ప్రతినిధులు వాదిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకుని, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు దాఖలు చేసిన 18 వేర్వేరు వ్యాజ్యాలు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 2024 ఆగస్టు ఒకటిన, మసీదు కమిటీ అభ్యంతరాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.కాశీ విశ్వనాథ్ ఆలయం - జ్ఞానవాపి మసీదు (వారణాసి, ఉత్తరప్రదేశ్)అయోధ్య, మధుర తరహాలోనే దేశంలో అత్యంత సంచలనం రేపుతున్న మతపరమైన ఆస్తుల కేసు ఇది. ఔరంగజేబు హయాంలో అసలైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసి, జ్ఞానవాపి మసీదును నిర్మించారని హిందువుల వాదన కాగా, శతాబ్దాలుగా ఇక్కడ నమాజులు జరుగుతున్నాయని ముస్లింలు 1991 చట్టాన్ని ఉదహరిస్తున్నారు. 2021లో ఐదుగురు మహిళలు ప్రార్థనల హక్కుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయపోరాటం వేగవంతమైంది. కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో మసీదు ‘వజూఖానా’లో శివలింగాన్ని పోలిన నిర్మాణం బయటపడటంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించింది. అనంతరం 2024లో మసీదులోని ‘వ్యాస్ జీ కా తహ్ఖానా’ బేస్మెంట్లో హిందూ పూజారి రోజూ ప్రార్థనలు చేయడానికి కోర్టు అనుమతించింది.షాహీ జామా మసీదు (సంభాల్, ఉత్తరప్రదేశ్)విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి భగవానుడి ప్రాచీన ‘హరిహర’ ఆలయం ఉన్న స్థలంలో ఈ మసీదును నిర్మించారన్న ఆరోపణలతో 2024లో సంభాల్ జిల్లాలో తీవ్ర పౌర అశాంతి చెలరేగింది. 1526లో బాబర్ కాలంలో ఇది నిర్మితమైందని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు సర్వేకు ఆదేశించింది. రెండో విడత సర్వే సమయంలో భద్రతా బలగాలు, స్థానిక ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు (ఢిల్లీ)ప్రముఖ కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కోసం.. మహ్మద్ ఘోరీ సైన్యాధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఏకంగా 27 హిందూ, జైన దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ దేవాలయాల శిథిలాలతోనే మసీదును కట్టారని, అక్కడ తమ దేవుళ్లను పునరుద్ధరించాలని 2021లో హిందూ, జైన భక్తులు సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే ఈ కట్టడాల ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు చట్టపరంగా అనుమతి లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కౌంటర్ దాఖలు చేసింది. చారిత్రక సంఘటనల ఆధారంగా శాంతికి విఘాతం కలిగించలేమంటూ సివిల్ కోర్టు దావాను కొట్టివేయగా, ప్రస్తుతం దీని అప్పీల్ పెండింగ్‌లో ఉంది.ఈద్గా మైదాన్ (హుబ్బళ్లి, కర్ణాటక)2022లో హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు మున్సిపల్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ భూమి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం కేవలం ఏడాదికి ఒక్క రూపాయి నామమాత్రపు రుసుముతో 999 సంవత్సరాల లీజును మాత్రమే కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇది సాధారణ ప్రార్థనా స్థలం కాదని, కేవలం బక్రీద్, రంజాన్ పండుగల సమయంలో మాత్రమే ఇస్లామిక్ ప్రార్థనలకు అనుమతించారని తేల్చిచెప్పింది.ఇది కూడా చదవండి: ‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన -
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
వెండి దిగుమతులపై ఆంక్షలు
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం వేళ విదేశీ మారక (డాలర్ల) నిల్వలను కాపాడుకునే క్రమంలో దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పసిడి, వెండి, ప్లాటినంలపై సుంకాలను పెంచిన ప్రభుత్వం వెండికి సంబంధించి మరిన్ని నియంత్రణలను ప్రకటించింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే (ఫ్రీ ఇంపోర్ట్) కేటగిరీలో ఉన్న వెండిని ఆంక్షలు వర్తించే ‘రిస్ట్రిక్టెడ్’ కేటగిరీలోకి మార్చింది. దీనితో ఈ విభాగంలోని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు అవసరం ఉంటుంది. తాజా పరిణామంతో ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, సెమీప్రాసెస్డ్ సిల్వర్, సిల్వర్ పౌడర్, సాదా వెండి ఆభరణాల్లాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలన్నా డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లోని యూనిట్లకు ఈ ఆంక్షలు వర్తించవు. కాకపోతే, అవి దిగుమతి చేసుకున్న వాటిని భారత మార్కెట్లో విక్రయించకుండా, పూర్తిగా ఎగుమతి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు ముందస్తు అనుమతి తీసుకున్నా సరే... ఒకసారి 100 కిలోలకన్నా ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవటానికి అనుమతించరు. ఇక ఎగుమతి ఆధారిత యూనిట్లు తొలుత దిగుమతి చేసుకున్న వెండిని వినియోగించి... అందులో కనీసం 50 శాతాన్ని ఎగుమతి చేసినట్లు నిరూపిస్తేనే మరోసారి దిగుమతికి అనుమతిస్తారు. విలువైన లోహాల దిగుమతి కోసం విదేశీ మారక నిల్వలను భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో పసిడితో పాటు వెండి దిగుమతులపై కేంద్రం సుంకాలను ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.12 బిలియన్ డాలర్ల దిగుమతులుభారత దిగుమతుల్లో వెండి వాటా ఏడాదికి దాదాపు 7 వేల నుంచి 9 వేల టన్నుల వరకు ఉంటోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2025– 26లో వెండి దిగుమతులు పరిమాణం పరంగా 42 శాతం పెరిగి 7,335 టన్నులకు చేరాయి. విలువపరంగా 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం. దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా సిల్వర్ పౌడర్, బులియన్ కడ్డీలు, ముడి రూపంలోని వెండి ఉంటున్నాయి. కొత్త నిబంధనలతో వెండి దిగుమతుల్లో సింహభాగానికి డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరి కానుంది. ఎందుకీ నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత విలువైన ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం అందులో ఒకటి. అలాగే వివిధ దేశాలతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును నియంత్రించడం మరో లక్ష్యం. థాయ్‌లాండ్, యూఏఈలాంటి దేశాలతో భారత్‌కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఉన్నాయి. దీనితో సుంకాల భారం భారీగా ఉండకుండా, ఆయా దేశాల మార్గం గుండా దిగుమతి చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కనుక, ఎఫ్‌టీఏల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రజలపై ప్రభావం ఏంటంటే..ఆభరణాలు ప్రియం..: అంతర్జాతీయంగా వెండి ధరలు భారీ స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఇటీవలి సుంకాల విధింపుతో సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనికి తోడు ఇక సంక్లిష్టమైన లైసెన్సు ప్రక్రియ కూడా తోడైతే దిగుమతుల్లో జాప్యానికి దారి తీయొచ్చు. ఫలితంగా దేశీయంగా డిమాండ్, అలాగే ధరలు కూడా భారీగా ఎగిసే అవకాశం ఉంది. మన దగ్గర శుభకార్యాలు, ఇతరత్రా గిఫ్ట్ ఐటెమ్స్‌లో వెండి వినియోగం ఎక్కువే ఉంటోంది. అయితే, చిన్న వ్యాపారులు, ఆభరణాల తయారీదార్లకు ముడి వస్తువు వ్యయాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. స్మగ్లింగ్ ముప్పు..: దిగుమతి సుంకాలను పెంచినప్పుడే స్మగ్లింగ్ ముప్పులపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు మరిన్ని నియంత్రణల వల్ల ఈ రిస్కులు ఇంకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలకు షాక్..: కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఇతరత్రా పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు .. ఇలా ఒకటేమిటి, అనేక అవసరాల కోసం సిల్వర్‌ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజా నియంత్రణల వల్ల ఆయా పరిశ్రమలకు ముడి వస్తువు ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అవి తయారు చేసే ఉత్పత్తుల ధరలూ పెరుగుతాయి. పెట్టుబడులకు కొనసాగనున్న ఆసక్తి..పసిడితో పాటు ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని కూడా ఓ కీలకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు స్థాయిలో ఉండటంతో రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నా సిల్వర్వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల కోణంలో దీనికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. -
7 వసంతాల తర్వాత ఎట్టకేలకు..
సిమ్లా: మారుతున్న వాతావరణ పరిస్థితులు హిమశిఖరాల్లోని టన్నుల కొద్దీ మంచును కబళించివేస్తున్నాయి. దీంతో మంచుతో నిండిపోయి సుందరంగా కన్పించాల్సిన హిమాలయాలు చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తు న్నాయి. మంచులో కలియతిరిగే భల్లూకాలు సైతం అంతర్థానమవుతున్నాయి. మరీముఖ్యంగా గోధమవర్ణ ఎలుగుబంట్లను హిమాచల్ వాసులు చూసి ఏడు వసంతాలు గడిచిపో యాయి. అయితే తాజాగా కినౌర్ జిల్లాలో మళ్లీ బ్రౌన్ బేర్ దర్శనమిచ్చి సందడిచేసింది. కినౌర్‌లోని మంచు లోయల్లో తన రెండు బుల్లి భల్లూకాలతో కన్పించి సందడిచేసిన ఆడ ఎలుగుబంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాక్చమ్– చిట్కుల్ వన్యప్రాణి సంరక్షణా అరణ్యంలో ఏడేళ్ల తర్వాత గత వారం ఒక గోధమరంగు ఎలుగుబంటిని చూశామని హిమాచల్ ప్రదేశ్ అటవీశాఖ విభాగం ఒక వీడియోను విడుదల చేసింది. బ్లాక్ ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ ఠాకూర్, ప్రకృతి ప్రేమికుడు గారీ భట్టీ, పరిశోధకులు డాక్టర్ బిశ్వరూప్ సత్పతి, డాక్టర్ రాహుల్‌దేవ్ మండల్ స్వయంగా వెళ్లి ఎలుగును చూసి వచ్చారు. బర్డ్కౌంట్ 2026 కార్యక్రమంలో చేపడుతుండగా అనూహ్యంగా ఇది కంటపడింది. ‘‘ఈ హిమాలయన్ బ్రౌన్ బేర్ అనేది గోధమరంగు భల్లూకాల్లో ఉపజాతికి చెందినది. దీని ఉర్సుస్ ఆర్కటస్ ఇసాబెల్లినస్ అని కూడా అంటారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సముద్రమట్టానికి 2,5000 అడుగుల ఎత్తులో మంచుమయ వాతా వరణాల్లో మాత్రమే ఇవి జీవిస్తాయి. గరిష్టంగా 250 కిలోలవరకు పెరుగుతాయి. సమూహంగాకాకుండా ఒంటరిగా జీవిస్తాయి. చెట్ల ఆకులు, వేర్లు, ఫలాలు, గడ్డి తిని బతుకు తాయి. ఇప్పటికే దీనిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. కాలుష్యం, తగ్గిన మంచు, తదితర కారణాలతో వీటి సంతతి భారీగా తగ్గిపోయింది. ‘‘కాలుష్యభూతానికి హిమాలయాలు బలవుతున్నా ఇంకా ఇలాంటి జాతులను కాపాడుతూ భావితరాలకు మన దేశ జీవవైవిధ్యాన్ని చాటేందుకు కృషి చేస్తున్నాయి’’ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి, హిమాచల్‌లో డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్) అశోక్ నేగీ వ్యాఖ్యానించారు. -
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ‘క్యాప్టగాన్’ డ్రగ్ పట్టుబడింది. ‘జిహాదీ డ్రగ్’గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించేందుకు స్మ గ్లర్లు చేసిన యత్నాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమర్థవంతంగా భగ్నం చేసింది. ‘ఆపరేషన్ రేజ్ పిల్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.182 కోట్ల విలువైన 227.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఓ సిరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.చపాతీ మిషన్.. గొర్రెల ఉన్ని.. భారత్ ట్రాన్సిట్ హబ్‌గా క్యాప్టగాన్ డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఓ విదేశీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎన్సీబీకి సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మే 11న న్యూఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వాడే చపాతీలు కట్ చేసే యంత్రంలో అత్యంత రహస్యంగా దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. వీటిని సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. ఈ దాడుల్లో సిరియా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 2024 నవంబర్ 15వ తేదీన పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చాడు. 2025 జనవరి 12వ తేదీతో అతడి వీసా గడువు ముగిసింది. అప్పటినుంచి నెబ్ సరాయ్లో అక్రమంగా అద్దెకు ఉంటూ ఈ దందాకు తెరతీశాడు. అతడిచ్చిన సమాచారంతో మే 14న గుజరాత్‌లోని ముంద్రా కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ (సీఎఫ్ఎస్)లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది. సిరియా నుంచి గొర్రెల ఉన్ని పేరుతో వచ్చిన ఓ కంటైనర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్ లభ్యమైంది. ఈ డ్రగ్స్‌ను భారత్ మీదుగా సౌదీ అరేబియా సహా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నారని వెల్లడైంది.ఎవరినీ ఉపేక్షించేది లేదు: అమిత్ షాఆపరేషన్ రేజ్ పిల్ విజయవంతం కావడంపై హోంమంత్రి అమిత్ షా ఎన్సీబీ అధికారులను అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, వాడకాన్ని ఏమాత్రం సహించేదిలేదని, భారత్‌ను రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ఒక్క గ్రాము డ్రగ్స్‌ను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్యాప్టగాన్ (ఫెనెథిల్లిన్ అనే రసాయన సమ్మేళనం) సైకోట్రోపిక్ డ్రగ్. పశ్చిమాసియా దేశాల్లో దీని వాడకం తీవ్రంగా ఉంది. భయం, అలసట, నిద్రను ఎక్కువ కాలంపాటు దరి చేరనివ్వకుండా యుద్ధ క్షేత్రంలో దూకుడుగా వ్యవహరించేందుకు తీవ్రవాదులు దీనిని వాడతారని, అందుకే దీనికి ‘జిహాదీ డ్రగ్’అనే పేరు వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఈ డ్రగ్ పట్టుబడటం ఇదే తొలిసారి. -
సూపర్‌ఫుడ్ స్వీటెనర్‌గా బెల్లం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వంటింట్లో శతాబ్దాలుగా భాగమైన బెల్లం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్‌ఫుడ్ స్వీటెనర్’గా గుర్తింపు పొందుతోంది. సహజ పద్ధతుల్లో తయారయ్యే ఈ సంప్రదాయ తీపి పదార్థం ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్‌ను సాధిస్తోంది. ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో 70 శాతానికి మించిన వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఉత్పత్తయ్యే చెరకు పంటలో 20 నుంచి 30 శాతం బెల్లం తయారీకే వినియోగమవుతున్నట్లు కేంద్రం శనివారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు, కుటీర పరిశ్రమల రూపంలో కొనసాగుతున్న బెల్లం తయారీ రంగం సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువను అందించే వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తోందని వివరించింది.ఎగుమతుల్లో తీపిభారత్ బెల్లం, సంప్రదాయ మిఠాయి ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సాధించింది. 2015–16లో 197 మిలియన్ డాలర్ల విలువైన బెల్లం ఎగుమతులు నమోదు కాగా, 2024–25 నాటికి 406.8 మిలియన్ డాలర్లకు చేరింది. దాదాపు 106 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఎగుమతి పరిమాణం కూడా 292.8 మెట్రిక్ టన్నుల నుంచి 471.9 మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. ఇండోనేసియా, అమెరికా, యూఏఈ, నైజీరియా, నేపాల్ వంటి దేశాలు భారత బెల్లానికి ప్రధాన మార్కెట్లుగా మారాయి. సహజ స్వీటెనర్లకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ భారత్‌కు కొత్త అవకాశాలను తెరుస్తోంది. రైతులకు లాభదాయకంతమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన రైతు ఆంతోని సామి సేంద్రియ బెల్లం పొడి తయారీలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచారు. సాధారణ బెల్లం కిలో రూ.50కు అమ్ముడవుతుండగా, సేంద్రియ బెల్లం పొడిని రూ.75 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం మాత్రం రెండింటికీ దాదాపు సమానమే. ఇప్పుడు బెల్లం చాక్లెట్లు, కొబ్బరి రుచుల బెల్లం వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి రావడం రైతులకు మరింత ఆదాయాన్ని తెస్తోంది.కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంబెల్లం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన, పీఎం–ఎఫ్ఎంఈ, ఓడీఓపీ వంటి పథకాల ద్వారా చిన్న ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం–ఎఫ్ఎంఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,528 బెల్లం ఆధారిత సూక్ష్మ ఆహార పరిశ్రమలకు రూ.102 కోట్లకు పైగా సబ్సిడీలు మంజూరు చేసింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తులను 19 జిల్లాల్లో ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’గా గుర్తింపుపొందింది.జీఐ ట్యాగ్‌తో ప్రత్యేక గుర్తింపుభారత్లో పలు ప్రాంతీయ బెల్లం రకాలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ బెల్లం, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ గుర్, కేరళలోని మరయూర్ బెల్లం ప్రత్యేకతతో గుర్తింపు పొందాయి. ఇవి ప్రాంతీయ సంప్రదాయ తయారీ విధానాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. -
కోర్టులూ ఆస్పత్రుల్లా 24/7!
జబల్పూర్: వైద్యాలయాల మాదిరిగా న్యాయస్థానాలూ 24 గంటలూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ల బాధలు, ఆకాంక్షలను నెరవర్చే రాజ్యాంగబద్ధ కేంద్రాలుగా పరిఢవిల్లాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిలషించారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర హైకోర్టు పరిధిలో కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధిచేసిన సందర్భంగా ‘సమీకృత ఐక్య డిజిటల్ వేదికగా న్యాయసాధికారత’పేరిట జరిగిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ‘‘ఆస్పత్రుల్లా కోర్టులూ వారంలో ప్రతిరోజూ ప్రతిగంటా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడు ప్రజల బాధలు, ఆకాంక్షలను న్యాయవ్యవస్థ సత్వరం తీర్చగలదు. సాంకేతికతో మాత్రమే కోర్టుల సమయం వృథాకాకుండా నివారించగలం. న్యాయవ్యవస్థలో సమర్థవంతమైన టెక్నాలజీ, కృత్రిమమేథ ఆధారిత మౌలికవసతుల కల్పన తర్వాత వేగవంతమైన న్యాయవితరణ సాధ్యమవుతుంది. తక్షణం ఉపశమనం కల్పించేలా ప్రజలకు న్యాయం అందించాలి. అందుకోసమే న్యాయవ్యవస్థ అనేది 24/7 పనిచేయాల్సిందే’’అని అన్నారు. యువతపై అలాంటి భాష వాడలేదు.. సరైన వృత్తి ఎంచుకునే సామర్థ్యంలేక యువత పరాన్నజీవుల్లా మీడియా, సోషల్‌మీడియా, లాయర్, సామాజిక కార్యకర్తల్లా మారి దేశవ్యవస్థను నాశనంచేస్తున్నారంటూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంకావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఒక వర్గం దురుద్దేశంతో నా మాటలను తప్పుగా వక్రీకరించింది. తప్పుడు, బోగస్ డిగ్రీ పట్టాలు సంపాదించి కొందరు లాయర్ వృత్తిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో నిన్న అలా మాట్లాడా. యువతను అస్సలు కించపరచలేదు. భారతీయ యువత నాకెంత గౌరవం ఇస్తారో నవభారత మూలస్తంభాలుగా వాళ్లనూ అంతకంటే ఎక్కువగా నేను గౌరవిస్తా’’అని సీజేఐ అన్నారు. -
ఎన్టీఏలో మార్పులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో మార్పులు చేపట్టింది. తాజాగా ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త కార్యదర్శులుగా 1998 బ్యాచ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారి అనూజా బాపట్తోపాటు 2004 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి రుచితా విజ్‌ను సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది. అదేవిధంగా, జాయింట్ డైరెక్టర్లుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఆకాశ్ జైన్‌ను, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ఆదిత్య రాజేంద్ర భోజ్గాధియాను నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. వీరి పదవీ కాలం ఐదేళ్లని అందులో పేర్కొంది. -
ప్రధాన్‌ను బర్తరఫ్ చేయండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, లేదా ఈ వైఫల్యానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ప్రదాని మోదీని శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని, ఫలితంగా 22 లక్షల మంది నీట్ అభ్యర్థుల ఆకాంక్షలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్‌కు రెండు రోజుల ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీకైన విషయం దేశం యావత్తూ తెలిసిపోయింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీల కట్టడికి పార్లమెంట్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ కమిటీలో ఉండటమే ఇందుకు కారణం’అని రాహుల్ ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘దేశం మూలాలపైనే మీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. కేవలం డబ్బు సంపాదన కోసమే విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ప్రొఫెసర్ల పదవుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబం«దీకులను కూర్చోబెట్టారు. ఇదో పెద్ద అక్రమ కూటమి’అని రాహుల్ ఆరోపించారు. ఈ కూటమి దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు. ‘ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అవ్వాలంటే కావాల్సింది పరిజ్ఞానం అనుభవం కాదు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే చాలు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వారు వైస్ చాన్స్‌లర్ అయ్యే అవకాశమేలేదన్నారు. అందుకే, ఇప్పటి వరకు కనీసం 80సార్లు పరీక్ష పేర్లు లీకై, 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. రాజధాని ద హేగ్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్‌లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్‌లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్‌లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్‌లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్‌కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్‌కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్‌లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్‌కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్‌లోనూ సూపర్ ఎల్‌నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్‌లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్‌లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్‌నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్‌లో ఈసారి జూన్‌లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్‌లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
సీఎం విజయ్ను కలిసిన కమల హాసన్.. కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్‌ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன். தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது. பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026 -
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, “పుష్ప” అని చెప్పుకునే జహంగీర్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం హెచ్చరిక చేశారు. “అతడు అత్యంత కిరాతక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతడి వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటా. పుష్ప అని చెప్పుకునే ఆ వ్యక్తి బాధ్యత ఇప్పుడు నాది” అని హెచ్చరించారు.ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్తాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో సువేందు అధికారి మాట్లాడారు.“మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదేళ్లుగా ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఫల్తాలో ఉంది. ఈ రీపోలింగ్‌తో ఓటర్ల హక్కులు మళ్లీ స్థిరపడతాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫల్తా ఓటర్లు బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా” అని సువేందు అధికారి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తృణమూల్ నేత, ఫల్తా అభ్యర్థి జహంగీర్ ఖాన్ తనను తాను “పుష్ప”గా చెప్పుకున్నారు. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ పోషించిన స్మగ్లర్, శక్తిమంతమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ పోలీసు పరిశీలకుడిగా నియమించింది. ఆయనను “సింగం” సినిమా సిరీస్‌లో అజయ్ దేవగన్ పోషించిన పోలీసు అధికారి పాత్రతో పోల్చి, ఖాన్ ‘‘పుప్ప’’ వ్యాఖ్యలు చేశాడు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు దశల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాగా, మొన్న తమిళనాడు అసెంబ్లీలోనూ ‘‘పుష్ప’’ పాత్రను గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలకు భారీ ఊరటనిచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF)పై వ్యాట్ భారీగా తగ్గించింది. ఎటిఎఫ్పై వ్యాట్ 25 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ.. ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విమానాలను నడపడానికి జెట్ ఇంజన్లలో ఈ ఏటీఎఫ్‌ను ఉపయోగిస్తారు.ఈ నిర్ణయంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేసే విమానయాన సంస్థలు.. ఈ వ్యాట్ తగ్గింపు కారణంగా ఇప్పటి నుండి తక్కువ ధరలను చెల్లించే అవకాశముంటుంది. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు ఏర్పడిన అంతరాయాల వల్ల విమానయాన సంస్థలు ఇప్పటికే భారీ జెట్ ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని నుంచి నడిచే విమానయాన సంస్థలపై ఈ నిర్ణయం పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపనుంది.కాగా, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఏటీఫ్‌పై విధించే విలువ ఆధారిత పన్నును 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో అధిక శాతం ఉండటంతో ఈ పన్ను తగ్గింపు.. విమానయాన సంస్థలకు ఉపశమనంగా మారనుంది.పెరుగుతున్న జెట్ ఇంధన ధరల వల్ల భారీ నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలకు ఈ నిర్ణయంతో భారం దిగనుంది. భారతీయ విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 35–40 శాతం కేవలం ఇంధనానికే ఖర్చవుతుంది. అందువల్ల విమానయాన రంగంలో ఇంధనమే భారీ భారంగా మారింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం విమానయాన సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో విమాన ఛార్జీల పెంపు.. కొన్ని మార్గాల రద్దుకు దారితీయవచ్చనే ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించినట్లయింది. -
నీట్ అవకతవకలపై ప్రధానికి కేతిరెడ్డి లేఖ
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్ష రద్దులు, పునఃపరీక్షల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం ఎదురైన వివాదాల వల్ల నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని తెలిపారు.దేశంలోని అనేక మంది విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి కోసం భారీగా ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఏడాది ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే అయినా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. -
ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!
వేరే ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి వస్తే మళ్లీ పాత ప్రాంతానికి వెళ్లిపోతాం. కానీ ఇక్కడో పెద్ద మనిషి ఇంటి అద్దె చెల్లించలేక పూర్తిగా నైతికతేనే వదిలేశాడు. తాను ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో భార్యను, కూతుర్ని ఇంటి యజమానికి శారీరక అవసరం కోసం పంపి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి అక్కడ మోర్బీ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె రూ. 2 వేలు కాగా, దాన్ని చెల్లించడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా నాలుగు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. దీన్ని ఇంటి యజమాని అవకాశంగా తీసుకున్నాడు. భార్య, కూతుర్ని అప్పచెప్పే ఒప్పందానికి సదరు వ్యక్తి అంగీకరించాడు. తద్వారా అతని భార్య, కూతురిపై పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు ఇంటి యజమాని. ఈ విషయం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్న వ్యక్తి అత్తకు తెలియడంతో మోర్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటి యజమానిని, ఈ దారుణానికి పూర్తి బాధ్యడైన సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీని తరువాత పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే చట్టం (పోక్సో)తో సహా పలు కఠినమైన కేసులు నమోదు చేశారు.మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమాని కలిసి ఈ వేధింపులకు పాల్పడినట్లు మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జే ఎం లాల్ తెలిపారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు. -
‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ
ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్మాల్యా బాగ్చి ప్రశ్నించారు.ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు. -
‘నీట్’ మరో మాస్టర్‌మైండ్ మనీషా అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎవరీ మనీషా? మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది. వేట వేగవంతం ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను సీజ్చేసింది. డబ్బులు ఆన్లైన్లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా.. 1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్) 2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్వాసి) 5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి) 6. మంగీ లాల్ బివాల్( జైపూర్‌వాసి) 7. వికాస్ బిలాల్( జైపూర్‌వాసి) 8. దినేశ్ బిలాల్( జైపూర్‌వాసి) 9. యశ్ యాదవ్(గురుగ్రామ్వాసి) -
ఫోన్ పక్కకి పెడతారా.. లేక గన్ తీయమంటారా
ఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్ మీరు బయిటకి వెళతారా లేక గన్ తీయమంటారా అని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ని ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడడంతో లావ్రోవ్ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్‌ని వదిలేయండి" అని ఆయనతో అన్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్ "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.#Watch | "If you don't surrender your phone, they will pull out a gun": Russian Foreign Minister Sergey Lavrov loses cool at a journalist during the BRICS Foreign Ministers Summits in New Delhi pic.twitter.com/Tpdk5uNzTX— NDTV WORLD (@NDTVWORLD) May 16, 2026 -
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎవరెవరికి ఏయే శాఖలు? శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.ఆర్ నిర్మల్‌కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.రాజ్‌మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. -
ఇది తప్పనిసరి.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది.సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. -
2 రోజుల్లో సీఎంగా సతీశన్ ప్రమాణం.. వేణు గోపాల్ ఏమన్నారంటే?
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ను కలిశారు. వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన సతీశన్ కాసేపు మాట్లాడారు.ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.కాగా, వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాట్లలో భాగంగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వీడీ సతీశన్ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్మెంట్ హౌస్‌లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.కాగా, కేరళలో యూడీఎఫ్ గెలిచాక కేసీ వేణుగోపాల్ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్‌కు హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल से केरल के मनोनीत मुख्यमंत्री वीडी सतीशन ने आज मुलाकात की pic.twitter.com/yBHDCsjulZ— News Capsule (@newscapsule_) May 16, 2026 -
అండమాన్ తీరాన్ని తాకిన రుతు పవనాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ తీరాన్ని రుతు పవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు పయనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మొత్తం నికోబార్ దీవులు, శ్రీవిజయపురం (బ్లెయిర్ పోర్ట్) సహా అండమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందే.. అంటే మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న (శుక్రవారం) తెలిపిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఇది భారతదేశంలో నైరుతి రుతుపవనాల కాలం (జూన్ నుండి సెప్టెంబర్) ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. ఈ సీజన్లో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని.. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. -
డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలకు.. సీబీఐ చెక్
డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ మోసాలను అరికట్టడానికి CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సరికొత్త ఏఐ ఆధారిత వెరిఫికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఏవరైనా సీబీఐ నోటీసులు, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలకు నోటీసులు అందితే అది సరైనదా కాదా అనే విషయం ఇక అభయ్ పోర్టల్‌లో సులువుగా తెలుసుకోవచ్చని పేర్కొంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు సైతం అప్డేట్ అవుతున్నాయి. ఇది వరకులా ప్రత్యక్షపద్దతినో ప్రజలను లూటీ చేయడం కాకుండా కేవలం ఒక్క ఓటీపీతో ఖాతాలో ఉన్న డబ్బంతా సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. అదే విధంగా సామాన్య ప్రజలను నేరాలు చేశావని భయపెడుతూ వారని అరెస్టు చేస్తామని జైళ్లో వేస్తామని బెదిరిస్తూ నకిలీ నోటీసులు అందజేసీ డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ఏవరైనా సైబర్ నేరాలు పేరుతో ప్రజలని బెదిరిస్తే అది అసలైందా లేదా నకిలీదా అనే విషయం క్షణాల్లో తెలుసుకునేలా ఒక అభయ్ అనే సరికొత్త ఏఐ ఆధారిత పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది.అభయ్ పోర్టల్‌ను వాడే విధానం?మొదటగా సీబీఐ అధికారిక వెబ్సైట్ www.cbi.gov.in లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో కనిపించే ‘ABHAY’ లోగోపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్కువచ్చే OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.ఇప్పుడు మీకు వచ్చిన నోటీసు కాపీని పీడీఎఫ్ లేదా చిత్రం (Image) అక్కడ అప్లోడ్ చేయాలి.మీ నోటీసును స్కాన్ చేసి, అది నిజమైనదా లేక నకిలీదా అనే విషయాన్ని ఈ AI చాట్‌బాట్ కేవలం నిమిషాల వ్యవధిలోనే తేల్చి చెబుతుంది.ఈ సందర్భంగా ప్రజలకు సీబీఐ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయ చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలిపింది. మిమ్మల్ని భయపెట్టి, కెమెరాల ముందు కూర్చోబెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనే సైబర్ నేరగాళ్ల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఆ ఒక్క మాటతో.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు
జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్‌గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్‌మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు.. 2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్ఆర్ నిజాయితీగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ.. అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్‌ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్‌ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్‌చుప్‌గా వెళ్లిపోయారట. ఈ సంఘటన రెడ్డిట్‌లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్‌బ్యాక్‌లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్‌లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!. -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
బెంగళూరు: రాష్ట్రంలో మందుబాబుకు ఎక్సైజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది. కింగ్‌ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్‌పోర్ట్స్ ధర రూ.25, బడ్‌వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది. ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్‌ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. -
ఇంటి ముంగిటకే ‘డిక్లట్టర్’.. పాత సామాన్ల ఉచిత తరలింపు!
బెంగళూరు: బెంగళూరు వాసులకు శుభవార్త. ఇళ్లోని పాత సామానును వదిలించుకునేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) ఒక సరికొత్త, స్మార్ట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై బాతబడిన పెద్ద వస్తువులను ఆటోలు మాట్లాడుకుని చెత్త కుప్పల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి ముంగిట నుంచే ఉచితంగా ఈ భారీ వ్యర్థాలను సేకరించేలా ఒక వినూత్న అప్లికేషన్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది.వ్యర్థాల నిర్వహణ కోసం ‘డిక్లట్టర్’ నగరంలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల తొలగింపును సులభతరం చేసే దిశగా బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఒక కీలక అడుగు వేసింది. పౌరుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ‘డిక్లట్టర్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. బెంగళూరు నగరవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే, అత్యంత సురక్షితంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ వ్యర్థాలను సేకరించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం అని గ్రేటర్ బెంగళూరు అథారిటీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా మే 16న వెల్లడించింది. ♻️ OLD BULKY WASTE TO DISPOSE OFF?Bengaluru now has a smarter way!🚛 FREE Doorstep Pickup for Bulky Waste across BengaluruTo promote responsible waste disposal and a cleaner city, Bengaluru Solid Waste Management Ltd. (BSWML) has launched the DCLUTTER App — a simple,… pic.twitter.com/o2LfGOxMEI— Greater Bengaluru Authority (@GBA_office) May 16, 2026ఇంటి వద్దకే ఉచిత సేవలుసాధారణంగా పెద్ద పరుపులు లేదా విరిగిన కుర్చీలను బయట పారేయడం నగరాల్లో పెద్ద సమస్య. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలు భారీ వ్యర్థాలను రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో పారేయకుండా అడ్డుకోవచ్చు. డిక్లట్టర్ యాప్ ద్వారా మీ వ్యర్థాల సేకరణను బుక్ చేసుకుంటే, సంబంధిత సిబ్బంది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా వాటిని తీసుకువెళతారు. ఈ వినూత్న సేవలు బెంగళూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చడానికి ఎంతగానో దోహదపడతాయని అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు.ఏయే వస్తువులు ఇచ్చుకోవచ్చు?ఈ సరికొత్త యాప్ ద్వారా ప్రధానంగా ఇళ్లలో స్థలాన్ని ఆక్రమించే భారీ వ్యర్థాలను సులభంగా తొలగించుకోవచ్చు. పాత ఫర్నీచర్, వాడేసిన పరుపులు, పాడైపోయిన లేదా విరిగిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న ఇతర పెద్ద వస్తువులను ఇందులో భాగంగా స్వీకరిస్తారు. బెంగళూరును ‘క్లీన్ అండ్ క్లట్టర్-ఫ్రీ సిటీ’గా ఉంచడానికి నగరవాసులందరూ ‘డిక్లట్టర్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ వంతు బాధ్యత నెరవేర్చాలని అధికారులు పిలుపునిచ్చారు. -
ఉంటారో, చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి
న్యూఢిల్లీ: పహల్గాం పచ్చికమైదానంలో పాశవిక దాడి మొదలు తరచూ సరిహద్దు వెంట ఉగ్ర చొరబాట్లకు పాల్పడుతున్న దాయాది పాకిస్తాన్‌ను భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం ఢిల్లీలోని మాణిక్షా సెంటర్లో యూనిఫాం అన్వీల్డ్ సంస్థ చేపట్టిన ‘సేనా సంవాద్’కార్యక్రమంలో పాక్‌నుద్దేశించి ద్వివేది వ్యాఖ్యలుచేశారు. ‘‘తీరు మార్చుకోకుండా ఇలాగే ముష్కర మిన్నాగులకు పాలు పోసి పెంచినా, ఉగ్ర చొరబాట్లను ప్రోత్సహించినా మీ అంతుచూస్తాం. భౌగోళిక పటంలో ఉండాలనుకుంటున్నారో, సర్వనాశనమై చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోతే మీ పుట్టి ముంచేస్తాం. మిమ్మల్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తాం’’అని హెచ్చరించారు. అలాంటి కేఫ్.. నా కల ఆర్మీ చీఫ్ యువతతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. ‘‘ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయ్యాక నచ్చిన పనిచేస్తా. ముఖ్యంగా నా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో దైనందిన జీవితంలో అలసిపోయిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కేఫ్‌ను ఆరంభిస్తా. జీవితాన్ని నెమ్మదిగా సాగిపోనీ అనే అర్థం వచ్చేలా కేఫ్‌కు ‘ఆహిస్తా జిందగీ’అని పేరు పెడతా. ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు ఎవరికీ కాసింత ఖాళీ సమయం దొరకట్లేదు. ఒక్కచోట కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక మంచి ఆలోచన చేసే తీరికే లేదు. కేఫ్‌లో అయితే జనం కొద్దిసేపు కూర్చుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు కెరీర్, ఇతర అంశాల్లో ఉచితంగా సలహాలు, సూచనలు చేసే ఏర్పాట్లుచేస్తా. అందులో ఒక గ్రంథాలయం సైతం అందుబాటులోకి తెస్తా. ఆలోచనల కూడలిగా ఆ కేఫ్ నిలిచిపోవాలి’’అని అన్నారు. India's Army Chief just said Pakistan must decide whether it wants to "be part of geography and history"General Upendra Dwivedi, speaking at Sena Samvad in Delhi, delivered the sharpest public warning from the Indian military establishment in recent memory pic.twitter.com/XM8yARg69j— Nabila Jamal (@nabilajamal_) May 16, 2026 -
‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ‘నీట్ యూజీ’ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. పేపర్ లీకేజీలు, రీ నీట్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షా విధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ‘మేము నీట్ పరీక్షను నిర్వహించబోం’ అంటూ కేరళ కాబోయే ముఖ్యమంత్రి విడి సతీశన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, విద్యా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.‘మాకేం సంబంధం లేదు’నీట్ యూజీ 2026 పరీక్షల నిర్వహణపై కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక స్పష్టత ఇచ్చారు. నీట్ అనేది కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష అని, దీని నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తాము ఈ పరీక్షను నిర్వహించబోమని, అయితే ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, కేంద్రానికి తగిన ప్రతిపాదనలు మాత్రం పంపుతామని ఆయన వెల్లడించారు. పరీక్షల్లో పారదర్శకత పెంచాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.లీకేజీలపై సీబీఐ విచారణమరోవైపు మే 15న జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రీ-నీట్ 2026 వివాదంపై స్పందించారు. పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగినట్లు అంగీకరించిన ఆయన, వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని హామీ ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ)ని రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే, 2026 పరీక్ష రాయబోయే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికకు వారం రోజుల సమయం, ఉచిత అప్లికేషన్ ఫీజు, జూన్ 14 లోగా అడ్మిట్ కార్డుల జారీ వంటి కీలక ఉపశమనాలు ప్రకటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల నుండి జరిగే నీట్ పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు.2027 నుంచి కొత్త విధానం.. ఇక అంతా ఆన్లైనేభవిష్యత్తులో లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2027 పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్‌లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. డిజిటల్ విధానం ద్వారా పరీక్షల్లో భద్రత, పారదర్శకతను మరింత పెంచవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ సమూల మార్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ వివాదానికి ఎంతవరకు ముగింపు పలుకుతాయో చూడాలి. -
ప్రధాని బాటలో కేరళ గవర్నర్.. వీఐపీ కల్చర్‌కు చెక్!
తిరువనంతపురం: సాధారణంగా వీఐపీల ప్రయాణం అంటే భారీ కాన్వాయ్, సైరన్ల మోతతో మార్మోగిపోతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ఖర్చులను అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించి, అందరి దృష్టిని ఆకర్షించారు.మంత్రివర్గ ప్రమాణస్వీకారం నుంచే అమలుప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తొమ్మిది నుంచి ఆరుకు కుదించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సహా ఇకపై జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ నిబంధన తక్షణం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఒకేసారి మూడో వంతు వాహనాలను తగ్గించడం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఏయే వాహనాలకు కోత పడిందంటే?అధికారిక వర్గాల తాజా సమాచారం ప్రకారం, గవర్నర్ కాన్వాయ్ నుండి ఒక ఎస్కార్ట్ వాహనాన్ని, అలాగే రెండు స్టాండ్ బై (అదనపు) వాహనాలను పూర్తిగా తొలగించారు. మారిన తాజా ప్రోటోకాల్ ప్రకారం ఇకపై ఆయన పర్యటనల్లో కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ లాజిస్టిక్స్‌లో అనవసరమైన ఇంధన వృథాను అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇలాంటి పొదుపు చర్యలను రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు.దేశవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్వీఐపీల కాన్వాయ్ కుదింపు అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక కొత్త ట్రెండ్ గా మారుతోంది. గతంలో ప్రధాని మోదీ స్వయంగా తన కాన్వాయ్ సైజును తగ్గించుకోవడమే కాకుండా, ఎలక్ట్రిక్ పైలట్ వాహనాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారు. ఇదే బాటలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తన భద్రతా వాహనాలను కుదించారు. మరోవైపు సుప్రీంకోర్టు సైతం పర్యావరణ పరిరక్షణ, లాజిస్టిక్ ఖర్చుల నియంత్రణ కోసం డిజిటల్ విచారణలు, కార్ పూలింగ్ విధానాలను ప్రోత్సహిస్తోంది. ఈ సస్టైనబిలిటీ ప్రయత్నాలకు ఇప్పుడు కేరళ గవర్నర్ కూడా తమ మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: మనీలాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాకు భారీ ఉపశమనం -
బోరుబావిలో చిన్నారి.. 10 గంటల ఉత్కంఠ!
హోషియార్పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారి దాదాపు 10 గంటల పాటు మృత్యువుతో పోరాడాడు. 90 అడుగుల లోతులో చీకటిలో చిక్కుకున్న ఆ అభం శుభం తెలియని ప్రాణాన్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేసిన సాహసోపేత ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.300 అడుగుల లోతు కలిగిన..అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ హృదయ విదారక ఘటన హోషియార్పూర్ జిల్లాలోని చక్ సవానా గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఆ చిన్నారి, సుమారు 90 అడుగుల వద్ద ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్ సేవలతో పాటు ఎంపీ రాజ్ కుమార్ చబ్బెవాల్, పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్, జిల్లా ఎస్ఎస్పీ తదితర ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.10 గంటల పాటు ఉత్కంఠబాలుడి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శరవేగంగా రంగంలోకి దిగాయి. చిన్నారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు బోరుబావి లోపలికి అధునాతన కెమెరాలను పంపారు. అలాగే నాలుగు జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా భారీ తవ్వకాలు చేపట్టారు. పోలీసులతో పాటు స్థానిక ఎన్జీవోలు, గ్రామస్తులు కూడా ఈ సహాయక చర్యల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. రాత్రింబవళ్లు శ్రమించి, దాదాపు 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఆపరేషన్ చివరకు ఫలించింది. అర్ధరాత్రి సమయంలో బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో రెస్క్యూ సిబ్బంది సఫలమయ్యారు.ఆస్పత్రికి తరలింపు.. ఆనందంలో కుటుంబంబోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గంటల తరబడి బోరుబావిలో ఇరుక్కుపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా తలెత్తాయా అని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని అధికారులు వెల్లడించడంతో, అప్పటివరకు తీవ్ర ఆందోళనతో గడిపిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సకాలంలో స్పందించి, తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన రెస్క్యూ బృందాలకు వారు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు. -
పెట్రో బాదుడు.. మెరుపు సమ్మెకు దిగిన గిగ్ వర్కర్లు
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పెంపుతో ఇటు గిగ్ వర్కర్ల జీవనోపాధి మరింత కష్టాల్లో పడింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని కార్మికులు ఒంటరిగా భరించలేరని, ప్రభుత్వం-కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మెరుపు సమ్మెకు గిగ్ వర్కర్ల అసోషియేషన్ పిలుపు ఇచ్చింది. ఇవాళ(శనివారం) యాప్ ఆధారిత సేవలను నిలిపివేయాలని గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) నిర్ణయించింది. అయితే ఈ సమ్మె తాత్కాలికంగానే ఉండనుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ సేవలు బంద్ ఉంటాయని నిన్న రాత్రి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ, “ఇప్పటికే వేసవిని లెక్క చేయకుండా పనిచేస్తున్న డెలివరీ వర్కర్లకు.. పెట్రో పెరుగుదల నేరుగా దెబ్బతీసింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ భారాన్ని భరించలేరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోమీటరుకు రూ.20 చెల్లించేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా చెబుతోంది ఏంటంటే.. దేశవ్యాప్తంగా సుమారు 1.4 కోట్ల గిగ్ వర్కర్లు మోటార్‌బైక్‌లు, స్కూటర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మహిళా కార్మికులు, డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది రోజుకు 10–14 గంటలు ట్రాఫిక్జామ్ల్లో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఇంధన ధరలతో పాటు వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ కంపెనీలు చెల్లింపులను తగినంతగా పెంచడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లు ఇలా సమ్మె చేయడం ఇదేం కొత్త కాదు. వేతనాల పెంపు, ఉద్యోగ..సామాజిక భద్రతలు డిమాండ్లతో ఈ మధ్యకాలంలో ఒక్క పూట, ఒక్కరోజు సమ్మెలు చేశాయి కూడా. ఈ నేపథ్యంతో ప్రభుత్వాలకు మెమొరాండం సమర్పించి, డెలివరీ ఛార్జీలు, కిలోమీటరు రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, డున్జో, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, అమెజాన్ ఫ్లెక్స్, ఇన్‌స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత సంస్థలకు కూడా యూనియన్ లేఖలు పంపింది. పెరిగిన ఇంధన ఖర్చులను కార్మికులపై మోపకుండా, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు ఇప్పటికే అస్థిరంగా ఉన్న వేతనాలను మరింత తగ్గిస్తాయని, దీనివల్ల గిగ్ వర్కర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. Rising petrol, diesel & LPG prices are directly affecting gig workers across India.GIPSWU demands fair per-kilometre rates for delivery workers & drivers.Appeal for temporary app shutdown tomorrow from 12 PM to 5 PM.#GIPSWU @PTI_News @the_hindu @htTweets @timesofindia pic.twitter.com/y5aECETQii— GIPSWU - Gig & Platform Service Workers Union (@GIPSWU_) May 15, 2026అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే 11 వారాల పాటు ఆయిల్ కంపెనీలు నష్టాల్ని భరించుకుంటూ వస్తుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌కు లీటర్‌కు రూ.3 చొప్పున రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, 2022 తర్వాత పెట్రోల్ రేట్లు పెరగడం ఇదే కాగా.. అదీ రూ.3 పెంచడం ఆందోళనకు దారి తీసింది. -
భోజ్‌శాలకు భక్తజనం.. మార్మోగిన హనుమాన్ చాలీసా!
ధార్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ధార్‌లోని భోజ్‌శాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో హిందూ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తీర్పు వెలువడిన మరుసటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.మార్మోగిన మంత్రోచ్ఛారణలుశనివారం ఉదయం భోజ్‌శాల ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ, దేవికి హారతి సమర్పించారు. తమ న్యాయపోరాటం ఫలించడంతో భక్తులు ఆనందభాష్పాలతో నృత్యాలు చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజూ పూజలు చేసుకునే అవకాశం దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని ఉత్సవ సమితి సభ్యులు ప్రకటించారు.రద్దయిన 2003 ఏఎస్ఐ (ASI) ఉత్తర్వులుఈ చారిత్రక తీర్పులో హైకోర్టు కీలక విషయాలను స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంలో పూజా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, చారిత్రక ఆధారాల ప్రకారం అది పరమార వంశానికి చెందిన రాజభోజుడు నిర్మించిన సంస్కృత విద్యాకేంద్రం (భోజ్‌శాల) అని ధృవీకరించింది. దీనితో పాటు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతిస్తూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) 2003లో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఆ ప్రాంగణంపై పూర్తి ఆరాధనా హక్కులు హిందువులకే ఉన్నాయని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ముస్లిం పక్షంహైకోర్టు తీర్పు నేపథ్యంలో, ముస్లిం కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్, తాము కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసి తమ వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తమకు లభించిన ప్రాథమిక ఆరాధనా హక్కులను వినియోగించుకుంటూ, ప్రతిరోజూ భోజ్‌శాలలో పూజలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. -
తెగిన జెయింట్ వీల్.. ఎగిరి కిందపడ్డ జనం!
సాసారం: బీహార్‌లోని సాసారంలో విషాదం చోటుచేసుకుంది. ఉల్లాసంగా గడుపుదామని ఎగ్జిబిషన్‌కు వెళ్లినవారు ఆ క్షణంలో భయంతో వణికిపోయారు. జెయిట్ వీల్ ఎక్కి, ఆకాశంలో విహరిస్తున్నామన్న ఆనందం వారిని క్షణాల్లోనే భయానికి గురిచేసింది. సాసారంలో ఏర్పాటు చేసిన డిస్నీల్యాండ్ తరహా ఎగ్జిబిషన్లో ఒక భారీ అమ్యూజ్మెంట్ రైడ్ (జెయింట్ స్వింగ్) అకస్మాత్తుగా కుప్పకూలడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.లొఒక్కసారిగా గాల్లోకి ఎగిరి..మే 15, శుక్రవారం సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో వేగంగా తిరుగుతున్న ఒక భారీ జెయింట్ స్వింగ్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో గిరగిరా తిరుగుతున్న ఆ రైడ్ ఒక్కసారిగా తన ఇరుసు నుంచి విడిపోయి, అదుపుతప్పి కిందకు దూసుకువచ్చి కుప్పకూలింది. దీంతో అందులో కూర్చున్న వారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడటంతో, ప్రాణభయంతో హాహాకారాలు మిన్నంటాయి.వెంటనే రంగంలోకి స్థానికులుకళ్లముందే జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ఎగ్జిబిషన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్తనాదాలు, గందరగోళం మధ్య ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రాణాలకు తెగించి, శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను అత్యవసర బృందాలు రాకముందే బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఆస్పత్రిలో చికిత్స.. కారణాలపై దర్యాప్తుగాయపడిన వారందరినీ వెంటనే సాసారం సదర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో పలువురు మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ‘కొంతమందికి ఇప్పటికే ప్రాథమిక చికిత్స అందించాం, మరికొందరిని సీటీ స్కాన్ కోసం పంపాం. మెరుగైన వైద్యం అందిస్తున్నాం’ అని డాక్టర్ మనీష్ కుమార్ వెల్లడించారు. ఎంతమంది గాయపడ్డారనే సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘోర ప్రమాదానికి నిర్వహణ లోపమా, లేక సాంకేతిక వైఫల్యమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మరో ‘బ్లూ డ్రమ్’ ఘోరం: భర్తతో కలిసి ప్రియుడిని.. -
బ్రిటీష్‌కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్‌లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్‌తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్‌ను ముగించాలంటూ విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్‌కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్‌గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్‌గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్‌కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్‌కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్‌లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్‌నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన రిక్వెస్ట్‌తో ఆమె వార్తల్లో నిలిచింది. -
మరో ‘బ్లూ డ్రమ్’ ఘోరం: భర్తతో కలిసి ప్రియుడిని..
థానే: అర్ధరాత్రి ఛాటింగులు, ప్రేమ సందేశాలతో మొదలైన ఓ ‘అక్రమ’ ప్రేమకథ చివరకు అత్యంత ఘోరమైన హత్యతో ముగిసింది. ప్రియుడు డబ్బులు ఇవ్వడం మానేశాడనే కోపంతో ఓ వివాహిత తన భర్త, ఇతరులతో కలిసి ప్రియుడిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కి, నిర్జన ప్రదేశంలో పడేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.ప్రేమ పేరిట వల.. ఆపై దారుణంథానే జిల్లాలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివిలిలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వసాయికి చెందిన వివాహిత మెహజబీన్ ఖాతున్ ఏక్రాన్ షేక్ (25)తో అతనికి 2021 నుండి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో వీరి వ్యవహారం బాగానే సాగింది. ఈ క్రమంలో మెహజబీన్ నుంచి తరచూ అర్బాజ్ నుండి భారీగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అతను కూడా ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపుతూ వచ్చాడు. అయితే ఇటీవలి కాలంలో అర్బాజ్ డబ్బులు ఇవ్వడం నిలిపివేయడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. తన భర్త హసన్ షేక్, సోదరుడు తారిక్ షేక్, అతని స్నేహితుడు మొజ్జమ్ పఠాన్లతో కలిసి అర్బాజ్ హత్యకు ప్లాన్ చేసింది.డబ్బుల కోసం పిలిపించి హత్యఏప్రిల్ 3న ఆఫీస్ పనిమీద దాదర్ వెళ్లిన అర్బాజ్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తండ్రి ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్బాజ్ కాల్ డేటా, మొబైల్ లొకేషన్‌ను పరిశీలించగా, అతను అదృశ్యమైన రోజు మెహజబీన్ లొకేషన్‌తో సరిపోలింది. అంతేకాకుండా అదృశ్యానికి ఒక రోజు ముందే అతను ఆమెకు రూ. 50,000 బదిలీ చేసినట్లు తేలింది. అనుమానంతో పోలీసులు మెహజబీన్‌ను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసమే అతడిని వసాయిలోని తన నివాసానికి పిలిపించానని, అక్కడ అతని వద్ద ఏమీ లేకపోవడంతో తామంతా కలిసి అర్బాజ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ పైపుతో తలపై తీవ్రంగా కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.పోలీసుల వేటహత్య అనంతరం నిందితులు అర్బాజ్ మృతదేహాన్ని ఒక డ్రమ్‌లో కుక్కి, వాలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య డ్రైనేజీ కాల్వలో పడేశారు. ఈ ఘోరానికి పాల్పడిన మెహజబీన్, ఆమె సోదరుడు తారిక్లను పోలీసులు మే ఏడున అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త హసన్, అతని స్నేహితుడు పఠాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాల నాశనం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం -
బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం
అసన్సోల్: పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్ల వాతావరణం ఏర్పడింది. లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమితులపై పోలీసులు ఇచ్చిన సూచనలు చివరకు అపార్థాలకు దారితీసి, తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. జహంగీరి మహల్లా పోలీస్ అవుట్‌పోస్టుపై మూకల దాడి, రాళ్ల రువ్వడం, వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.వదంతులు సృష్టించిన చిచ్చుముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆదేశాల మేరకు, మతపరమైన ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని పోలీసులు అసన్సోల్లోని రైల్‌పార్ ప్రాంత ప్రజలకు సూచించారు. ఇదే విషయమై మసీదు కమిటీతో పోలీసులు మాట్లాడుతుండగా.. శుక్రవారం రాత్రి ప్రార్థనలను అడ్డుకుంటున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో ఒక వర్గానికి చెందిన అసాంఘిక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి, జహంగీరి మహల్లా (నయా మహల్లా) పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి దిగాయి.వాహనాలు ధ్వంసంవదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి, విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసుల పైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో స్టేషన్ బయట, పరిసర వీధుల్లో పార్క్ చేసిన అనేక వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అసన్సోల్ నార్త్ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం కేవలం శబ్దాన్ని మసీదు ప్రాంగణానికే పరిమితం చేయాలని పోలీసులు కోరినందుకే ఈ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.రంగంలోకి కేంద్ర బలగాలుపరిస్థితి చేయి దాటిపోతుండటంతో అదనపు భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ విధ్వంసానికి కారణమైన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.ఇది కూడా చదవండి: అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో.. -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్‌తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
బెంగాల్లో ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీకి బిగ్ షాక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్లో అధికారం కోల్పోవడంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై అభిషేక్ బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల మేరకు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 5న సామాజిక కార్యకర్త రాజీబ్ సర్కార్.. అభిషేక్ బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగిన పలు ప్రచార కార్యక్రమాల్లో అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో బగుయాటి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేశారు. అభిషేక్ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. సర్కార్ తన ఫిర్యాదులో భాగంగా పలు ప్రసంగాల లింకులను కూడా సమర్పించారు.ఈ క్రమంలో మే 15వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 192, 196, 351(2) మరియు 353(1)(సి)లతో పాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123(2) మరియు 125 కింద ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు.. అభిషేక్ ప్రసంగాలు రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన, అశాంతిని సృష్టించి, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అనంతరం.. ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సబ్-ఇన్స్పెక్టర్ సోమనాథ్ సింఘా రాయ్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.అభిషేక్ సతీమణి వివాదం..ఇదిలా ఉండగా.. అంతకుముందు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెరపైకి వచ్చింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డులను కలిగివున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడివుంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరులా పేరుతో మరో పాన్‌కార్డు ఆమె కలిగివున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు రుజిరా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'నవ భారత్ టైమ్స్' నివేదించింది.థాయ్‌లాండ్ పౌరసత్వంరుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెనర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, 2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజకీయంగా ఎదిగే దశలో ఉన్నారు. అప్పటికే ఆయన ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. అభిషేక్, రుజిరా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి..
కొంచెంసేపు ఉంటే.. ఆ ఐదుగురి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయేవి. కానీ, సమయస్పూర్తితో ఆమె వ్యవహరించిన తీరు.. అదనంగా ఆ తల్లి చూపిన తెగువ.. వాళ్లను సురక్షితంగా బయటపడేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.శుక్రవారం ఉదయం బిహార్ షాహ్పూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు. అయితే అందులో మమత అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు బంధువులనూ రక్షించుకోగలిగింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. వీళ్లంతా వైశాలి జిల్లా జందాహాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రోసరా వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఫ్లాట్‌ఫారమ్‌కు వెళ్తున్నారు. అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జి ద్వారా కాకుండా పట్టాల ద్వారా దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్ మీద ఓ గూడ్స్ రైలు ఉంది. దాని కింద నుంచి దాటుతున్న టైంలో.. రైలు హఠాత్తుగా కదిలింది. అంతే.. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు గుభేల్మన్నాయి. వాళ్లు రైలు కింద నలిగిపోవడం ఖాయమని అంతా భావించారు. హాహాకారాలతో ఆ ప్రాంతం మారోమోగిపోయింది. కానీ, మమత సమయస్ఫూర్తి ప్రదర్శించింది. తన ఇద్దరు పిల్లలను కౌగిలించుకుని.. మిగతా వాళ్లనూ రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో సన్నని ఖాళీలో పట్టుకుని ఉండిపోయింది. అది గమనించిన కొందరు ఆమెకు చెయ్యి అందించారు. ఈలోపు గూడ్స్ వేగం పుంజుకోవడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రైలు ఆమెను ఢీ కొట్టుకుంటూ పోవడంతో గాయాలు అయ్యాయి. ఆపై గూడ్స్ వెళ్లిపోవడంతో.. వాల్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న ప్రయాణికుల సాయంతో గాయపడిన మమతకు తక్షణ చికిత్స అందించగా.. ఆమె కోలుకుని వెళ్లిపోయింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ధైర్యాన్ని ప్రజలు ప్రశంసించారు. “రెప్పపాటులో తీసుకున్న నిర్ణయం ఐదు ప్రాణాలను కాపాడింది” అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో.. ఈ సంఘటన రైల్వే భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులు ఎప్పుడూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడాలని అధికారులు మళ్లీ హెచ్చరించారు. షార్ట్‌కట్ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఈ వీడియో చూశాక.. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’ అనకుండా ఉండగలరా?.. SHOCKING VISUALS 🚨A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026 A major accident was averted at Shahpur Patori railway station. The abductor was none other than a mother who risked her own life to save his children's #samastipur #Bihar https://t.co/vwgSvpyA1s pic.twitter.com/bQeGowUl2N— Siraj Noorani (@sirajnoorani) May 15, 2026 -
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
భారత్‌కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్‌పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
జూన్ 21న నీట్ రీఎగ్జామ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–యూజీ రీఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్(యూజీ)–2026 పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నీట్(యూజీ) పరీక్షలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రద్దయిన నీట్‌ను జూన్ 21న మళ్లీ నిర్వహించబోతున్నామని, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాలు పెంచినట్లు తెలిపారు. ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చని, జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నీట్ అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లను కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరు కావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వం మాఫియా కుట్రలు, ధన బలం వంటివి విద్యార్థుల మెడికల్ సీటును లాక్కోవాలని తాము కోరుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఇప్పటిదాకా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గెస్ పేపర్ ముసుగులో కొన్ని ప్రశ్నలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయంటూ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని చెప్పారు. మే 3న పరీక్ష జరిగే, 7న ఫిర్యాదులు వచ్చాయన్నారు. పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులను శిక్షించడం తథ్యమని పేర్కొన్నారు. గతంలో నీట్ పరీక్షలో అక్రమాలు బయటపడిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ ఈ ఏడాది పేపర్ లీకేజీ ఘటన జరిగిందని, అందుకే మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని తెలియజేశారు. నీట్ విషయంలో ఎవరైనా భయాందోళనలు, అవాంతరాలను సృష్టిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. మన వ్యవస్థను విశ్వసించాలి ఓఎంఆర్ విధానంతో పోలిస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం కొంత మెరుగైనదని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పరీక్షకు కొంత రక్షణ ఉంటుందన్నారు. మరోవైపు సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సవాళ్లు ఉన్నప్పటికీ, మన దేశ వ్యవస్థను మనం విశ్వసించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరిగే రీటెస్టుకు సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఏ నగరంలో పరీక్ష రాయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. నీట్ టెస్టు జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల దాకా జరుగుతుందన్నారు. -
ఆర్జీ కర్ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల సస్పెన్షన్
కోల్‌కతా: 2024లో సంచలనం రేపిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన కేసును తిరిగిదోడుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దారుణంపై ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలపై ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీఎం సువేందు అధికారి ఆదేశాలిచ్చారు. కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సెక్రటేరియట్లో ప్రకటించారు. వీరు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేకపోవడమే కాదు, మృతురాలి తల్లిదండ్రులకు లంచం ఎరజూపారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన దర్యాప్తు నిర్ణీత వ్యవధిలోగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్ ముగిస్తారని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ కంటే ముందు, కోల్‌కతా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు దశలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు. -
సతీశన్ సమర్థుడైన సీఎం అవుతారు: రాధాకృష్ణన్
కొట్టాయం: వీడీ సతీశన్ సమర్థుడైన నాయకుడని, ఆయన దూరదృష్టి, దృఢత్వంతో పాలించి మంచి ముఖ్యమంత్రి అవుతారని కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువంచూర్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మంత్రివర్గాన్ని కేంద్ర నాయకత్వం ఆమోదంతో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు చాలా అంచనాలున్నాయని, మంత్రవర్గాన్ని ఏర్పాటు చేసేవారు ఈ గుర్తుంచుకోవాలన్నారు. ఇతరులు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలకు ప్రభావితం కాకూడదని సూచించారు. ‘యూడీఎఫ్ ప్రభుత్వంపై ప్రజలకు భారీ ఆశలున్నాయి. అవి నెరవేర్చడానికి ఒక సమష్టి కృషి అవసరం. గత ప్రభుత్వ పనితీరే మళ్ళీ పునరావృతమైతే, ప్రజల అంచనాలు దెబ్బతింటాయి. అది మంచిది కాదు. ‘కొత్త కేరళ’ఆవిర్భవిస్తోందన్న భావన ప్రజలకు కలగాలి’అని అన్నారు. ఏ శాఖ విలువైనదని కాకుండా, మంత్రి తనకు అప్పగించిన శాఖను ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారన్న విషయానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి శాఖా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. కొత్త ప్రభుత్వంలో ఏ పాత్రను పోషించడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను వెళ్లనని, పార్టీ అప్పగించిన పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించనని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశానికి రమేశ్ చెన్నితాల గైర్హాజరీ, ముఖ్యమంత్రి పేరు ప్రకటన తరువాత ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మాట్లాడుతూ.. సతీశన్‌కు మద్దతు తెలుపుతూ చెన్నితాల ఒక లేఖ ఇచ్చారని, అలాగే ఆయనకు అభినందనలు కూడా తెలిపారని ఆయన చెప్పారు. -
సామాన్యుడికి చమురు చిచ్చు
సాక్షి, బిజినెస్ డెస్క్: పెట్రో ధరల భారం ఎప్పుడూ పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆగదు. ప్రతి వంటగదిలోకి, ప్రతి పొలంలోకి, ప్రతి కుటుంబ బడ్జెట్లోకి చొరబడుతుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కారి్మకులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతుంది. అండర్ రికవరీల పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలపై ఆరి్ధక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సీఎన్జీ, డీజిల్ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కారి్మకులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా భారత్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగి ఆగి ఎట్టకేలకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. రెండు నెలలకు పైగా భారీ నష్టాలు భరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 పెంచడంతో రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడింది. ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్‌పై ఆధారపడే ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మార్కెట్ సరఫరా గొలుసులన్నింటిపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.రవాణా సంస్థలు ఇప్పటికే చార్జీలు కనీసం 3% పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. టాక్సీ, బస్సు రవాణా, డెలివరీ చార్జీలు కూడా వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు, మందులు, నిత్యావసర వస్తువుల నుంచి ఆన్లైన్ డెలివరీల వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరల పెంపుతో సాగు ఖర్చులూ పెరగనున్నాయి. రైతులు పంటలను మార్కెట్లకు తరలించే ఖర్చు కూడా పెరగడంతో ఆహార ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మళ్లీ వేగం? ఏప్రిల్‌లోనే రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపు కారణంగా వచ్చే మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% దాటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో రిజర్వ్ బ్యాంక్‌కు ద్రవ్యోల్బణ నియంత్రణ మరింత క్లిష్టం కానుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గిపోగా, ఇప్పుడు మరింత కఠిన ఆర్థిక విధానాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ధరలు మరింత పెరుగుతాయి. ఇంకా పెరిగే చాన్స్ ఉందా? ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు ఆయిల్ కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈ ధరల పెంపు పూర్తి ఉపశమనం కాదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 105–110 డాలర్ల వద్ద కొనసాగితే, ఇప్పటికీ రోజుకు వందల కోట్ల నష్టాలు తప్పవని అంచనా. పరిస్థితి మరింత దిగజారితే మరోసారి ఇంధన ధరల పెంపు కూడా తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్డీజిల్, ఏటీఎఫ్‌పై సుంకం తగ్గింపున్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పెట్రోల్ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) పేరిట విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.5కి, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. ఇవి మే 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్, ఇన్ఫ్రా సెస్సు ఉండబోదని పేర్కొంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంధన సంస్థలకు వచ్చే అసాధారణ లాభాలపై తాత్కాలికంగా విధించే సుంకాలను విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. -
పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడిపై మళ్లీ ధరల పిడుగు పడింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు శుక్ర వా రం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరల్లో ఈ స్థాయిలో పెంపు జరగడం ఇదే తొలిసారి. మార్చి 2024లో ఎన్నికల ముందు లీటరుకు రూ.2 మేర రేట్లను తగ్గించిన కేంద్రం.. ఇప్పుడు ఒకేసారి రూ.3 వడ్డించడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌తోపాటు సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. కిలో సీఎన్జీపై రూ.2 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.79.09కి చేరింది. ఈ పెంపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో పాటు సొంత వాహనదారులకు భారంగా పరిణమించింది.ధరలు ఎందుకు పెరిగాయి?: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులే ఈ పెంపునకు ప్రధాన కారణం. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల నుంచి ఏకంగా 100 డాలర్లకు పైగా చేరింది. దీంతో చమురు సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ సంస్థలు నెలకు రూ.30,000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ వంటి పొరుగు దేశాల్లో ఎప్పుడో ఇంధన ధరలు 15 శాతం నుంచి 20 శాతం మేర పెరిగినా.. భారత్‌లో మాత్రం ఆ భారాన్ని ఇప్పటివరకు వినియోగదారులపై మోపలేదు. -
సుధా భరద్వాజ్, వరవరరావు బెయిల్ రద్దు చేయాలి
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితులుగా ఉన్న సుధా భరద్వాజ్, వరవరరావులకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కోర్టులో శుక్రవారం పిటిషన్ వేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తూ ‘అర్బన్ నక్సల్’మావోయిస్ట్ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరయ్యారని ఆరోపించింది. ఈ ఏడాది జనవరి 19వ తేదీన ముంబై ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కేసులో సహనిందితులైన అరుణ్ పెరీరా, ఆనంద్ తెల్తుంబే, రొనా విల్సన్‌లు కూడా పాల్గొన్నారంది. ఈ కార్యక్రమం దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, సమగ్రతకు ప్రత్యక్షంగా ప్రమాదకరమైందని తెలిపింది. కాగా, సుధా భరద్వాజ్‌కు సాంకేతిక కారణాలతో 2021లో బెయిల్ మంజూరు కాగా, వరవరరావుకు ఏడాది తర్వాత అనారోగ్య కారణాలపై బెయిల్ మంజూరైంది. దిగువ కోర్టు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదు, అనుమతి లేకుండా ముంబై విడిచి వెళ్లరాదనేవి అందులో ఉన్నాయి. ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వీరు బెయిల్ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే కాకుండా నిషేధిత సంస్థల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించారంది. ప్రజా శాంతికి, దేశ భద్రతకు ముప్పు కలిగించే సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న షరతులను వీరు అతిక్రమించారని ఎన్ఐఏ తెలిపింది. వీరికి న్యాయ ప్రక్రియపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం దీనివల్ల రూఢీ అవుతోందని పేర్కొంది. పిటిషన్‌ను పరిశీలించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సుధా భరద్వాజ్, వరవరరావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 22వ తేదీన చేపడతామంది. -
ఢిల్లీలో నీట్ అభ్యర్థిని బలవన్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన నీట్ అభ్యర్థిని(26) ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. కొన్నేళ్లుగా నీట్ కోసం సిద్ధమవుతున్న ఆమె పరీక్ష రద్దుతో మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి సూసైట్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం చేయించారు. ఉరి వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పొగరాదు.. సెగరాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అందించిన రెండు హైడ్రోజన్ బస్సులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్ రవాణా వ్యవస్థకు రోల్ మోడల్ కానున్నాయి. ప్రయాణ మార్గాలు ఇవే.... సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వేళలు, టికెట్ ధరలు... ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్సీ డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్ తెలిపారు. -
ఒకే రూట్.. ఛార్జీల్లో ఇంత తేడానా?
సాక్షి, న్యూఢిల్లీ: పండుగలు, సెలవు దినాల్లో విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా టిక్కెట్ ఛార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రోజు, ఒకే మార్గంలో నడిచే విమానాలకు వేర్వేరు సంస్థలు భారీ వ్యత్యాసంతో ఛార్జీలు వసూలు చేయడాన్ని తప్పుబట్టింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ధరల నిర్ణయంలో హేతుబద్ధత ఉండాలని స్పష్టం చేసింది. విమాన ఛార్జీలను అకారణంగా, అకస్మాత్తుగా పెంచడంపై నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పండుగలు, సెలవుల సమయాల్లో విమానయాన సంస్థలు ఛార్జీలను 300 శాతం మేర పెంచుతున్నాయని పిటిషనర్ తరఫు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు అధికారాలు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం, డీజీసీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య వాస్తవమేనని అంగీకరించారు. కొత్తగా ’భారతీయ వాయుయాన్ అధినియం–2024 చట్టం అమల్లోకి వచ్చిందని, టిక్కెట్ ధరల నియంత్రణకు అవసరమైన నిబంధనల రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విమాన ఛార్జీల్లో తీవ్ర అంతరంపై కేంద్రం దృష్టి సారించాలని సూచించింది. ‘ఒకే రోజు, ఒకే సెక్టార్‌కు వెళ్లే విమానాల్లో ఎకానమీ క్లాస్‌కు ఒక సంస్థ రూ.8 వేలు వసూలు చేస్తే, మరో సంస్థ ఏకంగా రూ.18వేలు వసూలు చేస్తోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసి ప్రయాణికులకు కొంత ఊరట కల్పించండి. ఇది కేవలం వేసవి సెలవులకే పరిమితమైన అంశం కాదు, ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్య‘అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో డీజీసీఏ ఇదివరకే దాఖలు చేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఆ అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు సమయమిచ్చింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. -
ఇదే సరైన సమయం.. కమల్‌హాసన్ బహిరంగ లేఖ
చెన్నై: భారతీయ సినీ పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోందన్న కమల్.. ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.‘‘పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం వినియోగదారుల ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే, ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం నిర్ధారించుకోవాలి.’’ అని కమల్‌హాసన్ లేఖలో సూచించారు.‘‘ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి?. అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఒకే అభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశ్రమ వ్యాప్తంగా చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్ల మధ్య సంప్రదింపులు జరగాలి.సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం, మనమందరం కలిసి ఆచరణాత్మకమైన, సుస్థిరమైన నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్లు, స్టూడియోల అంతటా విద్యుత్ ఆదా చేయడం, సుస్థిరమైన సెట్ నిర్మాణం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం.మన పరిశ్రమ సంస్కృతిని తీర్చిదిద్దుతుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సినిమా కేవలం వినోదానికి మించిన బాధ్యతలను కలిగి ఉంటుంది. ఈ పరిశ్రమ నుండి అత్యధికంగా లబ్ధి పొందిన మనము ముందుగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడగలిగినట్లే’’ అంటూ కమల్‌హాసన్ లేఖలో పేర్కొన్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
భార్య ముందు అవమానించారని..
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నీట్ పేపర్ లీకేజీ కేసులో కింగ్‌పిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్ పేపర్ కమిటీలో సబ్జెట్ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్ పేపర్ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్ విద్యార్థికి లీక్ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ అయ్యారు. -
భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు బోజ్‌శాల వివాదంపై కీలక తీర్పు ఇచ్చింది. ధార్‌లోని బోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని దేవీ సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు బోజ్‌శాలను ప్రాచీన సరస్వతి ఆలయంగా గుర్తించింది. చారిత్రక ఆధారాలు, పురావస్తు పరిశోధనలు బోజ్‌శాలను సంస్కృత విద్యా కేంద్రంగా నిర్ధారించాయి. -
లక్షల కొద్దీ నోట్ల వర్షం కురిపిస్తున్నా.. అసలేం జరిగిందంటే?
గుజరాత్లో జానపద గాయకుడిపై నిర్వాహకులు నోట్ల వర్షం కురిపించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంప్రదాయ గుజరాతీ హాస్య జానపద ప్రదర్శన జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో జరిగింది. ఈ ప్రదర్శనలో నిర్వాహకులు గాయకుడు గోపాల్ సాధుపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించారు. ఆయన పాడుతుండగానే నోట్లతో ముంచెత్తారు.నోట్లు కుమ్మరిస్తున్నా..వైరలవుతున్న ఈ వీడియోలో భక్తులు తనపై నోట్ల సంచులను కుమ్మరిస్తున్నా.. గోపాల్ సాధు ఏమాత్రం చలించకుండా తన హార్మోనియం వాయిస్తూ పాడుతుండటం కనిపిస్తుంది. ఆ నోట్ల కుప్ప ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే.. ఆయన దాదాపుగా కనిపించకుండా పోయారు. స్టేజీపై ఆయన చుట్టుపక్కల ప్రాంతమంతా నోట్లతో నిండిపోయినప్పటికీ.. ఆయన తన ప్రదర్శనను ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఇది చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఈ ఘటనపై చర్చకు దారి తీసింది.నెటిజన్ల కామెంట్స్..ఇది నిజమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటారు. కేవలం అలా కూర్చుని నోట్ల వర్షంలో తడిసి ముద్దవ్వడం అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు.. ఆయన సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని ఆశిస్తున్నాను. వాళ్ళు నోట్లు కుమ్మరిస్తున్నా ఆయన పాడుతూనే ఉన్నారంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ డబ్బులో కొంత భాగం పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండంటూ వ్యాఖ్యానించారు.గతంలోనూ ఇలా..గుజరాత్లో భజన కార్యక్రమాల్లో భక్తులు ఇలా లక్షల రూపాయల నగదును వర్షంలా కురిపించిన వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో వల్సాద్ అగ్నివీర్ గౌ సేవా దళ్ నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తీదాన్ గధ్వీపై రూ.10, 20, 50, 100 నోట్లను వర్షంలా కురిపించారు. అదే విధంగా.. డిసెంబర్ 2022లో గుజరాత్‌లోని నవ్సారి గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో కీర్తీదాన్ గధ్వీపై దాదాపు రూ. 50 లక్షల విలువైన నోట్లను కురిపించారు. 2017, 2018లలో కూడా ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. View this post on Instagram A post shared by Gopal Sadhu (@thegopalsadhu) -
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాహుల్ రియాక్షన్
ఢిల్లీ: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను అంటూ లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్ మిశ్రా పలికిన చివరి మాటలు ఇవి. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న ఆ విద్యార్థి పరీక్ష రద్దు కావడంతో తీవ్రంగా కుంగిపోయాడు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్ష చేతిలో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థ చేసిన హత్య’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘2015 నుండి 2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయి. 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడింది. 148 కుంభకోణాలలో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు తీసుకున్నాయి. ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్క నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య పరీక్షలలోనే 15 కుంభకోణాలు జరిగాయి. అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాలకు బాధ్యులైన ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి, ఆ తర్వాత రహస్యంగా ఉన్నత పదవులలో తిరిగి నియమిస్తున్నారు’’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ నిలదీశారు.‘‘మోసానికి సహకరించేవారికి బహుమతులు లభిస్తుండగా.. పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మోదీ జీ.. మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు కావాలి?. విద్యార్థుల బాధ నా బాధ. విద్యార్ధుల కష్టం నా కష్టం. విద్యార్ధుల భవిష్యత్తును దొంగిలించిన వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎంత కాలం పట్టినా సరే.. ఎవరినీ వదిలిపెట్టం.. ఇది నా వాగ్దానం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.“अब नहीं देनी प्रतियोगी परीक्षा।”लखीमपुर खीरी के 21 साल के ऋतिक मिश्रा के ये आख़िरी शब्द थे। तीसरी बार NEET देने वाला यह बच्चा, परीक्षा रद्द होते ही टूट गया।गोवा में भी एक NEET अभ्यर्थी ने जान दे दी।ये बच्चे परीक्षा से नहीं हारे, इन्हें एक भ्रष्ट तंत्र ने मारा है।यह…— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2026 -
అరుదైన ఘటన.. ‘సాధారణం’లో అ‘సాధారణం’
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు. సాధారణంగా ఇలాంటి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు హై-రిస్క్ గర్భధారణల కారణంగా సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్స అవసరమవుతుంది. కానీ.. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఈ నలుగురు పిల్లలు సాధారణ కాన్పు ద్వారా జన్మించడం ఒక అసాధారణ కేసుగా ఆశ్చర్యపరుస్తోంది.అమీనాగా అనే ఆ మహిళకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్లలో నలుగురు పిండాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటి నుండి.. ఈ గర్భధారణ అత్యంత సంక్లిష్టమైనది వైద్యులు చెప్పారు. దీనివల్ల ఉండే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని.. కనీసం ఇద్దరు పిల్లలనైనా సురక్షితంగా ప్రసవించే అవకాశాలను పెంచడం కోసం "ఫీటల్ రిడక్షన్" (పిండాల సంఖ్యను తగ్గించడం) చేయాలని వైద్య బృందం సలహా ఇచ్చింది. అయితే నలుగురు పిల్లలతోనే గర్భాన్ని కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.గర్భధారణ సమయంలో అమీనా రక్తపోటు (బీపీ), కాలేయ సంబంధిత (లివర్) సమస్యలతో కూడా బాధపడ్డారు. దీంతో ఆమె చికిత్స కోసం పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిపాలన విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీన అమీనాకు మొదటిసారి నొప్పులు వచ్చాయి. మే 9న ఆమె తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు సుమారు 710 గ్రాములు ఉంది.ఆ సమయంలో గర్భం ఇంకా ఆరున్నర నుండి ఏడు నెలల దశలోనే ఉండటంతో, వైద్యులు ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. మిగిలిన ప్రసవాలను ఆలస్యం చేయగలిగారు. ఐదు రోజుల తర్వాత.. మే 14న ఆమెకు మళ్లీ ప్రసవ వేదన రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె మిగిలిన ముగ్గురు పిల్లలకు (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు) జన్మనిచ్చింది. నవజాత శిశువులలో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, మిగిలిన ఇద్దరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.ఈ కేసు వైద్యపరంగా అత్యంత అరుదైనదని.. సవాలుతో కూడుకుందని ఆసుపత్రి వైద్య బృందం పేర్కొంది. నలుగురు పిల్లలు వేర్వేరు సంచులలో (separate sacs) ఉన్నారని, దీనివల్ల సాధారణ ప్రసవాలు విజయవంతం కావడం వైద్యపరంగా అత్యంత అసాధారణమైన విషయమని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స, పర్యవేక్షణలో వైద్యుల బృందంతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సకాలంలో స్పందించడం, నిరంతర పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల సహకారం ఈ హై-రిస్క్ గర్భధారణను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయని వైద్యులు తెలిపారు. పిల్లల తండ్రి, కిరాణా దుకాణం యజమాని మహ్మద్ ఆలిమ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
న్యాయవాదుల నకిలీ డిగ్రీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వేలాది మంది న్యాయవాదుల విషయంలో సీబీఐ దర్యాప్తు అవసరమరని సూచించింది. ‘వేలాది నల్ల గౌన్లు ధరించిన వ్యక్తులు ఫేక్ డిగ్రీలతో న్యాయవృత్తిలో ఉన్నారు. సీబీఐ ఏదో ఒకటి చేయాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, యూట్యూబ్‌లో కొంతమంది న్యాయవాదుల మాటతీరు, వారు చేస్తున్న పోస్టులు వారి అర్హతలపై తీవ్రమైన సందేహాలు కలిగిస్తున్నాయని అన్నారు.ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గుర్తింపు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో వెలువడ్డాయి. పిటిషనర్ సంజయ్ దూబే కోర్టును అవమానించేలా వ్యవహరించారని సుప్రీంకోర్టు భావించింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో సంజయ్ దూబే మాటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవృత్తిలో క్రమశిక్షణ అంటే ఏమిటో చూపిస్తాను’ అని హెచ్చరించగా.. సీనియర్ అడ్వకేట్ గుర్తింపు కేవలం స్టేటస్ సింబల్‌గా మారిందా లేక న్యాయవ్యవస్థకు సేవ చేయడానికా అని న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం సదరు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించడంతో, పిటిషనర్ చివరికి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.ఈ సందర్భంగా కోర్టు, సమాజంలో ఇప్పటికే న్యాయవ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఉన్నారని, న్యాయవాదులు వారితో కలిసిపోవద్దని హెచ్చరించింది. -
వాహనదారుల్లో ఆందోళన.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
‘రాబోయే ఆదివారం నుంచి పెట్రోల్ బంకులు పనిచేయవు...’ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ పోస్ట్ సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, పుదుచ్చేరి వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు పూర్తిగా మూసివేస్తారనేది ఆ సందేశం సారాంశం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా సృష్టించిన ఈ నకిలీ పోస్ట్ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో వేలాది సార్లు షేర్ కావడంతో వాహనదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ సందేశం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ పీఐబీ ఫ్యాక్ట్-చెక్ బృందం రంగంలోకి దిగింది. ఈ వాదనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సంస్థ ఇదొక తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది.‘దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఆదివారాల్లో పెట్రోల్ పంపులను మూసివేయాలని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే. పౌరులెవరూ ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దు’ అని పీఐబీ విజ్ఞప్తి చేసింది.అకస్మాత్తుగా ఎందుకిలా?ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన ఇంధన లభ్యత కొరత ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో కీలకం. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంసిద్ధత మాత్రమే కానీ, భయాందోళనలు సృష్టించడం కాదు.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
హైదరాబాద్‌లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్‌లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్‌లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్‌లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్‌లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్‌వర్క్‌లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్‌లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్‌గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
డాలర్‌తో పోలిస్తే 96 మార్కు.. కారణాలివే..
భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది.ఈ రోజు (మే 15, 2026) ట్రేడింగ్ సెషన్లో రూపాయి విలువ 96 మార్కును దాటి రికార్డు స్థాయిలో 96.07 కనిష్ఠ స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్లో 95.95 వద్ద ముగిసిన రూపాయి, నేడు ఉదయం డాలర్‌తో పోలిస్తే 95.74 స్థాయిల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్-యూఎస్ ఉద్రిక్తతల కారణంగా మరింత క్షీణించి 0.3% నష్టంతో 96.05 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7% మేర క్షీణించడం గమనార్హం.రూపాయి పతనానికి గల కారణాలు..బ్యారెల్ 110 డాలర్లకు చేరిన ముడి చమురుపశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా సాగే కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేయడంతో గత 11 వారాలుగా చమురు ధరలు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్ల వద్ద కదులుతుండగా యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూఐటీ) బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు వ్యాపారం అంతా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడల్లా భారత్‌కు డాలర్ల అవసరం పెరిగి రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.ఆగని ఎఫ్‌పీఐల విక్రయాలు..దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ/ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది గత ఏడాది (రూ.1.54 లక్షల కోట్లు) అవుట్‌ఫ్లో రికార్డును సైతం అధిగమించింది.మే 14 ఎన్ఎస్ఈ డేటా ప్రకారం: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.146 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హబ్‌లుగా ఉన్న మార్కెట్లలోకి ఈ నిధులు మళ్లుతుండటంతో భారత రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది.ఫలితాన్ని ఇవ్వని ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంహార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందని, తద్వారా అమెరికా-ఇరాన్ సంక్షోభం సద్దుమణుగుతుందని మార్కెట్లు ఆశగా ఎదురుచూశాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన రెండు గంటల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు నమ్మశక్యం కాని విధంగా సాగాయని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభనపై స్పష్టత రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నిరాశ అలుముకుంది. అమెరికా విధాన నిర్ణేతల (యూఎస్ ఫెడ్) వ్యాఖ్యలు, అక్కడ వెలువడిన ఆర్థిక గణాంకాలు డాలర్‌ను మరింత బలోపేతం చేశాయి.భారత్‌పై పడే ప్రభావం ఏమిటి?రూపాయి విలువ ఇలాగే 96 దిగువన కొనసాగితే దేశీయంగా ‘ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్’ (దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉంది. ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కానున్నాయి. విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విదేశీ నిల్వల (ఫారెక్స్ రిజర్వ్స్) ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడంపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు.. ఇంతలోనే పాముకాటుతో కాంగ్రెస్ నేత మృతి
డాక్టర్ కేతన్ భాటికర్ మృతి గోవా రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. గోవా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కేతన్ భాటికర్ పాముకాటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాల్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. 38 ఏళ్ల కేతన్ భాటికర్ కర్ణాటకలోని దాండేలి గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు దిగిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను గోవాలోని ధర్బందోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా..గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ కేతన్ భాటికర్.. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైకోర్టు తీర్పుతో ఆ ఉపఎన్నిక రద్దు కావడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాద ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేతన్ భాటికర్ మరణం వైద్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేత యూరి అలెమావో కూడా సంతాపం తెలిపారు. ప్రజాసేవ పట్ల కేతన్ భాటికర్కు ఉన్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.ఉప ఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే..పోండా అసెంబ్లీ ఉపఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అవసరమైంది. దీంతో ఎన్నికల సంఘం 2026 ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున డాక్టర్ కేతన్ పోటీ చేశారు. అయితే, పోలింగ్‌కు కేవలం 16 గంటల ముందు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ ఉపఎన్నికను రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను డాక్టర్ కేతన్.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉందని.. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.సుప్రీంకోర్టుకు డాక్టర్ కేతన్..దీనిపై డాక్టర్ కేతన్ భాటికర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యాక రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రచారం పూర్తైంది.. పోస్టల్ బ్యాలెట్లు కూడా పడిపోయాయి. ప్రజలకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు దూరమైంది. చట్టం ఎన్నికలు నిర్వహించకూడదని కాదు.. తప్పనిసరి కాదని మాత్రమే చెబుతోంది. పోండా ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల చట్టంలోని Section 151A వ్యాఖ్యానం కీలకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం సమాధానం కోరింది. ఈ క్రమంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఆయన చనిపోయారు. డాక్టర్ కేతన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగా.. ఇంతలోనే పాముకాటుతో ఆయన మరణించడం రాజకీయంగా, న్యాయపరంగా కూడా చర్చనీయాంశమైంది.సుప్రీంకోర్టు నిర్ణయంపై..అయితే, డాక్టర్ కేతన్ మరణంతో ఆయన దాఖలు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగత హక్కులు లేదా ఎన్నికల అర్హతలకు సంబంధించిన కేసుల్లో పిటిషనర్ మరణిస్తే, ఆ పిటిషన్ “అబేట్” (చెల్లుబాటు కోల్పోవడం) అయ్యే అవకాశముంటుంది. అయితే ఇది పూర్తిగా కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పోండా ఉపఎన్నిక రద్దు అంశం ప్రజాప్రయోజనం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదిగా కోర్టు భావిస్తే, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ తరఫున మరో వ్యక్తి కేసును కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు. ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు. గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. -
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
పెట్రో ధరల పెంపు.. కేంద్రం తొలి స్పందన ఇదే..
ఢిల్లీ: దేశంలో పెట్రో రేట్ల పెంపుపై కేంద్రంగా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. అన్ని దేశాల కంటే భారత్‌లోనే పెట్రో రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదు. మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20-100 శాతం పెంచాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం పెరిగింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన. ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం. నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart. While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.Even as Brent crude crossed… pic.twitter.com/nbyiBbhhC9— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2026ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. -
నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగీలాల్, దినేష్ బివాల్ సోదరులు గత సంవత్సరాలలో సైతం పరీక్ష పత్రాలు లీక్ చేశారని అధికారులు భావిస్తున్నారు. బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలకు పరీక్షకు ముందే నీట్ 2025 ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. లీకైన పేపర్‌ను నెట్‌వర్క్‌లో ముందుకు విక్రయించడంలో ఇతని పాత్ర కూడా ఉందని సమాచారం. ఈ ప్రశ్నపత్రాన్ని ముందుగానే సేకరించి పంపిణీ చేయడానికి 65 లక్షల రూపాయలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళతో సహా) అడ్మిషన్ కౌన్సెలర్ల ముఠాలో సభ్యులని, వీరు కూడా వైద్య నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చారని తేలింది. లీకైన పేపర్‌కు మూలకర్తగా గుర్తించిన శుభమ్ ఖైర్నార్ స్వయంగా మెడికల్ విద్యార్థని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కుమారుడని అధికారులు గుర్తించారు. అయితే గతేడాది లీకైన నీట్ పేపర్ గుర్గావ్లో యష్ యాదవ్‌కు లీకైన పేపర్‌ను అందజేశాడని, అక్కడి నుండి యాదవ్ దానిని రాజస్థాన్‌కు చెందిన మాంగీలాల్ బివాల్‌కు పంపాడని సమాచారం. మాంగీలాల్ తన కుమారుడు వికాస్ బివాల్ తన మేనల్లుళ్ల కోసం ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం రాకెట్‌ను కోచింగ్ మాఫియానే నడిపిస్తోందని, ఇప్పటి వరకు అరెస్టు అయిన వారు కేవలం ఒక పెద్ద నెట్‌వర్క్‌లో భాగం మాత్రమేనని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. సికార్‌లోని కోచింగ్ సెంటర్లు సైతం నిఘాలో ఉన్నాయి. బివాల్ కుటుంబం ఎవరి కోసం పనిచేస్తుందో ఆ ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీట్ 2026 పేపర్ లీకేజీ కేసు ఏదో సాధారణ లీక్ కాదని, ఇది ఏళ్ల తరబడి వ్యవస్థీకృతంగా నడుస్తున్న నెట్వర్క్ అని అధికారులు భావిస్తున్నారు. పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్ నుంచే పేపర్ సికార్‌లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్‌కు చేరింది. అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్‌ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
ఉన్నావ్ కేసు.. కుల్దీప్ సెంగర్‌కు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదు శిక్షను సస్పెండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో శుక్రవారం ఆ ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సెంగర్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్(బెయిల్)ను రద్దు చేయడంతో పాటు.. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు మెరిట్ లోతుల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని.. అయితే సెంగర్ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపి రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2017లో వెలుగు చూసిన ఉన్నావో అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితురాలిపై అత్యాచారం జరపడంతో పాటు అక్రమ రవాణాకు ప్రయత్నించారని కుల్దీప్ సింగ్ సెంగర్‌పై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో.. ఆ కుటుంబానికి బెదిరింపులు, అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్ జరగడం.. బాధితురాలు ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం.. బంధువులు చనిపోవడం.. ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీంతో కేసు సీబీఐ చేతికి వెళ్లింది.అదే సమయంలో ఆ అభియోగాల నేపథ్యంలో బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అటుపై ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనకు జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేయడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన తల్లి, హక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి రాజధాని రోడ్లపై నిరసనకు దిగింది. ఆ సమయంలో అధికారులు వాళ్లను ఈడ్చుకెళ్లిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే బాధితురాలు న్యాయం కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈలోపు.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్‌పై సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేసింది.సెంగర్‌కి శిక్ష సస్పెన్షన్ ఇవ్వడం నేరం తీవ్రతను తగ్గించేలా ఉందని.బాధితురాలికి గతంలో బెదిరింపులు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో బెయిల్ అనర్హమని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఇప్పుడు సెంగర్ తాత్కాలిక ఉపశమనం సుప్రీం కోర్టు రద్దు చేయడంతో.. ఆయన భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
సామాన్యుడి నెత్తిన వరుస పిడుగులు!
దాదాపు నాలుగేళ్ల తర్వాత మన దేశంలో.. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అటు కేంద్రం ఇటు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల కేవలం పెట్రోల్ బంకుల వద్దే ఆగిపోతుందనుకుంటే మన పొరపాటే!. పెట్రో వడ్డనతో సామాన్యుడి నెత్తి మీద వరుస పిడుగులు పడే అవకాశం ఉంది. రవాణా మొదలు వంటింటి దాకా.. అన్నింటిపైనా ప్రభావం చూపించే స్పష్టంగా అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సవాలు విసరనుంది. ఈ ప్రభావంతో ఏయే రేట్లు పెరుగుతాయంటే.. టికెట్ రేట్లు?పెట్రోలు ధరలు పెరగడం వల్ల కార్లు, బైకులు వాడే ప్రజలకు రోజువారీ ప్రయాణం ఖరీదు అయ్యింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల బస్సులు, లారీలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగే చాన్స్ ఉంది. ఫలితంగా ఆటో, క్యాబ్, మోటర్ ట్యాక్సీల ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. రవాణా ఖర్చులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు వినోదం, అదనపు ఖర్చులను తగ్గించుకోవాల్సి రావొచ్చు!.గెట్ రెడీ..బంగారం, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. కూరగాయలు, నిత్యావరాల రేట్లు పెరుగుతూ పోతున్నాయి. పాలు, పెరుగు ధరలనూ పెంచేశారు. ఇక రేపోమాపో వంటింటి గ్యాస్ ధర.. ఆ వెంటనే సబ్బులు, షాంపుల రేట్లు కూడా పెరిగే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు అన్నీ రోడ్డు రవాణా ద్వారా సరఫరా అవుతాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడనుంది.సో.. వాటి రేట్లు పెరగడం దాదాపు ఖరారైనట్లే!.ఈ-కామర్స్ ద్వారా.. లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఫుడ్ డెలివరీ యాప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. డిస్కౌంట్లను వీలైనంతగా తగ్గించడం.. కనీస ఆర్డర్ విలువ పెరగడం వంటి మార్పులు జరగవచ్చు. ఇది ఇంతటితోనే ఆగిపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు డీజిల్ ఆధారిత ట్రాక్టర్లు, పంపులు వాడాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగి, ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల తయారీ, వ్యవసాయం, రిటైల్, సేవలన్నింటిలో ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా.. దీర్ఘకాలంలో ఇంధన ధరలు స్థిరపడకపోతే.. ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. -
తమిళనాడు ఎన్నికల్లో నకిలీ ఓటర్లు..?
చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేశారనే ఆరోపణలతో 25 మంది విదేశీ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైతో పాటు మదురై విమానాశ్రయాల్లో వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల నడుమ మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడు ఆ ఎన్నికల్లో నకీలీ ఓట్లు వేసిన 25 మంది విదేశీయులను అధికారులు పట్టుకున్నారు.ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులకు చేతిపై ఎలక్షన్ సిరా ఉండడం గుర్తించారు. దీంతో అనుమానం వచ్చన అధికారులు ఇది ఎలా చేతికి వచ్చిందని విచారణ చేయగా వారు అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. వీరంతా శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తులు. విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉన్నప్పటికీ, పాత ఓటర్ ఐడిలను ఉపయోగించి వీరు ఓటు వేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.వీరు చెన్నైలోని పెరంబూర్, కె.కె. నగర్ మరియు పట్టుక్కోట్టై వంటి నియోజకవర్గాల్లో ఓట్లు వేసినట్లు మరికొందరు పుదుచ్చేరిలో సైతం ఓట్లు వేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.వీరిపై 'భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా భారత ఎన్నికల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరం. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్‌గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్‌గా మారుతోంది. విజయ్ సర్కార్‌కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్‌కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్‌కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్‌గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్‌ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్‌ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్‌కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్‌ను తమిళన్కు ముందు.. తమిళ్‌కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్‌ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్‌ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
బిగ్ అలర్ట్.. ఈనెల 20న మెడికల్ షాపులు బంద్
దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఈ బంద్‌లో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(AIOCD) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు ఒక రోజు పాటు తీవ్రంగా ప్రభావితం కానుంది. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కోనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. వివరాల మేరకు.. అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (AIOCD) పిలుపు మేరకు ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను మూసివేయనున్నారు. ఏఐఓసీడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు కూడా బంద్ కానున్నాయి. అయితే, పెద్ద కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.ఇక, ఆన్లైన్ ఫార్మసీ నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మిస్యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్లైన్లో విక్రయాలు అవుతున్నాయన్నారు. అలాగే, కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లు నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్ చేశారు. పేషెంట్లకు కోవిడ్ సమయంలో మందులు డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని AIOCD పేర్కొంది.ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) తరపున జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వర రావు మాట్లాడుతూ.. బంద్ సమయంలో ప్రజల భద్రతను, నిత్యావసర మందుల లభ్యతను, శాంతిభద్రతలను మరియు బాధ్యతాయుతమైన సమాచార మార్పిడిని పాటించాలని సంబంధిత వర్గాలందరికీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలిగించకుండా, బంద్‌లో శాంతియుతంగా మరియు చట్టబద్ధంగా పాల్గొనాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నిజమైన అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఎమర్జెన్సీ మందులను సరఫరా చేయాలన్నారు. రోగులు, ప్రజలు, అధికారులు లేదా ఏజెన్సీలతో ఎటువంటి ఘర్షణకు దిగవద్దని కోరారు. సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. అక్రమ అమ్మకాలు, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ మందులు, అనధికార ఆన్లైన్ మందుల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలన్నారు. మందుల సరఫరా మరియు ప్రజారోగ్య పరిస్థితులపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. బంద్ సమయంలో ఎలాంటి బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, ఆటంకాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించాలని పోలీసు శాఖను కోరారు. అంబులెన్సులు, అత్యవసర మందుల సరఫరా వాహనాలు మరియు ఆరోగ్య సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేలా చూడాలన్నారు. పుకార్లు, హింస లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.బంద్‌కు కారణాలుఅక్రమ ఈ-ఫార్మసీలు: Drugs & Cosmetics Act, 1940లో స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా పనిచేస్తున్నాయి.డీప్ డిస్కౌంటింగ్: కార్పొరేట్ ఈ-ఫార్మసీలు 20–60% తగ్గింపులు ఇస్తూ చిన్న కెమిస్టుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి.రోగుల భద్రతా సమస్యలు: ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు అమ్మడం, AI ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్లు.COVID కాలం సడలింపులు: G.S.R. 220 (E) నోటిఫికేషన్ ఇంకా కొనసాగుతోంది.ఈ-ఫార్మసీల నియంత్రణ చట్టాలుDrugs & Cosmetics Act, 1940: ఫిజికల్ ఫార్మసీలకు వర్తించే చట్టం, కానీ ఈ-ఫార్మసీలకు స్పష్టమైన నిబంధనలు లేవు.Draft E-Pharmacy Rules, 2018: రిజిస్ట్రేషన్, ఇన్స్పెక్షన్, ప్రకటనల నిషేధం, ఫిర్యాదు పరిష్కారం వంటి నిబంధనలు ప్రతిపాదించబడ్డాయి కానీ ఇంకా అమలు కాలేదు.Delhi High Court Interim Stay (2018): ఆన్లైన్ మందుల అమ్మకంపై తాత్కాలిక నిషేధం విధించింది, కానీ అమలు అసమానంగా ఉంది.CDSCO Show-Cause Notices (2023): లైసెన్స్ లేకుండా పనిచేసిన 20 ఈ-ఫార్మసీలకు నోటీసులు ఇచ్చింది. -
పొదుపా పాడా.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు చెప్పడంతో సామాన్యుడిపై పిడుగు గ్యారెంటీ అనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లే.. మొన్న కమర్షియల్ గ్యాస్.. నిన్న పాలు, కూరగాయలు.. రేట్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇంధన ధరలు పెరగడంతో విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికలు కావడంతో ప్రధాని మోదీ వసూళ్లు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీని ద్రవ్యోల్బణం మనిషి(Mehngai Man Modi)గా అభివర్ణిస్తూ.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడింది. ఇంధన పొదుపు పేరిట కొత్త డ్రామాలకు తెర తీశారని.. విదేశీ ప్రయాణాలు వద్దంటూనే ఇప్పుడు ఆయనే విదేశాలకు వెళ్లాడని ఆ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పెరుగుదలను దయనీయమైన పరిస్థితిగా పేర్కొంది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందా? అని ప్రశ్నించింది. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. పెట్రోల్ రేట్లు పెరగడం.. సైకిల్(సమాజ్‌వాదీ గుర్తు)నే భవిష్యత్తు అంటూ కార్టూన్ షేర్ చేశారు.దేశవ్యాప్తంగా పెట్రో రేట్లు తప్పవనే ఊహాగానాలు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలయ్యాక అది ఉండొచ్చని అంతా భావించారు. ఈ మధ్యలో పెంపు వార్తలను కొట్టేసిన కేంద్రం.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ఇంధన పొదుపు వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ సైతం పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోల్, డీజిల్‌పైన రూ.3 చొప్పున పెంపును ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. -
నీట్ పరీక్ష..కొత్త తేదీలు ప్రకటన
పేపర్ లీక్ నిర్ధారణ కారణంగానే నీట్ పరీక్ష రద్దు చేశామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమకెంతో కీలకమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే రీ ఎగ్జామ్ పెట్టే నిర్ణయం తీసుకున్నాం. ప్రతిభ గల విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేశామని తెలిపారు.సీబీఐ ఈ అంశంపై విచారణ చేపడుతుంది త్వరలోనే లీకు మాఫియాను పట్టుకుంటుందని ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో మాల్‌ప్రాక్టిస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీఎగ్జామ్‌కు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 14 లోపు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గతంతో పోలిస్తే ఎగ్జామ్ సమయాన్ని 15 నిమిషాలు పెంచామన్నారు. కాగా కొద్ది సేపటి క్రితమే నీట్ ఎగ్జామ్ కొత్త తేదీలను NTA ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్ష ఉండనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ కారణాలతో రద్దైన నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది.దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షరద్దైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్‌తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది. -
యూఏఈకి బయిలుదేరిన మోదీ
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనకు బయిలుదేరారు. ఈ రోజు ( శుక్రవారం) నుంచి ఈ నెల 20 వరకూ ఆయన పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత యూఏఈకి వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. అనంతరం అబుదాబిలో యూఏఈ అధినేతతో భోజనం చేస్తారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంధనంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ నుంచి భారత్‌కు అధికంగా చమురు సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. యూఏఈ పర్యటన తర్వాత యూరప్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్‌ఫారమ్‌కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్‌ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
బ్రిక్స్: హర్ముజ్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి దిగ్భందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన వేళ బ్రిక్స్ సదస్సు వేదికగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి , ఎర్ర సముద్రం వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడం వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు.నిన్న మే15 (గురువారం) జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం చేశారు."శాంతి ఎవరికో ఒకరికే పరిమితం కాదు స్థిరత్వం అనేది కొందరికే పరిమితం కాకూడదు,శాంతి అనేది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు" అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి, చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి " అని అన్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగకుండా చూడాలని, అలాగే ఏకపక్ష ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బ్రిక్స్ దేశాలు "ఆచరణాత్మక మార్గాలను" వెతకాలని భారత విదేశాంగ మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో పరోక్షంగా ఇరాన్‌కు సూచనలు చేస్తూ జైశంకర్ ప్రసంగించారు. అయితే ఈ సదస్సులో ఇరాన్ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.ఇరాన్ - UAE మధ్య వివాదంకాగా ఈసమావేశంలో ఇరాన్ , యూఏఈ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాలుఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేకపోతున్నాయి.బ్రిక్స్ కూటమి2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా.. 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్‌లో చేరింది. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ జనాభాలో సుమారు 49.5% కి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ప్చ్ విజయన్.. ఎలా తట్టుకుంటారో?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామన్న పినరయి విజయన్ కల నెరవేరలేదు. ఘోర ఓటమితో.. కేరళంలో ఎల్డీఎఫ్ దశాబ్దకాల పాలన ముగిసింది. దీనికి తోడు అక్కడి రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని మలుపు ఒకటి చోటు చేసుకుంది.తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించింది. 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుంది ఈ కూటమి. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తీవ్ర తర్జన భర్జనల తర్వాత వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. ఎల్డీఎఫ్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. అందులో సీపీఎం 26, సీపీఐ 8, ఆర్జేడీ 1 సీటు గెలిచాయి. మరోవైపు బీజేపీ 3 సీట్లు సాధించి కేరళ చరిత్రలోనే మెరుగైన ఫలితం అందుకుంది.ఈ ఫలితాలతో.. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పినరయి విజయన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారబోతున్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పినరయి విజయన్ను శాసనసభా పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ఈ విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే కారణమని.. ప్రతిపక్ష నేతగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని.. మారుతున్న రాజకీయాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మిత్రపక్షం సీపీఐలోని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సీపీఎం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయన్నే ప్రతిపక్ష నేతగా నిర్ణయించింది.సీపీఎం చరిత్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేతగా మారడం కొత్త విషయం కాదు. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, వీఎస్ అచ్యుతానందన్‌లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పినరయి విజయన్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా విజయన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాధించిన 61 ఏళ్ల వీడీ సతీశన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇంతకాలం అసెంబ్లీలో ప్రత్యర్థిగా సతీశన్ దూకుడు చూపించేవారు. ఆ దూకుడే విజయన్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసేది. కానీ ఇప్పుడు 82 ఏళ్ల వయసులో విజయన్‌కి అంత ఓపిక ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. మరోవైపు.. ఈ పాత్రల మార్పు కేరళ అసెంబ్లీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. అదే సమయంలో అక్కడి ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటమి తర్వాత కూడా పార్టీకి పెద్దదిక్కుగా మారిన పినరయి.. ప్రతిపక్షంలో తన శక్తిని ఎలా వినియోగిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. -
నోయిడా హింస.. విదేశాల నుండి డబ్బు
యూపీ: నోయిడాలో గత నెలలో జరిగిన కార్మికుల నిరసన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిరసనలకు కారణమైన వ్యక్తికి విదేశాల నుంచి పెద్దమెుత్తంలో నిధులు జమయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.నోయిడాలో గత నెల ఏప్రిల్ 13న పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. వివిధ రంగాలకు చెందిన సుమారు 40 నుండి 50 వేల మంది కార్మికులు నగర వ్యాప్తంగా గూమిగూడి హింసాత్మక ప్రదర్శనలు చేపట్టారు. సెక్టార్ 63 మరియు మదర్సన్ కంపెనీ ప్రాంగణ సమీపంలో కొంతమంది అల్లరి మూకలు హింసకు పాల్పడటమే కాకుండా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ రోజు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో నిందితుడైన సత్యం వర్మ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుండి రూ. కోటికి పైగా నగదు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఖాతాలోకి డాలర్లు, పౌండ్లు, యూరోల రూపంలో ఈ భారీ మొత్తం వచ్చిందని తెలిపారు. వాటిని సత్యం అనే వ్యక్తి ఇతర వ్యక్తుల ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.కాగా ఈ నిరసనల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆదిత్య ఆనంద్ అనే వ్యక్తిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేయగా ఏప్రిల్ 19న లక్నోలో సత్యం వర్మ, హిమాన్షు ఠాకూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు బిగుల్ మజ్దూర్ దస్తా అనే లెఫ్ట్ వింగ్ (వామపక్ష) కార్మిక హక్కుల సంఘంలో నాయకులని తెలిపారు.అయితే, ఆ నిధులు ఏ దేశాల నుండి వచ్చాయి లేదా ఏయే సంస్థలపై విచారణ జరుగుతోంది అనే వివరాలను పోలీసులు ఇంకా బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. -
నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగంలో భాగం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి.ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది.అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్‌కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.👉 పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.👉హింట్ ఇస్తూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం.. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూనే.. పెంచక తప్పదనే చెబుతూ వచ్చింది. ఈలోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్‌పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్ కంపెనీలు.👉 సీఎన్జీ కూడా.. మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు. 👉 ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలుఢిల్లీ: పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67ముంబై: పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03హైదరాబాద్: పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70కోల్‌కతా: పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02చెన్నై: పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39బెంగళూరు: పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99పాట్నా: పెట్రోల్ ₹108.54, డీజిల్ ₹94.78జైపూర్: పెట్రోల్ ₹108.03, డీజిల్ ₹93.49తిరువనంతపురం: పెట్రోల్ ₹110.38, డీజిల్ ₹99.26చండీగఢ్: పెట్రోల్ ₹97.30, డీజిల్ ₹85.45తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్‌పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్‌పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్‌ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్‌లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో జూన్ 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియకు వినియోగిస్తున్న సిబ్బందితోనే ఎస్ఐఆర్ కూడా నిర్వహించేలా తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. 5 నుంచి సిబ్బందికి శిక్షణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బంది, అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు 46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో)లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించుకోవాలని సూచించారు.ఈ ఎస్ఐఆర్కు అర్హత తేదీని 2026, జూలై 1గా నిర్ణయించారని తెలిపారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారంతా ఈ ఎస్ఐఆర్ పరిధిలోకి వస్తారని వెల్లడించారు. జూలై 14 నాటికి రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలన్నింటి హేతుబదీ్ధకరణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సమర్థంగా నిర్వహించడానికి వీలుగా 2001లో జరిగిన ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని, ఇప్పటికే 64 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు వివరించారు. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో 46,397 మంది బీఎల్వోలు, 68,868 మంది బీఎల్ఏలు పాల్గొంటారు. సుమారు నాలుగున్నర నెలలపాటు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనుంది.తెలంగాణలో జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ తెలంగాణలో ఎస్ఐఆర్ అర్హత తేదీని 2026 అక్టోబర్ 1గా నిర్ణయించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నారు. -
కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై 10 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత వి.డి.సతీశన్‌కు సీఎం పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం గురువారం నిర్ణయించింది. ఇప్పటిదాకా జరిగిన చర్చల ఆధారంగా సతీశన్‌ను కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) నాయకుడిగా నియమించాలని నిర్ణయించినట్లు కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వెల్లడించారు. ఆమె గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, సీనియర్ నేత జైరామ్ రమేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. రాష్ట్రంలో సీఎల్పికి కొత్త నాయకుడిని నియమించే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తి అధికారం కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సహా పార్టీ ఎంపీలు, నేతలతో ఖర్గే విస్తృతంగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. సీఎల్పీ నాయకుడిగా సతీశన్‌ను నియమిస్తూ తుది నిర్ణయం తీసుకున్నట్లు దీపాదాస్ మున్షీ స్పష్టంచేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం కె.సి.వేణుగోపాల్, సతీశన్, రమేశ్ చెన్నితాల పోటీపడ్డారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, దాదాపు 10 రోజులపాటు ఢిల్లీలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు సతీశన్‌కే సీఎం పోస్టు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఖర్గే, రాహుల్ గాంధీ 40 నిమిషాలపాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గురువారం తుది నిర్ణయం వెలువడింది. నూతన కేరళను సృష్టిస్తాం: సతీశన్ తనను సీఎంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు సతీశన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అతిపెద్ద బాధ్యత అప్పగించిందని అన్నారు. కేరళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేరళ ప్రజలు పదేళ్ల వామపక్ష పాలనను అంతం చేశారని, ఎన్నో ఆశలతో తమకు అధికారం అప్పగించారని పేర్కొన్నారు. నూతన కేరళను సృష్టించడానికి, నూతన యుగాన్ని ప్రారంభించడానికి అంకితభావంతో పని చేస్తామని వెల్లడించారు. గురువాయూర్కు రమేశ్ చెన్నితాల! కేరళ సీఎం పదవిని ఆశించిన సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల గురువారం అధిష్టానం నిర్ణయం తెలిసిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. తిరువనంతపురంలోని తన ఇంటి నుంచి గురువాయూర్ శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిపోయినట్లు సమాచారం.ఐయూఎంఎల్ ఒత్తిడి పెంచడం వల్లే.. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు కె.సి.వేణుగోపాల్‌కు ఉన్నప్పటికీ సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ప్రధాన భాగస్వామి అయిన ఐయూఎంఎల్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెల్చుకుంది. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం పదవిని సతీశన్‌ను కట్టబెట్టాలని ఆ పార్టీ కాంగ్రెస్ పెద్దలపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేని నేపథ్యంలో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. మరోవైపు మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె.సి.వేణుగోపాల్‌కు అండగా నిలిచారు. కానీ, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు సతీశన్‌కే జైకొట్టారు. క్యాడర్‌పై బలమైన పట్టుండడం ఆయనకు అనుకూలంగా మారింది. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం సతీశన్‌ను సీఎంగా ఎంపిక చేయక తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం సతీశన్ సహా కాంగ్రెస్ నేతలు గురువారం కేరళ గవర్నర్ ఆర్.వి.ఆర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 18న సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీశన్ ఆచరణాత్మక రాజకీయవేత్తవి.డి.సతీశన్.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూనే, ప్రశాంతమైన శైలితో ప్రజలకు అందుబాటులో ఉండే నేత. కేరళ రాజకీయాల్లో దూకుడుగల ప్రతిపక్ష నేతగా ప్రతిష్టను పెంచుకున్నారు. 2021లో ఓటమి తర్వాత దశాబ్దకాలంగా పార్టీ పునరుజ్జీవనానికి కృషి చేశారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉద్భవించి, కేరళలోని అత్యంత బలమైన ప్రతిపక్ష నాయకులలో ఒకరిగా ఎదిగిన సతీశన్, తన రాజకీయ వ్యూహంతో ఆచరణాత్మక రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజాకర్షక నేతగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి సారించారు. పినరయి విజయన్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. క్రమశిక్షణ కలిగిన నేతగా పేరుతెచ్చుకున్న సతీశన్.. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకపోయినప్పటికీ, మీడియా వ్యవహారాలలో నేర్పరి. ఆయన శైలి.. వర్గపోరాటాలతో సతమతమవుతున్న పార్టీలో కొందరు సీనియర్ నాయకులను కలవరపెట్టింది. యువతను కాంగ్రెస్ వైపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. దిగ్గజ నాయకులైన కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ, ఊమెన్ చాందీల తర్వాత కాంగ్రెస్‌లో ప్రజలను ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకురాలేకపోతే రాజకీయ అజ్ఞాత వాసం చేస్తానని సంచలనాత్మక ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు, యూడీఎఫ్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక ధైర్యమైన ప్రకటన. సతీశన్ క్షేత్రస్థాయి విధానం, స్థానిక సమస్యలపై నిరంతర దృష్టి, పార్టీ వ్యవస్థను, ఓటర్ల విశ్వాసాన్ని పునరి్నరి్మంచడంలో తోడ్పడ్డాయి. కాంగ్రెస్‌లో ఏఐసీసీ కార్యదర్శి, కేపీసీసీ ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులలో పనిచేశారు. సాధారణ కుటుంబం నుంచి1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కె.దామోదర మీనన్, తల్లి వి.విలాసిని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్ మాస్టర్స్ చదివారు. రాజకీయంలోకి రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు పదేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య ఆర్.లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది. సతీశన్ రాజకీయ ప్రస్థానం విద్యారి్థగానే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేఎస్‌యూ (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం1996లో మొదటిసారి పరవూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2001 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్ వేవ్ ఉన్నప్పుడూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, రమేష్ చెన్నితల స్థానంలో హైకమాండ్ సతీశన్‌ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడును అవలంబించారు. అసెంబ్లీలో ఏదైనా మాట్లాడేప్పుడూ పూర్తి సమాచారం, పక్కా ఆధారాలతో మాట్లాడి బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో, యూడీఎఫ్ ఉప ఎన్నికల విజయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలలో బలమైన ప్రదర్శనతో ఇచ్చింది. పార్టీలోపల, బయటా వివాద రహిత నాయకుడిగా క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్ అక్రమాస్తులపై దర్యాప్తు చేయండి
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్రమాస్తులను పోగేసుకున్నారంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్.విజ్ఞేశ్ శిశిర్ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులోని లక్నో ధర్మాసనం స్పందించింది. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాలని జస్టిస్ రాజేశ్ చౌహాన్, జస్టిస్ జఫీర్ అహ్మద్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. మే 12వ తేదీన ఇన్–చాంబర్ విచారణ చేపట్టిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. జూలై 20వ తేదీలోపు తాజా దర్యాప్తు నివేదికను సమరి్పంచాలని సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత గతంలో, ప్రస్తుతం వేర్వేరు ఎంపీ నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెల్చిన నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖతోపాటు తీవ్రమైన నేరాల దర్యాప్తు విభాగం డైరెక్టర్(డీఎస్ఎఫ్ఐఓ) అంతర్గత దర్యాప్తు జరిపి 8 వారాల్లోపు నివేదించాలని ధర్మాసనం సూచించింది. ఇప్పటికే పిటిషనర్ నుంచీ తాము ఫిర్యాదు అందుకున్నామని హైకోర్టుకు సీబీఐ, ఈడీ తెలిపాయి. -
మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లావ్రోవ్ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్ను మోదీ కోరారు. మోదీని కలిసిన ‘బ్రిక్స్’విదేశాంగ మంత్రులు బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, బ్రెజిల్ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. -
హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్‌ను దాటగా ఎన్వీ సన్‌షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్‌ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్‌షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్‌కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్‌కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగంలో భాగం
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి. ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది. అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్‌కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
పశ్చిమాసియా శాంతి.. అందని ద్రాక్ష కానివ్వం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో గురువారం మొదలైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సదస్సులో పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇకనైనా హార్మూజ్ జలసంధి తెరచుకునేలా, సముద్రమార్గంలో సరకుల రవాణా సవ్యంగా జరిగి ముడిచమురు, నిత్యావసరాల ధరలు దిగొచ్చేలా ప్రపంచదేశాలు సమష్టి నిర్ణయాలు తీసుకుని పశ్చిమాసియా యుద్ధమేఘాలను చెల్లాచెదురుచేయాలని భారత్ ఆశాభావం వ్యక్తంచేసింది. అగ్రరాజ్యాల అసంబద్ధ ఆంక్షల కత్తిని తొలగించేలా ఉమ్మడి పోరాటం చేయాలని బ్రిక్స్ దేశాలకు భారత్ పిలుపిచ్చింది. రెండ్రోజులపాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో తొలిరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించారు. ఇరాన్‌పై దాడికి తెగబడిన అమెరికానుద్దేశించి జైశంకర్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తోటి దేశాలు గౌరవించాలని హితవు పలికారు. ‘‘శాంతి అనేది కలగా మిగిలిపోనివ్వం. అంతర్జాతీయ చట్టాల ఉనికి శాంతే కీలకం. ప్రజలను కాపాడాన్నా, మౌలిక వసతుల పరిరక్షించాలన్నా శాంతి వెల్లివిరియాలి. సంఘర్షణలకు సంప్రతింపులు, దౌత్యమే అత్యుత్తమ మార్గం. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో సముద్రమార్గంలో సరకు రవాణా కష్టమైంది. ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హార్మూజ్ తెరచుకోవాలి. ఎర్రసముద్రం గుండా రవాణా కొనసాగాలి. ఇక గాజాలో మానవతా సాయం ఊపందుకోవాలి. శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సాయం పెంపు, విశ్వసనీయ మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని సాధించం అనేవి ఎంతో కీలకం. పాలస్తీనియన్ల భవిష్యత్తు దృష్ట్యా రెండు దేశాల విధానానికి భారత్ ఓటేస్తోంది’’అని జైశంకర్ అన్నారు. గురువారం బ్రిక్స్ సెషన్స్‌లో ఒక దాంట్లో చర్చవేళ యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జోక్యంచేసుకోవడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, యూఏఈ విదేశాంగ మంత్రి ఖలీఫా షాహీన్ అల్ మరార్‌లు శాంతించారని తెలుస్తోంది. ఈ సెషన్లో బ్రెజిల్ విదేశాంగ మంత్రి మారో వియేరా, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియానో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా తదితరులు పాల్గొన్నారు. తమదేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంపై యూఏఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విస్తరణవాదానికి మేం బలయ్యాం ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడారు. ‘‘యుద్దకాంక్షతో రగిలిపోతున్న దేశాల అక్రమ రాజ్యవిస్తరణవాదానికి మేం బలైపోతున్నాం. నేటి సమాజంలో ఇలాంటి ధోరణులకు చోటివ్వకూడదు. హేయమైన దాడులు జరుగుతున్నా ఇరాన్ ప్రజలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ మాపై యుద్ధానికి కాలు దువ్విన అమెరికా, ఇజ్రాయెల్‌ను బ్రిక్స్ సభ్యదేశాలు తప్పుబట్టాల్సిందే’’అని అరాఘ్చీ డిమాండ్‌చేశారు. -
మరోసారి లాయరైన మమత
కోల్‌కతా/న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చి మ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మరోసారి నల్ల కోటు వేసుకుని కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస పెచ్చరిల్లిందంటూ ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరిలో మమత నల్లకోటు ధరించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం తెల్సిందే. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4వ తేదీ నుంచి టీఎంసీ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడు లు జరుగుతున్నాయని సిర్సన్యా బందోపా ధ్యాయ వేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పౌల్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎంపీ కల్యాణ్ బెనర్జీ కుమారుడైన సిర్సన్యా బందోపాధ్యాయ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. హైకోర్టులో మొదటిసారిగా హాజరైన మమత.. కల్యాణ్ బెనర్జీకి తోడుగా వాదనలు వినిపించారు. దాడులకు పాల్పడే వారి నుంచి ప్రజలను కాపాడాలని హైకోర్టు ను కోరారు. ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో కనీసం 10 మంది చనిపోగా, 160 మంది టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, కనీసం 2 వేల హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని చెప్పారు. చేపలు, మాంసం దుకాణాలనూ లక్ష్యంగా చేసుకున్నారన్నారు. కోల్‌కతాలో అక్రమ కట్టడాలను కొత్తగా వచ్చిన సువేందు అధికారి ప్రభుత్వం కూల్చివేస్తుండటాన్ని మమత ప్రస్తావిస్తూ ‘యూపీ మాదిరిగా బెంగాల్ బుల్డోజర్ రాష్ట్రం కాదు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. స్పందించిన ధర్మాసనం.. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను తప్పనిసరిగా కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక వాతావరణంలో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన వారు తిరిగి సురక్షితంగా చేరుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కోరింది. ఈ విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించాలంది. మూడు వారాల్లోగా అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరీ అవసరమనిపిస్తే మరో రెండు వారాలు సమయం తీసుకోవచ్చని తెలిపింది. కాగా, తీర్పు అనంతరం మమత కోర్టు ప్రాంగణం నుంచి వెళ్లిపోతుండగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు లాయర్లు ఆమెనుద్దేశించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేశారు. కోర్టు తీర్పును తమ విజయంగా టీఎంసీ అభివర్ణించింది. బీజేపీ నిజం స్వరూపం బయటపడిందంటూ వ్యాఖ్యానించింది.బీసీఐ సీరియస్.. మమత హైకోర్టులో వాదనలు వినిపించారంటూ వచ్చిన వార్తలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పందించింది. మమత లాయర్‌గా నమోదయ్యారా? ఒక వేళ అయితే సీఎంగా ఉండగా 2011–2026 మధ్య కాలంలో ఆమె లాయర్ సభ్యత్వం పరిస్థితి ఏమిటి?వంటి వివరాలను 48 గంటల్లోగా అందజేయాలని పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్‌ను కోరింది. రాజ్యాంగ పదవి, లాభదాయక ఉద్యోగాల్లో ఉన్న వారు, ఆ కాలంలో బార్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. -
న్యాయ సమీక్ష రాజ్యాంగ విధి
న్యూఢిల్లీ: న్యాయ సమీక్షాధికారం తమ రాజ్యాంగ విధి అని, సంస్కరణలు, సంక్షేమం వంటి అంశాల్లో ఆ అధికారాన్ని తాము వదులుకోజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని శబరిమల, తదితర మత ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టడం తెల్సిందే. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ లాయర్ కె.పరమేశ్వర్ గురువారం తన వాదనలు వినిపించారు. ‘సామాజిక సంక్షేమం, సంస్కరణల ప్రాథమిక బాధ్యత శాసనసభలపైనే ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. దీనర్థం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులకు అధికారం లేదని కాదు. న్యాయస్థానం అత్యుత్సాహం చూపే సంస్కర్త మాదిరిగా ఉండరాదు, అలాగని ప్రేక్షక పాత్రకే పరిమితం కారాదు’అని పరమేశ్వర్ పేర్కొన్నారు. ‘మతపరమైన హక్కుల చెల్లుబాటును హేతుబద్ధత వంటి అంశాల ఆధారంగా అంచనా వేయకూడదు. విశ్వాసానికి, హేతబద్ధతకు చాలా వ్యత్యాసం ఉంది. హేతుబద్ధతను తెరపైకి తెచ్చిన పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25, 26లు ఉనికినే కోల్పోతాయి. ప్రజల స్వేచ్ఛను, సమగ్రతను కాపాడే సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానాలు మతాచారాల్లో జోక్యం చేసుకోవచ్చు’అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సీజేఐ ఏకీభవించారు. ‘న్యాయసమీక్ష బాధ్యతను రాజ్యాంగ న్యాయస్థానం వదులుకోజాలదు. ఇది కేవలం అధికారానికి సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగం కోర్టుకున్న రాజ్యాంగవిధి’అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. 16 రోజులపాటు కొనసాగిన వాదనలు ప్రార్థనాస్థలాల్లో మహిళలపై వివక్షపై వాదనలు వాదనలు ముగించిన 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా పక్షాలు తమ వాదనలను ఈ నెల 29వ తేదీలోగా పూర్తిస్థాయిలో రాతపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోనిరాజ్యాంగ ధర్మాసనం 16 రోజులపాటు వాదనలు విన్నది. సీఎస్ వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి, ఇందిరా జైసింగ్, నీరజ్ కిషన్ కౌల్, గోపాల్ శంకరనారాయణన్ తదితర సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. ధర్మాసనంలో సీజేతోపాటు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలె, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఉన్నారు. అంతకు ముందు కేంద్రం, శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలను అనుమతించరాన్న నిబంధనను కొనసాగించాలని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నిబంధనల మత విశ్వాసాల పరిధిలోకి వస్తుందని, న్యాయపరమైన సమీక్షకు ఇది అతీతమని వివరించింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెల్సిందే. అనంతరం సుప్రీంకోర్టు ఈ అంశంపై అంతిమ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని నిర్ణయించింది. శబరిమలతోపాటు మసీదులు, దర్గాల్లో ముస్లిం మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం, పార్సీయేతర పురుషులను వివాహమాడిన పార్సీ మహిళలను ఆ మత పవిత్రప్రాంతంలోకి అనుమతించారన్న అంశంపైనా తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ముస్లిం, పార్సీ మహిళలు తమ ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షల వంటి మత స్వేచ్ఛా వ్యవహారాల్లో సంపూర్ణ న్యాయం చేయడానికి ఒక న్యాయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు పరిధిలోకి వచ్చే ఏడు ప్రశ్నలను పరిశీలిస్తామని ధర్మాసనం ముందుగానే తెలిపింది. అవి..→ ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛా హక్కు పరిధి, పరిమితి ఏమిటి? → ఆర్టీకల్ 25 ప్రకారం దఖలు పడే హక్కులకు, ఆర్టీకల్ 26 కింద మతపరమైన సంస్థలకు ఉండే హక్కులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? → ఆర్టీకల్ 26 ప్రకారం మత సంస్థలకు ఉండే హక్కులు.. ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్యంతో పాటు ఇతర ప్రాథమిక హక్కులకు కూడా లోబడి ఉంటాయా? → ఆర్టీకల్ 25, 26లలో పేర్కొన్న నైతికత అనే పదానికి అర్థం, పరిధి ఏమిటి? అందులో రాజ్యాంగబద్ధమైన నైతికత కూడా భాగమేనా? → ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ సమీక్షకు ఎంత వరకు అవకాశముంటుంది? → రాజ్యాంగంలోని అధికరణ 25 (2) (బీ)లో ఉన్న హిందువులలోని విభాగాలు అనే పదానికి అర్థం ఏమిటి? → ఏదైనా ఒక మత సమూహానికి, సంస్థకు చెందని వ్యక్తి, ఆ మతానికి సంబంధించిన ఆచారాలను ప్రశ్నిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయొచ్చా?. -
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.“తమిళనాడు భారత్‌లోనే టెక్స్టైల్, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.“గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్టైల్స్, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు.“ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్టైల్ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. -
అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు
ఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మను , కోర్టును లక్ష్యంగా చేసుకుని సందేహాలను రేకెత్తిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లపై కోర్టు ధిక్కరణ చట్టం కింద క్రిమినల్ చర్యలను ప్రారంభించాలని కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందు తాము హాజరు కాబోమనే విషయాన్ని కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్ నాయకులు ఆన్లైన్లో లేఖలు షేర్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించారు. దీనిలో భాగంగా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సైతం.. తనను ఎవరూ బెదిరించలేరంటూ గట్టిగా హెచ్చరించారు.‘ఎడిటెడ్ వీడియోలతో నా కుటుంబ సభ్యులను నిందించారు... ఇది నన్ను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థను భయపెట్టడానికే చేశారు. నన్ను ఎవరూ బెదిరించలేరు’ అని వ్యాఖ్యానించారు.కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. విచారణకు స్వర్ణకాంత శర్మ దూరం..ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు స్వర్ణకాంత్ శర్మ వెల్లడించారు. న్యాయ క్రమశిక్షణ లో భాగంగా తాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ గతంలోనే కొట్టేసిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరొక న్యాయమూర్తి కి కేటాయించాలని కోరారు. -
రూ. 44 వేలు తగలేసినా.. క్షోభ పెట్టారు : ఇండిగోపై తీవ్ర ఆరోపణలు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నాగ్‌పూర్‌కు చెందిన ఒక న్యాయవాది ఆరోపణలు సంచలనంగా మారాయి. బాగ్డోగ్రా నుండి కోల్‌కతా వెళ్తున్న విమానంలో తన 3 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రుల నుంచి దూరంగా కూర్చోబెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలు విమానయాన సంస్థల సీట్ల కేటాయింపు పద్ధతులు, కుటుంబ సీటింగ్ విధానాలపై ఆన్లైన్లో విస్తృత చర్చకు దారితీశాయి.టిక్కెట్ల కోసం రూ. 44 వేలు చెల్లించినా, ఇండిగో తన మూడేళ్ల బిడ్డను తల్లిదండ్రులకు దూరంగా కూర్చోబెట్టిందని, ఇది తమకు తీవ్రమైన మానసిక వేదన కలిగించిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ్ మిశ్రా సుమారు రూ. 43,900 ఖర్చు చేసి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, విమానంలో సీట్ల కేటాయింపు సమయంలో ఇండిగో సిబ్బంది ఆ 3 ఏళ్ల బాబుకు, తల్లిదండ్రులకు వేర్వేరు చోట్ల సీట్లు కేటాయించారు. ఇదే ఆందోళనకు దారి తీసింది.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లిగౌరవ్ మిశ్రా ఆరోపణలు ఏంటి? సీట్ సెలక్షన్ కోసం తాము అదనపు డబ్బులు చెల్లించలేదనే కారణంతోనే, విమానయాన సంస్థ కావాలనే అందరినీ విడివిడిగా కూర్చోబెట్టారని లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీజీసీఏ (DGCA) నిబంధనలను ప్రస్తావించారు. 12 ఏళ్లలోపు పిల్లలకు కనీసం ఒక తల్లి లేదా తండ్రి పక్కన సీటు కేటాయించాలని డీజీసీఏ నిబంధనలు (Rule 3.15) చెబుతున్నాయని, ఇండిగో దీన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రయాణ సమయంలో విమానం బాగా కుదుపులకు (Turbulence) లోనైందని, ఆ సమయంలో తన పక్కన ఎవరూ లేకపోవడంతో చిన్నారి తీవ్ర భయాందోళనకు గురయ్యాడని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు 'తీవ్రమైన మానసిక వేదన'గా కలిగించిందన్నారు.ఇదీ చదవండి : రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ నెటిజన్ల స్పందన ఈ ఉదంతంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. లాభాల కోసం ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తారా? 3 ఏళ్ల పిల్లాడిని ఒంటరిగా కూర్చో బెట్టడం భద్రతా పరంగా కూడా రిస్క్ కొందరు ఇండిగోపై మండిపడ్డారు. ఫ్యామిలీ మెంబర్లను విడదీసి, సీట్ల కోసం డబ్బులు అడగడం ఇప్పుడు అన్ని విమాన సంస్థలకు ఒక అలవాటుగా మారింది" అని మరికొందరు విమర్శించారు. విమాన సంస్థలు వ్యాపార దృక్పథంతో నిబంధనలను పక్కన పెట్టడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 44 వేలు పెట్టినప్పుడు, సీట్ల కోసం మరో కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టలేరా?" అని కొందరంటే, ఒకవేళ సీట్లు వేరుగా వచ్చినా, ఎవర్నో ఒకర్ని అడిగి సీటు మార్చుకోవచ్చు కదా?" అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందనతరువాత ఇండిగో ఈ ఫిర్యాదుపై బహిరంగంగా స్పందిస్తూ, మిశ్రాను నేరుగా సంప్రదించడానికి ప్రయత్నించినా, కానీ కుదరలేదు. తదుపరి సంప్రదింపుల కోసం దయచేసి మీకు అనువైన సమయాన్ని లేదా ప్రత్యామ్నాయ సంప్రదింపు నంబర్‌ను డీఎంల ద్వారా తెలియజేయాలని కోరింది. -
ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్ హీరోలా సంపాదిస్తాడేమో..
హౌరా: పశ్చిమ బెంగాల్ శిబ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్‌లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.శిబ్పూర్ కేసులో, హెచ్ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్‌కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్మెంట్లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు. అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. #BengalShocker | TMC leader’s house raided, gold bed and secret basement uncovered!The entire police team was stunned during the raid on TMC leader Shamim Ahmed’s residence in Shibpur, Howrah.Police reportedly discovered a hidden luxury flat through a trap door, featuring a… pic.twitter.com/JGDCVrY0Pu— Organiser Weekly (@eOrganiser) May 14, 2026పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా, శిబ్పూర్లో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే ఇల్లు.👇బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినప్పుడు, మొత్తం బృందం దిగ్భ్రాంతికి గురైంది....ఎందుకంటే టీఎంసీ ఎమ్మెల్యే షమీమ్ అహ్మద్ ఇంట్లో ఒక బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు, రహస్యంగా ఉన్న నేలమాళిగ నుండి… pic.twitter.com/UrXY3uRpIv— JSP Naresh (@JspBVMNaresh) May 14, 2026 -
బిగ్ క్యాట్, బిగ్ మిషన్ : భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: బిగ్ క్యాట్లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్‌క్యాట్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) సమ్మిట్–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్ వీటిని నిర్వహించబోతోంది. భారత్‌లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పులుల సంరక్షణలో మనమే ఆదర్శంప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ టైగర్’(ఎన్టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్ కార్యక్రమంలో టైగర్ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్ సింహాలు కేవలం భారత్‌లోనే ఉండటంతో గిర్ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్ లయన్’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు. ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!మనుషుల మధ్యే చిరుతల సహజీవనంభువనేశ్వర్లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్‌టక్‌లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లిచీతాల పునరావాసంలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపుమధ్యప్రదేశ్లోని భోపాల్ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్‌ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్ క్యాట్ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు వేదికగా నిలవనున్నాయి. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఐదు రాష్ట్రాల్లో బిగ్ క్యాట్లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..ఆసియా సింహం – గిర్(గుజరాత్)చీతా – భోపాల్(మధ్యప్రదేశ్)చిరుత – భువనేశ్వర్(ఒడిశా)మంచు చిరుత – గ్యాంగ్‌టక్(సిక్కిం)పులి – చంద్రపూర్(మహారాష్ట్ర) -
లాయర్ మమతా వివరాలు ఇవ్వండి: బీసీఐ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కలకత్తా హైకోర్టు ముందు హాజరైన కొన్ని గంటల తర్వాత ఆమె లాయర్ వివరాలను ఇవ్వాలంలూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ).. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు లేఖ రాసింది. న్యాయవాదిగా నమోదు, ప్రాక్టీస్ హోదాకు సంబంధించిన వివరాలను కోరింది. అంతకుముందు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కోల్కత్తా హైకోర్టు ముందు హాజరై, బెంగాల్లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఒక కేసులో వాదనలు వినిపించారు. దాంతో మమతా బెనర్జీ మరోసారి హైలైట్ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె న్యాయవాది వృత్తికి సంబంధించిన అన్ని వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ అంశానికి సంబంధించి మే 16వ తేదీ లోగా అంటే శనివారంలోపు ‘లాయర్ మమతా’ పూర్తి వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ బార్ కార్యదర్శికి లేఖ రాసింది బీసీఐ. మమతా లాయర్ దుస్తుల్లో హైకోర్టు ముందు హాజరైన విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది బీసీఐ. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లోమాజీ సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అయితే ఓ కీలక కేసుకు సంబంధించి ఆమె హైకోర్టుకు హాజరైన క్రమంలో మాజీ సీఎం కాస్తా.. లాయర్ మమతాగా అవతారమెత్తారని జనం అనుకుంటున్నారు. -
ఆ రోజు సూర్యుడి చూపంతా ఇండియా పైనే!
ఆ రోజు సూర్యుడి చూపంతా ఇండియా పైనే! ఏరోజు? ఎందుకు? ఎలా? ప్రశ్నలన్నీ మనసులోకి వచ్చాయి కదా! ఆగండాగండి. అది ఏప్రిల్ నెలాఖరు 27వ తేదీ. ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఆ రోజు ప్రపంచమంతా సాధారణం కంటే వేడెక్కింది. అయితే, అత్యంత వేడి నగరాల్లో మొదటి 50 నగరాలు ఒక్క మన దేశంలోనే నమోదయ్యాయి. గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ సంస్థ ఈ విషయం వెల్లడించింది. యూపీలో ఎక్కువ...ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా నగరం ఏక్యూఐ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగానే ఇక్కడ వేసవిలో తీవ్రమైన వేడి ఉంటుంది. ఇక, ఏప్రిల్ 27న బాందాలో ఉష్ణోగ్రతలు 115.16 ఫారహీట్స్‌కు, అంటే 46.2చేరుకున్నాయి. ఆ రోజు భూగోళంపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఆ రోజు తెల్లవారుజామునే బాందాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 34.72222 డిగ్రీలు. అయితే ఒక్క రోజు డేటాను ఒక ధోరణిగా పరిగణించకపోయినా... దేశం మాత్రం వాతావరణ సంక్షోభం ఎదుర్కొంటోందని వాతావరణ శాస్త్రవేత్త మాక్సిమిలియానో హెర్రెరా తెలిపారు. ముందే వచ్చిన వేసవి.. అయితే వేసవిలో ఎండలు సాధారణమే. కానీ ఈసారి మాత్రం అసాధారణ ఎండలున్నాయి. గతంలో కంటే మన దేశంలో వేసవి ఈసారి ముందుగానే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన వేడి నమోదైంది. ఇది కాలానుగుణ సగటు కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువ. రానురాను దేశంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా అంటే... 2050 నాటికి ఆరోగ్యవంతులైన మనుషులు కూడా తట్టుకుని జీవించలేని స్థాయికి చేరుకుంటుందని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ వేడి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమ వుతారని చెబుతున్నారు. ఈ నెల చివరలో మధ్య, తూర్పు భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హీట్ ఇండెక్స్ 122 నుంచి 140 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని స్థాయని హెర్రెరా హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మమతా బెనర్జీ మేనల్లుడికి కొత్త చిక్కులు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోవడంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి తలనొప్పులు ఎక్కువయ్యాయి. సువేందు అధికారి.. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అభిషేక్ బెనర్జీకి జడ్‌ప్లస్ భద్రతను ఉపసంహరించారు. అంతేకాదు బీజేపీ సర్కారు ఆదేశాలతో ఆయన ఇంటి ముందు భద్రత కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా తొలగించింది. తాజాగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెరపైకి వచ్చింది.బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డులను కలిగివున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడివుంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరులా పేరుతో మరో పాన్‌కార్డు ఆమె కలిగివున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు రుజిరా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'నవ భారత్ టైమ్స్' నివేదించింది.థాయ్‌లాండ్ పౌరసత్వంరుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెనర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజకీయంగా ఎదిగే దశలో ఉన్నారు. అప్పటికే ఆయన ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. అభిషేక్, రుజిరా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.వేర్వేరు తండ్రుల పేర్లు.. వివాదంథాయ్లాండ్లో ఉన్నప్పుడు రుజిరా.. భారత సంతతికి చెందిన వ్యక్తిగా పీఐఓ (PIO) కార్డును కలిగి ఉన్నారు. ఇందులో ఆమె తండి పేరు నిపన్ నరులా అని ఉంది. అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకున్న తర్వాత ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం సమర్పించిన పత్రాలలో తన తండ్రి పేరును గురుచరణ్ అహుజాగా పేర్కొన్నారు. ఇది ఇప్పటికీ వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.రుజిరాపై విచారణకు డిమాండ్ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో రుజిరా బెనర్జీపై విచారణ జరపాలని సోషల్ మీడియాలో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. రుజిరాపై వచ్చిన ఆరోపణల గురించి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేప్యథంలో సువేందు అధికారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


