మే 5న తెలంగాణకు నితిన్‌ గడ్కరీ | Nitin Gadkari to visit Telangana on May 5th | Sakshi
Sakshi News home page

మే 5న తెలంగాణకు నితిన్‌ గడ్కరీ

Apr 27 2025 5:05 AM | Updated on Apr 27 2025 5:05 AM

Nitin Gadkari to visit Telangana on May 5th

రాష్ట్రంలో రూ.6,280 కోట్ల విలువైన జాతీయ రహదారులను జాతికి అంకితం

ట్రిపుల్‌ ఆర్‌ (దక్షిణ భాగం)ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో దాదాపు రూ.6,280 కోట్ల వ్య యంతో నిర్మించిన 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదా రులను మే 5వ తేదీన కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిష న్‌రెడ్డి సంయుక్తంగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్య టనలో మొదట ఆదిలాబాద్‌ జిల్లాలో, ఆ తర్వాత హైద రాబాద్‌ నుంచి.. రెండు వేర్వేరు చోట్ల నుంచి జాతీయ రహ దారులకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. 

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో దాదాపు రూ.6, 280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర జాతీయ రహ దారులకు సంబంధించిన పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటితో పాటు రూ.961 కోట్లతో 51 కి.మీ. మేర చేపట్టనున్న రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, హైదరాబాద్‌ నార్త్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ రీజనల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే (రీజనల్‌ రింగ్‌ రోడ్‌ – ఉత్తర భాగం) ప్రాజెక్టు కు సంబంధించి పబ్లిక్‌–ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ అప్రెయిజల్‌ కమిటీ (పీపీపీఏసీ), కేబినెట్‌ అను మతులు త్వరితగతిన ఇచ్చేలా చర్య లు తీసుకోవాలని, ఆర్థికపరమైన అంశాలపై త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. 

ఈ ప్రాజెక్టుకు రూ.18,772 కోట్లు ఖర్చు కావొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే హైదరా బాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (సౌత్‌) నిర్మాణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. ఈ ప్రాజెక్టును జాతీయ రహ దారిగా ప్రకటించేందుకు కూడా కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణా నికి మొత్తం రూ.13 వేల కోట్లు ఖర్చు కానుండగా.. భూసేకర ణలో 50 శాతం ఖర్చుగా రూ.2,230 కోట్లు భరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ అంగీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement