ఏం కష్టమొచ్చిందో ఆ తల్లికి.. | Infant dies of suicide at Nalgonda Government General Hospital | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చిందో ఆ తల్లికి..

Aug 13 2026 1:28 AM | Updated on Aug 13 2026 1:28 AM

Infant dies of suicide at Nalgonda Government General Hospital

మమత , చికిత్స పొందుతున్న చిన్నారి

నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో బాలింత బలవన్మరణం

నల్లగొండ టౌన్‌/మునుగోడు: మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టి ఆరు నెలలకే మృతిచెందాడు. ఆ తర్వాత ముగ్గురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఐదో కాన్పులో మగబిడ్డ పుట్టినప్పటికీ.. ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో బిడ్డ పుట్టిన వారం రోజులకే ప్రభు త్వాస్పత్రి ఆవరణలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చోటుచేసు కుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమా మిడి గ్రామానికి చెందిన గుండు రమేశ్‌కు 12 ఏళ్ల క్రితం మర్రి గూడ మండలం కుధాభక్షపల్లి గ్రామానికి చెందిన మమత (27) తో వివాహమైంది. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. 

ఆ దంపతులు మగబిడ్డ కోసం ఎదురుచూస్తుండగా.. మమత మరోసారి గర్భవతి అయ్యింది. ఐదో కాన్పు కోసం 8 రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేరింది. అదే రోజే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్యం దృష్ట్యా శిశు వును వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో కాని మంగళవారం రాత్రి 2 గంటల తర్వాత మమత ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆస్పత్రి ఆవరణలోని పోస్టుమార్టం గది వద్ద ఉన్న షెడ్‌లో చీరతో ఉరేసు కుని ఆత్మహత్య చేసుకుంది. 

బుధవారం తెల్లవారుజా మున మమత ఉరికి వేలాడుతుండటం గమనించిన సిబ్బంది వెంటనే ఆమె కుటుంబ సభ్యు లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మమత మృతదే హానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మంగళవారం రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూ రిటీ సిబ్బందిని తొలగించాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) వాణి ఆదేశించారు.  

మాకు అన్నం ఎవరు పెడతారు అమ్మ..
మమత మృతితో ఆమె భర్త, ముగ్గురు కుమార్తెలు శ్రీజ, అక్షర, సామిక కన్నీరుమున్నీరయ్యారు. పదేళ్లలోపున్న ఈ చిన్నారు లు తల్లి మృతదేహాన్ని చూసి ‘మాకు అన్నం ఎవరు పెడతారు అమ్మా.. మమ్మల్ని బడికి ఎవరు పంపుతారు అమ్మా..’ అంటూ రోదిస్తుండటం బంధువులు, గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement