సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో బెంగళూరులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేగా కాంతారావు.. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
రేగా కాంతారావు.. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ చానెల్ పేరుతో ప్లాట్‌కు పిలిపించి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు.. తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే, రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26న కేసు నమోదు చేశారు.


