ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్‌ సింగ్‌ | BJP leader Raja Iqbal Singh is new Delhi mayor | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్‌ సింగ్‌

Apr 26 2025 4:28 AM | Updated on Apr 26 2025 4:28 AM

BJP leader Raja Iqbal Singh is new Delhi mayor

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్‌ సింగ్‌ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్‌కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన మన్‌దీప్‌ సింగ్‌పై ఇక్బాల్‌ ఘన విజయం సాధించారు. 

ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్‌ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్‌ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్‌ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్‌ సింగ్‌ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్‌ సింగ్‌ నార్త్‌ ఎంసీడీ మేయర్‌గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్‌ లైన్స్‌ జోన్‌ చీఫ్‌గా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement