కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు | Union Minister Bandi Sanjay Sensational Comments | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 24 2026 5:37 PM | Updated on Jul 24 2026 5:53 PM

Union Minister Bandi Sanjay Sensational Comments

హైదరాబాద్‌:  నీట్‌ పేపర్‌ లీకేజ్‌ అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేస్తున్న ఉద్యమంలో అరాచక శక్తులు చేరాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ బండి సంజయ్‌ విమర్శించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులు చేశారని, ఆ దాడిలో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. 

ఈరోజు(శుక్రవారం, జూలై 24వ తేదీ) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నుంచి మాట్లాడిన బండి సంజయ్‌.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పాలనలో 18 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, కర్ణాటక, బెంగాల్‌, కేరళంలో పేపర్లు లీకైతే ఎవరూ రాజీనామా చేయలేదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో  ఎగ్జామ్‌ పేపర్లు లీక్‌ అయ్యాయని, బీఆర్‌ఎస్‌ హయాంలో పేపర్లు లీకైతే మీరు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి చేరాయన్నారు. నిరసనలు చేస్తుంది విద్యార్థులైతే.. వారి చేతుల్లో రాళ్లు, రాడ్లు ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. 

‘ ఈ ఆందోళనలో పార్లమెంట్‌పై దాడికి కుట్ర చేశారు. సంఘ విద్రోహలపైనే పోలీసులు లాఠీలు వాడారు.  విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. పాకిస్తాన్‌ నుంచి విష ప్రచారం చేస్తున్నారు. యూపీఏ హయాంలో 70 సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయి.  అన్ని రాష్ట్రాల్లో పేపర్ల లీక్‌ ఘటనలు జరిగాయి. ఆ సమయంలో వారు రాజీనామాలు చేశారా? అని బండి సంజయ్‌ నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement