బీఆర్ఎస్ నిరసనలు అప్‌డేట్స్..
ఇందిరా పార్క్ చేరుకున్న కేటీఆర్
- నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్న కేటీఆర్
- భారీగా చేరుకున్న విద్యార్థులు, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం
- నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా మౌనం పాటించిన కేటీఆర్
మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్..
- ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్
- బీజేపీ-బీఆర్ఎస్ రెండు ఒక్కటే..
- గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్స్ వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు.
- కేటీఆర్‌ని అడ్డుకొని తీరుతాము.
- అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి అడ్డుకుంటాము.
- బీజేపీ హయంలోనూ పేపర్ లీకులే జరుగుతున్నాయి.
- సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
నల్ల చొక్కాతో నిరసనల్లో కేటీఆర్..
- నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొననున్న కేటీఆర్
- ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
- ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం
పోలీసుల మోహరింపు..
- గాంధీ భవన్ బయట భారీగా మోహరించిన పోలీసులు...
- నిరుద్యోగ జేఏసీ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు..
అడ్డుకున్న పోలీసులు..
- ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరాపార్కు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలు..
- భారీగా మోహరించిన పోలీసులు
- ఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా అడ్డగిస్తున్న పోలీసులు
- పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నగరంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్ చేపట్టనున్న నిరసన దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పేపర్ లీక్‌లకు కారణం అయిన బీఆర్ఎస్ ఇప్పుడు నిరసన పేరుతో నాటకం ఆడుతుందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ హెచ్చరించారు.
- ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
- ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం
- నిరసనలో పాల్గొననున్న విద్యార్థులు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
- కాసేపట్లో ఇందిరా పార్క్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మరోవైపు ఇందిరాపార్క్ వద్ద పోలీసుల బందోబస్త్
- బీఆర్ఎస్ నిరసనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
- దీంతో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం వద్ద పోలీస్ బందోబస్త్
- బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి
పోలీసుల భారీ బందోబస్తు..
ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు భారీ గా చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు..
బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్‌లకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్..
మరికాసేపట్లో ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వెళ్లనున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ హెచ్చరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
నిరసనలకు కేటీఆర్..
మరోవైపు.. ఉదయం పది గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం
నిరసనలో పాల్గొననున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు
ఆంక్షలు ఇలా..
- కేటీఆర్ ధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతి
- 1000 మందికి మించి ధర్నా చేయరాదు
- మధ్యాహ్నం 2 గంటల లోపే ధర్నా ముగించాలి
- సచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్ళరాదు
- మైక్ సౌండ్‌లు కూడా పరిమితిలో వినియోగించాలి.


