హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్‌లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు.
ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది.


