సిరిసిల్ల: ‘నా చావుకి ప్రధాని మోదీనే కారణం’ | Telangana Rajanna Sircilla Youth Leaves Suicide Note Mentioning PM Modi, Police Investigating Cause | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల: ‘నా చావుకి ప్రధాని మోదీనే కారణం’

Jul 24 2026 9:22 AM | Updated on Jul 24 2026 10:30 AM

Young Man Ends Life in Rajanna Sircilla

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తన చావుకు ప్రధాని నరేంద్రమోదీ కారణమంటూ సూసైడ్‌నోట్‌ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కలకలం రేపింది. సర్‌(ఎస్‌ఐఆర్‌) ఫామ్‌పై సూసైడ్‌నోట్‌ రాసి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రధాని మోదీ తన చావుకు ఎందుకు కారణమో ఆ నోట్‌లో వివరించలేదు.

 రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన పిట్ల వంశీ(25) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టి యర్‌ వరకు చదువుకున్న వంశీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు అక్కడితోనే ఆపేసి పెయింటింగ్‌ పని చేసేవాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. 

మృతుడి తండ్రి పిట్ల బాలయ్య ఫిర్యాదు మేరకు తల్లి తిట్టిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. అంత్యక్రియల ఖర్చులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రూ.20వేలు పంపించారు. వంశీ కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతుగా నిలిచారు. అంత్యక్రియల సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement