నీట్ పేపర్‌ లీకేజ్‌పై మోదీ కీలక ప్రకటన | Modi Responds To The NEET Paper Leak, Announces Tough Anti Paper Leak Measures, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

నీట్ పేపర్‌ లీకేజ్‌పై మోదీ కీలక ప్రకటన

Jul 24 2026 12:19 AM | Updated on Jul 24 2026 11:43 PM

Modi responds to the NEET paper leak

సాక్షి, ఢిల్లీ: నీట్‌ లీకేజ్‌పై నిరసనలు తీవ్ర తరమవుతున్న వేళ ‍ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినేట్‌లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్‌ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ వివరాలను మోదీ స్వయంగా వెల్లడించారు.

రీఎగ్జామ్‌ తర్వాత విద్యార్థులు సంతోషంగా ఉన్నారని విద్యాసంవత్సరం వృథా కాకూడదని తిరిగి పరీక్ష నిర్వహించామని మోదీ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల హృదయాలను పేపర్‌ లీకేజ్‌లు గాయపరిచాయన్నారు. పరీక్ష విధానంలో సంస్కరణలు తెస్తామని తెలిపారు. 

ఈ మేరకు సోమవారం సభలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. అదేవిధంగా నీట్‌ పేపర్‌ లీక్ బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement