సోనమ్ వాంగ్‌ చుక్‌ నిరాహార దీక్ష విరమణ | Sonam Wangchuk Ends 26 Day Hunger Strike After Centre Assurances On NEET Paper Leak Reforms, Watch Video Inside | Sakshi
Sakshi News home page

సోనమ్ వాంగ్‌ చుక్‌ నిరాహార దీక్ష విరమణ

Jul 24 2026 1:02 AM | Updated on Jul 24 2026 10:24 AM

Sonam Wangchuk calls off his fast

సాక్షి, ఢిల్లీ: పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష విరమింపచేశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్  సమక్షంలో పండ్ల రసం తాగి దీక్షను విరమించారు.  నీట్‌ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్‌ వాంగ్‌ చుక్‌ నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. 

ఈ కార్యక్రమంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉంది.  ఈ పోరాటంలో సహకరించిన అందరికీ, నా వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి నా ధన్యవాదాలు" అని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.

కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో పేపర్‌ లీకేజ్‌లు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు సోమవారం కేబినేట్‌ భేటీలో కీలక బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు.

మరోవైపు ఆయనకు మద్దతుగా కాక్రోజ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement