సాక్షి, ఢిల్లీ: సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్‌ని నియమించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుత కార్యదర్శి వినిత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది.
అదే విధంగా ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్‌పై ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్‌ని నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టున ఏర్పాటు చేసినట్లు తెలిపింది.


