breaking news
sonam wang chuk
-
CJP సంబరాలపై వాంగ్‌చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్‌గా మారిన వేళ.. వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్‌చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్‌చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సపోర్ట్‌గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్‌చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్‌చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్‌చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్‌చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్‌చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్‌చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్‌చుక్‌ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్‌చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్‌చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్‌చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్‌చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్‌చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బ్రో ఇక చాలు సోనమ్‌కు.. సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీకేజీల నిరసనలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన మరుసటి రోజే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. వాంగ్చుక్కు తన ఇంటి నుంచి వండిన భోజనాన్ని పంపుతానని.. పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందున నిరసన తెలుపుతున్న విద్యార్థులను కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.సల్మాన్ మాటల్లో "సోనమ్, ఇంకా చాలు బ్రో. దీన్ని ఇంకా పొడిగించవద్దు. అత్యవసరమైతే ఆ పట్టుదలను మరొక దాని కోసం ఉంచుకోండి—అయినా ఇప్పుడు దానికి అవసరం లేదనే భావిస్తున్నాను. ఏదైనా తినండి. నీకు కావాలంటే మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను" అని సల్మాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.చదువు పరంగా, భద్రత పరంగా విద్యార్థులే దేశానికి మొదటి ప్రాధాన్యత అని, ప్రధాని నుంచి ఇప్పటికే హామీ లభించినందున వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ నొక్కి చెప్పారు. "విద్యాపరంగా, భద్రత పరంగా విద్యార్థులే అత్యున్నత ప్రాధాన్యత. కాబట్టి వారు భయపడాల్సిన పనిలేదు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదు. గౌరవనీయ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఈ లీకేజీకి బాధ్యులైన వారందరిపై ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి విద్యార్థులారా, దయచేసి మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లండి" అని సల్మాన్ తెలిపారు.రాజకీయ హైజాక్బాలీవుడ్ స్టార్ అంతకుముందు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడమే కాకుండా, వారి ఉద్యమాన్ని ఎవరూ 'హైజాక్' చేయకూడదని హెచ్చరించారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన విద్యార్థులు చేపట్టిన "శాంతియుత" నిరసనను ప్రశంసించడమే కాకుండా, వారిని "ధైర్యవంతులు, సాహసవంతులు" అని కొనియాడారు. "ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది. దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు. దీని శ్రేయస్సు అంతా మన దేశ విద్యార్థులకే దక్కాలి. ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది అందరికీ మంచి జరిగే పరిస్థితి. అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక" అని ఆయన అంతకుముందు రాసుకొచ్చారు.కాగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ తన నిరాహార దీక్షను విరమింపజేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ
సాక్షి, ఢిల్లీ: పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమింపచేశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో పండ్ల రసం తాగి దీక్షను విరమించారు. నీట్ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో సహకరించిన అందరికీ, నా వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి నా ధన్యవాదాలు" అని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో పేపర్ లీకేజ్‌లు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు సోమవారం కేబినేట్ భేటీలో కీలక బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు.మరోవైపు ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ముగించారు. 23 రోజులుగా దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమిస్తున్నట్లు సోమవారం(జూలై 20వ తేదీ) సాయంత్రం ప్రకటించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చల తర్వాత వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు.అంతకుముందు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేసేనాటికి 21 రోజులు పూర్తవ్వగా, ఆపై ఆయనను ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో సైతం వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. మరొకవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్రమంత్రితో చర్చల అనంతరం వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. ఒక్కటి నెరవేర్చినా..తాను ఈరోజు ఢిల్లీలో దీక్షను విరమిస్తానని ముందుగానే చెప్పారు వాంగ్‌చుక్. తన విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్ష విరమిస్తానన్నారు. నీట్-యూజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలా కాని పక్షంలో డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీలకు సమర్పించేందుకు పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. -
వాంగ్ చుక్ దీక్ష.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్యం తీవ్రవంగా క్షీణించడం, డివిజన్ బెంచ్ ఆదేశాల కారణంగానే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కోర్టు పేర్కొంది.ఈ ప్రభుత్వ చర్యను ఏకపక్షమైనదిగా ఎట్టిపరిస్థితుల్లో పేర్కొనలేమని తెలిపింది.వాంగ్‌చుక్ అంగీకరించిన రీతిలోనే ఆయనకు మందులని ఇస్తున్నారని పేర్కొంది. ఈ కేసుపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలతో పాటు పోలీసులు సైతం తమ స్పందనలను మూడు రోజుల్లోగా దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 24కు వాయిదా వేసింది.కాగా సోనమ్ భార్య గీతాంజలి, వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.దీక్ష భగ్నంకాగా సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను నిన్న (శనివారం) ఉదయం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు.మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు.‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు.పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
‘సఫ్దర్‌జంగ్’కు వాంగ్‌చుక్ భార్య హెచ్చరిక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విషయంలో, తన అనుమతి లేకుండా ఎటువంటి మందులు లేదా ద్రవ పదార్థాలను అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో ఆస్పత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, వైద్యుల సమ్మతి లేకుండా రోగికి చికిత్స అందించకూడదని ఆమె స్పష్టం చేశారు. స్వయంగా ఆస్పత్రిలో ఉంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.నీట్ పరీక్షలో అవకతవకలు, పలువురు విద్యార్థుల మరణాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమించడంతో, శనివారం పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సలహా మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీర్ఘకాలిక నిరాహార దీక్ష కారణంగా వాంగ్‌చుక్ తీవ్ర నీరసానికి గురయ్యారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. వాంగ్‌చుక్ తరలింపు సమయంలో నిరసనకారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఆయనను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్ తండ్రి పోరాటం! -
"జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా.".. వాంగ్ చుక్
సాక్షి, ఢిల్లీ: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్‌కు నిరసనగా జులై 20న పార్లమెంట్ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీట్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. దీక్ష 20 రోజుకు చేరుకున్న నేపథ్యంలో వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఆ నేపథ్యంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ "జూలై 20 వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. నేను బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల చాలా బలంగా ఉన్నాను. మీరంతా కూడా లోపల, బయట అంతే బలంగా ఉన్నారని నాకు తెలుసు. జూలై 20న మనం చేపట్టబోయే శాంతియుత పార్లమెంట్ మార్చ్‌కు ఈ శక్తే మనకు కావాలి. మేమంతా కలిసి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌కు వెళ్లి మా విజ్ఞప్తిని సమర్పిస్తాం."ఈ సమయంలో ఆయన సరదాగా మాట్లాడుతూ "నేను జూలై 20 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరు రాకపోయినా, జూలై 20 మార్చ్ విజయవంతం కాకపోయినా, నేను దెయ్యంగానైనా తిరిగి వస్తాను" అని అనడంతో అక్కడ ఉన్న మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయడంపైనే ఉండాలని కోరారు.గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ కేవలం నీటి పైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు.సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.ఢిల్లీ హైకోర్టు జోక్యంఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఈ నిరసనలను ప్రారంభించగా, జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. -
సోనమ్ వాంగ్ చుక్ కు సీరియస్.. ఆరోగ్యంపై వైద్యుల రిపోర్ట్
-
20వ రోజుకు వాంగ్‌చుక్ దీక్ష.. వైద్యుల హెచ్చరిక!
దేశ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, అలాగే లడఖ్ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. ఆయన దీక్ష నేటితో(శుక్రవారం)20వ రోజుకు చేరుకోగా.. వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ రిలీజ్ చేశారు. శరీరంలో కీలక మార్పులు మొదలయ్యాయని.. పరిస్థితి మరింత దిగజారితే అవయవాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తాజా వైద్య నివేదిక ప్రకారం.. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్‌చుక్ 9 కిలోలకు పైగా బరువు తగ్గి ప్రస్తుతం 56.9 కిలోలకు చేరుకున్నారు. దీర్ఘకాల ఉపవాసంలో శరీరం మొదట గ్లూకోజ్ నిల్వలను ఉపయోగించుకుంటుందని, ఆ తర్వాత కొవ్వు, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుందని వైద్యులు తెలిపారు. ఆయనలో కీటోన్ స్థాయి పెరగడం, యూరిక్ యాసిడ్ పెరిగిన స్థాయిలో నమోదవడం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే తదుపరి దశలో గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చుక్ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. పరీక్షల పేపర్ లీకులు, నీట్ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించడంతో.. వ్యవహారం కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించింది. వాంగ్చుక్కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ఆయన ప్రాణం విలువైనదని, అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఫోర్స్ ఫీడింగ్(బలవంతంగా ఆహారం అందించాలని) కోర్టు సూచించింది.తగ్గేదే లే అంటున్న వాంగ్చుక్తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి వాంగ్‌చుక్ భరోసా ఇచ్చారు. తనకు బాగానే ఉందంటూ ప్రకటించారు. వైద్య పరీక్షల్లో పెద్ద సమస్యలు బయటపడలేదని.. మద్దతుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా దీక్ష విరమిస్తే తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.పెరుగుతున్న మద్దతు.. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్‌కు వెళ్లి వాంగ్చుక్కు సంఘీభావం తెలిపారు. ప్రతి ఏడాది పేపర్ లీక్‌లతో యువత నష్టపోతున్నారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వినాలని కేజ్రీవాల్ కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసింది.సినీ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. జూలై 20న చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్‌లో సుమారు 1.5 లక్షల మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. -
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు సీపీఎం మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా లేకుండా పోయాయని సీపీఏం కార్యదర్శి శ్రీనివాస్ రావు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారన్నారు. ఈ రోజు (సోమవారం) పర్యావరణకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, తెలంగాణ జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నీట్ పరీక్ష తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని నీట్ పరీక్ష లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలోని యువతరమంతా ఆగ్రహంతో ఉందన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని తెలిపారు. సీజేపీ దీక్షకు సీపీఏం పూర్తి మద్దతిస్తోందని పేర్కొన్నారు. సీజేపీ ఆందోళనకు సీపీఎం పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET) సహా పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అదేవిధంగా లద్దాక్ ప్రత్యేక డిమాండ్ల వెంటనే నెరవేర్చాలని దీక్షకు దిగారు.గత 15 రోజులుగా ఆయన దీక్ష చేయడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆహరం తీసుకోకపోవడంతో ఆయన రక్తపోటు (బీపీ), బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోయాయి.మొత్తంగా ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. -
టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు. నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్‌లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్‌తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ..జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. -
సోనమ్ వాంగ్‌చుక్ విడుదల
లేహ్/జోధ్‌పూర్: లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల దరిమిలా ఆయనను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)కింద అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్న వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.శాంతి స్థాపన కోసమే ఈ నిర్ణయంలడఖ్లో శాంతి, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, ఆందోళనలను పరిష్కరించేందుకు, అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. గతంలో ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేందుకే వాంగ్చుక్ను నిర్బంధించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది.పరిశ్రమలు, పర్యాటకంపై ప్రభావంలడఖ్లో నిరంతర బంద్‌లు, నిరసనల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వాతావరణాన్ని మార్చేందుకే వాంగ్‌చుక్ విడుదలకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.‘న్యాయ పోరాటం ఫలించింది’వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో తన భర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఎప్పుడూ అహింసా మార్గాన్నే కోరుకున్నారని అన్నారు. హింస వల్ల లడఖ్‌లో తన ఐదేళ్ల ‘తపస్సు’ వృథా అవుతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో కూడా పేర్కొన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. వాంగ్‌చుక్ విడుదలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయన మద్దతుదారులకు ఆనందాన్నిచ్చింది. -
ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్ ఆగ్రహం
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్ వర్గాలు భగ్గుమన్నాయి. ‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.#WATCH | Delhi CM Atishi reached Bawana police station to meet activist Sonam WangchukShe says, "People of Ladakh want statehood. Sonam Wangchuk and the people of Ladakh, who were going to visit Bapu's Samadhi, were arrested. They did not let me meet Sonam Wangchuk. This is the… pic.twitter.com/j5rmK3KCBa— ANI (@ANI) October 1, 2024 సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్ వాంగత్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.ఇక.. ఇప్పటికే సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు -
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరాహార దీక్ష ముగింపుతో తన పోరాటం ఆగిపోదని సోనమ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మార్చి 6 తేదీనా ఈ దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నిరాహార దీక్ష విరమించే కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు. నేను మళ్లీ పోరాటం చేస్తా. నా పోరాటంలో ఈ నిరాహార దీక్ష కేవలం మొదటి అడుగు మాత్రమే. మహాత్మా గాంధీ చేపట్టిన నిరాహారదీక్షల్లో 21 రోజుల దీక్షే ప్రధానమైంది. ఈ రోజు చాలా ముఖ్యమైంది. కేవలం తొలి దశ నిరాహార దీక్ష మాత్రమే నేటి( మంగళవారం)తో ముగిసింది. కానీ పోరాటం ముగిసిపోలేదు. మహిళలు 10 రోజు పాటు మరో నిరాహార దీక్ష చేపట్టనున్నాను. యువత, బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొంటారు. ఇలా నేను, నా తర్వాత మహిళలు నిరాహార దీక్ష చేపడతారు. ఇలా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. నా నిరాహార దీక్షలో ఒకే రోజు సుమారు 6వేల మంది పాల్గొన్నారు’ అని సోనమ్ వాంగ్‌చుక్ ఎక్స్ వేదికగా తెలిపారు. END 21st Day OF MY #CLIMATEFAST I'll be back... 7000 people gathered today. It was the end of the 1st leg of my fast. Btw 21 days was the longest fast Gandhi ji kept. From tomorrow women's groups of Ladakh will take it forward with a 10 Days fast, then the youth, then the… pic.twitter.com/pozNiuPvyS — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 అంతకు ముందు ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతి రాజనీతిజ్ఞులు కావాలని నేను ఆశిస్తున్నా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు మా డిమాండ్లను నెరవేర్చి వారు కూడా రాజనీతిజ్ఞులమని రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నా’అని సోనమ్ వాంగ్‌చుక్ ‘ఎక్స్’లో పోస్ట్చేసిన వీడియోలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఆగస్ట్ 2019 జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్, లడాక్ కేంద్రగా ప్రాంతపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. లేహ్, కార్గిల్ జిల్లాలతో లాడక్.. కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించి ఉంది. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర... వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్ రాజ్ బర్త్‌డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
తల్లి నేర్పిన ఓనమాలే ‘శాపం’ గా మారాయి..
ఒక పోటీలో వందకు పది మంది ఓడితే.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే వందలో 70 మంది విఫలమైతే.. మొత్తం వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. ఆ వైఫల్యాన్ని గుర్తించి తన అనుభవంతో మార్పు తేవడానికి ప్రయత్నించాడు సోనమ్ వాంగ్‌చుక్. సంప్రదాయేతర సిలబస్‌ను రూపొందించి ‘ఆసాన్ భాషామే’(సులభమైన భాషలో) పిల్లలకు పాఠాలు బోధించడం, మంచు నీటి ప్రవాహాలను గడ్డ కట్టించి.. వర్షాభావ పరిస్థితులప్పుడు వాడుకోవడం, సోలార్ ఆర్మీ టెంట్లు.. ఇలా ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంజినీర్‌గా, ఆవిష్కరణకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్‌చుక్.. తన జీవితం కంటే ఆవిష్కరణలు, వాటి వెనుక ఆలోచనలే పిల్లలకు పాఠంగా ఉండటాన్ని ఇష్టపడతానని చెప్తుంటాడు. సోనమ్ వాంగ్‌చుక్ పుట్టినరోజు ఇవాళ. 1966 సెప్టెంబర్ 1న లడఖ్‌లోని లే జిల్లా ఉలెటోక్పో లో వాంగ్‌చుక్ జన్మించాడు. ఇంజినీర్ కమ్ సైంటిస్ట్ అయిన సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తి నుంచే త్రీ ఇడియట్స్ సినిమా తెరకెక్కిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో అమీర్ క్యారెక్టర్ పున్షుక్ వాంగ్డూ(రాంచో) చూపించే ప్లాన్లన్నీ వాంగ్‌చుక్ నిజజీవితంలో అమలు చేసినవే. తల్లి నేర్పిన పాఠాలే.. వాంగ్‌చుక్ పుట్టిన ఊళ్లో బడి లేదు. దీంతో 9 ఏళ్ల వయసుదాకా ఆయన బడి ముఖం చూడలేదు. ఆ వయసులో గృహిణి అయిన తల్లి నేర్పిన ఓనమాలే ఆయనకు దిక్కయ్యాయి. వాంగ్ చుక్ తండ్రి రాజకీయ వేత్త(మాజీ మంత్రి కూడా). అందుకే ఎలాగోలా శ్రీనగర్‌లోని ఓ స్కూల్లో కొడుక్కి అడ్మిషన్ తెచ్చాడు. అయితే వాంగ్చుక్కు తల్లి నేర్పిన భాషంతా స్థానిక భాషలో ఉండడంతో.. స్కూల్లో బాగా ఇబ్బందిపడేవాడు. టీచర్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉంటే.. ‘సుద్దమొద్దు’ అనే ముద్ర పడింది. తన తల్లి నేర్పిన ఆ ఓనమాలే తన పాలిట శాపం అయ్యాయని, అలా జరిగి ఉండకపోతే తన జీవితం కుటుంబానికి దూరం అయ్యేది కాదని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడాయన. అంతేకాదు శ్రీనగర్ బడిలో నడిపిన రోజుల్ని.. చీకటి రోజులుగా అభివర్ణించుకుంటాడు. టీచర్లు, తోటి విద్యార్థులు చూసే అవమానమైన చూపులకు, కామెంట్లకు భరించలేక ఒకదశకొచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు. పాకెట్‌మనీ లేకున్నా.. ఒంటరిగా ఢిల్లీకి చేరిన వాంగ్‌చుక్.. విశేష్కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తన స్కూల్ చదువులు పూర్తయ్యేదాకా ఆచూకీ పేరెంట్స్‌కు చెప్పొద్దంటూ బతిమాలుకున్నాడు వాంగ్‌చుక్. అది అర్థం చేసుకుని, మాటిచ్చి వాంగ్చుక్కు తమ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాడు ఆ ప్రిన్స్‌పాల్. చదువులో రాటుదేలాక విషయాన్ని పేరెంట్స్‌కి తెలియజేసి.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆపై శ్రీనగర్ ఎన్ఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి మరోసారి కుటుంబానికి దూరం అయ్యాడు. వాంగ్‌చుక్ ఆర్థిక నిపుణుడు కావాలన్నది ఆ తండ్రి కోరిక. అది నెరవేరకపోవడంతో కొడుకును అసహ్యించుకుని తిరిగి దగ్గరకు తీసుకోలేదు. పేరెంట్స్‌కు దూరమైన వాంగ్‌చుక్.. తన స్కాలర్‌షిప్‌తోనే హాస్టల్ చదువులు కొనసాగించాడు. ఆపై ఓ ప్రొఫెసర్ సాయంతో ఫ్రాన్స్‌లో ఎర్తెన్ ఆర్చిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన జీవితం.. లడఖ్ పరిస్థితుల కారణంగా కొత్త మలుపు తిరిగింది. కామన్సెన్స్ ఉపయోగించి ప్రజల అవసరాలను తీర్చే ఆవిష్కరణలకు బీజం పడింది ఇక్కడి నుంచే.. ►లడఖ్‌లో అడుగుపెట్టేనాటికి.. అక్కడి విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 5 శాతంగా తేలింది. దీంతో విద్యా సంస్కరణలకు బీజం వేశాడు. నిపుణులైన గ్రామస్తులకు-తల్లిదండ్రులకు శిక్షణ ఇప్పించాడు. వాళ్ల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పించాడు. అలా ఐదు శాతం నుంచి 75 శాతానికి పాస్ పర్సంటేజ్‌ను మూడేళ్లలోనే సాధించి చూపించాడాయన. ► స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్‌ను కొందరు విద్యార్థులతో 1988లో స్థాపించాడు. పూర్తి సోలార్ ఎనర్జీతో నడిచే విద్యాలయం ఇది. ► స్వచ్ఛమైన నీటిని గ్రామ ప్రజలకు అందించేందుకు ప్రవాహాలను దారి మళ్లించే ప్లాన్లు అమలు చేశాడాయన. ఐస్ స్థూపాలను కోన్ ఆకారంలో నెలకొల్పి కృత్రిమ హిమానీనదాలతో నీటి కరువును తీర్చే ప్రయత్నం చేశాడు. 2013లో ‘ఐస్ స్తూప’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ► సోషల్ ఇంజినీర్‌గా ఎన్నో విచిత్రమైన ఆవిష్కరణలు చేశాడు వాంగ్‌చుక్. సోలార్ ప్రాజెక్టులతో లడఖ్ గ్రామీణ ముఖచిత్రం మార్చేశాడు. ఆ ఆవిష్కరణలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు కూడా. ► ప్రభుత్వ, కార్పొరేట్ వైఫల్య చదువుల్ని ఏలియన్ చదవులుగా వర్ణిస్తాడాయన. సంప్రదాయేతర బడి.. విద్యా సంస్కరణలకు బీజం వేయడంతో పాటు కొన్నాళ్లపాటు ప్రభుత్వ ఎడ్యుకేషన్ అడ్వైజరీగా వ్యవహరించాడు కూడా. ► నానో కారు వైఫల్యానికి కారణాల్లో ఒకటి.. పేదల కారుగా ప్రచారం చేయడమే అంటాడు సోనమ్ వాంగ్‌చుక్. పేదవాళ్లే ఆ కారును కొంటారనే ‘సొసైటీ యాక్సెప్టెన్సీ’ వల్ల దానిని జనాలు తిప్పికొట్టారని చెప్పాడు. ► రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాంగ్‌చుక్.. వ్యవస్థ లోపాల వల్లే మంచి విద్య అందట్లేదని అభిప్రాయపడుతుంటాడు. ప్రజల ప్రాధాన్యం మారినప్పుడే.. ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుందని చెప్తాడాయన. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు. -
వైరల్ : కార్‌ను ఇలా కూడా వాడొచ్చా..?!
ఆమిర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్, రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతి. విద్యావ్యవస్థలోని లోపాలను, ఇంజనీరింగ్ పట్ల మనకున్న వ్యామోహాన్ని తప్పు పడుతూ.. చదువుకు అసలైన నిర్వచనం చెప్పింది ఈ సినిమా. ఈ సినిమాలో ఆమిర్ నటించిన ‘పున్సుక్ వాంగ్డు’ పాత్రకు ప్రేరణనిచ్చిని వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. లడఖ్‌కు చెందిన వాంగ్‌చుక్.. ‘ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆప్ లడఖ్’ అనే సంస్థను స్థాపించి జీవితాలకు పనికి వచ్చే విద్యను నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాంగ్‌చుక్ చేసిన ఓ ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్‌ను రీసైకిల్ చేసి ఇంటి కప్పుగా మార్చిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. వాంగ్‌చుక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫోటో మహీంద్ర గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రను తెగ ఆకర్షించింది. దాంతో ఆయన వాంగ్చుక్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘ఓ స్నేహితుడు పంపించిన ఈ ఫోటో ద్వారా వాంగ్‌చుక్ సృజనాత్మకత నాకు తెలిసింది. మహీంద్ర కారును ఇంటి పై కప్పుగా మార్చిన మీ ఆలోచన నిజంగా సూపర్బ్. మీ ఇన్స్టిట్యూట్లో పనికిరానిదంటూ దేన్ని వదిలేయరు కదా. ఇది మా ఆటో షెడ్డింగ్ వెంచర్‌తో పోటీ పడుతోంది. కానీ మీ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందం’టూ అభినందిస్తూ ట్వీట్ చేశారు. A friend sent these pics from Sonam Wangchuk’s Himalayan Institute of Alternatives,Ladakh.Recycling a Mahindra car into a home roof.A way of life at the Institute, where nothing gets discarded.Well this will compete with our auto-shredding venture but it’s far more creative! pic.twitter.com/p7UwgOvtxD — anand mahindra (@anandmahindra) December 14, 2018 వాంగ్‌చుక్ ఈ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘ఆనంద్ మహీంద్ర మీరు మంచి స్టోరిని షేర్ చేశారు. 1997 - 2007 వరకూ ఈ కార్ మా దగ్గర చాలా విశ్వసనీయంగా పని చేసింది. ఎడ్యూకేషనల్ క్యాంపెయిన్ నిర్వహించడంలో ఈ కార్ మాకెంతో ఉపయోగపడింది. ఫలితంగా కేవలం 5 శాతంగా ఉన్నా మెట్రిక్యులేషన్ ఫలితాలు ఇప్పుడు 75 శాతానికి పెరిగాయి’ అంటూ రీట్వీట్ చేశారు. Dear Mr @anandmahindra the Jeep you tweeted has a lovely story. It was instrumental in educational campaigns in the remotest frontiers of Ladakh... which finally took the matriculation results from 5% to 75%. It served us faithfully between 1997 to 2007 before taking new avatara. pic.twitter.com/N9ejsphOjQ — Sonam Wangchuk (@Wangchuk66) December 17, 2018 దీనికి బదులిస్తూ ఆనంద్ మహీంద్ర ‘సోనమ్ మీరు చెప్పింది వాస్తవం. మీ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఒక వేళ మీ క్యాంపెయిన్ ఇంకా వేటినైనా పూర్తి చేయలేదని భావిస్తే.. అందుకు నేను ఎలాంటి సాయం చేయగలనో తెలపండి’ అంటూ రీట్వీట్ చేశారు. వాంగ్‌చుక్, ఆనంద్ మహీంద్రల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు వీరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Sonam you’re absolutely right—that IS a lovely story. How do I find out more about the educational campaign you referred to? And how we can support the campaign if the job is unfinished? @Wangchuk66 @manoj_naandi https://t.co/JgidIlv5qU — anand mahindra (@anandmahindra) December 19, 2018 -
కరిగిన నీటితో కొండలు
చుట్టూ గడ్డి మొక్క కూడా లేదుగానీ... మధ్యలో భారీ మంచు పర్వతమా? ఎలాగబ్బా? ఫొటోలు చూడగానే చాలామందికి వచ్చే డౌట్లు ఇవే. ఎలా అన్న విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ఐస్స్తూపాలుగా పిలుస్తున్న ఈ మంచు పర్వతాల గురించి ముందు తెలుసుకుందాం. మనదేశానికి ఉత్తరాన మంచుకొండల కింద లడాఖ్ అనే ప్రాంతముందికదా... అక్కడిదీ ఈ మంచుస్తూపం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి ప్రాంతంగా దీనికి పేరుంది. అయితే నిన్నమొన్నటి వరకూ పక్కనున్న మంచుకొండల్లోని హిమనదాలు (గ్లేషియర్స్) కరిగి లడాఖ్ ప్రాంతంలో ఉండేవారికి కొద్దోగొప్పో నీళ్లు అందించేవి. వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మరీ కనాకష్టంగా మారిపోయింది. ఈ చిక్కులకు చెక్‌పెట్టేందుకు సోనమ్ వాంగ్‌ఛుక్ అనే ఇంజనీరుకు తట్టిన ఐడియా వాస్తవ రూపమే ఈ మంచుస్తూపాలు. కరిగిపోతున్న హిమనదాల నీరు పల్లానికి వస్తుంది కదా.. అక్కడ కొన్ని పైపులను నిలువుగా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పైకి ఎగజిమ్మే నీరు... పరిసరాల్లో ఉండే మైనస్ 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ప్రభావంతో గడ్డకట్టిపోతుంది. చలి తగ్గి... ఎండలు పెరిగే వరకు ఇలాగే అక్కడే ఉండిపోయే నీరు ఆ తరువాత ప్రజల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది. సోనమ్ వాంగ్‌ఛుక్ ఇప్పటికే ఇలాంటి మంచుస్తూపాలు కొన్నింటిని ఏర్పాటు చేయడమే కాకుండా... వాటి ఆధారంగా కొన్ని వేల మొక్కలను పెంచుతున్నారు కూడా. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని కొద్దిమేరకైనా పంటలు పండించుకునేందుకు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ఇవి సాయపడతాయని, భవిష్యత్తులో కనీసం 50 వరకూ భారీ మంచుస్తూపాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు సోనమ్. ఇంకో విషయం...ఈ సోనమ్ వాంగ్‌ఛుక్ స్ఫూర్తితోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో రంఛోడ్దాస్ శ్యామల్‌దాస్ ఛాంఛడ్ ఉరఫ్ రాంచో పాత్ర రూపుదిద్దుకుంది.


