సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా లేకుండా పోయాయని సీపీఏం కార్యదర్శి శ్రీనివాస్ రావు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారన్నారు. ఈ రోజు (సోమవారం) పర్యావరణకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, తెలంగాణ జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నీట్ పరీక్ష తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని నీట్ పరీక్ష లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలోని యువతరమంతా ఆగ్రహంతో ఉందన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని తెలిపారు. సీజేపీ దీక్షకు సీపీఏం పూర్తి మద్దతిస్తోందని పేర్కొన్నారు. సీజేపీ ఆందోళనకు సీపీఎం పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET) సహా పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అదేవిధంగా లద్దాక్ ప్రత్యేక డిమాండ్ల వెంటనే నెరవేర్చాలని దీక్షకు దిగారు.
గత 15 రోజులుగా ఆయన దీక్ష చేయడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆహరం తీసుకోకపోవడంతో ఆయన రక్తపోటు (బీపీ), బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోయాయి.మొత్తంగా ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.


