ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతుండగనే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం కీలక పదవికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం ఎక్స్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది.
ఈ ప్రకటన ప్రకారం మూడేళ్ల పదికాలానికిగాను ఆలయ ట్రస్ట్ సీఈఓ పదవికి అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందుకు జూలై 18 చివరి తేదీ అని పేర్కొంది. ఈ పదవి కాలపరిమితి మూడు సంవత్సరాలు. 50 - 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీత భత్యాలు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించబడతాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు : దుమారం
श्री राम जन्मभूमि तीर्थक्षेत्र (न्यास) श्री राम जन्मभूमि मंदिर के मुख्य कार्यकारी अधिकारी पद के लिए योग्य जनों से आवेदन आमंत्रित करता है
आवेदन की अंतिम तिथि: शनिवार १८ जुलाई २०२६; सायं ४ बजे
Shri Ram Janmabhoomi Teerth Kshetra (Trust) invites applications from eligible… pic.twitter.com/PHa0MbT5kY— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 13, 2026
సీఈఓ బాధ్యతలు
ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి లేదా సీఈఓ నేరుగా ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. సంస్థ అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తూ, దాని చట్టబద్ధమైన, పరిపాలనా, ఆర్థిక విధులను పర్యవేక్షిస్తారు. సంస్థ లక్ష్యాలు స్థాయికి తగిన కార్యాచరణ వ్యవస్థలు, విధానాలు, పద్ధతులను అభివృద్ధి చేయాలి. ట్రస్ట్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో సహా, ట్రస్ట్ మొత్తం నిర్వహణకు సీఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్ వ్యవస్థలు, సంస్థాగత సమాచారంలో పారదర్శకత, జవాబు దారీతనం, సామర్థ్యాన్ని ప్రోత్సహించే బాధ్యత సీఈఓకు ఉంటుంది.
ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
ఈ బాధ్యతలతోపాటు అవసరమైనప్పుడు స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సంస్థ భద్రతా వ్యవస్థను కూడా సీఈఓ పర్యవేక్షిస్తారు. అన్ని మతపర ఆచారాలు, పూజలు, పండుగలు, వేడుకలను సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూసే బాధ్యత ఈ పదవిపై ఉంటుంది. అలాగే ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా నిర్ధారించడం మరో ముఖ్య బాధ్యతల్లో ఒకటి. ఇంకా సంస్థను సందర్శించే విశిష్ట అతిథులు, ప్రముఖ సాధువుల కోసం ఏర్పాట్లు చూడాలి. ట్రస్ట్, ఆలయం రెండింటి ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. ట్రస్ట్ డీడ్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సీఈఓ ప్రణాళికలను రూపొందించి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, జనరల్ సెక్రటరీ మార్గదర్శకత్వంలో నిర్వర్తించాలి. ట్రస్ట్ లేదా ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు అప్పగించే అదనపు బాధ్యతలను కూడా సీఈవో నిర్వహించాలి.
ఇదీ చదవండి: ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, ఫేస్ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు


