ట్రంప్‌, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్‌? ఇరాన్‌ రివెంజ్‌ లిస్ట్‌ కలకలం! | Iranian newspaper revenge list Trump Netanyahu, Meloni among 13 leaders | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్‌? ఇరాన్‌ రివెంజ్‌ లిస్ట్‌ కలకలం!

Jul 13 2026 11:44 AM | Updated on Jul 13 2026 12:34 PM

Iranian newspaper revenge list Trump Netanyahu, Meloni among 13 leaders

టెహ్రాన్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన 'హమ్‌షాహ్రీ' (Hamshahri) పత్రిక వివాదాస్పద ప్రచురణలో 13 మంది కీలక నేతలతో కూడిన రివెంజ్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పలువురు యూరోపియన్ నాయకులతో సహా 13 మంది విదేశీ నేతలతో కూడిన ప్రతీకార జాబితాను ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు 'ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ'.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రాఫిక్ వెలుగులోకి రావడం గమనార్హం. తన తండ్రి మరణానికి ప్రతీకారం  తప్పదని, ఇందుకు బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మొజ్తాబా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని కచ్చితంగా నెర వేరుస్తానని  కూడా అన్నారు.

శాంతియుత మరణం ఉండదు - మోజ్తబా ఖమేనీ
ఈ వారం ప్రారంభంలో జరిగిన తన తండ్రి అంత్యక్రియల తర్వాత మోజ్తబా ఖమేనీ శనివారం తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ, ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ప్రతీకారం తమ దేశ సంకల్పం, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నేరస్థులకు కంటిమీద కునుకు ఉండదు. వారికి ప్రశాంత మరణం ఉండదని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సుప్రీం లీడర్ పేర్కొన్నప్పటికీ, ఆయన ఎవరి పేర్లను ప్రత్యక్షంగా వెల్లడించలేదు. అలాగే, హమ్‌షాహ్రీ పత్రిక ప్రచురించిన ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్‌, తలలు పగిలాయ్‌!

ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ ఇన్‌ఫోగ్రాఫిక్‌లో మోజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు 13 మంది విదేశీ నాయకుల ఫోటోలను ప్రదర్శించారు. వారిలో ముఖ్యులు:

డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)

బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)

కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని)

మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)

పీట్ హెగ్‌సెత్ (అమెరికా రక్షణ మంత్రి)

ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)

జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని)

ఫ్రీడ్రిచ్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)

ఈ గ్రాఫిక్ ఆన్‌లైన్‌లో మాత్రమే పబ్లిష్ అయింది. ఆదివారం నాటి ప్రింట్ ఎడిషన్‌లో దీనిని ప్రచురించలేదు.

ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement