ఆ ప్రాంతం పేరు వింటే ఇప్పటకీ భయమే..! నేటికీ అది మిస్టరీనే.. | Interesting Facts: What Really Happens Inside the Bermuda Triangle | Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతం పేరు వింటే ఇప్పటకీ భయమే..! నేటికీ అది మిస్టరీనే..

Jul 12 2026 5:13 PM | Updated on Jul 12 2026 5:25 PM

Interesting Facts: What Really Happens Inside the Bermuda Triangle

మనిషి ఎంత అన్వేషించినా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రపంచంలోని కొన్ని వింత ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని నేటికీ అంతు చిక్కని మిస్టరీలానే మిగిలిపోయాయి. ఆఖరికి సైన్సుకి, టెక్నాలజీ సైతం ఆ ప్రాంతాల వద్దకు వచ్చేటప్పటికీ చతికిలపడ్డాయని చెప్పొచ్చు. అందుకు ప్రధాన కారణం ఇక్కడ జరిగిన ఎన్నో విచిత్రమైన సంఘటనలే. ఈ ప్రాంతంలో ప్రవేశించిన కొన్ని షిప్స్ విమానాలు అకస్మాతుగా తమ కమ్యూనికేషన్ కోల్పోయి అదృశ్యమయ్యాయి. ఎందువల్ల ఇలా జరుగుతుందని అప్పటికప్పుడూ రెస్కూ చర్యలు చేపట్టేందుకు పంపిన మరో ఓడ సైతం తనలోకి లాగేసుకుంది. 

చివరికి వాటి శకలాలు అదృశ్యమైన ప్రదేశంలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. అయితే ఇందులో ప్రయాణించిన మనుషుల జాడ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేగాదు ఈ ప్రాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు సముద్ర గర్భంలో ఒక భారి వర్టెక్స్(సుడిగాలి) ఉందని, మరికొందరు అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని..ఇలా ఏవేవో కథనాలు కల్పించేస్తుంటారు. 

ఆ ప్రాంతమే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా ప్యూటోరికో బెర్మిడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజ ఆకార ప్రాంతమైన బర్మిడా ట్రయాంగల్‌. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?. ఎందుకు ఆ ప్రాంతానికి 5 లక్షల చెదరపు మైళ్ల పరిధిలో వందల సంఖ్యలో నౌకలు, విమానాలు ఆనవాలు లేకుండా మాయమైపోయాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు?. నిజంగానే ఇది సైన్స్ ఇంకా పూర్తిగా చేదించలేని ఒక మిస్టరీనా లేక మానవ మేదస్సుకు అందని రహస్యమా తదితర విశేషాల గురించి ఈ కింది వీడియోపై క్లిక్‌ చేయండి. 

(చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్‌ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)

 


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement