అయోధ్య విరాళాల గోల్‌మాల్‌: ఆరెస్సెస్ నమ్మకం ఇదే.. | RSS Expresses Concern Over Ram Mandir Donation Scam Investigation | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల గోల్‌మాల్‌: ఆరెస్సెస్ నమ్మకం ఇదే..

Jul 13 2026 8:46 AM | Updated on Jul 13 2026 9:24 AM

RSS Expresses Concern Over Ram Mandir Donation Scam Investigation

బెలగావి: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల లెక్కింపులో జరిగినట్లు చెప్తున్న అవకతవకలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఆరెస్సెస్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ మూడు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భాగవత్, సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే సహా పలువురు సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
 

రామమందిరంలో నగదు రూపంలో వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు పక్కదారి పట్టాయంటూ గత జూన్ 7న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ ప్రాథమిక విచారణ అనంతరం జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధమున్న ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ప్రారంభమైన ఈ విచారణపై తమకు నమ్మకముందని, నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. కోట్లాది మంది రామభక్తుల విశ్వాసాలను, సెంటిమెంట్లను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆలయ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ట్రస్ట్‌ను కోరింది.

 

ఇది కూడా చదవండి: అజ్ఞాతం వీడనున్న మొజ్తబా ఖమేనీ.. త్వరలో తొలి బహిరంగ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement