breaking news
Expressed
-
నౌకలపై దాడులు.. ఐరాసలో భారత్ ఆగ్రహం
న్యూయార్క్: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో సముద్ర నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నిరంతర నౌకాయానం, వాణిజ్యాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాను భారత్‌కు అత్యంత కీలకమైన ప్రాంతంగా అభివర్ణించారు. ఇటీవల కొంతకాలం దాడులు ఆగిపోయిన తర్వాత మళ్లీ ప్రారంభం కావడం ఆందోళనకరమని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ గట్టిగా కోరుతోందని ఆయన స్పష్టం చేశారు.ఐరాస భద్రతా మండలిలో మంగళవారం జరిగిన చర్చలో హరీశ్ మాట్లాడుతూ, ఈ నెలలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంఎం మొంబాసా సహా పలు నౌకలపై జరిగిన దాడులను ఖండించారు. ఈ దాడుల్లో పలువురు భారతీయులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు అదృశ్యమయ్యారు. నావికులను టార్గెట్ చేయడం, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి ఆటంకం కలిగించడాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రాంతీయ శాంతి, భద్రతల కోసం చర్చలు దౌత్య మార్గాల్లో జరగాలని భారత్ వాదించింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జూలై 11న ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. కాగా ఈ ప్రాంతంలో భారత్‌కు భారీగా వాణిజ్య, ఇంధన ప్రయోజనాలు ఉన్నాయని, దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారని, వారి భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యమని హరీశ్ ఉద్ఘాటించారు. కేవలం హోర్ముజ్ మీదే కాకుండా గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభాన్ని కూడా విస్మరించకూడదని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన! -
అయోధ్య విరాళాల గోల్మాల్: ఆరెస్సెస్ నమ్మకం ఇదే..
బెలగావి: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల లెక్కింపులో జరిగినట్లు చెప్తున్న అవకతవకలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఆరెస్సెస్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ మూడు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే సహా పలువురు సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. Bengaluru, Karnataka: On the RSS meeting in Belagavi, KPCC President B.K. Hariprasad says, "The Belagavi meeting is an attempt to rebuild the RSS's image after it suffered a major setback. They have lost credibility, and after the looting of Ayodhya, they are trying to project a… pic.twitter.com/lreWnMivYK— IANS (@ians_india) July 12, 2026రామమందిరంలో నగదు రూపంలో వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు పక్కదారి పట్టాయంటూ గత జూన్ 7న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ ప్రాథమిక విచారణ అనంతరం జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధమున్న ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ప్రారంభమైన ఈ విచారణపై తమకు నమ్మకముందని, నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. కోట్లాది మంది రామభక్తుల విశ్వాసాలను, సెంటిమెంట్లను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆలయ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ట్రస్ట్‌ను కోరింది. Ayodhya, Uttar Pradesh: On writing a letter to Prime Minister Narendra Modi regarding the Ram Temple matter, Paramhans Acharya, Peethadheeshwar of Tapasvi Chhavani says, "...On behalf of all religious leaders, followers of Sanatan Dharma, and saints, we have sent a letter to the… pic.twitter.com/UJRngd0SzK— IANS (@ians_india) July 12, 2026ఇది కూడా చదవండి: అజ్ఞాతం వీడనున్న మొజ్తబా ఖమేనీ.. త్వరలో తొలి బహిరంగ సభ -
లోక్‌సభ వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ ఉభయ సభలు తీవ్ర వాదోపవాదాలతో అట్టుడికాయి. లోక్‌సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం నాటి ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యంగా లడఖ్ సరిహద్దు అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది.రాజ్యసభలో ఖర్గే వర్సెస్ రిజిజురాజ్యసభలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, లోక్‌సభలో రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. సభ ఎవరి ఇష్టానుసారమో నడవదని, నిబంధనల ప్రకారమే సాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి స్పీకర్ 40 నిమిషాల సమయం ఇచ్చారని, అయినప్పటికీ ఆయన నిబంధనలు అతిక్రమించి మాట్లాడారని రిజిజు ఎదురుదాడి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ స్పీకర్ ఆదేశాలను గౌరవించకుండా ప్రసంగాన్ని కొనసాగించారని, ఇది సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తాను దేశానికి తెలియని అనేక రహస్య పత్రాలను, పుస్తకాలను సభ ముందు ఉంచుతున్నానని దూబే తెలిపారు.జెపి నడ్డా మాట్లాడుతూ ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు సభను సాగనీయడం లేదని మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ సైతం ఖర్గే చేసిన ‘లించింగ్’ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాత ఘటనలను గుర్తుచేశారు. సభలో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలోనే మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ‘ఇండియా’ కూటమి నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు లోక్‌సభలో ప్రధాని ప్రసంగానికి ఆటంకం కలగడంతో, ఆయన నేడు సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్‌కు చేరుకుని కీలక నేతలతో చర్చలు జరిపారు. సభలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. -
మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించటంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి.. బస్సు ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి క్షతగాత్రులు కోలుకోవాలి.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా. ఇంతమంది ప్రాణనష్టం బాధాకరంగా ఉంది. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి చాలా బాధాకరం.. ఈ క్లిష్ట సమయంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మరణించిన వారి ప్రతి కుటుంబానికి పీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రమాదం దిగ్భ్రాంతికరం.. మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – కే.చంద్రశేఖర్‌రావు, బీఆర్ఎస్ అధినేత ఘటన కలచివేసింది..తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాధిత కుటుంబాలకు సానుభూతి.. ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలి. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి అండగా ఉంటాం.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు వెంటనే స్పందించి ఇచి్చన ఆదేశాలతో యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బాధితులను ఆదుకోవాలి చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – కే.తారకరామారావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మంత్రులు, ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: ఈ ఘటన దురదృష్టకరమని, సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాల కోసం దేవుని ప్రార్థిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాధితులకు అండగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు.కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇలాంటి దుర్ఘటనల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చేవెళ్లలోని పీఎంఆర్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.మీర్జాగూడ రోడ్డు ప్రమాదం తెలుసుకుని తీవ్ర ది్రగ్బాంతికి గురైనట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టిప్పర్లపై కవర్ కప్పేలా చర్యలు తీసుకోవాలని, అదే జరిగి ఉంటే చేవెళ్ల వద్ద ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదని బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.అంజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తల్లి బర్త్ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన ముద్దుగుమ్మ (ఫోటోలు)
-
ఏపీ హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన


