హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీజీ20 లీగ్ తొలి సీజన్ (2026) టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ టోర్నీ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సినీ తారల సందడి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శనలతో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఫైనల్ మ్యాచ్ సమయంలో ఫ్లడ్ లైట్లు దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోవడంతో ఆట కాసేపు ఆగిపోయింది.


