breaking news
TG20 League
-
టీజీ20 లీగ్ మెమొరీస్ షేర్ చేసిన యాంకర్ (ఫొటోలు)
-
ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్... విజేతగా హైదరాబాద్ (ఫొటోలు)
-
టీజీ20 లీగ్ విజేతగా హైదరాబాద్
టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యానఇన 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. రాణించిన జైస్వాల్మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్ రాజ్ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం 1 (నాటౌట్) పరుగు చేశారు.స్టార్ బ్యాటర్ మిలింద్ సహా హర్షిత్ రాజ్ డకౌట్లయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు.విజయతీరాలకు చేర్చిన వైష్ణవ్158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఆదిలోనే వికాస్ రెడ్డి (4) వికెట్ కోల్పోయినప్పటికీ.. అభిరథ్ రెడ్డి (48), అశ్విన్ (36) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు కూడా ఔటయ్యాక వైష్ణవ్ రెడ్డి (41 నాటౌట్) గెలుపు బాధ్యతలను భుజాలకేసుకొని హైదరాబాద్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి ప్రణవ్ (19 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరి, ఛాంపియన్‌గా అవతరించింది. -
TG20 Final: రాణించిన జైస్వాల్.. ఖమ్మం నామమాత్రపు స్కోర్
ఇవాళ (జులై 12) జరుగుతున్న టీజీ20 లీగ్-2026 ఫైనల్లో ఖమ్మం ఏసెస్-హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.హైదరాబాద్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్ రాజ్ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం 1 (నాటౌట్) పరుగు చేశారు. స్టార్ బ్యాటర్ మిలింద్ సహా హర్షిత్ రాజ్ డకౌట్లయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు.తుది జట్లు..హైదరాబాద్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గుడుగు గణేశ్, ప్రణవ్ వర్మ, అజయ్ దేవ్‌గౌడ్, అరవింద్, షణ్ముఖ్ అశ్విన్, అఖిల్ రాథోడ్, దేవ్ మెహతాఖమ్మం: మిలింద్ (కెప్టెన్), సహేంద్ర మల్లు, హర్షిత్, వేద్ రెడ్డి, షేక్ అజహర్, విద్యానంద రెడ్డి, జీఎస్కే రెడ్డి, హిమతేజ, పరాస్ రాజ్, ప్రతీక్ రెడ్డి, మికిల్ జైస్వాల్ -
ఖమ్మంపై గెలుపు.. హైదరాబాద్‌దే టైటిల్
టీజీ20 లీగ్ విజేతగా హైదరాబాద్టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్7.4వ ఓవర్- 69 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. విద్యానంద్ రెడ్డి బౌలింగ్‌లో అశ్విన్ (36) ఔటయ్యాడు.ధాటిగా ఆడుతున్న అభిరథ్158 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు రెండో ఓవర్లోనే వికాస్ (4) వికెట్ కోల్పోయినప్పటికీ.. ధాటిగా ఆడుతుంది. మరో ఓపెనర్ అభిరథ్ రెడ్డి (23) బ్యాట్ ఝులిపిస్తున్నాడు. అతడికి అశ్విన్ (16) కూడా సహకరిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత హైదారాబద్ స్కోర్ 44-1గా ఉంది. హైదరాబాద్ ముందు నామమాత్రపు టార్గెట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం హైదరాబాద్ ముందు 158 పరుగుల నామమాత్రపు టార్గెట్ ఉంచింది. ఖమ్మం తరఫున మికెల్ జైస్వాల్ (65) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. స్టార్ బ్యాటర్ మిలింద్ డకౌట్ కాగా.. హిమతేజ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు. 16 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 122-5జైస్వాల్ (60), మల్లు (2) బ్యాటింగ్ఆటకు అంతరాయంస్టేడియంలో ఓ ఫ్లడ్‌లైట్ సమస్య తలెత్తడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.నిలకడగా ఆడుతున్న హిమతేజ, జైస్వాల్11 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 76-3గా ఉంది. హిమతేజ (32), జైస్వాల్ (18) నిలకడగా ఆడుతున్నారు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఖమ్మంఖమ్మం జట్టు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మెహతా బౌలింగ్‌లో 3 బంతుల వ్యవధిలో ఖమ్మం జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పి రెడ్డి (15), కృష్ణా రెడ్డి (4) ఔట్ కాగా.. హిమతేజ (2), జైస్వాల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 5.3 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 27-3గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఖమ్మం1.4వ ఓవర్- రెండో ఓవర్లోనే ఖమ్మం జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పి రాజ్ (3) దేవ్ గౌడ్ బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 19-1గా ఉంది. పి రెడ్డి (12), జి కృష్ణా రెడ్డి (2) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్టీజీ20 లీగ్-2026 ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్-హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..హైదరాబాద్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గుడుగు గణేశ్, ప్రణవ్ వర్మ, అజయ్ దేవ్‌గౌడ్, అరవింద్, షణ్ముఖ్ అశ్విన్, అఖిల్ రాథోడ్, దేవ్ మెహతాఖమ్మం: మిలింద్ (కెప్టెన్), సహేంద్ర మల్లు, హర్షిత్, వేద్ రెడ్డి, షేక్ అజహర్, విద్యానంద రెడ్డి, జీఎస్కే రెడ్డి, హిమతేజ, పరాస్ రాజ్, ప్రతీక్ రెడ్డి, మికిల్ జైస్వాల్ -
నేడు టీజీ టి20 ఫైనల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించిన తెలంగాణ టి20 లీగ్ నేటితో ముగియనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఈ–చాంపియన్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా నిలిచిన చాంపియన్స్ టీమ్... క్వాలిఫయర్–1లో ఖమ్మం ఏసెస్ చేతిలోనే ఓడింది. ఇప్పుడు ఈ రెండు జట్లు మరో సారి తలపడే సమరంతో టోర్నీ విజేత ఎవరో తేలనుంది. సా.7.15 నుంచి జరిగే ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. -
క్వాలిఫయర్-2లో కరీంనగర్ ఓటమి.. ఫైనల్‌కు హైదరాబాద్
తెలంగాణ టీ20 లీగ్-2026లో కరీంనగర్ డైమండ్స్ పోరాటం ముగిసింది. శుక్రవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ పరాజయం పాలైంది. దీంతో కరీంనగర్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టగా.. హైదరాబాద్ జట్టు ఆదివారం అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుతో ఫైనల్లో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(45) రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆఖిల్, శుభమ్ తలా వికెట్ సాధించారు. -
హైదరాబాద్‌తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్
Update: హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న కరీంనగర్తెలంగాణ టీ20 లీగ్-2026లో మరో కీలక మ్యాచ్‌కు తెరలేచింది. క్వాలిఫయర్-2లో భాగంగా ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్‌లో రంగారెడ్డిని చిత్తు చేసిన కరీంనగర్ డైమండ్స్.. ఇప్పుడు క్వాలిఫయర్-2లో అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు క్వాలిఫయర్-1లో ఖమ్మం చేతిలో ఖంగుతిన్న హైదరాబాద్ జట్టు తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుకరీంనగర్ డైమండ్స్: తన్మయ్ అగర్వాల్ (సి), సాత్విక్ రెడ్డి, హెచ్‌కె సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, నారాయణ తేజ, శుభం శర్మ, అఖిల్ కుమార్ సంకోజు, రత్లావత్ దినేష్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీష్ కుమార్హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గడుగు గణేష్, వైష్ణవ్ రెడ్డి ఎ, ప్రణవ్ వర్మ, పి అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
హైదరాబాద్ టీమ్‌కు షాక్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఖమ్మం
తెలంగాణ టీ20 (TG20)-2026లో అన్విత ఖమ్మం ఏసెస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌ను ఓడించిన ఖమ్మం.. టీజీ20లో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫయర్-1లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఖమ్మం బ్యాటర్లలో మికిల్ జైశ్వాల్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు,7 సిక్స్‌లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(40), పరాస్ రాజ్(32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఆఖిల్ రాథోడ్ రెండు, షణ్ముఖ, ప్రణవ్, అజయ్, దేవ్ తలా వికెట్ సాధించారు.అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(1) ఆరంభంలో ఔటైనప్పటికి మరో ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(27 బంతుల్లో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర మల్లు మూడు, వేద్ రెడ్డి రెండు వికెట్లు సాధించారు. కాగా శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. -
జైశ్వాల్ విధ్వంసం.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ టీ20-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు సత్తాచాటారు. ముఖ్యంగా ఖమ్మం మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు.తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన జైశ్వాల్.. క్రీజులో సెటిల్ అయ్యాక హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశాడు. అజయ్ దేవ్ గౌడ్ వేసిన ఆఖరి ఓవర్లో మికిల్ 20 పరుగులు పిండుకున్నాడు. జైశ్వాల్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు,7 సిక్స్‌లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(40), పరాస్ రాజ్(32) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఆఖిల్ రాథోడ్ రెండు, షణ్ముఖ, ప్రణవ్, అజయ్, దేవ్ తలా వికెట్ సాధించారు. -
హైదరాబాద్‌తో మ్యాచ్.. ఖమ్మంకు భారీ షాక్
తెలంగాణ టీ20 (TG20)-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌కు ఖమ్మం స్టార్ బ్యాటర్ హిమతేజ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు అందుబాటులో లేనిట్లు తెలుస్తోంది. హిమతేజ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కీలక మ్యాచ్‌కు అతడు లేకపోవడం ఖమ్మంకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.అతడి స్ధానంలో పరాస్ రాజ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ రెండు జట్లు లీగ్ స్టేజిలో టేబుల్ టాపర్స్‌గా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ఫైనల్లో అడుగుపెట్టేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్‌తో తలపడనుంది.తుది జట్లుఅన్విత ఖమ్మం ఏసెస్: వాఫీ డైమండ్ కచ్చి, జీఎస్కే రెడ్డి, పరాస్ రాజ్, మిక్కిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), చామ వి మిలింద్(కెప్టెన్), సహేంద్ర మల్లు, షేక్ అజర్, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వైహైదరాబాద్ ఈ-ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, గడుగు గణేష్, ప్రణవ్ వర్మ, వైష్ణవ్ రెడ్డి ఎ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, పి అరవింద్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
క్వాలిఫయర్-2కు కరీంనగర్ డైమండ్స్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో ఉప్పల్ వేదికగా రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో కరీంనగర్ ఘన విజయం సాధించింది. దీంతో కరీంనగర్ జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. ఈ టీజీ 20 లీగ్‌లో తన్మయ్‌కు ఇది మూడో సెంచరీ.తన్మయ్‌తో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సింహా అర్ధ శతకం (50)తో రాణించాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్‌కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ స్పిన్నర్ ఆశిష్ శ్రీవాస్తవ్ 5 వికెట్లు పడగొట్టి కరీంనగర్‌ను దెబ్బతీశాడు. ఆశిష్ 3.3 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడితో పాటు శుభమ్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. రంగారెడ్డి బ్యాటర్లలో కెప్టెన్ తనయ్ త్యాగరాజన్(33 బంతుల్లో 63), నితన్ సాయి యాదవ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు: కపిల్ దేవ్ -
ఎలిమినేటర్ మ్యాచ్‌లో శతక్కొట్టిన కెప్టెన్
రంగారెడ్డి రైజర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ దంచికొట్టాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో తన్మయ్‌కు ఇది మూడో సెంచరీ. సింహా అర్ధ శతకంఇక రంగారెడ్డితో మ్యాచ్‌లో ఓపెనర్లలో తన్మయ్ ఇలా సెంచరీతో చెలరేగగా.. సాత్విక్ రెడ్డి మాత్రం 15 పరుగులకే నిష్క్రమించాడు. అయితే, తన్మయ్‌తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది సింహా అర్ధ శతకం (50) పూర్తి చేసుకుని అవుటయ్యాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్‌కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. ఇక వీరిద్దరు అవుటైన తర్వాత కరీంనగర్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. వైస్ కెప్టెన్ చందన్ సహానీ 3, వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ 14 పరుగులు చేసి అవుట్ కాగా.. నారాయణ తేజ డకౌట్‌గా వెనుదిరిగాడు.కరీంనగర్ భారీ స్కోరుమిగిలిన వారిలో హరీశ్ ఠాకూర్ 9 పరుగులు చేయగా.. శుభం శర్మ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సరికి కరీంనగర్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది.రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Absolute Cinema! ✋🤩🤚There is literally no stopping Tanmay Agarwal! 🔥3rd 💯 of the season! 🥊#Eliminator #KDvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/JuWbLnjU2z— tg20official (@tg20official) July 9, 2026 -
ఎలిమినేటర్ మ్యాచ్.. కరీంనగర్ బ్యాటింగ్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026 తుది అంకానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన కరీంనగర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా లీగ్ దశలో ఏడింట చెరో నాలుగు విజయాలతో కరీంనగర్, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. నెట్‌రన్‌రేటు పరంగా రంగారెడ్డి (1.211) కంటే మెరుగ్గా ఉండి కరీంనగర్ (1.535) మూడో స్థానంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాటి ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. తుదిజట్లుకరీంనగర్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డితనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అలంకృద్ రాపోలు (వికెట్ కీపర్), జ్ఞానప్రకాశ్ రెడ్డి, వెంకట్ కార్తిక్, ఆదిత్య జవ్వాజి, నితిన్‌సాయి యాదవ్, అరుణ్ కుమార్, హితేశ్ యాదవ్, సచేత్ బింజ్రాజ్క, ఆర్యన్ కరియప్ప. -
చిత్తుగా ఓడిన వరంగల్.. ప్లేఆఫ్స్‌కు రంగారెడ్డి రైజర్స్
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్ లో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్.. వరంగల్ వారియర్స్‌పై 161 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 253 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 91 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అమన్‌రావు (31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరంగల్ బౌలర్లలో నితిన్ సాయి యాదవ్, హితేశ్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (43 బంతుల్లో 91, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, ఆదిత్య జవ్వాజి (36 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 71 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. చివర్లో వెంకట్ కార్తిక్ (26 బంతుల్లో 51 నాటౌట్) సంచలన హాఫ్ సెంచరీతో మెరిశాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో సల్మాన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా, ముద్దసర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు. -
ఆరోన్ జార్జ్ విధ్వంసం.. రంగారెడ్డి భారీ స్కోరు
టీజీ20 లీగ్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ జూలు విదిల్చింది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఆరోజన్ జార్జ్ (43 బంతుల్లో 91, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, ఆదిత్య జవ్వాజి (36 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 71 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం.చివర్లో వెంకట్ కార్తిక్ (26 బంతుల్లో 51 నాటౌట్) సంచలన హాఫ్ సెంచరీతో మెరిశాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో సల్మాన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా, ముద్దసర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు. Aaron George is not going to die wondering. 🫡The young opener is unfazed by wickets falling at the other end, going on an all-out brawl, hitting the bowlers around the park.#RRRvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/wLJqSVQYzV— tg20official (@tg20official) July 7, 2026The Ranga Reddy Risers do themselves a massive favour by putting 2️⃣5️⃣2️⃣ on the board!In pursuit of qualification, the batters went on a gleeful boundary hitting spree, everyone chipping away towards a mammoth total!Will the Risers keep the Warriors to under 121 and qualify for… pic.twitter.com/YhY9g8T3tM— tg20official (@tg20official) July 7, 2026 -
వరంగల్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్
టీజీ20 లీగ్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా రెండో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయింది. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో ఆరోన్ జార్జ్ (70), ఆదిత్య (54) ధాటిగా ఆడుతున్నారు. ఇక టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన రంగారెడ్డి రైజర్స్ మూడు విజయాలు, మూడు ఓటములతో ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు వరంగల్ వారియర్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. వరంగల్ వారియర్స్‌కు ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికీ రంగారెడ్డి రైజర్స్‌కు మాత్రం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో వరంగల్‌పై రంగారెడ్డి భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. -
కరీంనగర్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు!
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ అరంగేట్ర సీజన్లో కరీంనగర్ డైమండ్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. పాలమూరు స్ట్రైకర్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ ఆటగాళ్లు దుమ్ములేపారు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఏకంగా 73 పరుగుల తేడాతో చిత్తు చేసింది కరీంనగర్.ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు- కరీంనగర్ తలపడ్డాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం ఓపెనర్లలో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం (58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు; 109) సాధించాడు. సాత్విక్ రెడ్డి 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో నారాయణ తేజ మెరుపులు (8 బంతుల్లో 23 నాటౌట్) మెరిపించాడు.ఇక లక్ష్య ఛేదనలో పాలమూరును కరీంనగర్ 143 పరుగులకే కట్టడి చేసింది. కరీంనగర్ బౌలర్లలో రత్లావత్ దినేశ్, శుభం శర్మ మూడేసి వికెట్లతో చెలరేగి పాలమూరు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. నారాయణ తేజ, ఆశిష్ శ్రీవాస్తవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.A true all-rounder! 😍This return catch deserves a place in the greatest museums of the world! 🥵#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/dgGVkLTZ6M— tg20official (@tg20official) July 7, 2026సంహిత్ రెడ్డి మెరుపులు వృథాపాలమూరు బ్యాటర్లలో సంహిత్ రెడ్డి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా షాదాబ్ అహ్మద్ (16 బంతుల్లో 24) రాణించాడు. కానీ మిగతా వాళ్లంతా తేలిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాలమూరు తొమ్మిది వికెట్లు నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాలమూరుకు ఇది ఐదో ఓటమి. మరోవైపు.. కరీంనగర్‌కు ఏడింట ఇది నాలుగో గెలుపు. ఇక ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం ప్లే ఆఫ్స్ చేరగా.. మూడు, నాలుగు స్థానాల కోసం కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి బరిలో నిలిచాయి. అయితే, మంగళవారం జరిగే రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు నిలిచారో అధికారికంగా తేలుతుంది. కరీంనగర్ ఎనిమిది పాయింట్లతో పాటు మెరుగైన నెట్‌రన్‌రేటు (+1.424)తో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్
పాలమూరు స్ట్రైకర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. ఫలితంగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్ భారీ స్కోరు చేయగలిగింది.తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో కరీంనగర్ డైమండ్స్ తలపడుతోంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. కరీంనగర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.తన్మయ్ శతకంతో చెలరేగడంతోఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109), సాత్విక్ రెడ్డి (22 బంతుల్లో 32) శుభారంభం అందించారు. ముఖ్యంగా తన్మయ్ శతకంతో చెలరేగడంతో మిగతా బ్యాటర్లు విఫలమైనా కరీంనగర్ స్కోరు 200 దాటింది. చందన్ సహాని 16, సింహా 15, రాహుల్ రాదేశ్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.Brutal hitting! 💥Tanmay Agarwal upped the ante with 2️⃣0️⃣ off the over, putting the Diamonds in a position of stength! 💪#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/mNgmtOh5lc— tg20official (@tg20official) July 7, 2026ఆఖర్లో నారాయణ తేజ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 23 నాటౌట్) ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 216 పరుగులు చేసింది. పాలమూరు బౌలర్లలో అశ్వద్ రాజీవ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆఫ్రిది, రిషభ్ బిస్లాస్, నిశాంత్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కరీంనగర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు.. పాలమూరు ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది.తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
కరీంనగర్‌కు చావోరేవో.. టాస్ గెలిచిన పాలమూరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్- కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం.కాగా హైదరాబాద్ ఇ- చాంపియన్స్ లీగ్ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్‌తో పాటు ఖమ్మం ఏసెస్ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ పోటీలో ఉన్నాయి.ఇక మంగళవారం కరీంనగర్ పాలమూరుతో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్‌రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
నల్గొండ నైట్స్‌పై హైదరాబాద్ ఇ-చాంప్స్ విజయం
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఇ-చాంపియన్స్ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన ఏడింటిలోనూ విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది. సోమవారం ఉప్పల్ వేదికగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చాంపియన్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇ-చాంప్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అన్విత్ రెడ్డి (40), అభిరథ్ రెడ్డి (39) రాణించగా, చివర్లో అజయ్ దేవ్ (34 నాటౌట్), వైష్ణవ్ రెడ్డి (16 బంతుల్లో 41 నాటౌట్ , ఒక ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. నల్గొండ బౌలర్లలో శరను నిశాంత్ 2 వికెట్లు తీయగా, ఇయాన్ సతాని, అర్ఫాజ్ అహ్మద్, అనికేత్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నల్గొండ బ్యాటర్లలో వరుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధసెంచరీ చేయగా, జశ్వత్ మోతె (36), గౌరవ్ రెడ్డి (25) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో షన్ముక అశ్విన్ 4 వికెట్లు తీయగా, అజయ్ దేవ్, ప్రనవ్ వర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి వికెట్‌కు జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డిలు 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత వరుణ్ గౌడ్ నిలకడగా ఆడడంతో రన్‌రేట్ ఎక్కడా తగ్గలేదు. చివర్లో హర్షవర్దన్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో నల్గొండ్ నైట్స్ 180 పరుగుల మార్క్‌ను దాటింది.Game changing over! 🥵🤯A Vaishnav Reddy, where were you throughout this chase?! 💥The batter has killed the game with four huuuuuuuuge 6️⃣s that has completely swung the pendulum in the Champions' favour!#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/ViWou61XOI— tg20official (@tg20official) July 6, 2026Oh yes, Abhi! 🫡His intent is clear as day, as Abhirath Reddy is playing the aggressor's role very early in the innings.#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/Q4Ux4DxOUn— tg20official (@tg20official) July 6, 2026 -
నల్గొండ భారీ స్కోరు.. హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే?
టీజీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఇ-చాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నల్గొండ బ్యాటర్లలో వరుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధసెంచరీ చేయగా, జశ్వత్ మోతె (36), గౌరవ్ రెడ్డి (25) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో షన్ముక అశ్విన్ 4 వికెట్లు తీయగా, అజయ్ దేవ్, ప్రనవ్ వర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు.తొలి వికెట్‌కు జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డిలు 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత వరుణ్ గౌడ్ నిలకడగా ఆడడంతో రన్‌రేట్ ఎక్కడా తగ్గలేదు. చివర్లో హర్షవర్దన్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో నల్గొండ్ నైట్స్ 180 పరుగుల మార్క్‌ను దాటింది.Jashwanth 🤝 GauravThe Knights' dynamic duo get off to another good start, keeping the scoreboard ticking with regular hit to the fence.#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/j8ap7i2zVf— tg20official (@tg20official) July 6, 2026 Goud, that's some serious hitting! 💥Aelgani Varun Goud dug into the bowler and tore him apart in a huge 23 run over!#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/RLPTrGcTuP— tg20official (@tg20official) July 6, 2026 -
టాస్ గెలిచిన హైదరాబాద్ ఇ-చాంపియన్స్
టీజీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ చాంపియన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరబాద్ ఇ-చాంపియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన ఆరింటిలోనూ విజయాలు సాధించిన హైదరాబాద్ ఇ-చాంపియన్స్ 12 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు నల్గొండ నైట్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నల్గొండ నైట్స్ రెండో స్థానానికి చేరుకోవాలని భావిస్తుండగా, హైదరాబాద్ ఇ-చాంపియన్స్ మాత్రం తమ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవాలని భావిస్తోంది.తుదిజట్లు:నల్గొండ నైట్స్: జశ్వత్ మోతే, గౌరవ్ రెడ్డి, పి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్ (వికెట్ కీపర్), అర్ఫాజ్ అహ్మద్, దివేష్ సింగ్, ఇల్యాన్ సతాని, ఏలగాని వరుణ్ గౌడ్, శరణు నిశాంత్హైదరాబాద్ ఇ చాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్), వికాస్ రెడ్డి , వైష్ణవ్ రెడ్డి (వికెట్ కీపర్), గడుగు గణేష్ న్విత్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
తిలక్ వర్మ జట్టును వీడాడు.. పరాజయాల పరంపరతో..
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ నుంచి మెదక్ ఫాల్కన్స్ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది.కాగా సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో మెదక్ సంచలన విజయం సాధించింది. వరంగల్ వారియర్స్ విధించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ మెదక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. సెంచరీ (56 బంతుల్లో 136 నాటౌట్) బాది జట్టును గెలిపించాడు.Goosebumps! 🥶Stuff of dreams, really. The whole of Medak Falcons feel it. The whole of Telangana feels it! 😍😍#WWvMF #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/cASKvz7vgs— tg20official (@tg20official) June 22, 2026తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా..ఆ తర్వాత తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా.. మెదక్ పరాజయాల పరంపర కొనసాగింది. గెలుపున్నదే లేక చతికిల పడిన మెదక్.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. అయితే, సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన మెదక్ తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగాఆరంభంలోనే ఓపెనర్లలో జీఎస్కే రెడ్డిని డకౌట్ చేయడం సహా వాఫీ కచ్చి (14)ని కూడా త్వరగానే పెవిలియన్‌కు పంపి కెప్టెన్ రవితేజ శుభారంభం అందించాడు. మికిల్ జైస్వాల్ (15) అర్జున్ పెవిలియన్‌కు చేర్చగా ఖమ్మం ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులతో హిమతేజ అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ప్రతీక్ రెడ్డి (32) రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది.శుభారంభం అందించినా..ఓపెనర్లు నమన్ అగర్వాల్ (19 బంతుల్లో 32), శృంజిత్ రెడ్డి (46 బంతుల్లో 60) శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. కెప్టెన్ రవితేజ డకౌట్ కాగా.. విక్రమ్ నాయక్ (7), వరుణ్ యర్రం (0) తీవ్రంగా నిరాశపరిచారు.ఇక సూర్య తేజ (19 బంతుల్లో 26), ఇషాన్ శర్మ (15 బంతుల్లో 34 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఫలితంగా మెదక్ 19 పరుగుల తేడాతో ఓడిపోయి భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఖమ్మం ఈ విజయంతో ఐదో గెలుపు నమోదు చేసి పది పాయింట్లతో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఇక మెదక్‌తో మ్యాచ్‌లో ఖమ్మం బౌలర్లు హర్షిత్ సాయి, విద్యానంద రెడ్డి, వాఫీ కచ్చీ తలా రెండు వికెట్లు తీయగా.. వేద్రెడ్డికి ఒక వికెట్ దక్కింది. -
ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. డీజీపీ సీవీ ఆనంద్ స్పందన ఇదే!
టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ ఆటగాడు మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రంగారెడ్డి రైజర్స్ 139 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షిత్ సాయి బౌలింగ్‌లో నితిన్ సాయి యాదవ్ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద కాచుకు కూర్చున్న మికిల్ జైస్వాల్ తనను తాను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌కు తగలకుండా అలాగే నిలబడ్డాడు. మికిల్ జైస్వాల్ క్యాచ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. '1982లో లీగ్ క్రికెట్ ఆడడం ప్రారంభించాను. అప్పటినుంచి ఇప్పటిదాకా నా జీవితంలో ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ చూడలేదు. ఇక్కడ అద్భుతమైన విషయమేంటంటే.. మికిల్ జైస్వాల్ బౌండరీ దాటకుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా క్యాచ్ పట్టిన విధానం హైలైట్‌గా మారింది. మరి దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారో చెప్పండి' అని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆదిత్య జవ్వాజి (43), గ్నానా రెడ్డి (36) రాణించారు. ఖమ్మం బౌలర్లలో సీవీ మిలింద్ మూడు వికెట్లు తీయగా, హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఖమ్మం ఏసెస్ 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలుపొందింది. కొనిదెల హిమతేజ (45), మికిల్ జైస్వాల్ (30), ఆఖర్లో కెప్టెన్ సీవీ మిలింద్ (29 నాటౌట్) రాణించారు.Just see this catch taken by Mickil Jaiswal in the TGT20 match yesterday in the Uppal stadium in the match between Khammam Aces and Ranga Reddy Risers .I have never seen a better catch than this ever since I first started playing league cricket in 1982 , even in all types of… pic.twitter.com/2J8isD0gHh— CV Anand IPS (@CVAnandIPS) July 5, 2026 -
శతక్కొట్టిన హిమతేజ
మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ స్టార్ కొడిమెల హిమతేజ శతక్కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో వాఫీ కచ్చి 14 పరుగులు చేయగా.. జీఎస్కే రెడ్డి డకౌట్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న హిమతేజ 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.మిగిలిన వారిలో మికిల్ జైస్వాల్ 15 పరుగులు చేయగా.. ప్రతీక్ రెడ్డి 32 పరుగులతో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ సీవీ మిలింద్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఖమ్మం ఏసెస్ 190 పరుగులు చేసింది. మెదక్ బౌలర్లలో రవితేజ రెండు, మధుకర్ మన్నె, అర్జున్ గొర్రపల్లి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్.. తుదిజట్లు ఇవే
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఖమ్మం.. నాలుగింట గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. మెదక్ మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో మెదక్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు సాధించింది. లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: టిజి20 లీగ్‌లో సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఖమ్మం ఏసెస్ జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్పై గెలుపొందింది. మొదట రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ఆదిత్య జవ్వాజి (37 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రకాశ్ రెడ్డి (25 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఖమ్మం జట్టు సారథి మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులుచేసింది. హిమతేజ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మికిల్ జైస్వాల్ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు), మిలింద్ (21 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సత్తాచాటడంతో ఖమ్మం సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలుపొందింది. -
రంగారెడ్డిపై ఖమ్మం ఏసెస్ విజయం
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)-2026లో ఖమ్మం ఏసెస్ రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తు చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో రంగారెడ్డిపై విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు సాధించింది.ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (4), అరవెల్లి అవినాశ్ రావు (12) విఫలం కాగా.. జ్ఞానప్రకాశ్ రెడ్డి (36), ఆదిత్య జవ్వాజి (43) జట్టును ఆదుకున్నారు. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. హర్షిత్ సాయి, వేద్ రెడ్డి తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. విద్యానంద రెడ్డి, షేక్ అజర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు వాఫీ కచ్చి (4), ప్రతీక్ రెడ్డి (17).. వన్‌డౌన్ బ్యాటర్ జీఎస్కే రెడ్డి (14) పూర్తిగా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో కొడిమెల హిమతేజ, మికిల్ జైస్వాల్ మెరుపులు మెరిపించారు.హిమతేజ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేయగా.. మికిల్ 22 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. ఆఖర్లో సీవీ మిలింద్ 21 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలవగా.. సహేంద్ర మల్లు 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 17.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసిన ఖమ్మం.. రంగారెడ్డిని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. -
RRR vs AKA: మికిల్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (4), అరవెల్లి అవినాశ్ రావు (12) విఫలం కాగా.. జ్ఞానప్రకాశ్ రెడ్డి (36), ఆదిత్య జవ్వాజి (43) జట్టును ఆదుకున్నారు.మిగిలిన వారిలో రాఘవ (2) పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ (14), నితిన్ సాయి యాదవ్ (19)కూడా నిరాశపరిచారు. సచేత్ బింజ్రాజ్క (2), ఆర్యన్ కరియప్ప (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. అరుణ్ కుమార్ 1, తనయ్ జడ్డు ఏడు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ మిలింద్మూడు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. విద్యానంద రెడ్డి, షేక్ అజర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ఇక ఈ మ్యాచ్‌లో ఖమ్మం స్టార్ మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ సాయి బౌలింగ్‌లో నితిన్‌సాయి యాదవ్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న మికిల్.. బ్యాలెన్స్ కోల్పోకుండా పని పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.YOU CANNOT DO THAT, MICKIL! 🤯🤯Mickil Jasiwal, you absolute beauty! 🔥There have been some top grabs this tournament, but none better than Mickil's one-handed STUNNER! 💥#AKAvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3daQhuKbv— tg20official (@tg20official) July 4, 2026తుదిజట్లుఖమ్మం ఏసెస్సీవీ మిలింద్ (కెప్టెన్), ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, హర్షిత్ సాయి, వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్, ఆరోన్ జార్జ్ వర్గీస్, అరవెల్లి అవినాశ్ రావు (వికెట్ కీపర్), రాఘవ, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, సచేత్ బింజ్రాజ్క, అరుణ్ కుమార్, ఆర్యన్ కరియప్ప. -
వర్షంతో వరంగల్, పాలమూరు మ్యాచ్ రద్దు
టీజీ20 లీగ్‌లో శుక్రవారం వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. హర్షిత్ చౌదరీ (8), రిషికేత్ సిసోడియా (1) పరుగులతో ఆడుతున్నారు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. -
పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ వరంగల్ తుది జట్లు ఇవే
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని వరంగల్, పాలమూరు భావిస్తున్నాయి.తుది జట్లువరంగల్ వారియర్స్: అమన్ రావ్ పేరాల(కెప్టెన్), భవేష్ సేథ్(వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, కర్రి సాయి ధనుష్, ముదస్సర్ హుస్సేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్పాలమూరువిగ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంతేశ్వర్ రెడ్డి, రిషబ్, మహ్మద్ అఫ్రిది, బుడిది తేజ, షదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ రెడ్డి -
తీరు మారని మెదక్.. నల్గొండ చేతిలో ఘోర ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో మెదక్ ఫాల్కన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ఈ టోర్నీలో మెదక్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో మెదక్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వరుణ్ యర్రం(44), రవితేజ(33), శ్రుంజిత్ రెడ్డి(30) రాణించారు. నల్గొండ బౌలర్లలో చింతల రక్షణ్, అనికేత్ రెడ్డి, ఇలియాన్ సతాని తలా వికెట్ సాధించారు.అనంతరం మెదక్ ఫాల్కన్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి(47 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జశ్వంత్(34) రాణించాడు. మెదక్ బౌలర్లలో మధుకర్, అర్జున్ మాత్రమే తలా వికెట్ పడగొట్టారు. మెదక్ జట్టులో కెప్టెన్ తిలక్ వర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మెదక్ జట్టు కేవలం తొలి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఫాల్కన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: IND vs ENG: 'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి' -
నల్గొండతో మ్యాచ్.. మెదక్ నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ఓపెనర్లలో నమన్ అగర్వాల్ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రవితేజ 33 పరుగులు చేశాడు. ఆఖర్లో విక్రం నాయక్ (31 బంతుల్లో 48), వరుణ్ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, సతాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.తుదిజట్లుమెదక్ ఫాల్కన్స్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), సాయి వరుణ్ యర్రం, అర్జున్ గొర్రపల్లి, జగమ్ బన్నీ, నొమన్ అహ్మద్, సయ్మద్ ఘాజి అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నెనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, టి.హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, నితీశ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, ఇల్యాన్ సతాని, ఉర్వేశ్ కక్కడ్, రక్షన్ రెడ్డి. -
రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తు చేసిన కరీంనగర్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో కరీంనగర్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ను 58 పరుగుల తేడాతో కరీంనగర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేష్(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు హెచ్‌కే సింహా(60), చందన్ సహనీ(7 బంతుల్లో 17) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో తన్మయ్ జడ్డూ రెండు, త్యాగరాజన్, నితిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఆధిత్య జవ్వాజీ(48), కరియప్ప(30) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ స్పిన్నర్ నారయణ తేజ మూడు వికెట్లు పడగొట్టగా.. శుభమ్ శర్మ, దినేష్ తలా రెండు వికెట్లు సాధించారు. -
కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా గురువారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి మొదట బౌలింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది.కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (24), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (29) ఫర్వాలేదనిపించగా.. సింహా, రాహుల్ రాదేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సింహా 38 బంతుల్లోనే 60 పరుగులు చేయగా.. రాహుల్ 37 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. చందన్ సహానీ (19), శుభం శర్మ (17 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్నీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ 230 పరుగులు సాధించింది. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డు రెండు వికెట్లు తీయగా.. తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహానీ, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డు, ఆర్యన్ కరియప్ప. -
అన్వితా ఖమ్మం ఏసెస్ ఘన విజయం
టీజీ20 లీగ్‌లో భాగంగా అన్వితా ఖమ్మం ఏసెస్ రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. బుధవారం ఉప్పల్ వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యచ్‌లో ఖమ్మం ఏసెస్ 33 పరుగులతో విజయాన్ని అందుకుంది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నల్గొండ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులకు పరిమితమైంది. నల్గొండ బ్యాటర్లలో గౌరవ్ రెడ్డి (54) అర్ధసెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ జశ్వంత్ మోతె (22) పరుగులు సాధించాడు. ఆఖర్లో హర్షవర్దన్ సింగ్ (37 నాటౌట్) మెరిసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఖమ్మం బౌలర్లలో వాఫి కచ్చి, వేద్ రెడ్డి చెరో 3 వికెట్లతో మెరిశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్విత్ ఖమ్మం జట్టు బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హిమతేజ(31 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(56), పరాస్ రాజ్(46) రాణించారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్, దివేష్ తలా వికెట్ సాధించారు. -
హిమతేజ విధ్వంసం.. నల్గొండ ముందు భారీ టార్గెట్
నల్గొండతో మ్యాచ్‌లో అన్విత్ ఖమ్మం బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హిమతేజ(31 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(56), పరాస్ రాజ్(46) రాణించారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్, దివేష్ తలా వికెట్ సాధించారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఖమ్మంతెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా అన్విత్ ఖమ్మం ఏసెస్, నల్గొండ నైట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో హిమతేజ సారథిగా వ్యవహరిస్తున్నాడు.తుది జట్లుఅనురాగ్ నల్గొండ నైట్స్: జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డి, పాట్కూరి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి(కెప్టెన్), ఏలగాని వరుణ్ గౌడ్, అర్ఫాజ్ అహ్మద్ మహ్మద్, అనికేత్ రెడ్డి, చింతల రక్షణ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్(వికెట్ కీపర్), దివేష్ సింగ్, శరణు నిశాంత్అన్విత్ ఖమ్మం ఏసెస్ జట్టు: వాఫీ డైమండ్ కచ్చి, పరాస్ రాజ్, మిక్కిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), కొడిమెల హిమతేజ(కెప్టెన్), జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, మహేష్ విప్పర్ల, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వై -
వరంగల్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరంగల్ స్కోరెంతంటే?వరంగల్ ఓపెనర్లలో హర్షిత్ చౌదరి (22) త్వరగానే వెనుదిరగగా.. కెప్టెన్ అమన్ రావు (20 బంతుల్లో 45) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషికేత్ 38 పరుగులు చేయగా.. మిగిలిన వారిలో శౌనక్ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.మురుగన్ అభిషేక్ (4) పూర్తిగా విఫలం కాగా.. ధీరజ్ 18, భవేశ్ 6, ఆది మణి కిరణ్ 5, ముదస్సర్ 3 పరుగులు చేసి నిష్క్రమించారు. క్రాంతి (2), సల్మాన్ అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వరంగల్ తొమ్మిది వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.హైదరాబాద్ బౌలర్లలో అజయ్ గౌడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అజేయ శతకం (43 బంతుల్లో 101)తో అదరగొట్టగా.. గడుగు గణేశ్ అర్ధ శతకం (31 బంతుల్లో 50)తో అలరించాడు. వరంగల్ బౌలర్లలో సల్మాన్ ఖాన్, క్రాంతి, శౌనక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లువరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేత్ (వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుసేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్.హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, గడుగు గణేశ్, వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, ఎంఏ షణ్ముఖ. -
‘నాలాంటి ఆటగాళ్లకు గొప్ప అవకాశం’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ నేపథ్యం, సాధారణ రైతు కుటుంబం, ఇప్పుడు బతుకుతెరువు కోసం ఒక దుకాణంలో పని చేయాల్సిన స్థితి... అయినా సరే ఆ అబ్బాయి క్రికెట్‌పై మక్కువతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. సరైన వేదికపై తనను తాను నిరూపించుకొని మున్ముందు పైకి ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు. అలాంటి వారికి తెలంగాణ టి20 లీగ్ తగిన దిశను చూపిస్తోంది. ఈ టోర్నీ ద్వారా పలువురు క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో నోమాన్ అహ్మద్ ఒకడు. ప్రస్తుతం టీజీ టి20 లీగ్‌లో అతను మెదక్ ఫాల్సన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే హెచ్‌సీఏ లీగ్స్‌లో ఆడుతున్నా... ఈ టోర్నీతో అభిమానుల మధ్య ఆడేందుకు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దక్కిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ నోమాన్ చెప్పాడు. ‘చాలా రోజులుగా టి20 లీగ్ గురించి ఎదురు చూశాను. వేలం జరిగినప్పుడు మాకూ చాన్స్ వస్తుందా అని ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. అయితే నా అదృష్టం బాగుంది. వేలంలో మెదక్ టీమ్‌ను నన్ను తీసుకోవడంతో సంతోషం కలిగింది. హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లతో పోలిస్తే ఈ టోర్నీలో వాతావరణం చాలా భిన్నం. పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య ఆడే అవకాశం వచ్చింది. పైగా పలువురు ఇతర సీనియర్ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు’ అని నోమాన్ అన్నాడు. అతని స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లేపల్లి. హైదరాబాద్‌కు వచ్చి సమీప బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో ఆటపై ఆసక్తి ఉండటంతో టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రం ఆడేవాడు. ఇందులోనే రాణించడాన్ని గుర్తించిన మిత్రులు మరింత ప్రోత్సహించారు. ఈ క్రమంలో కోవిడ్ లాక్డౌన్ ముగిసిన తర్వాత నగరంలో పూర్తిస్థాయి శిక్షణవైపు మళ్లాడు. అత్తాపూర్‌లోని సిటీ క్రికెట్ అకాడమీలో కోచ్ అహ్మద్ వద్ద అతను కోచింగ్ తీసుకుంటున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న అతనికి హెచ్‌సీఏ లీగ్ పోటీల్లో చార్మినార్ క్లబ్ తరఫున ఆడే అవకాశం దక్కింది. బ్యాటర్‌గా గత సీజన్లో రెండు రోజుల లీగ్‌లో 350 పరుగులతో అతను ఆకట్టుకున్నాడు. అనంతరం హెచ్‌సీఏ ఎమర్జింగ్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు టీజీ టి20 లీగ్ నోమాన్కు మరో మంచి చాన్స్‌ను ఇచ్చింది. ‘మెదక్ ఫాల్కన్స్ టీమ్ యాజమాన్యం నాకు అండగా నిలిచి అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఐపీఎల్ తరహాలో మా జట్టు ప్రాక్టీస్, ట్రైనింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్, మా కెపె్టన్ తిలక్ వర్మ వ్యక్తిగతంగా నా ఆటపై పలు సూచనలు చేయడం మర్చిపోలేనిది’ అని నోమాన్ చెప్పాడు. అనారోగ్యం కారణంగా నోమాన్ తండ్రి వ్యవసాయానికి కూడా దూరమయ్యాడు. దాంతో 24 ఏళ్ల నోమాన్ ఇప్పుడు ఒక బేకరీలో పని చేస్తున్నాడు. అయితే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని అతను చెప్పాడు. టీజీ టి20 వేలంలో మెదక్ అతడిని రూ.75 వేలకు సొంతం చేసుకుంది. ‘నేను హెచ్‌సీఏలో ఎలాంటి ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆడలేదు. ఇప్పుడు మిగిలింది సీనియర్ టీమ్‌లో స్థానమే. టీజీ టి20 టోర్నీలోకి ఎంపికైన కొద్ది మందిలో నేనూ ఉన్నానంటే నా ఆట గురించి అందరికీ తెలుస్తోంది. మున్ముందు మరింత పట్టుదలగా కష్టపడతా. నా వ్యక్తిగత కారణాలు ఆటకు అడ్డు రావు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి హైదరాబాద్ టీమ్‌లోకి ఎంపిక కావడమే నా లక్ష్యం’ అని నోమాన్ ఆశాభావంతో చెప్పాడు. -
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) రాణించారు. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.కుప్పకూలిన మెదక్అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్.. కరీంనగర్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. మెదక్ బ్యాటర్లలో తెలకపల్లి రవితేజ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ బౌలర్లలో శ్రీవాస్తవ్, శుభమ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హారీష్, నారయణ్, సతీష్ కుమార్, సాత్విక్ రెడ్డి తలా వికెట్ సాధించారు. -
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు. -
ఖమ్మంపై హైదరాబాద్ ఇ-చాంపియన్స్ విజయం
టీజీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా అన్వితా ఖమ్మం ఏసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇ-చాంప్స్ 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ ఇ-చాంప్స్ పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 212 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన అన్వితా ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితమైంది. కొడిదెల హిమతేజ (64) అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో శ్రీనికేత్ మూడు వికెట్లు తీయగా, అజయ్ దేవ్‌గౌడ్, షణ్ముక అశ్విన్, అన్విత్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఇ-చాంప్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి (59) హఫ్ సెంచరీతో చెలరేగగా, గుడుగు గణేశ్ (21 బంతుల్లో 44) రాణించాడు. అన్వితా ఖమ్మం బౌలర్లలో వేద్ రెడ్డి, సహేంద్ర మలు, సాకేత్ దాత్రక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్‌తో మ్యాచ్.. ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్కు గాయం!
తెలంగాణ ప్రీమియర్ లీగ్‌లో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో హిమతేజ ఖమ్మం జట్టును ముందుండినడిపిస్తున్నాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు అగ్రస్ధానంలో ఉండగా.. ఖమ్మం నాలుగో స్ధానంలో ఉంది.జట్లు:హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్(వికెట్ కీపర్), అన్విత్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, గడుగు గణేష్, అజయ్ దేవ్ గౌడ్, అఖిల్ రాథోడ్, వైష్ణవ్ రెడ్డి ఎ.అన్విత ఖమ్మం ఏసెస్ : కొడిమెల హిమతేజ(కెప్టెన్), మిక్కిల్ జైస్వాల్, సాకేత్ ధాత్రక్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, వాఫీ డైమండ్ కచ్చి, మయాంక్ గుప్తా, మహేష్ విప్పర్ల, వేద్ రెడ్డి, విద్యానంద రెడ్డి -
నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో అనురాగ్ నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌ను 6 వికెట్ల తేడాతో నల్గొండ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగుల నామ మాత్రపు స్కోర్ సాధించింది. పాలమూరు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. నల్గొండ నైట్స్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ మహమ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ రెండు, అనికేత్, దివేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. నల్గొండ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ బుద్ది(68) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ విజయంతో నల్గొండ నైట్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్ -
పాలమూరు నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్- పాలమూరు స్ట్రైకర్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది.పాలమూరు నామమాత్రపు స్కోరునల్గొండతో మ్యాచ్‌లో పాలమూరు నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. నల్గొండ బౌలర్ల ధాటికి పాలమూరు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో విఘ్నేశ్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరు (4)కే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ యాదవ్ డకౌట్ అయ్యాడు.మరో ఓపెనర్ చైతన్య రెడ్డి 17 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (35 బంతుల్లో 55), తేజ (33 బంతుల్లో 50) అద్భుత అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మిగిలిన వారిలో ఆఫ్రిది పద్నాలుగు పరుగులు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాలమూరు 148 పరుగులు స్కోరు చేసింది.నల్గొండ బౌలర్లలో అఫ్రాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ సరాను రెండు, అనికేత్ రెడ్డి, దివేశ్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుపాలమూరుప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్ యాదవ్, రోహిత్ రాయుడు, ఎండీ షాదాబ్ అహ్మద్, ఎండీ ఆఫ్రిది అహ్మద్, రతన్ తేజ, రిషభ్ బస్లాస్, నిపుణ్ రెడ్డి, ఎండీ అజారుద్దీన్నల్గొండరాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, పి. నితీశ్ రెడ్డి, ఎండీ అఫ్రాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, వరుణ్ గౌడ్, రక్షన్ రెడ్డి, నిశాంత్ సరాను. -
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్‌లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి. -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. 200 దాటిన స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. వరంగల్ వారియర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. కాగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముదస్సర్ బౌలింగ్‌లో ఓపెనర్ సాత్విక్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరుకే (4) వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 133 పరుగులుఈ క్రమంలో 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు.అయితే, కిరణ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా పూర్తిగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ చందన్ సహాని 16 పరుగులు చేయగా.. హరీశ్ ఠాకూర్ 1, శుభం శర్మ 2 (రిటైర్డ్ అవుట్) పరుగులకే నిష్క్రమించారు.రాహుల్ రాధేశ్ 15, నారాయణ తేజ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది. కాగా కరీంనగర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడిపోయింది. వరంగల్‌పై గెలిచి బోణీ కొట్టాలని పట్దుదలగా ఉంది.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026 -
వరంగల్ వారియర్స్‌తో మ్యాచ్.. కరీంనగర్ బోణీ కొట్టేనా?
టీజీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా 14వ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక వరంగ్ వారియర్స్ ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆడిన రెండింటిలోనూ ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఆఖరి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లోనైనా గెలిచి కరీంనగర్ డైమండ్స్ టోర్నీలో బోణీ చేయాలని చూస్తుండగా, రెండో విజయంతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని వరంగల్ వారియర్స్ భావిస్తోంది.తుదిజట్లు:కరీంనగర్ డైమండ్స్: సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్(వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్: హర్షిత్ చౌదరి అమన్ రావు (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్ప,ల్లెపాటి క్రాంతి -
చితక్కొట్టిన ఓపెనర్లు.. రంగారెడ్డి రైజర్స్ ఘనవిజయం
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు. పాలమూరు బౌలర్ రిషబ్ బస్లాస్ రెండు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగితే, పున్నయ్య, త్యాగరాజన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో రంగారెడ్డి రైజర్స్ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు మూడో ఓటమితో పాలమూరు ఏడో స్థానానికి పడిపోయింది.Hila daala, miya! 🔥A long stride, a long mane, a fire in his heart, purpose in his game. 💥#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/NIfAwpn2pa— tg20official (@tg20official) June 27, 2026He came in red hot, fully charged! 🔋Aryan Cariappa ran in with purpose and bowled with intent, ending with 4️⃣ in his kitty and a Purple Cap on his head.#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/pIlJo7NG9h— tg20official (@tg20official) June 27, 2026చదవండి: అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే! -
పాలమూరు స్ట్రైకర్స్‌పై రంగారెడ్డి విజయం
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. రంగారెడ్డి ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) ఆరంభం నుంచే ధాటి ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలో గ్యానా రెడ్డి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ అవనీష్ అర్ధసెంచరీతో రాణించాడు. అయితే చివర్లో అవనీష్ ఔటైనప్పటికీ ఆదిత్య (7 నాటౌట్), తనయ్ త్యాగరాజన్ (7 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు.ఫిఫ్టీ బాదిన వెంటనే అవనీష్ ఔట్.. మూడో వికెట్ డౌన్పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఓఎనర్ అవనీష్ అర్ధసెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న అవనీష్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే ఫిఫ్టీ సాధించిన వెంటనే అవనీష్ పృథ్వీరెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో రంగారెడ్డి 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఆరోన్ జార్జ్ (6) రూపంలో రంగారెడ్డి రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు 47 పరుగులు చేసిన ఓపెనర్ గ్యానా రెడ్డి బస్లాస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రంగారెడ్డి విజయానికి 54 బంతుల్లో 28 పరుగులు కావాలి.దంచుతున్న ఓపెనర్లు.. 7 ఓవర్లలో 77/0పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి స్ట్రైకర్స్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రంగారెడ్డి 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. గ్నాన్రెడ్డి (39), అవనీష్ (31) పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు.ధాటిగా ఆడుతున్న రంగారెడ్డి రైజర్స్131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఓపెనర్ గ్నానా రెడ్డి (16 బంతుల్లో 37) ధాటిగా ఆడుతుండగా, అవనీష్ (2) పరుగులతో సహకరిస్తున్నాడు.రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 131 పరుగులురంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాలమూరు 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. చేసింది. ఓపెనర్ విగ్నేశ్ రెడ్డి (46), షాదాబ్ అహ్మద్ (22) మినహా మిగతావారంతా పెద్దగా రాణించలేదు. అంతేకాదు రంగారెడ్డి రైజర్స్ బౌలర్ద ధాటికి ఇద్దరు బ్యాటర్లు గోల్డెన్ డక్ అయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4 వికెట్లతో చెలరేగగా, త్యాగరాజన్, పున్నయ్య చెరో 2 వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ డౌన్63 పరుగుల వద్ద పాలమూరు స్ట్రైకర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన షాదాబ్ అహ్మద్ రాకేశ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన పాలమూరురంగారెడ్డితో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఏడు పరుగులు చేసిన రోహిత్ రాయుడు కరియప్ప బౌలింగ్‌లో త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాలమూరు స్ట్రైకర్స్ 31 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.రెండు పరుగులకే 2 వికెట్లు డౌన్రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఓపెనర్ చైతన్యరెడ్డి పున్నయ్య బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కెప్టెన్ ప్రగ్నయ్ రెడ్డి (1) త్యాగరాజన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పాలమూరు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.టాస్ గెలిచిన రంగారెడ్డిటీజీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం 13వ మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రంగారెడ్డి స్ట్రైకర్స్ ఆడిన మూడింటిలో రెండింట విజయంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు పాలమూరు స్ట్రైకర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండు ఓడి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రంగారెడ్డి రైజర్స్ టాప్ 2 స్థానానికి చేరుకోవాలని చూస్తోంది.తుదిజట్లు:పాలమూరు స్ట్రైకర్స్: ప్రగ్నయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేష్ రెడ్డి, పిఎస్ చైతన్య రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, షాదాబ్ అహ్మద్, మహ్మద్ అఫ్రిది, బుద్ధి తేజ, రిషబ్ బాస్లాస్, రవి కిరణ్, ఎండీ అజారుద్దీన్🚨 PLAYING XI 🚨11 🦁 take the field to hunt their prey and pick up one more win. #PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/VcknsEKfkZ— tg20official (@tg20official) June 27, 2026రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్, ఆరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన రెడ్డి, ఆదిత్య జవ్వాజీ, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేష్, అరుణ్ కుమార్, బి పున్నయ్య, ఆర్యన్ కరియప్ప🚨 PLAYING XI 🚨👕 The Risers faced a setback but name a squad that's up for the challenge and ready to push for a win! 💪#PSvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/A2ddSNMEuD— tg20official (@tg20official) June 27, 2026 -
వికాస్, అభిరథ్ విధ్వంసం.. హైదరాబాద్ హ్యాట్రిక్
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను మెదక్ కూడా ధీటుగానే ప్రారంభించినప్పటికీ.. 12వ ఓవర్ తర్వాత స్వల్ప విరామాల్లో 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అజయ్ దేవ్ గౌడ్ (4-0-20-4), ప్రణవ్ వర్మ (4-0-35-2) అద్భుతంగా బౌలింగ్ చేసి మెదక్‌కు దెబ్బకొట్టారు. శ్రీనికేత్, నితన్ నాయక్ తలో వికెట్ తీశారు. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్ (75) ఒంటరిపోరాటం చేశాడు. వరుణ్ యెర్రమ్ (38), రవితేజ (31), ఇషాన్ శర్మ (27) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో హైదారాబాద్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో సోలోగా అగ్రస్థానంలో నిలిచింది. -
హైదరాబాద్ ఖాతాలో మరో గెలుపు
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన మెదక్ లక్ష్యానికి 47 పరుగుల దూరంలో (194-9) నిలిచిపోయింది. ధీటుగా బదులిస్తున్న మెదక్241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెదక్ ఫాల్కన్స్ ధీటుగా బదులిస్తుంది. 11.3 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ గెలవాలంటే మరో 51 బంతుల్లో 114 పరుగులు చేయాలి. విక్రమ్ నాయక్ (70) విధంసాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా రవితేజ (18) క్రీజ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు. సెంచరీ చేజార్చుకున్న వికాస్ రెడ్డి15.1వ ఓవర్- వికాస్ రెడ్డి సెంచరీ చేజార్చుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో వికాస్ రెడ్డిఓపెనర్ వికాస్ రెడ్డి సెంచరీ దిశగా సాగుతున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత హైదరాబాద్ స్కోర్ 180-2గా ఉంది. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 122-1గా ఉంది. అభిరథ్ రెడ్డి (27 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. వికాస్ రెడ్డి 59, నితిన్ నాయర్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అభిరథ్ రెడ్డి వికెట్ ఘాజీ అబ్బాస్‌కు దక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.తుది జట్లు..మెదక్ ఫాల్కన్స్: శృంజిత్ రెడ్డి, నమన్ అగర్వాల్, సాయి వరుణ్ ఎర్రమ్, రవితేజ (కెప్టెన్), నౌమాన్ అహ్మద్, ఇషాన్ శర్మ, విక్రమ్ నాయక్ గుగులోత్, బన్నీ జగం, అహ్వినన్ రామ్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్హైదరాబాద్ ఈ ఛాంప్స్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, షణ్ముఖ అశ్విన్, గణేశ్ గడుగు, నితిన్ నాయక్, అర్వింద్, అజయ్ దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, శ్రీనికేత్ -
ఉత్కంఠపోరులో ఖమ్మం ఏసెస్‌దే గెలుపు
టీజీ20 లీగ్‌లో మరో ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. శుక్రవారం కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (30 బంతుల్లో 55 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్‌ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్, ఆశిష్, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు. -
రాణించిన జైస్వాల్, హిమతేజ.. ఖమ్మం భారీ స్కోరు
టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్‌ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్, ఆశిష్, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు. -
కరీంనగర్ డైమండ్స్‌పై ఖమ్మం ఏసెస్ విజయం
శుక్రవారం కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ విజయం కోసం పోరాడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి కరీంనగర్ డైమండ్స్ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కరీంనగర్ విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన కరీంనగర్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (23 బంతుల్లో 60 నాటౌట్) ధాటిగా ఆడుతుండగా, హరీశ్ఠాకూర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. 👉 17 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీవీ మిలింద్ (14), జైస్వాల్ (25) ఆడుతున్నారు.👉14 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (20), ప్రతీక్‌రెడ్డి (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కొడిదెల హిమతేజ (56) అర్ధసెంచరీ చేయగా, జీఎస్కే రెడ్డి (43) పరుగులతో రాణించాడు.👉 6 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం అన్వితా ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. హిమతేజ (42), జీఎస్కే రెడ్డి (19) పరుగులతో ఆడుతున్నారు.👉టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. వాఫి కాచీ దినేశ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ గుప్తా 2 పరుగులు చేసి హరీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం 11వ మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్‌లో అన్వితా ఖమ్మం జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక గెలుపు సాధించగా, కరీంనగర్ డైమండ్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.తుది జట్లుఖమ్మం ఏసెస్: కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డికరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్ -
నల్గొండ నైట్స్ ఘన విజయం
టీజీ20 లీగ్‌లో భాగంగా నల్గొండ నైట్స్ రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్ 91 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్‌రావు (46) టాప్ స్కోరర్‌గా నిలవగా, మురుగన్ అభిషేక్ (44) పర్వాలేదనిపించాడు. నల్గొండ నైట్స్ బౌలర్లలో సరాను నిశాంత్, వరుణ్ గౌడ్ చెరో మూడు వికెట్లు తీయగా, అనికేత్‌రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (80), నితీశ్‌రెడ్డి (81) విధ్వంసంతో నల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. SLAM DUNK, Nishanth! 🏀Nishanth Saranu gets things going for the Knights, striking twice in two balls to peg the Warriors back significantly! 🧨#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/nHr08NkGSq— tg20official (@tg20official) June 26, 2026 -
గౌరవ్ రెడ్డి విధ్వంసం.. నితీశ్ రెడ్డి ధనాధన్.. నల్గొండ భారీ స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా నల్గొండ నైట్స్ భారీ స్కోరు సాధించింది. వరంగల్ వారియర్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 259 పరుగులు స్కోరు చేసింది.ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ ఆదిలోనే ఓపెనర్ ప్రణవ్ సూర్యదేవర (4) వికెట్ కోల్పోయింది. అయితే, ఆరంభంలోనే వికెట్ తీసిన ఆనందం వరంగల్‌కు ఎక్కువ సేపు నిలవలేదు.ఆకాశమే హద్దుగాఓపెనర్ గౌరవ్ రెడ్డితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గౌరవ్ కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. Dead straight! 🥵The safest part of the field has been breached and Gaurav Reddy leaves no chance for the fielders to stop him! 💥#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EuxBENGCNT— tg20official (@tg20official) June 26, 2026మరోవైపు.. నితీశ్ రెడ్డి 41 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు. వీరిద్దరు కలిసి ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.Naa tera, naa mera. 4️⃣ runs Anurag Nalgonda Knights ka 🫣#ANKvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/jnKLqpu522— tg20official (@tg20official) June 26, 2026మెరుపులు మెరిపించారుఅయితే, గౌరవ్ రెడ్డిని ముదస్సర్ అవుట్ చేయగా.. నితీశ్ రెడ్డి రనౌట్ అయ్యాడు. మిగితా వారిలో కెప్టెన్ రాహుల్ బుద్ధి (18 బంతుల్లో 31), అర్ఫాజ్ అహ్మద్ (14 బంతుల్లో 33) మెరుపులు మెరిపించగా.. దివేశ్ సింగ్ (7 బంతుల్లో 18 నాటౌట్) రాణించాడు. ఫలితంగా నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది.వరంగల్ బౌలర్ల ఆట తీరుపై విమర్శలుకాగా వరంగల్ వారియర్స్ తమ తొలి మ్యాచ్‌లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌పై 258 పరుగులు చేసింది. అయితే, ఈ టార్గెట్‌ను కాపాడుకోలేక ఓటమి పాలైంది. తాజాగా నల్గొండకు ఏకంగా 259 పరుగులు లీక్ చేసింది. దీంతో వరంగల్ బౌలర్ల ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక నల్గొండతో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. ముదస్పర్, శౌనక్ తలా ఒక వికెట్ తీశారు. టీమిండియా స్టార్ మహ్మద్ సిరాజ్ వస్తేనే వరంగల్ బౌలింగ్ వైఫల్యాల నుంచి బయటపడగలదనిపిస్తోంది.చదవండి: కెప్టెన్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే? -
వరంగల్‌తో మ్యాచ్.. నల్గొండ బ్యాటింగ్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా శుక్రవారం వరంగల్ వారియర్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదికగా టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నల్గొండ నైట్స్ బ్యాటింగ్‌కు దిగింది.కాగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న వరంగల్.. ఒక విజయం.. ఒక పరాజయం నమోదు చేసింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. నల్గొండ సైతం ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతోంది.తుదిజట్లునల్గొండప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, నితీశ్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), దివేశ్ సింగ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి.హర్షవర్దన్ సింగ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్, రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.వరంగల్అమన్ రావు (కెప్టెన్), హర్షిత్ చౌదరి, రిషికేత్ సిసోడియా, భవేశ్ సేత్, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, ఆసిఫ్ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్ అబ్దుల్ మాలిక్, ముదస్పర్ హుసేన్, శౌనక్ కులకర్ణి. -
‘దూకుడే నా శైలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ పేరాల అమన్ రావు మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను చివరకు 48 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. రాష్ట్ర స్థాయి లీగ్ పోటీల్లో అమన్దే వేగవంతమైన శతకం. అయితే దీంతో తాను సంతృప్తి చెందలేదని, మరో మూడు బంతుల ముందే సాధించాల్సిందని అతను అన్నాడు. ‘శతకానికి చేరువవుతున్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సింది. నేను అనుకున్నదాని ప్రకారం 29 బంతుల్లోనే సెంచరీ రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో నేను నిరుత్సాహ పడ్డాను. అయితే మున్ముందు మరో అవకాశం వస్తే వదిలి పెట్టను’ అని గురువారం ‘సాక్షి’తో అమన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో చివరకు వరంగల్ ఓటమి పాలైనా, అమన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. దూకుడుగా బ్యాటింగ్ చేయడమే తన శైలి అని, తొలి బంతి నుంచి చెలరేగడం అలవాటుగా మార్చుకున్నానని అమన్ చెప్పాడు. ‘కెరీర్ ఆరంభం నుంచి నేను ఇదే తరహాలో ఆడతాను. హైదరాబాద్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వేగంగా పరుగులు సాధించాను. ఇప్పుడు తెలంగాణ టి20 లీగ్‌లో దీనిని కొనసాగిస్తున్నా. మేం మెదక్‌తో మ్యాచ్ ఓడినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం చూశాను. వారికి కావాల్సింది అదే. పైగా ఈ మ్యాచ్‌తో లీగ్‌లో సరైన ఊపు లభించిందని భావిస్తున్నా’ అని అమన్ రావు చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ బెంగాల్‌పై అద్భుత డబుల్ సెంచరీ చేయడం అమన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. 186 వద్ద నుంచి ఇన్నింగ్స్‌లో మిగిలిన చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 2, 6 బాది అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. ‘వన్డే డబుల్ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే సీజన్లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నా’ అని అతను వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్లో అమన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీనిపై నిరాశ చెందలేదని, తనదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అతను వ్యాఖ్యానించాడు. ‘నా ప్రతిభను రాయల్స్ గుర్తించింది. అందుకే టీమ్‌లోకి తీసుకున్నామని హెడ్ కోచ్ సంగక్కర చెప్పారు. అయితే టీమ్ కాంబినేషన్ కారణంగా ఆడే చాన్స్ లభించలేదు. నిరాశపడవద్దని, మున్ముందు ఇదే జట్టుతో కొనసాగించి అవకాశాలు కల్పిస్తామని ఆయన నాకు ధైర్యం చెప్పారు. ఇది ఆరంభమే కదా. మున్ముందు ఐపీఎల్లో సత్తా చాటగలనని నమ్ముతున్నా’ అని అమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతిభాన్వేషణ బృందాలను ఆకట్టుకునేందుకు టీజీ టి20 మంచి చాన్స్ అని, కొత్త ఆటగాళ్లు దీనిని అందిపుచ్చుకోవాలన్న అమన్... వారియర్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో తరహాలోనే టీజీ లీగ్ సాగుతోంది. సరైన సమయంలో మన రాష్ట్ర ఆటగాళ్లకు ఈ వేదిక లభించడం శుభపరిణామం. మా జట్టు రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. పలువురు ప్రతిభావంతులతో టీమ్ పటిష్టంగా ఉంది. టీమ్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. తొలి సీజన్లో వరంగల్ వారియర్స్‌ను విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం’ అని అమన్ రావు చెప్పాడు. -
సత్తా చాటిన రాయుడు.. మెదక్‌పై పాలమూరు గెలుపు
టీజీ20 లీగ్ 2026లో ఇవాళ (జూన్ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై పాలమూరు స్ట్రయికర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోహిత్ రాయుడు (54) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. బుడిది తేజ (23), ప్రతీక్ పవార్ (27 నాటౌట్) సహకారంతో పాలమూరును విజయతీరాలకు చేర్చారు. రాయుడు, పవార్ సత్తా చాటడంతో పాలమూరు జట్టు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్ బౌలర్లలో వరుణ్ యెర్రం 2, ఘజా అబ్బాస్, శృంజిత్ రెడ్డి, రవితేజ తలో వికెట్ తీశారు. -
మెదక్‌పై పాలమూరు గెలుపు
ఆదిలోనే పాలమూరుకు షాక్165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో బంతికే కరణ్ యాదవ్ (0), మూడో ఓవర్ నాలుగో బంతికి ప్రజ్ఞయ్ రెడ్డి (15) ఔటయ్యారు. రెండు వికెట్లు యెర్రం వరుణ్‌కే దక్కాయి. 3 ఓవర్ల తర్వాత పాలమూరు స్కోర్ 18-2గా ఉంది. పాలమూరు టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు. కష్టాల్లో మెదక్మెదక్ జట్టు ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అశ్విన్ రామ్ (12) రిటైర్డ్ ఔట్ కాగా.. శృంజిత్ రెడ్డి (19) తేజ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత మెదక్ స్కోర్ 58-4గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన మెదక్3.4వ ఓవర్- 36 పరుగుల వద్ద మెదక్ రెండో వికెట్ కోల్పోయింది. రవి కిరణ్ బౌలింగ్‌లో నమన్ అగర్వాల్ (21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లోనే మెదక్‌కు షాక్మెదక్ ఫాల్కన్స్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రవి కిరణ్ బౌలింగ్‌లో పవార్‌కు క్యాచ్ ఇచ్చి సాయి కాకులమర్రి (1) ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాలమూరు స్ట్రయికర్స్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరుగుతున్న తొమ్మిదో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్, మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాలమూరు జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
మా బ్యాటింగ్ బాగుంది.. ఛేజింగ్‌లో బెటర్: తన్మయ్ అగర్వాల్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని.. వారు తప్పక రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ డైమండ్స్ జట్టు గురువారం సాక్షి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కోచ్ సుమంత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం, ప్రత్యర్థిని బట్టి మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాము.అందుకు అనుగుణంగానే జట్టు కూర్పు కూడా ఉంటుంది. ఏదేమైనా ప్రతీ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా ఆఖరి వరకు మేము పోరాడతాము. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెంట నిలిచే అభిమానులను గర్వపడేలా చేయడమే మా లక్ష్యం.ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారుహైదరాబాద్ ఇ- చాంపియన్స్ జట్టును ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాము. ఆ జట్టుతో మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడతాము. ఇక తిలక్ వర్మ (మెదక్ ఫాల్కన్స్), మహ్మద్ సిరాజ్ (వరంగల్ వారియర్స్) వంటి టీమిండియా స్టార్లపై ఆడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లతో పోటీని కూడా మా వాళ్లు పూర్తిగా ఆస్వాదిస్తూ.. సత్తా చాటగలరనే నమ్మకం ఉంది’’ అని సుమంత్ పేర్కొన్నారు.ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అభిమానుల మద్దతు మాకు చాలా అవసరం. నా భార్య కూడా స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తుంది. కుటుంబం నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే, మైదానంలో దిగిన తర్వాత మాత్రం దృష్టి మొత్తం ఆట మీదే ఉంటుంది. మేము మా యాజమాన్యం పట్ల కృతజ్ఞులమై ఉంటాము. మ్యాచ్ ఓడినా.. గెలిచినా... నా సహచర ఆటగాళ్ల పట్ల నాకు కృతజ్ఞతాభావం ఉంటుంది. మేమంతా కలిస్తే జట్టు. కాబట్టి గెలుపోటములలో అందరికీ సమాన భాగం ఉంటుంది’’ అని తెలిపాడుడ్రెసింగ్రూమ్ వాతావరణంఅదే విధంగా.. ‘‘మ్యాచ్‌కు ముందు ఒత్తిడి ఉండటం సహజం. అప్పుడు మా టీమ్మేట్ ఆశిష్ శ్రీవాస్తవ్ మమ్మల్ని కూల్ చేస్తాడు (నవ్వులు). ఇక మా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి మా జట్టు ఛేజింగ్‌లో మరింత గొప్పగా రాణించగలదని చెప్పగలను. మా ఆల్‌రౌండర్ హరీశ్ ఠాకూర్ ఏడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయగలడు.గత మ్యాచ్‌లో కూడా మేము బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ 8-9 తొమ్మిది బంతుల్లో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆటలో ఇవన్నీ సహజం. మేము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాము. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నా.ఇక కెప్టెన్‌గా జట్టును సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించడం అత్యంత ముఖ్యం. గత పదిహేనేళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నా. మా జట్టు సభ్యుల సందేహాలు తీర్చడం, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలు మార్చడం నా విధి. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే నా లక్ష్యం. యాజమాన్యం మాపై ఒత్తిడి పెట్టదు. టీజీ20 ద్వారా మాకు మంచి ప్లామ్ఫామ్ దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని తన్మయ్ అగర్వాల్ పేర్కొన్నాడు.చదవండి: కరీంనగర్‌పై నల్గొండ గెలుపు -
రంగారెడ్డికి తొలి ఓటమి.. హైదరాబాద్‌కు రెండో గెలుపు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)-2026లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి రైజర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ గురువారం ఉప్పల్ వేదికగా తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా... రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది.రంగారెడ్డి స్కోరెంతంటే?ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ 35 పరుగులు చేయగా.. అవనీశ్ రావు మెరుపు అర్ధ శతకం (29 బంతుల్లో 53) సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య జవ్వాజి సైతం హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 58) చేయగా.. త్యాగరాజన్ 22 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సాయి యాదవ్ (10 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.అభిరథ్ రెడ్డి ధనాధన్లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ ఆదిలోనే ఓపెనర్ వికాస్ రెడ్డి (3).. వన్‌డౌన్ బ్యాటర్ అన్విత్ రెడ్డి (4) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదిన అభిరథ్ రెడ్డి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. రంగారెడ్డి కెప్టెన్ తనయ్ త్యాగరాజన బౌలింగ్‌లో హితేశ్‌కు మ్యాచ్ ఇచ్చి 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మిగిలిన వారిలో షణ్ముఖ 30, గణేశ్ 25, యశ్వీర్ 30 పరుగులతో రాణించారు. ఫలితంగా 18 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా సీజన్లో రంగారెడ్డికి ఇది తొలి ఓటమి కాగా.. హైదరాబాద్‌కు రెండో గెలుపుసంక్షిప్త స్కోర్లురంగారెడ్డి- 195/4హైదరాబాద్- 198/4 (18)ఫలితం- ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపుతుదిజట్లురంగారెడ్డిఅవనీశ్ రావు అరవెల్లి (వికెట్ కీపర్), తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, రాకేశ్, అరుణ్ కుమార్, పున్నయ్య భువనగిరి, ఆర్యన్ కరియప్ప.హైదరాబాద్అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్‌గౌడ్, అభిరథ్ రెడ్డి (కెప్టెన్), గణేశ్ గడుగు, సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ శర్మ, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, అఖిల్ రాథోడ్, యశ్వీర్ గౌడ్. -
రాణించిన నితీశ్ రెడ్డి.. కరీంనగర్‌పై నల్గొండ గెలుపు
టీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో).వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరుణ్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది.కరీంనగర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా ప్లేయర్లలో షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం లక్ష్య ఛేదనకు ముందు వరుణుడు మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. ఛేదనలో నల్గొండ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా, నితీశ్ రెడ్డి (52), దివేశ్ సింగ్ (36 నాటౌట్) బాధ్యతాయుంగా ఆడారు. నితీశ్ నల్గొండను గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత ఔట్ కాగా.. దివేశ్, అర్ఫాజ్ ఖాన్ (6 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో 18 బంతులు మిగిలుండగానే నల్గొండ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కరీంనగర్‌పై నల్గొండ గెలుపు
కరీంనగర్‌పై నల్గొండ గెలుపుటీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో). లక్ష్యం దిశగా సాగుతున్న నల్గొండవరుణుడు అంతరాయం కలిగించడంతో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. 10 ఓవర్ల తర్వాత నల్గొండ స్కోర్ 76-3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 42 బంతుల్లో 41 పరుగులు చేయాలి. చెలరేగిన రక్షణ్, వరుణ్.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరున్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కష్టాల్లో కరీంనగర్వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి మొదలైంది. వర్షానికి ముందే 9వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. అదే ఓవర్ చివరి బంతికి, మరుసటి ఓవర్ తొలి బంతికి మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత 14 ఓవర్ వరకు జాగ్రత్తగా ఆడిన కరీంనగర్.. 15వ ఓవర్ మూడో బంతికి మరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రక్షణ్ రెడ్డి బౌలింగ్‌లో షుభమ్ శర్మ (20) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 102-6గా ఉంది. ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన కరీంనగర్కరీంనగర్ జట్టు 9వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. వరుణ్ గౌడ్ బౌలింగ్‌లో తొలుత సాత్విక్ రెడ్డి (1), ఆతర్వాత షరణ్ (15) ఔటయ్యారు. తొలి వికెట్ కోల్పోయిన కరీంనగర్.. 8 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?7.1వ ఓవర్- 61 పరుగుల వద్ద కరీంనగర్ తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న తన్మయ్ అగర్వాల్ (46) అర్ఫాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 62-1గా ఉంది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నల్గొండటీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నల్గొండ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు..నల్గొండ నైట్స్:రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను. కరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్ -
శతక్కొట్టిన హర్షిత్ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్-2026 (టీజీ20)లో మూడో శతకం నమోదైంది. వరంగల్ వారియర్స్ ఓపెనర్ హర్షిత్ చౌదరి శతక్కొట్టాడు. ఖమ్మం ఏసెస్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 48 బంతుల్లో హర్షిత్ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో తొ మ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.వరంగల్‌కు తొలుత ఓటమికాగా జూన్ 21న టీజీ20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఉప్పల్ వేదికగా సోమవారం మెదక్ ఫాల్కన్స్‌పై 32 బంతుల్లోనే శతక్కొట్టాడు.తద్వారా లీగ్‌లో మొట్టమొదటి సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు ఈ కరీంనగర్ అబ్బాయి. అయితే, ఆ వెంటనే మెదక్ సారథి తిలక్ వర్మ కూడా సెంచరీ చేసి.. లీగ్‌లో రెండో శతకం నమోదు చేయడంతో పాటు.. వరంగల్‌పై తన జట్టుకు విజయం అందించాడు.ఖమ్మం స్కోరు 202తాజాగా తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ఖమ్మం ఏసెస్‌ను ఎదుర్కొన్న వరంగల్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఖమ్మం బ్యాటర్లలో మయాంక్ గుప్త (54), మికిల్ జైస్వాల్ (54) అర్ధ శతకాలతో రాణించారు.చెలరేగిన హర్షిత్.. వరంగల్ బోణీవరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, హుసేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఆదిలోనే కెప్టెన్ అమన్‌రావు (7) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ హర్షిత్ చౌదరి శతకంతో చెలరేగాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొన్న హర్షిత్ పదకొండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో వరంగల్‌ను విజయతీరాలకు చేర్చాడు హర్షిత్ చౌదరి. ఫలితంగా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వరంగల్.. ఖమ్మంపై ఐదు వికెట్ల తేడాతో (208-5) విజయం సాధించింది.ఇక సీజన్లో వరంగల్‌కు ఇదే తొలి గెలుపు. టీమిండియా స్టార్ మహ్మద్ సిరాజ్ వరంగల్ జట్టుతో పాటు స్టేడియానికి వచ్చినప్పటికీ.. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో వరంగల్ తరఫున సిరాజ్ బరిలో దిగనున్నాడు.చదవండి: డ్రెసింగ్ రూమ్‌లోకి వైభవ్‌కి నో ఎంట్రీ!One of the finest knocks Uppal has seen! 🤩A hundred that raised the bar for batters all over!Harshit Choudhary deserves ALL the accolades, leading his side to a memorable first win. ⚡️#AKAvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/fQrjo7xfgE— tg20official (@tg20official) June 24, 2026 -
ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్- 2026 (టీజీ20)లో భాగంగా బుధవారం వరంగల్ వారియర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది.ఖమ్మం ఆలౌట్ఓపెనర్లలో వాఫీ కచ్చీ (17) విఫలం కాగా.. మయాంక్ గుప్త అర్ధ శతకం (54)తో రాణించాడు. మిగిలిన వారిలో హిమతేజ (23), ప్రతీక్ రెడ్డి (20) ఫర్వాలేదనిపించగా.. మికిల్ జైస్వాల్ మెరుపు హాఫ్ సెంచరీ (22 బంతుల్లో 54)తో దుమ్ములేపాడు.కెప్టెన్ సీవీ మిలింద్ 11 పరుగులకే వెనుదిరగగా.. వరంగల్ బౌలర్ల ధాటికి విశాల్ యాదవ్ (0), విద్యానంద రెడ్డి (6), సాయి వెంకట్ ధాత్రక్ (2), మహేశ్ విప్పర్ల (1) పెవిలియన్‌కు వరుసకట్టారు. వేద్ రెడ్డి అమిస్తాపురం 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ మూడేసి వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, మదస్సర్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వరంగల్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఏడు బంతులు మిగిలి ఉండగానే.. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి (208-5) పని పూర్తి చేసింది. హర్షిత్ చౌదరి మెరుపు సెంచరీ (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు: 121 రన్స్) చేసి ఒంటిచేత్తో వరంగల్‌ను గెలిపించాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఖమ్మం బౌలర్లో సాకేత్ ధాత్రక్ రెండు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్, మహేశ్ విప్పర్ల, వేద్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మం వాఫీ కచ్చీ, మయాంక్ గుప్త, సీవీ మిలింద్ (కెప్టెన్), హిమతేజ, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి, సాయి వెంకట్ ధాత్రక్, విశాల్ యాదవ్, మహేశ్ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డివరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), రుషికేశ్ సిసోడియా, హర్షిత్ చౌదరి, అభిషేక్, మణి కిరణ్, షౌనక్ కులకర్ణి, హుసేన్, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్ మాలిక్. -
టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్ అట్రాక్షన్‌గా తిలక్ వర్మ (ఫొటోలు)
-
‘భవిష్యత్తు బాగుంటుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్ మున్ముందు పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాము జత కట్టామని వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్ జూపల్లి అన్నారు. ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు సరైన అవకాశం ఎదురు చూస్తున్నారని, తొలి సీజన్లో ఇప్పటి వరకు లభిస్తున్న స్పందనను చూస్తే లీగ్ విజయవంతమైనట్లుగా చెప్పవచ్చని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘మా సన్నిహితులు అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌లోని ఒక జట్టులో సహ యజమానిగా ఉన్నారు. ఆ కారణంగా టీజీ టి20లో టీమ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగింది. క్రికెట్‌పై ఆసక్తితో పాటు మన వద్ద జరుగుతున్న టోర్నీలో భాగమైతే బాగుంటుందని ముందుకు వచ్చాం. ఇందులో లాభాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. రాబోయే సీజన్లలో లీగ్ మరింత పెద్ద స్థాయికి చేరుతుంది’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా... వరంగల్ టీమ్ అన్ని విధాలా పటిష్టంగా ఉందని వరుణ్ చెప్పారు. ముఖ్యంగా పేరాల అమన్ రావు అద్భుత ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అమన్ సూపర్ షాట్స్ ఆడాడు. సాధికారికంగా అతను బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఐపీఎల్‌లోకి ఎందుకు ఎంపికయ్యాడో తెలుస్తుంది. అమన్ మాత్రమే కాకుండా ఇతర కుర్రాళ్లపై కూడా మాకు నమ్మకం ఉంది. లీగ్‌లో వారియర్స్ మంచి ఫలితాలు సాధించడం ఖాయం’ అని వరుణ్ వెల్లడించారు. బీసీసీఐ అనుమతించిన నిబంధనల ప్రకారం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటంతో తొలి మ్యాచ్ ఆడలేదని... తర్వాతి మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగుతాడని వరుణ్ స్పష్టం చేశారు. -
త్యాగరాజన్ ఆల్‌రౌండ్ షో.. ఫాల్కన్స్‌పై రైజర్స్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. ఫాల్కన్స్‌ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. అనంతరం రైజర్స్ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన తనయ్ త్యాగరాజన్ బంతితో (4-0-36-3), బ్యాట్‌తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.రాణించిన బౌలర్లుతనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శుభారంభం అందించిన ఓపెనర్లు165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్ జార్జ్ (27), అరవెల్లి అవనీశ్ (25) మెరుపు ఇన్నింగ్స్‌లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్ (9) నిరాశపరిచినా.. రాకేశ్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్ త్యాగరాజన్, నితిన్ యాదవ్ (28 నాటౌట్) సహకరించారు. ఫాల్కన్స్ బౌలర్లలో వరుణ్ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్, అశ్విన్ రామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మెదక్ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్ గెలుపు
మెదక్ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్ గెలుపుతొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. రంగారెడ్డి రైజర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గెలుపు దిశగా రంగారెడ్డి రైజర్స్165 పరుగుల లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ గెలుపు దిశగా సాగుతోంది. 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన ఆ జట్టు.. మరో 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. సత్తా చాటిన త్యాగరాజన్.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్5 బంతుల వ్యవధిలో ఫాల్కన్స్ 2 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్మూడో బంతికి త్యాగరాజన్ నమన్ అగర్వాల్‌ను (37) ఔట్ చేయగా. 16వ ఓవర్ తొలి బంతికే వరుణ్‌ను (1) అరుణ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కోలుకున్న ఫాల్కన్స్5 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఫాల్కన్స్ తిరిగి కోలుకుంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడే వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్ (31), నమన్ అగర్వాల్ (21) ఫాల్కన్స్‌ను ఆదుకున్నారు. 3 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న మెదక్ ఫాల్కన్స్ కష్టాలు ఎదుర్కొంటుంది. 55 ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత తనయ్ త్యాగరాజన్ బౌలింగ్‌లో శృన్జిత్ రెడ్డి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆతర్వాత రవితేజ (6), పూర్ణచంద్ రావ్ (38) పెవిలియన్‌కు చేరారు. రవితేజను తనయ్ జడ్డూ ఔట్ చేయగా.. త్యాగరాజన్ పూర్ణచంద్ ఆట కట్టించాడు. తొలి వికెట్ కోల్పోయిన ఫాల్కన్స్2.3వ ఓవర్- 26 పరుగుల వద్ద మెదక్ ఫాల్కన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ బౌలింగ్‌లో శృన్జిత్ రెడ్డి (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ప్రణవ్ రంగారెడ్డి రైజర్స్- మెదక్ ఫాల్కన్స్ మంగళవారం రాత్రి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మెదక్ ఫాల్కన్స్ బ్యాటింగ్‌కు దిగింది.తుది జట్లు..రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్ఘీస్, అవనీశ్ రావ్ (వికెట్‌కీపర్), అలంక్రిథ్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితీశ్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డూ, ఆర్యన్ కరియప్పమెదక్ ఫాల్కన్స్: రవితేజ (కెప్టెన్), సాయి పూర్ణానంద్ రావ్, శృన్జిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్‌కీపర్), సూర్య తేజ, సాయి వరుణ్, జంగం బన్ని, అశ్వినన్ రామ్, నమన్ అగర్వాల్, సయ్యద్ ఘజా అబ్బాస్, మధుకర్ మన్నే -
హైదరాబాద్‌కు తొలి గెలుపు
తెలంగాణ టీ20 లీగ్-2026లో హైదరాబాద్ ఇ- ఛాంపియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్.. పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం అందించగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్ బస్లాస్ 2, రవి కిరణ్ ఓ వికెట్ తీశారు. -
పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ మంగళవారం తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది. పాలమూరు ఆలౌట్హైదరాబాద్ బౌలర్ల ధాటికి పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరుగా రాణించారు. హైదాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ గెలుపునామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. 15.4 ఓవర్లలో పనిపూర్తి చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి గెలుపు నమోదు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేయగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాలమూరు బౌలర్లలో రిషభ్ బస్లాస్ రెండు, రవి కిరణ్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పాలమూరు ఖమ్మం ఏసెస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.తుదిజట్లుపాలమూరుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి, పృథ్వీ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, నిశాంత్ సేన్ రెడ్డి సీహెచ్, ప్రతీక్ పవార్, మహ్మద్ ఆఫ్రిది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, రిషభ్ బస్లాస్, కిరణ్, జంబోజు పార్దీబన్.హైదరాబాద్హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), సాయి వికాస్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ, అఖిల్ రాథోడ్, గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, యశ్వీర్ గౌడ్. -
టైటిల్ ఖమ్మం టీందే..!
-
‘చాలా బాధపడ్డాను.. సత్తా చాటేందుకు ఇదే మంచి సమయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది. 'టోర్నీ తొలి మ్యాచ్‌లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్‌కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్‌లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్‌సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా హెచ్‌సీఏ లీగ్స్‌లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్‌కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్‌కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్‌గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్ హాంఫట్
తెలంగాణ టీ20 లీగ్‌ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు. -
TG20 League 2026: తిలక్ వర్మ సూపర్ సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు. -
TG20 League: వైభవ్ టీమ్మేట్ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా అమన్‌రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్‌ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్‌లో అమన్ దుమ్ములేపుతున్నాడు. -
TG20 League 2026: శతక్కొట్టిన తిలక్ వర్మ.. మెదక్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.మెదక్ ఫాల్కన్స్ ఘన విజయంఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.విజయం దిశగా మెదక్మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్‌లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదక్ మూడో వికెట్ డౌన్మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్‌రావు పేరాల.. రాహుల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీఅమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీవరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్‌ప్లేలోనే వంద పరుగులు దాటింది.దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లువరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్‌గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్‌ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తుదిజట్లు వరంగల్ వారియర్స్ అమన్‌రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె. -
తనయ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రంగారెడ్డి ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ శుభారంభం చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం సాధించింది. నల్గొండ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. రైజర్స్ కెప్టెన్ తన్మయ్ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేశాడు. నల్గొండ బౌలర్లలో వరుణ్ గౌడ్, అనికేత్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.That's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
నల్గొండ నామమాత్రపు స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ సోమవారం ముఖాముఖి ఎదురుపడ్డాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.నల్గొండ స్కోరెంతంటే?ఈ క్రమంలో రంగారెడ్డి బౌలింగ్ ధాటికి నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి మెరుపులు (19 బంతుల్లో 30) మెరిపించాడు.మిగిలిన వారిలో వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్, హర్షవర్దన్ సింగ్ నల్గొండ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. దివేశ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు వికెట్లతో చెలరేగగా.. కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు.తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృద్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నివాంత్ శరణు. Update: తనయ్ కెప్టెన్ ఇన్నిం గ్స్.. రంగారెడ్డి ఘన విజయంThat's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్.. పాలమూరు స్ట్రైకర్స్‌పై గెలుపొందగా.. తాజాగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నల్గొండ స్కోరెంతంటే?నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి వేగంగా (19 బంతుల్లో 30) ఆడాడు. వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఫెయిలయ్యారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. రంగారెడ్డి ఘన విజయంనల్గొండ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేయగా.. తనయ్ త్యాగరాజన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితిన్ సాయి యాదవ్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను. -
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
-
TG20 League: అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం
తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.Juggling act but safe hands! 😮💨Inches away from the boundary rope, Vidyananda Reddy Ellala recovers well to dismiss the opposition skipper.#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/G64zKnQpUw— tg20official (@tg20official) June 21, 2026 -
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్‌లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
అట్టహాసంగా టీజీ20 లీగ్ ఆరంభ వేడుకలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టీ20 లీగ్ (TG20) తొలి సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ టీ20 లీగ్ మంచి అవకాశమని ఈ సందర్భంగా విక్రమార్క పేర్కొన్నారు.ఆయనతో పాటు టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్తో స్టేడియంలో జోష్ నింపారు. ఉర్రూతలూగించే పాటలతో సాగిన డిజిటల్ లేజర్ షో,. సాంస్కృతిక ప్రదర్శనలు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశాయి.No warm-up needed.Thaman set the TG20 stage on fire from the very first beat. 🔥⚡#OpeningCeremony #SreenidhiUniversity #ManaCricketShuru pic.twitter.com/hh8HXB3rl8— tg20official (@tg20official) June 21, 2026 -
పాలమూరు స్ట్రైకర్స్‌పై ఖమ్మం ఘన విజయం
Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates:. తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.పాలమూరు ఐదో వికెట్ డౌన్పాలమూరు ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ప్రతీక్ పవార్.. మిలింద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లకు పాలమూరు స్కోర్: 190/5. పాలమూరు విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి.పాలమూరు మూడో వికెట్ డౌన్35 పరుగులు చేసిన చైతన్య రెడ్డి.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు పాలమూర్ స్కోర్: 167/3పాలమూరు రెండో వికెట్ డౌన్పాలమూరు రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రజ్ఞయ్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు.పాలమూరు తొలి వికెట్ డౌన్పాలమూరు తొలి వికెట్ కోల్పోయింది. 86 పరుగులు చేసిన విగ్నేష్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పాలమూరు స్కోర్: 133/1దూకుడుగా ఆడుతున్న పాలమూరు ఓపెనర్లు238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి పాలమూరు వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో అనుముల విగ్నేష్ రెడ్డి(45), చైతన్య రెడ్డి(7) ఉన్నారు.పాలమూరు టార్గెట్ ఎంతంటే?పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.GSK aale aale, nahi khelte hai haule haule! 🥵Three 6️⃣s in an over that gave the #AnvitaKhammamAces the very start they needed. 🔥#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/67iEuethQs— tg20official (@tg20official) June 21, 2026మూడో వికెట్ డౌన్ఖమ్మం జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జైశ్వాల్.. అఫ్రిది అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు స్కోర్: 150/3ఖమ్మం రెండో వికెట్ డౌన్ఖమ్మం ఏసెస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కృష్ణ రెడ్డి.. రోహిత్ రాయుడు బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 141/2ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ డౌన్అన్విత ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన వాఫీ కచ్చీ.. నిపుణ్ రెడ్డి శవ్వా బౌలింగ్ ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 113/1దుమ్ములేపుతున్న ఖమ్మం ఓపెనర్లుఅన్విత ఖమ్మం ఏసెస్ ఓపెనర్లు కృష్ణ రెడ్డి(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30), వాఫీ కచ్చీ(24 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) దుమ్ములేపుతున్నారు. 7 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ స్కోర్: 86/0తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్‌కు తెరలేచింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఉప్పల్ మైదానం వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుఖమ్మం ఏసెస్కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డిపాలమూరు స్ట్రైకర్స్అన్ముల విఘ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి(కెప్టెన్), పృథ్వీ రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, మహమ్మద్ అఫ్రీది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, బుడిది రతన్ తేజ, పి.ఎస్. చైతన్య రెడ్డి, జంబోజు పార్థిపన్, రవి కిరణ్ మజేటి -
తెలంగాణ టి20కి వేళాయె..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక టి20 లీగ్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అధికారికంగా టీజీ టి20 లీగ్‌ను తొలిసారి నిర్వహించనున్నారు. గతంలో పలు వేర్వేరు లీగ్ టోర్నీలు జరిగినా... బీసీసీఐ అనుమతితో అధికారికంగా టోర్నీని జరపడం ఇదే తొలిసారి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర అసోసియేషన్లు రాష్ట్ర స్థాయిలో వర్ధమాన క్రికెటర్ల కోసం ఇలాంటి టి20 లీగ్‌ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు హెచ్‌సీఏ కూడా ఆ జాబితాలో చేరింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేడు టోర్నీ మొదలు కానుంది. 22 రోజుల పాటు జరిగే టోర్నీలో ఫైనల్ సహా మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూలై 12న ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. దీనికి ముందు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 160 మంది ప్లేయర్లు... టీజీ టి20 లీగ్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. హైదరాబాద్ ఇ–చాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్ టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టీమ్‌లకు అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, ప్రజ్ఞయ్ రెడ్డి, రవితేజ, అమన్ రావు, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముందుగా బిడ్ ద్వారా ఎనిమిది మంది ఫ్రాంచైజీలను ఎంపిక చేయగా, ఆ తర్వాత వేలం ద్వారా టీమ్‌లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.ఒక్కో టీమ్‌లో 20 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించారు. వేలంలో అత్యధికంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మకు రూ.33 లక్షలు దక్కగా, పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు లభించాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ మిలింద్కు అత్యధికంగా రూ. 17 లక్షలు దక్కాయి. ఆటగాళ్ల కోసం అన్ని జట్లు కలిపి మొత్తం రూ. 4.74 కోట్లు వెచ్చించాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా తిలక్, సిరాజ్ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారనే విషయంపై స్పష్టత లేదు. రూ.49 టికెట్... తొలిసారి నిర్వహిస్తున్న లీగ్ కోసం హెచ్‌సీఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తుండగా, ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించారు. టోర్నీకి శ్రీనిధి యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తడంతో దీనిపై హెచ్‌సీఏ వివరణ ఇచ్చింది. లీగ్ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిందని, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణలోనే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఎక్కువ మంది అభిమానులు స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు చూడటం కోసం కేవలం రూ.49 టికెట్‌ను అందుబాటులో ఉంచారు. ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వివరాలు » కరీంనగర్ డైమండ్స్ – ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ జ్వెలర్స్ » ఖమ్మం ఏసెస్ – అన్విత గ్రూప్ » పాలమూరు స్ట్రైకర్స్ – వీరభద్ర స్టీల్స్ » మెదక్ ఫాల్కన్స్ – బృంద ఇన్ఫ్రా » వరంగల్ వారియర్స్ – బైన్ గ్లోబల్ రిసోర్సెస్ » రంగారెడ్డి రైజర్స్ – బూరుగు ఇన్ఫ్రా అండ్ ప్రణవ » నల్లగొండ నైట్స్ – కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్æ » హైదరాబాద్ ఇ–చాంపియన్స్– ఉషోదయ ఎంటర్ప్రైజెస్ -
‘బ్యాటింగ్ మా ప్రధాన బలం.. సీక్రెట్ వెపన్ అతడే!’
ఆదివారం నుంచి ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుతో సాక్షి మీడియా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జట్టు బలాలు, బలహీనతలపై ఖమ్మం ఏసెస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అన్ని జట్లతో పోలిస్తే బ్యాటింగ్ తమ ప్రధాన బలమని ఖమ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జట్టులో ఉన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్‌లోనే వాడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయర్ ఎవరనేది మాత్రం తాము రివీల్ చేయబోవవడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం జట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు రంజీల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సహా ఇతర లీగ్స్‌కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్‌లు తమ లాంటి ఆటగాళ్లకు కీలకంగా మారుతుందని తెలిపాడు. తమ జట్టులో లెగ్ స్పిన్నర్‌గా వేద్‌రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడని, అతడు తన స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో కెప్టెన్ సీవీ మిలింద్‌తో పాటు వైస్ కెప్టెన్ హిమతేజ, లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి, ఓపెనర్ ప్రతీక్‌రెడ్డి పాటు ఇతర క్రికెటర్లు పాల్గొన్నారు. ఇక ఖమ్మం ఏసెస్ జట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖమ్మం ఏసెస్ జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 21న పాలమూరు స్ట్రైకర్స్‌తో ఆడనుంది. -
TG20: ఎనిమిది జట్లు, ఆటగాళ్ల ధర.. పూర్తి వివరాలు
తెలంగాణలో ప్రతిష్టాత్మక టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో టీజీ20 పేరిట జూన్ 21 నుంచి జూలై 10 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఈ చాంపియన్స్ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఏ జట్టులో ఎవరు? ధర ఎంత?కరీంనగర్ డైమండ్స్చందన్ సహానీ- రూ. 9.5 లక్షలుఆశిష్ శ్రీవాస్తవ్- రూ. 9 లక్షలుతన్మయ్ అగర్వాల్- రూ. 8 లక్షలురాహుల్ రాదేశ్- రూ. 4.5 లక్షలురత్లావత్ దినేశ్- రూ. 4.5 లక్షలుహృషికేశ్ సింహ- రూ. 3.7 లక్షలుశుభం శర్మ- రూ. 3.5 లక్షలుమహ్మద్ అబ్దుల్ అద్నాన్- రూ. 3 లక్షలుఎన్ సాత్విక్ రెడ్డి- రూ. 2 లక్షలుటీవీఎస్ నారాయణ తేజ- రూ. 2 లక్షలుఅఖిల్ కుమార్ సంకోజు- రూ. 1.5 లక్షలుబి సతీశ్ కుమార్- రూ. లక్షసాయి కార్తికేయ మల్లం- రూ. 95 వేలునిహాల్ రెడ్డి- రూ. 75 వేలుర్యాన్ బిన్ అబ్దుల్లా- రూ. 75 వేలుఆశిష్ అభయ్- రూ. 75 వేలురావూరి సాయి శరణ్- రూ. 75 వేలుపగడాల లోకేశ్- రూ. 75 వేలుయశ్ సత్వాలేకర్- రూ. 75 వేలుచిల్లకూరు లిఖిత్ రెడ్డి- రూ. 75 వేలుఖమ్మం ఏసెస్చామా వ్రజేంద్ర మిలింద్- రూ. 17 లక్షలుహిమతేజ కొడిమెల- రూ. 8 లక్షలుమికిల్ జైస్వాల్- రూ. 6 లక్షలుఅనంత్ ప్రతీక్ రెడ్డి- రూ. 3.75 లక్షలుసాకేత్ ధాత్రక్- రూ. 3.5 లక్షలువఫీ కచ్చి- రూ. 3.25 లక్షలుఖుష్ అగర్వాల్- రూ. 3 లక్షలుమయాంక్ గుప్త- రూ. 3 లక్షలుజీఎస్కే రెడ్డి- రూ. 1.8 లక్షలువిద్యానంద రెడ్డి ఎల్లాల- రూ. 1.7 లక్షలుమహేశ్ విప్రాలా- రూ. 1.3 లక్షలుషేక్ అజర్- రూ. లక్షబద్ది విశాల్ యాదవ్- రూ. 85 వేలుసబవేత్ లోక్‌నాథ్ నాయక్- రూ. 75 వేలుమగవత్ సిద్ధు నాయక్- రూ. 75 వేలుపారస్ రాజ్- రూ. 75 వేలువేద్ రెడ్డి అమిస్తాపురం- రూ. 75 వేలువివేక్ సింగ్- రూ. 75 వేలుసహేంద్ర మల్లు- రూ. 75 వేలుఆవేజ్ అహ్మద్- రూ. 75 వేలుపాలమూరు స్ట్రైకర్స్రవి కిరణ్ మేజేటి- రూ. 13 లక్షలుప్రజ్ఞయ్ రెడ్డి- రూ. 11 లక్షలురోహిత్ రాయుడు కొలగాని- రూ. 6.5 లక్షలుప్రతీక్ పవార్- రూ. 4.25 లక్షలుపీఎస్ చైతన్య రెడ్డి- రూ. 3.25 లక్షలుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి- రూ. 3 లక్షలుఎ. పృథ్వీ రెడ్డి- రూ. 3 లక్షలునిశాంత్ సేన్ రెడ్డి సీఎహెచ్- రూ. 2.3 లక్షలుమహ్మద్ ఆఫ్రిది అహ్మద్- రూ. 2.3 లక్షలురిషభ్ బస్లాస్- రూ. 2 లక్షలుఎం సంహిత్ రెడ్డి- రూ. 2 లక్షలుషేక్ అబ్దుల్ జీషాన్- రూ. లక్షఅశ్వద్ రాజీవ్- రూ. 95 వేలుబూడిది రతన్ తేజ- రూ. 80 వేలుకరణ్ యాదవ్- రూ. 75 వేలుమణికంఠేశ్వర్ రెడ్డి- రూ. 75 వేలుమహ్మద్ షాదాబ్ అహ్మద్- రూ. 75 వేలునిపుణ్ రెడ్డి షవ్వా- రూ. 75 వేలుజంబోజు పార్ధీపన్- రూ. 75 వేలుఎండీ అజారుద్దీన్- రూ. 75 వేలు.మెదక్ ఫాల్కన్స్తిలక్ వర్మ- రూ. 33 లక్షలురవితేజ టి- రూ. 12 లక్షలువిక్రం నాయక్ గుగులోత్- రూ. 1.1 లక్షలుశశాంత్ బుడ్తి- రూ. లక్షనిమ్న నిమగడ్డ సూర్య తేజ- రూ. 85 వేలుహరి ఓం సింగ్- రూ. 75 వేలుఇషాన్ శర్మ- రూ. 75 వేలుబన్నీ జగమ్- రూ. 75 వేలుజయదేవ్ రెండ్ల- రూ. 75 వేలుసాయి పూర్ణానంద్ రావు కాకులమర్రి- రూ. 75 వేలుకుంటా రాహుల్- రూ. 75 వేలుమధుకర్ మన్నె- రూ. 75 వేలునమన్ అగర్వాల్- రూ. 75 వేలునయని అనీశ్ రెడ్డి- రూ. 75 వేలునొమన్ అహ్మద్- రూ. 75 వేలుసయ్యద్ ఘాజి అబ్బాస్- రూ. 75 వేలుసాయి వరుణ్ యెర్రమ్- రూ. 75 వేలుఅశ్వినన్ రామ్ బూర్గుబావి- రూ. 75 వేలుశ్రుజిత్ రెడ్డి- రూ. 75 వేలురంగనాథ్ బీకే- రూ. 75 వేలుహైదరాబాద్ ఈ చాంపియన్స్అభిరథ్ రెడ్డి మందాడి- రూ. 11 లక్షలుఅజయ్ దేవ్ గౌడ్- రూ. 11 లక్షలుఅఖిల్ రాథోడ్- రూ. 1.6 లక్షలుఅన్విత్ రెడ్డి- రూ. 3.5 లక్షలుబాకి హిశాంత్ ప్రేమ్ చరణ్- రూ. 95 వేలుసి. అభినవ్ తేజ్- రూ. లక్షదేవ్ మెహతా- రూ. 75 వేలుగణేష్ గడుగు- రూ. 3.25 లక్షలుగూడెల్లి జశ్వంత్- రూ. 75 వేలుమిర్యాల ప్రత్యుష్ కుమార్- రూ. 75 వేలుఎం.ఎం. చరణ్- రూ. 75 వేలునితిన్ నాయక్- రూ. 75 వేలుపి. అరవింద్- రూ. 1 లక్షప్రణవ్ వర్మ- రూ. 8. 5 లక్షలుసాయి వికాస్ రెడ్డి- రూ. 4.25 లక్షలుఫణ్ముఖ అశ్విన్- రూ. 1.5 లక్షలుశ్రీనికేత్- రూ. 2.3 లక్షలుతరుణ్ రాజన్- 1.6 లక్షలువైష్ణవ్ రెడ్డి ఎ- - రూ. 75 వేలుయశ్వీర్ గౌడ్- రూ. 3 లక్షలునల్గొండ నైట్స్మహమ్మద్ అర్ఫాజ్ అహ్మద్- రూ. 11 లక్షలుఏల్గాని వరుణ్ గౌడ్- రూ. 3.5 లక్షలుఅనికేత్ రెడ్డి- రూ. 4.7 లక్షలుబీరవోలు నాగ సుధాంశ్ రెడ్డి- రూ. 75 వేలుచిన్నట్ల రక్షణ్ రెడ్డి- రూ. 6 లక్షలుచిన్నుగారి రుత్విక్- రూ. 75 వేలుదివేష్ సింగ్ - రూ. 75 వేలుగౌరవ్ రెడ్డి- రూ. 4.5 లక్షలుఇల్యాన్ సథాని- రూ. లక్షజశ్వంత్ మోటే- రూ. 75 వేలుజవ్వాజీ శ్రీకాంత్- రూ. 75 వేలునిశాంత్ శరణు- రూ. 5.5 లక్షలుపట్కూరి నితీశ్ రెడ్డి- రూ. 5.5 లక్షలుప్రణవ్ సూర్యదేవర- రూ. 2.5 లక్షలురాహుల్ బుద్ధి- రూ. 8 లక్షలుషేక్ సమీర్- రూ. 75 వేలుషేక్ సోహైల్- రూ. 75 వేలుటి. హర్షవర్ధన్ సింగ్- రూ. లక్షఉర్వేష్ కక్కడ్- రూ. 75 వేలువిక్రాంత్ రెడ్డి ఎం- రూ. 75 వేలురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్- రూ. 11 లక్షలుఆరోన్ జార్జ్ వర్గీస్- రూ. 7.5 లక్షలుఅడే సంతోష్- రూ. 90 వేలుఆదిత్య జవ్వాజీ- రూ. 1.6 లక్షలుఆదిత్య మల్హోత్రా- రూ. 85 వేలుఅలంకృత్ రపోలే- రూ. 1.9 లక్షలుఅరవెల్లి అవనీష్ రావు- రూ. 7 లక్షలుఆర్యన్ కారియప్ప- రూ. లక్షబబర్ ఖాన్ బర్కత్ ఖాన్- రూ. 75 వేలుభువనగిరి పున్నయ్య- రూ. 3 లక్షలుసి. హితేష్ యాదవ్- రూ. 2.3 లక్షలుచిమాట శ్రీనాథ్ యాదవ్- రూ. లక్షజ్ఞాన ప్రకాశ్ రెడ్డి- రూ. 4 లక్షలుటి. అరుణ్ కుమార్- రూ. లక్షనానావత్ రాకేష్- రూ. 90 వేలునితిన్ సాయి యాదవ్- రూ. 9 లక్షలురావుల ప్రణవ్ ఆదిత్యం- రూ. 75 వేలుఎస్. వెంకట్ కార్తిక్- రూ. 75 వేలుసచేత్ బింజ్రాజ్కా- రూ. 4 లక్షలుతనయ్ జద్దు- రూ. 75 వేలువరంగల్ వారియర్స్మహ్మద్ సిరాజ్- రూ. 14 లక్షలుఆది మణి కిరణ్- రూ. 85 వేలుఅమన్ రావు పేరాల- రూ. 12 లక్షలుఅమ్గోత్ దివిన్- రూ. 85 వేలుఅనిరుధ్ శ్రీవాత్స టి.పి.- రూ. 2 లక్షలుభావేష్ సేథ్- రూ. 5 లక్షలుహర్షిత్ చౌధరి- రూ. 3 లక్షలుకర్రి సాయి ధనుష్- రూ. 75 వేలుమహమ్మద్ అబ్దుల్ మాలిక్- రూ. 3 లక్షలుమహమ్మద్ ఆసిఫ్ మంసూరి- రూ. 75 వేలుమొహమ్మద్ ముదస్సర్ హుస్సేన్- రూ. 3 లక్షలుమురుగన్ అభిషేక్- రూ. 3 లక్షలుపల్లెపాటి క్రాంతి- రూ. 75 వేలుఋషికేత్ సిసోడియా- రూ. 4.75 లక్షలుఋషిత్ రావు- - రూ. 75 వేలురిత్విక్ గౌడ్- రూ. 75 వేలుసల్మాన్ ఖాన్- రూ. 75 వేలుషౌనక్ కులకర్ణి- రూ. 1.6 లక్షలుశివ రామకృష్ణ తెర్లి- రూ. 75 వేలువైష్ణవ్ విశ్వనాథ- రూ. లక్ష -
TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)
-
టీజీ టి20 లీగ్‌కు ఎనిమిది టీమ్‌లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ టి20 లీగ్ (టీజీ టి20) ఫ్రాంచైజీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిడ్ ద్వారా అధిక మొత్తాలు దాఖలు చేసిన టాప్–8 టీమ్ యాజమాన్యాలను హెచ్‌సీఏ శనివారం ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో తొలిసారి టీజీ టి20 లీగ్‌ను జరుపుతున్నారు. వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనుండగా, ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో అత్యధికంగా రూ.7 కోట్ల 50 లక్షలకు హైదరాబాద్ టీమ్‌ను ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్ఫ్రా/ ప్రణవ (రూ.7.20 కోట్లు), వరంగల్ జట్టును బెయిన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.6.55 కోట్లు), మెదక్ టీమ్‌ను బృంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (రూ.6.33 కోట్లు), నల్గొండ టీమ్‌ను కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.5.06 కోట్లు) గెలుచుకున్నాయి. కరీంనగర్ జట్టును ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ (రూ.4.57 కోట్లు), మహబూబ్‌నగర్ జట్టును వీరభద్ర స్టీల్స్ (రూ.4.50 కోట్లు), ఖమ్మం టీమ్‌ను అన్విత గ్రూప్ (రూ.4.44 కోట్లు) సొంతం చేసుకున్నాయి.


