అన్వితా ఖమ్మం ఏసెస్ ఘన విజయం | TG20 League-Anvita-Khammam-Aces-Beat Nalgonda Knights By-34-Runs | Sakshi
Sakshi News home page

అన్వితా ఖమ్మం ఏసెస్ ఘన విజయం

Jul 1 2026 10:44 PM | Updated on Jul 1 2026 11:01 PM

TG20 League-Anvita-Khammam-Aces-Beat Nalgonda Knights By-34-Runs

టీజీ20 లీగ్‌లో భాగంగా అన్వితా ఖమ్మం ఏసెస్ రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. బుధవారం ఉప్పల్ వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యచ్‌లో ఖమ్మం ఏసెస్‌ 33 పరుగులతో విజయాన్ని అందుకుంది.  212 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న‌ల్గొండ నైట్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. 

న‌ల్గొండ బ్యాట‌ర్ల‌లో గౌర‌వ్ రెడ్డి (54) అర్ధ‌సెంచ‌రీతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓపెన‌ర్ జశ్వంత్ మోతె (22) ప‌రుగులు సాధించాడు. ఆఖ‌ర్లో హ‌ర్షవ‌ర్ద‌న్ సింగ్ (37 నాటౌట్‌) మెరిసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఖ‌మ్మం బౌల‌ర్ల‌లో వాఫి క‌చ్చి, వేద్ రెడ్డి చెరో 3 వికెట్ల‌తో మెరిశారు.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన‌ అన్విత్‌ ఖమ్మం జ‌ట్టు బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత 20 ఓవర్లలో ఖ‌మ్మం ఏసెస్‌ 2 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ హిమతేజ(31 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు జీఎస్‌కే రెడ్డి(56), పరాస్‌ రాజ్‌(46) రాణించారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్‌, దివేష్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement