రాజ్యసభ సభ్యునిగా ఖర్గే ప్రమాణ స్వీకారం | Mallikarjun Kharge Takes Oath As Rajya Sabha MP, Vows To Hold Modi Government Accountable | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యునిగా ఖర్గే ప్రమాణ స్వీకారం

Jun 29 2026 1:52 PM | Updated on Jun 29 2026 2:25 PM

Mallikarjun Kharge Takes Oath as Rajya Sabha MP

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన తర్వాత, సోమవారం నాడు ఎంపీగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్‌లో ఖర్గే చేత ప్రమాణం చేయించారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, హిందీ భాషలో  ఖర్గే ఈ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. ప్రజల గొంతుకను, వారి ఆకాంక్షలను పార్లమెంట్‌లో పూర్తి చిత్తశుద్ధితో వినిపిస్తానని ఆయన అన్నారు.

ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తన ప్రధాన బాధ్యతని ఖర్గే ప్రకటించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యేకంగా హాజరై ఖర్గేకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఖర్గేతో పాటు బీజేపీ నేత తరుణ్ చుగ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు కొత్త సభ్యులు కూడా ఈ రోజు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement