ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
అసలేం జరిగింది?
శాను అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు.
రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్ చేశారని, అప్పుడు అబ్యాక్‌గ్రౌండ్‌లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు.
ఇదీ చదవండి: లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
చివరికి ఆ యువకులు బ్రతిమిలాడి, బేరసారాల తరువాత డిరూ. 2,400 చెల్లించడానికి అంగీకరించడంతో ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. ఆ యువకుల వద్ద అంత నగదు లేకపోవడంతో యూపీఐ (UPI) ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేశారు. ఇంజనీర్ శాను ఆ యూపీఐ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, ఈ డిజిటల్ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు. మరి బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Bangalore auto walas are brutal to innocent people!
Hoping to earn their livelihood, two young boys from a village just reached SMVT railway station. They took an auto to Attibele as they wanted to go to Hosur.
After the ride, the auto driver demanded ₹3000 just for 35 km???…— Sanu (@SanuThink) June 22, 2026
నెటిజన్ల ఆగ్రహం
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుండి బెంగళూరుకు వచ్చే విద్యార్థులు, యువతకుఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తాయని, ఇది నగరం పేరును చెడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?


