ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం | Actor Pankaj Tripathis brother critically injured in attack at ancestral village | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

Jun 22 2026 2:50 PM | Updated on Jun 22 2026 3:01 PM

Actor Pankaj Tripathis brother critically injured in attack at ancestral village

బాలీవుడ్ ప్రముఖ నటుడు, స్త్రీ 2, ఓఎమ్‌జి-2 మిమి, మీర్జాపూర్‌ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న పంకజ్ త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిగా వచ్చిన ఆస్తి తాగాదాలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ తీవ్రంగా గాయపడిన సంగతి కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం నటుడు పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన బరౌలీ పట్టణంలోని బెల్‌సంద్ వద్ద ఈ దాడి జరిగింది. భూ వివాదానికి సంబంధించిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు  బీజేంద్రనాథ్ తివారీపై కర్రతో దారుణంగా దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన అతడిని గోపాల్ గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో  మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  

ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి దాడికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి జుడీషియల్ కస్టడీకి పంపినట్లు గోపాల్‌గంజ్ ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందనందున పూర్తి స్థాయి చట్టపరమైన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు నిరాకరించారు.  

ఈ దాడి ఘటనపై జేడీయూ  జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement