అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం | Telugu Student Arun Sai Reddy Bollendula Passes Away Unexpectedly in the USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

Jun 22 2026 12:26 PM | Updated on Jun 22 2026 12:38 PM

Telugu Student Arun Sai Reddy Bollendula Passes Away Unexpectedly in the USA

మరో తెలుగు విద్యార్థి డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో  ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత  ఫ్లోరిడాలోని టెంపా నగరంలో  ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement