హార్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన | Iran Refuses To Reopen Strait Of Hormuz, Demands US Withdrawal And War Reparations, More Details Inside | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

Aug 9 2026 8:11 AM | Updated on Aug 9 2026 12:18 PM

Iran Says Strait Of Hormuz Wont Open Until Us Corrects Behaviour

అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్‌ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీ మహ్మద్‌ బఘెర్‌ జొల్ఘాదర్‌ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.

‘అమెరికా ఇకపై ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్‌ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్‌ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్‌కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.

శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్‌ విభాగానికి జొల్ఘాదర్‌ కమాండర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్‌ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్‌ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్‌తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్‌ ప్రకటించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement