26 ఏళ్ల మిలియనీర్‌ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్‌ | Did a 26 Year Old Millionaire Really Spend Rs 220 Crore to Look Like a Dog? | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల మిలియనీర్‌ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్‌

Aug 8 2026 4:07 PM | Updated on Aug 8 2026 4:27 PM

Did a 26 Year Old Millionaire Really Spend  Rs 220 Crore to Look Like a Dog?

ఎవరైనా అందంగా  మారాలనుకుంటారు.  మంచి ఒడ్డూ పొడుగు, శరీర స్షౌ‍ష్టవంతో ఆకర్షణీయంగా  కనిపించేందుకు ఎత్తు పెరగాలని లేదా బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీఒక వ్యాపారవేత్త కుక్కలా మారేందుకు అనేక సర్జరీలు చేయించుకున్నారు. ఏకంగా  రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాడనే వార్త  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  ఇందులో నిజమెంత?

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న "జాసో (Jaso)" అనే 26 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త దాదాపు  రూ.220 కోట్లు ఖర్చు చేశాడని ప్రచారం  జోరుగా సాగుతోంది. ఈ కోటీశ్వరుడికి కుక్కలంటే మక్కువ ఎక్కువట. అందుకే కుక్కలా బాడీ మోడిఫికేషన్‌, ఆపరేషన్లు అంటూ పెద్ద మొత్తంలో ఖర్చుచేశాడనే ప్రచారం  విపరీతంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ పోస్టులు , వీడియోల ప్రకారం, జపాన్‌కు చెందిన "జాసో" అనే 26 ఏళ్ల యువ మిలియనీర్, అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా తనను తాను కుక్కలా మార్చుకున్నాడని, దీనికోసం రూ.220 కోట్లు ఖర్చు  అయిందంటున్న వైరల్ వీడియోలలో ఒక వ్యక్తి కుక్క దుస్తులలో, కుక్కలాగే కదులుతున్నట్లు కనిపిస్తున్నాడు.

ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్‌ యూట్యూబర్‌ వరల్డ్‌ రికార్డ్‌, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?


 

ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్‌, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ 

ఫ్యాక్ట్ చెక్
ఈ వార్తలో ఎలాంటి నిజం ఉన్నట్లు ఆధారాలు లేవు. "జాసో" అనే వ్యక్తి గుర్తింపు, ఆయన వయస్సు (26), ఆయన వ్యాపారవేత్త  రూ. 220 కోట్లు ఖర్చు చేశారనే వాదనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవని ఫ్యాక్ట్‌ చెక్‌ నిపుణులు తేల్చారు. ఇది పూర్తిగా కల్పితం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్  లైక్స్ కోసం క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీలలో ఇది ఒకటని, ఇప్పటివరకు రూ,220 కోట్ల ట్రాన్స్‌ఫర్మేషన్ వార్తకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదని స్పష్టమవుతోంది. ఇక ఈ క్లిప్‌లలో కనిపిస్తున్న జంతువు మనుషుల చర్మం లాంటి రూపం కలిగిన ఒక అరుదైన, ప్రాచీన 'హెయిర్‌లెస్' (జుట్టు లేని) కుక్క జాతికి చెందినది.

ఇదీ చదవండి: డ్యూప్లెక్స్‌ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి

'జాసో డాగ్ ట్రాన్స్‌ఫర్మేషన్'  స్టోరీ నిస్సందేహంగా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వివాదాస్పద స్టోరీలపై అధికారిక ప్రకటనలు లేదా విశ్వసనీయమైన నివేదికలు ఈ రెండు కథనాలలో దేనినైనా ధృవీకరించే వరకు అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చదవండి: గర్ల్‌ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్‌ : లవర్‌ చేసిన పని ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement