డ్యూప్లెక్స్‌ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి | Bengaluru Shocker: Woman's Skeletal Remains Found Inside Closed House | Sakshi
Sakshi News home page

డ్యూప్లెక్స్‌ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి

Aug 8 2026 1:11 PM | Updated on Aug 8 2026 1:27 PM

Woman decomposed body found at Bengaluru home

సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బాగలగుంటెలో ఒక విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉంటున్న 57 ఏళ్ల దాక్షాయణి అనే మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో అస్థిపంజరమై కనిపించింది. ఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా, ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారి కనిపించింది. ఆమె మానసిక వేదన, ఒంటరితనంతోనే, దాదాపు ఏడాది క్రితం  మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం 2005లో ఆరోగ్య సమస్యల కారణంగా దాక్షాయణి కొడుకు మరణించాడు. దీంతో ఆమె  మానసికంగా బాగా కృంగిపోయింది.  ఆ తర్వాత ఆమె 'షిజోఫ్రెనియా' (Schizophrenia) అనే మానసిక అనారోగ్యంతో బాధపడగా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు.2017లో ఆమె భర్త ఉమేష్ కూడా మరణించడంతో, హవనూర్ లేఅవుట్‌లోని ఇంట్లో ఆమె ఒంటరిగానే నివసిస్తోంది.

ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్‌, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ 

అనుమానం ఎలా వచ్చిందీ అంటే
ఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసివేసి ఉండటంతో, అద్దెకు తీసుకునేందుకు వెళ్లి తలుపులు తెరవలేకపోయిన బ్రోకర్లు  స్థానికులు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బాగలగుంటె పోలీసులు  ఆ డ్యూప్లెక్స్ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా దాక్షాయణి అస్థిపంజరం లభ్యమైంది. 

ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్‌ యూట్యూబర్‌ వరల్డ్‌ రికార్డ్‌, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?

మరోవైపు గత రెండేళ్లుగా దాక్షాయణితో తాము టచ్‌లో లేమని ఆమె సోదరుడు మహేష్ (50) తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ఎప్పుడు, ఎలా మరణించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement