కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్‌: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు! | Shashi Tharoor Admits Congress Failed To Draw Crowds With Student Protest Campaign, Calls For Introspection | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్‌: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!

Aug 8 2026 9:42 AM | Updated on Aug 8 2026 10:16 AM

Shashi Tharoor Admits Congress Failed to Resonate with Students

న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి నిరసనల ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అంగీకరించారు. ముంబైలో జరిగిన ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్’ (ఐఐఎంయూఎన్) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశాలపై తాము ముందుగానే గళం విప్పినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలకు వచ్చిన జనసందోహం తమ ప్రచారానికి రాలేదన్నారు.

తాము లేవనెత్తిన అంశాలనే సీజేపీ కూడా జంతర్ మంతర్ వద్ద ప్రస్తావించిందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమయ్యామని శశిథరూర్ గుర్తుచేశారు. అయితే, తమ వ్యూహంలో ఎక్కడ లోపం జరిగిందో, యువత (జెన్ జీ) నాడిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమలమయ్యామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై జూన్ 20 నుంచి సీజేపీ చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement