కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్‌ నేత హత్య | Karnataka Shock, Congress Leader And Former Panchayat President David D’Souza Shot Dead In Udupi, More Details Inside | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్‌ నేత హత్య

Aug 8 2026 8:07 AM | Updated on Aug 8 2026 10:24 AM

Congress leader David shot dead In Karnataka Udupi

బెంగళూరు: కర్ణాటకలోనియ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉడుపి జిల్లాలో కాంగ్రెస్‌ నేత, కాంట్రాక్టర్‌, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్‌ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో డేవిడ్‌ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి డిసౌజాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, డిసౌజా కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారు. గతంలో పంచాయతీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన హత్య స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.

అయితే, డేవిడ్‌ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement