హర్ముజ్‌లో హైటెన్షన్‌కు తెర.. అమెరికా–ఇరాన్ కీలక ఒప్పందం | End to high tension in Hormuz Key US-Iran agreement | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో హైటెన్షన్‌కు తెర.. అమెరికా–ఇరాన్ కీలక ఒప్పందం

Aug 8 2026 9:34 PM | Updated on Aug 8 2026 9:46 PM

End to high tension in Hormuz Key US-Iran agreement

హర్ముజ్‌ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒమన్‌ దేశం దౌత్యంతో అంతర్జాతీయ నౌకయానాన్ని పునరుద్ధించేందుకు ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు సంతకం చేశాయని సమాాచారం.

ఒకదేశ అంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం తలదూర్చకూడదని ఇరు దేశాల సౌర్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నాయి. హర్ముజ్‌ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి సురక్షితంగా తరలివెళ్లేలా మార్గం ఇస్తే ఇరాన్‌కు సంబంధించిన ఆర్థిక ఆంక్షలను సడలించనున్నట్లు అమెరికా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇక చమురధరలు తగ్గే అవకాశం ఉంది.

కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల తర్వాత హర్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ జలసంధిని తెరవాలని అమెరికా ఇరాన్‌ను పలుమార్లు కోరినప్పటికీ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్‌ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రహస్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement