చీకట్లో రహస్య మీటింగ్.. కారులో మెుజ్తాబానేనా? | iran president met mojtaba khamenei in darkness isnt convinced it was him | Sakshi
Sakshi News home page

చీకట్లో రహస్య మీటింగ్.. కారులో మెుజ్తాబానేనా?

Aug 7 2026 8:57 AM | Updated on Aug 7 2026 9:10 AM

iran president met mojtaba khamenei in darkness isnt convinced it was him

టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీం మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై ఇప్పుడు ఎంతో సస్పెన్స్‌ నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయతుల్లా ఖమేనీ మరణించిన అనంతరం ఇరాన్‌ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించింది లేదు చివరకు ఖమేనీ అంత్యక్రియలకు సైతం ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన బ్రతికి ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్‌ అధ్యక్షుడు ఇటీవలే మోజ్తాబాతో రహస్యంగా భేటీ అయినట్లు వార్త ప్రచురించింది.  

రహస్య భేటీ

ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, "పెజెష్కియన్‌ను ఆయన భద్రతా సిబ్బంది టెహ్రాన్‌లోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనను తన అధికారిక వాహనం నుంచి దించి, టింటెడ్ అద్దాలు ఉన్న ఒక సాధారణ కారులోకి ఎక్కించారు. ఆ కారులో మొజ్తబా ఖమేనీ వేచి ఉన్నారు. అయితే ఆ ప్రదేశంలో పూర్తిగా చీకటి ఉండటంతో ఇద్దరూ ఒకరినొకరు చూడలేకపోయారు. సమావేశం కేవలం కొన్ని నిమిషాలే కొనసాగింది, అనంతరం పెజెష్కియన్‌ను వెంటనే అక్కడి నుంచి పంపించారు". అంతేకాదు, ఖమేనీ భద్రతా సిబ్బంది ఆయనకు చేతులు కలిపే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది.

మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై సందేహం

అధ్యక్షుడి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశం తనను అవమానించినట్టుగా అనిపించిందని పెజెష్కియన్ భావించారని, తర్వాత తాను మాట్లాడింది నిజంగానే మొజ్తబా ఖమేనీయేనా అని ప్రశ్నించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ భేటీ తర్వాత ఖమేనీ అధికారిక నివాసంలో మరోసారి సమావేశం కావాలని పెజెష్కియన్ కోరినా, ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం.  

అనంతరం ఈ అంశంపై పెజెష్కియన్ మాట్లాడుతూ ఖమేనీతో మాట్లాడటం ఇప్పుడు చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం చాలా కష్టం. అయినప్పటికీ ఆయన ఉనికి మాకు గొప్ప బలాన్ని ఇస్తోంది. దాని వల్లనే మేము ముందుకు సాగగలుగుతున్నాం అని ఆయన తెలిపినట్లు కథనాలు ప్రచురించాయి.

రాజీనామా  బెదిరింపులతో మీటింగ్ 
ఇరాన్ మీడియా కథనం ప్రకారం, ఖమేనీని కలవడానికి పెజెష్కియన్ పలుమార్లు ప్రయత్నించారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో చివరకు ఖమేనీ కార్యాలయం సమావేశానికి అంగీకరించిందని తెలిపింది. సంప్రదాయం ప్రకారం ఆయన నివాసంలో కాకుండా వేరే రహస్య ప్రదేశంలో భేటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.  

ఖమేనీ ఉనిపై ట్రంప్‌ 
"వారి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు. వారి వైమానిక రక్షణ వ్యవస్థ నాశనమైంది. వారి ప్రధాన నాయకులు చనిపోయారు. ఖమేనీ వెళ్లిపోయాడు. ఆయన కుమారుడు కూడా 90 శాతం వరకు అంతమైపోయాడు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement