Mojtaba Hosseini Khamenei
-
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం లీడర్ మెజ్తాబా ఖమేనీ పేరిట ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.మోజ్తాబా ఖమేనీ ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.ఇరాన్- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ నెలకొంది. -
మోజ్తాబా ఉంది అక్కడే? రష్యా సంచలన ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ జాడపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కనిపించకపోవడం సైతం దానికి ఒక కారణం. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం ఆయన ఆచూకీపై స్పందించింది. మోజ్తాబా ఎక్కడ ఉన్నారో ఇరాన్‌లోని రష్యా రాయబారి స్పష్టతనిచ్చారు.మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అమెరికా దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడి ఉండవచ్చునని అన్నారు. ఆయన అసలు బ్రతికున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మోజ్తాబా రష్యాలో తలదాచుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రష్యా స్పందించింది.రష్యా రాయబారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ " మొజ్తాబా ఖమేనీ దేశంలోనే ఉన్నారు, అయితే అర్థం చేసుకోదగిన కారణాల వల్ల బహిరంగంగా కనిపించడం మానుకుంటున్నారు" అని అన్నారు. యుద్ధంలో గాయపడిన ఖమేనీకి చికిత్స అందించేందుకు ఆయనను రష్యాకు విమానంలో తరలించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన తేల్చిచెప్పారు. కాగా అమెరికా-ఇరాన్ యుద్ధంలో రష్యా పాత్రను కూడా అమెరికా పర్యవేక్షిస్తోందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్‌కు సహాయం చేస్తోందన్న వార్తలను మాస్కో ఖండించినప్పటికీ, హెగ్సెత్ ఇలా అన్నారు కాగా యుద్ధం మెుదలై నెల రోజులు గడిచింది. అయినప్పటికీ ఇరు వర్గాలు ఏ మాత్రం తగ్గడం లేదు. -
మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే?
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా చేస్తున్న దురాక్రమణ ఖండించి ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికి ఉన్నారో లేదో తెలియదు అని అన్నారు. అమెరికా జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ ఇరాక్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు.ఆ లేఖలో " అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో మా దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాక్ మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అలాగే ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు". అని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్‌పై జరుగుతున్న దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఇరాక్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడాన్ని అభినందించారు.కాగా ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ మూడవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకూ మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం కొన్ని రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. గతంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. -
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నారు. అయితే ఇదివరకే ఇరాన్ మోజ్తాబా ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతల ఉనికిపై చర్చ జోరుగా నడుస్తోంది. మార్చి 2న ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడి జరిపింది. ఈ వివరాలను ప్రకటిస్తూ నెతన్యాహు అదృష్టం ఏలా ఉందో తెలియలేదు. అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి నెతన్యాహు ఆరోగ్యంపై పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ నెతన్యాహుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరువేళ్లు ఉన్నాయని అది ఏఐ జనరేటడ్ వీడియో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదే విధమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారిని లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకే ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆయనకు తీవ్రగాయాలయ్యాయని కోమాలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. శనివారం ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ " మోజ్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. ఆయన గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఆయన ప్రాణాలతో లేడని నేను విన్నాను. ఒక వేళ ప్రాణాలతో ఉంటే వారి దేశం కోసం తెలివిగా ఆలోచిస్తారు. అది ఆయన లొంగిపోవడమే" అని ట్రంప్ అన్నారు.కాగా మోజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కాలు పోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. -
మోజ్తాబా ఆరోగ్యంపై పెదవి విరిచిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఇరాన్ సుప్రీంలీడర్‌గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ దేశానికి చెందిన 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబాను ఎన్నుకుంది. ఈ ఎన్నికపై ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకుంటే వారే తమ లక్ష్యమని హెచ్చరించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.కాగా పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కొరత ఏర్పడింది. హార్మూజ్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెరిసేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వారి అనుమతి లేకుండా ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడి చేస్తుంది. -
ఇరాన్ నూతన సారథి మొజ్తబా!
దుబాయ్: ఇరాన్ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఐఆర్జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. తెర వెనక ‘సుప్రీం’మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు. ఆయన 1969లో మషాద్ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్‌పై పోరులో ఐఆర్జీసీ విభాగమైన హబీబ్ ఇబ్న్ మజాహిర్ బెటాలియన్‌కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్‌జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది. 1989లో ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్ కూడా మొజ్తబానే ఇరాన్లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్ జెరూసలేం: ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు. -
ఇరాన్ కొత్త నేతను నియమిస్తే.. వెంటనే లేపేస్తాం.., ఇజ్రాయెల్ వార్నింగ్
జెరూసలేం: అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎంపికయ్యారు. అయితే, మోజ్తాబా ఎన్నికపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ ప్రభుత్వం నియమించిన నాయకుడు ఎవరైనా సరే వెంటనే లేపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ దేశానికి కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నుకుంది. ఈ క్రమంలో మోజ్తాబా ఎంపికపై ఇజ్రాయెల్ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. పరోక్షంగా మోజ్తాబా ప్రాణం తీసేందుకు తాను, దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాల(IDF)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ‘రోర్ ఆఫ్ ది లయన్’లో భాగంగా అంతర్భాగంగా మిషన్‌ను నిర్వహించడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని, చర్య తీసుకోవాలని ఐడీఎఫ్‌కు సూచించినట్లు చెప్పారు. כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני - יהיה יעד חד משמעי לחיסול.לא חשוב מה שמו והמקום בו יסתתר.רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026


