ఇరాన్‌ కొత్త నేతను నియమిస్తే.. వెంటనే లేపేస్తాం.., ఇజ్రాయెల్‌ వార్నింగ్‌ | Defense Minister Israel Katz Warn To Iran Over Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

కొత్త నేతను నియమిస్తే.. వెంటనే లేపేస్తాం..!

Mar 4 2026 12:39 PM | Updated on Mar 4 2026 1:03 PM

Defense Minister Israel Katz Warn To Iran Over Mojtaba Khamenei

జెరూసలేం: అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎంపికయ్యారు. అయితే, మోజ్తాబా ఎన్నికపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ఇరాన్‌ ప్రభుత్వం నియమించిన నాయకుడు ఎవరైనా సరే వెంటనే లేపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ఒత్తిడి మేరకు ఇరాన్‌ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్‌పర్ట్‌ కమిటీ దేశానికి కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నుకుంది. ఈ క్రమంలో మోజ్తాబా ఎంపికపై ఇజ్రాయెల్‌

ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. పరోక్షంగా మోజ్తాబా ప్రాణం తీసేందుకు తాను, దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాల(IDF)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ‘రోర్ ఆఫ్ ది లయన్’లో భాగంగా అంతర్భాగంగా మిషన్‌ను నిర్వహించడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని, చర్య తీసుకోవాలని ఐడీఎఫ్‌కు సూచించినట్లు చెప్పారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement