ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్‌ క్రీములతో జర భద్రం.. | Red Mark On Donald Trump Neck, Dermatologists Explain Skin Cream Allergies And Reactions, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్‌ క్రీములతో జర భద్రం..

Mar 4 2026 11:40 AM | Updated on Mar 4 2026 12:36 PM

Trumps Neck Redness From Skin Cream: What It Means And What Happen

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్‌ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు  సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్‌ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్‌ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..

మనం రెగ్యులర్‌గా వాడే స్కిన్‌ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్‌ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్‌ రాసే ఈ క్రీమ్‌ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్‌ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. 

ఒక్కోసారి ఏజ్‌ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్‌ క్రీమ్‌ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 

అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్‌ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్‌లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. 

ఇది అందరికీ ఒకేలా ఉండదు..

కొందరికీ తక్కువ రియాక్టివ్‌ చర్మం ఉంటుంది.

పదే పదే అదే క్రీమ్‌ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్‌ క్రీమ్‌ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. 

అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. 

అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్‌ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్‌క్రీమ్‌ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. 

అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్‌లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్‌ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్‌క్రీమ్‌ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్‌ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.

(చదవండి: బుల్లి ఫ్యాషన్‌ డిజైనర్‌..! జస్ట్‌ పదేళ్లకే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement